తిరువనంతపురం: మనం చేస్తున్న పని సరైనదే అయినప్పుడు దేని గురించి, ఎవరి గురించి భయపడాల్సిన పనిలేదు. ఈ మాటలను నిజం చేసే సంఘటన ఒకటి కేరళలో చోటు చేసుకుంది. రాంగ్ రూట్‌లో వస్తోన్న ఓ బస్సుకు ఎదురుగా తన స్కూటినీ నడుపుతూ.. బస్సు కరెక్ట్ రూట్‌లోకి వెళ్లేలా చేసిందో మహిళ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. వివరాలు.. ఓ మహిళ రోడ్డు మీద స్కూటితో వెళ్తుంది. ఇంతలో ఓ బస్సు రాంగ్ రూట్‌లో మహిళకు ఎదురుగా వచ్చింది. అయితే బస్సును చూసి ఆ మహిళ ఏ మాత్రం బెదరలేదు. అలానే ముందుకు వెళ్లసాగింది. ఇక చేసేదేం లేక ఆ బస్సు డ్రైవరే డైవర్షన్ తీసుకుని కరెక్ట్ రూట్‌లోకి వెళ్లాడు. ఈ మొత్తం సంఘటనను వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేశాడో వ్యక్తి.
When you are RIGHT it gives you a very different kind of MIGHT. See Joe a lady rider down South doesn't budge an inch to give in to an erring Bus Driver. Kudos to her. @TheBikerni @IndiaWima @UrvashiPatole @utterflea @anandmahindra @mishramugdha #GirlPower #BikerLife #BikerGirl pic.twitter.com/3RkkUr4XdG
— TheGhostRider31 (@TheGhostRider31) September 25, 2019
ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు మహిళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. లేడీ బాస్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ‘ఉత్తర భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరిగే చాన్సే లేదు. ఇదే సంఘటన యూపీలో జరిగితే ఆ బస్సు డ్రైవర్ కిందకు దిగి.. సదరు మహిళను కొట్టేవాడు. బస్సును పక్కకు తిప్పేవాడు కాదు’ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment