wrong route driving
-
యాక్సిడెంట్ నిందితునికి అరగంటలోనే బెయిల్..!
ఢిల్లీ: దేశ రాజధాని రీజియన్‌లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు ఓ నిండు ప్రాణం బలైంది. అతివేగంగా రాంగ్రూట్లో వచ్చి ఓ యువ బైకర్‌ను ఢీ కొట్టడంతో స్పాట్లోనే అతను చనిపోయాడు. అయితే ఈ కేసులో గురుగావ్ పోలీసులు వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్వారకాకు చెందిన 23 ఏళ్ల అక్షత్ గార్గ్.. తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం డీఎల్ఎఫ్ ఫేజ్ 2 గోల్ఫ్ కోర్స్ రోడ్లో వెళ్తున్నాడు. ఆ టైంలో హఠాత్తుగా రాంగ్రూట్లో వచ్చిన ఓ మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనం అతని బైక్‌ను ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ ఎగిరి కాస్త దూరంలో పడింది. ఆ ప్రమాదం తర్వాత అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 24 గంటలు గడవక ముందే బెయిల్ మీద రిలీజ్ చేశారు.అక్షత్ స్నేహితుడి బైక్‌కు ఉన్న గోప్రో యాక్షన్ కెమెరా ద్వారా యాక్సిడెంట్ రికార్డయ్యింది. అయితే పోలీసులు ఆ వీడియోను సాక్ష్యంగా పరిగణించబోమని చెప్పారని, నిందితుడిని అరగంటలోనే బయటకు పంపించేశారని అక్షత్ స్నేహితుడు వాపోయాడు. విషయం బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తగా.. బెయిల్ రద్దు చేసి కేసు విచారణ చేపడతామని గురుగావ్ పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో #JusticeforAkshat ట్రెండ్ నడుస్తోందిShocking Car-Bike Collision in Gurgaon, accused released on bail same day! Car driving on wrong side of Gurgaon Golf Course road DLF Phase-II rammed into a bike killing the rider Akshat Garg on the spot. Accused driver Kuldeep Thakur who was in the SUV with a BJP sticker on it… pic.twitter.com/qUETDrAZ1C— Nabila Jamal (@nabilajamal_) September 19, 2024 -
పొగరుబోతుకు ఆర్మీ జవాన్ జవాబు!
ఆర్మీ అంటేనే క్రమశిక్షణకు, కట్టుబాట్లకు పేరు.. బెటాలియన్లోనైనా.. బయటనైనా జవాన్లు పద్ధతి ప్రకారం ఉంటారు. మరి.. తమ చుట్టూ ఉన్నవారు పద్ధతి మీరి కనిపిస్తే... పొగరుగా ప్రవర్తిస్తూంటే...? సహించలేరు కదా? ఈ వీడియోలో కూడా అదే జరిగింది. ఇందులో స్కూటర్ నడుపుతున్న ఓ వ్యక్తి డివైడర్‌కు ఆవల.. ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డంగా నిలబడటమే కాకుండా.. ఆంబులెన్స్కూ దారివ్వకుండా... పక్క నుంచి వెళ్లాల్సిందిగా పొగరుగా వ్యవహరించాడు. ఈ విషయం కాస్తా.. వెనుక ఉన్న ఆర్మీ వాహనం డ్రైవర్ కంట పడింది. కాసేపు ఊరకున్న.. ఆ వ్యక్తి పొగరుగా చేస్తున్న చేష్టలను ఆ జవాను తట్టుకోలేకపోయాడు. వాహనం నుంచి కిందకు దిగి.. ఆ వ్యక్తి హెల్మెట్‌పైనే ఒక్కటిచ్చుకున్నాడు... ‘‘బుద్ధుందా.. ఎదురుగా ఆంబులెన్స్ వచ్చినా దారి ఇవ్వవా’’ అని గడ్డిపెట్టినట్లు ఉన్నాడు. అయినా ఆ వ్యక్తి పక్కకు జరగలేదు సరికదా.. ఇంకాస్తా దురుసుగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో ఆ జవాలు.. వాహనంలో ఉంచిన లాఠీని బయటకు తీసి పని చెప్పబోయాడు. ఈ లోపు అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసు... ‘‘మీరు ఉండండి సర్. ఇక నేను చూసుకుంటాను కదా’’ అని సర్ది చెప్పింది.ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ.. @shilpa_cn హ్యాండిల్ కలిగిన ‘ఎక్స్’ ఖాతాదారు ఒకరు ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆర్మీ జవాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.Satisfying video 🤌🏻Indian Army 😍 pic.twitter.com/H6nnlehIaD— Shilpa (@shilpa_cn) August 25, 2024 -
Sowmya Janu Photos: హోంగార్డ్‌పై దాడి..ట్రెండింగ్ లో నటి సౌమ్య జాను (ఫొటోలు)
-
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న పల్లె వెలుగు బస్సుకు కు బుధవారం తెల్లవారు జామున పెను ప్రమాదం తప్పింది . పాల్వంచ వాగు వద్ద దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో బస్సు రాంగ్ రూట్లో వెళ్ళి మరో బస్సును ఢీ కొట్టబోయింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 35 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు కామారెడ్డి డిపోకు చెందిందని బస్సు డ్రైవర్ తెలిపాడు. -
రాంగ్‌రూట్, ట్రిపుల్ రైడింగ్‌లపై నిబంధనలు కఠినతరం
-
Cyberabad: జంక్షన్లు, యూ టర్న్‌లు.. ఎక్కడ కావాలో మీరే చెప్చొచ్చు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలంటే అధ్యయనం తప్పనిసరి. స్థానికుల అవసరాలను, వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించగలిగితే వక్రమార్గంలో ప్రయాణాలు, ప్రమాదాలూ తగ్గుతాయి. అలాగే ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా పాటిస్తారు. ఈ క్రమంలో సైబరాబాద్‌లో కొత్తగా యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటు అవసరాన్ని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. స్థానికుల నుంచి అభ్యర్థనలను స్వీకరించి, ఆ మేరకు కూడళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాంగ్ రూట్లో వెళుతూ.. ‘నిజమైన వినియోగదారులే.. నిజమైన న్యాయనిర్ణేతలు’ ట్రాఫిక్ నిర్ణయాలలో ఇది అక్షరాలా నిజం. వాహనదారులు కోరిన విధంగా యూటర్న్ ఇస్తే వక్రమార్గంలో ప్రయాణించరు. అలా చేయకపోవటంతో రాంగ్ రూట్లో వెళ్లి ప్రమాదాలకు కారణం అవుతున్నారని పోలీసులు గుర్తించారు. అందుకే యూటర్న్లు, జంక్షన్లు, ట్రాఫిక్ మళ్లింపుల ఏర్పాట్లపై స్థానికుల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వీకరించాలని నిర్ణయించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆయా ఏర్పాట్లతో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం ఉంటుందా? వాహన ప్రమాదాలు తగ్గుతాయా? అసలు అది న్యాయబద్దమైన కోరికేనా వంటి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కారు పడిందని ఫ్లైఓవరు ఎక్కట్లేదు.. ఖాజాగూడ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైకి ఎక్కకుండా కింది నుంచి వెళ్లి జంక్షన్ దగ్గర కుడి వైపునకు మళ్లుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. కారణమేంటని అధ్యయనం చేయగా.. రెండున్నరేళ్ల క్రితం ఆ ఫ్లైఓవర్ పైనుంచి కారు కిందికి పడిపోవటంతో వాహనదారులు ఇప్పటికీ భయపడుతున్నారని, అలాగే ఆ ఫ్లైఓవర్ డిజైనింగ్‌లోనే లోపాలున్నాయని ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. ఏ రహదారైనా 90 డిగ్రీల కోణంలో తిరిగేటప్పుడు ఎటు వైపునకు మళ్లుతుందో ఆ వైపు రోడ్డు కొంత వంగి ఉండాలి. లేకపోతే వేగంతో వచ్చే వాహనాలు రోడ్డుకు అనుగుణంగా మళ్లవు. దీంతో ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం బయోడైవర్సిటీ ఫైఓవర్ రోడ్డు డిజైనింగ్‌లో మరమ్మతులు చేయలేం కాబట్టే వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. యూటర్న్, జంక్షన్లు ఇక్కడే.. ఇప్పటివరకు యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటుపై స్థానికుల నుంచి 25కి పైగా అభ్యర్థనలు వచ్చాయని.. సాధ్యాసాధ్యాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత 3 ప్రాంతాలను ఎంపిక చేశామని, మరో 11 ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ► ఐఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వెళ్లే మార్గంలో కోకాపేట దగ్గర వరుణ్ మోటార్స్ వైపున తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)తో కలిసి జంక్షన్‌ను అభివృద్ధి చేశారు. ► ఏఐజీ ఆసుపత్రి అభ్యర్థన మేరకు గచ్చిబౌలిలోని డెలాయిట్ ఆఫీసు దగ్గర యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. ► గచ్చిబౌలి జంక్షన్ ఇందిరానగర్ దగ్గర యూటర్న్‌ను ఇచ్చారు. ► జీఎంసీ బాలయోగి స్టేడియం ముందు ఉన్న యూటర్న్ తక్కువ విస్తీర్ణం ఉందని వచ్చిన అభ్యర్థన మేరకు వెడల్పాటి యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. జంక్షన్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష గ్రేటర్ నగరంలో రోడ్ల నిర్వహణతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న ఫుట్‌పాత్‌లు, జంక్షన్ల అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అమీర్‌పేట హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్పార్‌డీపీ), సమగ్ర రోడ్డు నిర్వహణ (సీఆర్ఎంపీ)లో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాలపై అధికారులు మంత్రికి వివరాలు అందించారు. సీఆర్ఎంపీ ద్వారా నిరంతరం నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ కొనసాగిస్తున్నందున వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రోడ్లకు సంబంధించిన అన్ని అంశాలపైనా మరింత దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫార్ములా ఈ– రేసుకి సంబంధించి మంత్రి కేటీఆర్ సమీక్షించారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు. (క్లిక్: విలవిలలాడిన ఐటీ సిటీ.. ‘గ్రేటర్’ సిటీ పరిస్థితి ఏంటి?) -
రాంగ్ రూట్.. ఇకపై ఫుల్ టైట్
నేరేడ్మెట్(హైదరాబాద్): పక్కనే రాంగ్ రూట్.. కాస్త దూరం వెళ్తే యూటర్న్.. కానీ కొంత మంది రాంగ్రూట్నే ఎంచుకుంటున్నారు. ఓవైపు వేగంగా వచ్చే వాహనాలు.. మరోవైపు రాంగ్రూట్లో వెళ్లే వాహనాలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇప్పటికే రాంగ్రూట్లో వెళ్లే వారికి అనేక చలాన్లు సైతం వేశారు. ట్రాఫిక్ పోలీసులు లేని సమయంలో రయ్యిమంటూ వాహనాలకు ఎదురెళ్తున్నారు. అటునుంచి వేగంగా వచ్చే వాహనాలకు అడ్డుగా వెళ్లడంతో ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడక్కడా ఉండే సీసీ కెమెరాల్లో కనిపించకుండా నంబర్ప్లేట్లను చెరిపేస్తున్నారు. కొంతమంది ఆకతాయిలు నంబర్ ప్లేట్లకు మాస్కులు కట్టి నంబర్ కనిపించకుండా తప్పించుకుంటున్నారు. అలాంటి వారికిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మొదటిసారి అవగాహన కల్పిస్తూ.. రెండోసారి వాహనదారులు చిక్కితే చలాన్లు విధిస్తున్నారు. హెల్మెట్ లేకుండా.. నంబర్ ప్లేట్ కనిపించకుండా ఉన్న వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ► మల్కాజిగిరి ట్రాఫిక్ ఠాణా పరిధిలోని నేరేడ్మెట్లో రాంగ్ రూట్ డ్రైవింగ్‌లు అధికంగా ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ► ఇందులో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులే షార్ట్‌కట్‌లో గమ్యస్థానాలకు వెళ్లడానికి రాంగ్రూట్లో ప్రయాణిస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. ► నేరేడ్మెట్–ఈసీఐఎల్ ప్రధాన మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ► ఈ మార్గంలో నేరేడ్మెట్ క్రాస్ రోడ్డు, జేజేనగర్ చౌరస్తా, సైనిక్‌పురి చౌరస్తాల్లోనే యుటర్న్‌లు ఉన్నాయి. ► డిఫెన్స్ కాలనీ, వాయుపురి, సైనిక్పురితోపాటు పలు కాలనీలు ఉన్నాయి. ► ఆయా కాలనీల అంతర్గత రోడ్ల నుంచి ప్రధాన రోడ్ల మీదికి వచ్చే వాహనదారులు రాంగ్రూట్లో ప్రయాణిస్తున్నారు. ► దాంతో ఎదురుగా వస్తున్న పాదచారులు, ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ► గడిచిన నెలలో 10 వరకు రాంగ్‌రూట్ ప్రయాణం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. ► ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు రాంగ్‌రూట్ డ్రైవింగ్ నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చదవండి: బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా.. -
వైరల్: ఆమె అదృష్టం బాగుంది.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
అనంతపురం క్రైం: అదృష్టం బాగుండి ఓ యువతి ప్రాణాలతో బయటపడింది. అనంతపురంలోని క్లాక్‌టవర్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాలు.. నగరంలోని మారుతీనగర్‌కు చెందిన నాగలక్ష్మి... ఐర్లాండ్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు నెల కిందట అనంతపురానికి వచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం టవర్‌క్లాక్ సమీపంలోని దుకాణంలో మందులు కొనుగోలు చేసి, సోదరి దివ్యాంజలితో కలిసి స్కూటీపై మారుతీనగర్‌కు వెళ్లేందుకు రాంగ్‌రూట్‌లోకి ప్రవేశించారు. ట్రాఫిక్ సిగ్నల్ వెలగడంతో అప్పటి వరకూ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. బస్సును గమనించని నాగలక్ష్మి తన స్కూటీని ఆపకుండా అలాగే ముందుకు వెళ్లనివ్వడంతో బస్సు బంపర్ తగిలి కిందకు పడ్డారు. బస్సు డ్రైవర్ బ్రేక్ వేసేలోపు ముందు చక్రం స్కూటీ పైకి వెళ్లింది. ఘటనలో నాగలక్ష్మి కాలు విరిగింది. వెనుక కూర్చొన్న దివ్యాంజలికి ఎలాంటి గాయాలు కాలేదు. స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రురాలు పోలీసులతో మాట్లాడుతూ.. కేవలం తన అజాగ్రత్త కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని, దీనిపై ఎలాంటి కేసు అవసరం లేదంటూ పోలీసులకు విన్నవించారు. ఇదే విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు ధ్రువీకరించారు. -
రాంగ్ రూట్లో ప్రముఖ హీరో: అడ్డుకున్న పోలీసులు
-
రాంగ్ రూట్: ప్రముఖ హీరోను అడ్డుకున్న పోలీసులు!
ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని తెగ ఎదురు చూస్తుంటారు. అయితే ఇక్కడో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మాత్రం ఏకంగా రాంగ్ రూట్లో గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేసి కెమెరాలకు చిక్కాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని హెచ్చరించి హీరో తన పొరపాటును సరిదిద్దుకునేలా చేశారు. మలయాళ ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ తన లగ్జరీ కారును తీసుకుని కేరళ రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఓ చోట అతడు రాంగ్ రూట్లో సిగ్నల్ కోసం వెయిట్ చేశాడు. ఇది గమనించిన ఓ పోలీసు అతడి కారు దగ్గరకు వెళ్లి మందలించాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించాడు. దీంతో అతడు తన కారును రివర్స్ తీసుకుని రోడ్డు కుడివైపు లైనులోకి ప్రవేశించాడు. దీన్నంతటినీ కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఇదిలా వుంటే దుల్కర్ సల్మాన్ నటించిన కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాదిత్తాల్ రిలీజై ఏడాది పూర్తైన సందర్భంగా ఈ సినిమా టీమ్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ, వీజే రక్షన్, నిరంజని అగత్యాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులో కనులు కనులను దోచాయంటే పేరుతో విడుదలైంది. మరోవైపు ‘పడి పడి లేచే మనసు’ సినిమా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ‘మహానటి’ సినిమాను నిర్మించిన స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నది. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. చదవండి: లెఫ్టినెంట్ రామ్‌గా వస్తోన్న దుల్కర్ -
మల్లన్నా.. ఏందన్నా ఇది?
శామీర్‌పేట్: రైతు వేదికలను ప్రారంభించేందుకు గాను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో పర్యటించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు రామ మందిరం నిర్మాణంపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ మజీద్‌పూర్ వద్ద మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌ని ఆపి నిరసన తెలిపేందుకు రాజీవ్‌రహదారిపై బైఠాయించారు. దీనిపై సమాచారం అందడంతో మంత్రి కాన్వాయ్ అలియాబాద్ చౌరస్తా వరకు రాజీవ్ రహదారిలో రాంగ్ రూట్లో అక్కడి నుంచి వెళ్లి పోయారు. రాంగ్ రూట్ లో వెళ్లిన మంత్రి వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తారా లేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
‘ఇదే యూపీ అయితే డ్రైవర్ ఆమెను కొట్టేవాడు’
తిరువనంతపురం: మనం చేస్తున్న పని సరైనదే అయినప్పుడు దేని గురించి, ఎవరి గురించి భయపడాల్సిన పనిలేదు. ఈ మాటలను నిజం చేసే సంఘటన ఒకటి కేరళలో చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వస్తోన్న ఓ బస్సుకు ఎదురుగా తన స్కూటినీ నడుపుతూ.. బస్సు కరెక్ట్ రూట్లోకి వెళ్లేలా చేసిందో మహిళ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. వివరాలు.. ఓ మహిళ రోడ్డు మీద స్కూటితో వెళ్తుంది. ఇంతలో ఓ బస్సు రాంగ్ రూట్లో మహిళకు ఎదురుగా వచ్చింది. అయితే బస్సును చూసి ఆ మహిళ ఏ మాత్రం బెదరలేదు. అలానే ముందుకు వెళ్లసాగింది. ఇక చేసేదేం లేక ఆ బస్సు డ్రైవరే డైవర్షన్ తీసుకుని కరెక్ట్ రూట్లోకి వెళ్లాడు. ఈ మొత్తం సంఘటనను వీడియో తీసి ట్విటర్లో షేర్ చేశాడో వ్యక్తి. When you are RIGHT it gives you a very different kind of MIGHT. See Joe a lady rider down South doesn't budge an inch to give in to an erring Bus Driver. Kudos to her. @TheBikerni @IndiaWima @UrvashiPatole @utterflea @anandmahindra @mishramugdha #GirlPower #BikerLife #BikerGirl pic.twitter.com/3RkkUr4XdG — TheGhostRider31 (@TheGhostRider31) September 25, 2019 ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు మహిళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. లేడీ బాస్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ‘ఉత్తర భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరిగే చాన్సే లేదు. ఇదే సంఘటన యూపీలో జరిగితే ఆ బస్సు డ్రైవర్ కిందకు దిగి.. సదరు మహిళను కొట్టేవాడు. బస్సును పక్కకు తిప్పేవాడు కాదు’ అంటున్నారు. -
రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తే జైలుకే!
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు కేవలం మద్యం తాగి వాహనం నడుపుతూ, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా దూసుకుపోతూ, మైనర్ డ్రైవింగ్... ఈ ఉల్లంఘనలకే న్యాయస్థానాలు జైలు శిక్ష విధించేవి. అయితే బుధవారం తొలిసారిగా రాంగ్రూట్లో డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ఇద్దరికి కోర్టు రెండు రోజుల జైలు, జరిమానా విధించింది. ఈ కేసులను ట్రాఫిక్ పోలీసులు కాకుండా బోయిన్పల్లి శాంతిభద్రతల విభాగం అధికారులు నమోదు చేయడం గమనార్హం. న్యాయస్థానాలు రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌ను సైతం సీరియస్‌గా తీసుకుంటున్నాయని, భద్రతా కారణాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. నగరంలో రాంగ్ రూట్/నో ఎంట్రీ మార్గాల్లో దూసుకుపోతూ ప్రమాదాలకు గురికావడంతో పాటు వాటికి కారకులుగా మారుతున్న ఉదంతాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. కాస్తదూరం ముందుకు వెళ్లి ‘యూ టర్న్’ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్న వాహనచోదకులు... అది వన్ వేగా కనిపిస్తున్నా... రాంగ్ రూట్ అని తెలిసినా దూసుకుపోతున్నారు. నో ఎంట్రీ మార్గాలనూ వీరు వదలట్లేదు. ఇలాంటి వాహనచోదకులు నిత్యం చిన్న చిన్న ప్రమాదాలకు లోనవడంతో ఎదుటి వారికీ ఇబ్బందికరంగా మారుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారి ఉసురు తీయడంతో పాటు కుటుంబాన్నే కకలావికలం చేస్తున్నాయి. సిటీలోని అనేక జంక్షన్లతో పాటు కొన్ని కీలక ప్రాంతాల్లో ఈ రాంగ్ రూట్, నో ఎంట్రీ ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసినా వీటిని అడ్డుకోలేకపోతున్నారు. దీంతో కెమెరాలతో కానిస్టేబుళ్లు, హోంగార్డుల్ని మోహరిస్తున్నారు. వీరు ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడే వారి వాహనాలను ఫొటోలు తీసి, ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ–చలాన్ పంపుతున్నారు. స్పాట్లో చిక్కిన వారిని న్యాయస్థానంలో హాజరుపరచడం ప్రారంభించారు. నగర ట్రాఫిక్ విభాగం అమలు చేస్తున్న అత్యాధునిక వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) అమలులోకి వస్తే ఈ తరహా ఉల్లంఘనులకు రాత్రి వేళల్లోనూ చెక్ చెప్పవచ్చు. ఆటోమేటిక్ రాంగ్ డైరెక్షన్ వైలేషన్ క్యాప్చర్ సిస్టం (ఏఆర్‌డీవీసీఎస్)గా పిలిచే సాఫ్ట్‌వేర్‌ను బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. దీనిని నగరంలో ఈ తరహా ఉల్లంఘనలకు అవకాశం ఉన్న జంక్షన్లలో ఇప్పటికే ఉన్న సర్వైలెన్స్ కెమెరాలను అనుసంధానిస్తారు. జంక్షన్లు కాకుండా ఇతర చోట్ల ఈ ఉల్లంఘనలు జరుగుతున్న ప్రాంతాల్లో కొత్తగా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇలా నగర వ్యాప్తంగా 100 చోట్ల ఉండే కెమెరాలన్నీ కంట్రోల్ రూమ్‌లోని సర్వర్‌కు అనుసంధానించి ఉంటాయి. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ప్రత్యేక ప్రోగ్రామింగ్ ఆయా మార్గాల్లో నిర్దేశించిన రూట్లలో కాకుండా వాటికి వ్యతిరేకంగా వచ్చే వాహనాలను గుర్తించి, ఫొటో తీసి, కంట్రోల్‌రూమ్ సర్వర్‌కు పంపుతుంది. అక్కడ ఈ–చలాన్‌ను జనరేట్ చేసి వాహనచోదకుల చిరునామాకు పంపేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఐటీఎంఎస్ అమలులోకి వస్తే ఇలాంటి ఉల్లంఘనులకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పినట్లు అవుతుంది. -
రాంగ్ రూట్లో రావొద్దన్నందుకు దాడి
బంజారాహిల్స్: రాంగ్రూట్లో ఎందుకు వస్తున్నావంటూ ప్రశ్నించినందుకు ఓ యువకుడిపై కొంత మంది యువకులు దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రహ్మత్‌నగర్ సమీపంలోని జవహర్‌నగర్ సాయిబాబా టెంపుల్ వద్ద కొందరు యువకులు రాంగ్రూట్లో బైక్‌పై వస్తుండగా పాదాచారులతో పాటు ఇతర వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. రాంగ్రూట్లో వస్తే ప్రమాదాలు జరుగుతాయని స్థానికంగా నివసించే జోమాటో డెలివరీ బాయ్ శివశంకర్(22) వారిని మందలిస్తూ నిలదీశాడు. దీంతో సదరు యువకులు మద్యం మత్తులో శివశంకర్‌పై కత్తులు,రాడ్లు, ట్యూబ్‌లైట్లతో దాడి చేసి గాయపర్చారు. ఎంత బతిమిలాడినా వినిపించుకోలేదు. వారి నుంచి తప్పించుకునేందుకు శివశంకర్ తీవ్రంగా యత్నించాడు. అయినా వదిలిపెట్టకుండా వెంటపడి కొట్టారు. సుమారు గంటపాటు సాయిబాబా టెంపుల్చౌరస్తాలో యువకుల మధ్య ఘర్షణ ఉధ్రిక్తతకు దారి తీసింది. స్థానికులు ఆపేందుకు యత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. దాడి చేసిన యువకులు అక్కడి నుంచి పరారీ కాగా పోలీసులు రాత్రంతా గాలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పించుకోలేరు!
సాక్షి, సిటీబ్యూరో: ‘తొంబై తొమ్మిది సార్లు ఉల్లంఘించినా ఏ ఇబ్బందీ రాకపోవచ్చు... ధోరణి మారకుంటే వందోసారైనా మూల్యం చెల్లించుకోక తప్పదు’ ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో అధికారులు పదేపదే చెప్పే మాట ఇది. ఈ మూల్యం ఉల్లంఘనకు పాల్పడిన వాహనచోదకుడు చెల్లిస్తే ఒక ఎత్తు. అదే...ఏ పాపం ఎరుగని ఎదుటి వ్యక్తిపై ప్రభావం చూపితే... ఆ కుటుంబం బాధ, వ్యధ వర్ణనాతీతం. ప్రస్తుతం నగరంలో నిత్యం అనేక కుటుంబాలు ఈ క్షోభను అనుభవిస్తున్నాయి. ఉల్లంఘన దృష్టిలో పొరపాటుగా ఉన్న అనేక అంశాలు బాధితుల పాలిట గ్రహపాట్లుగామారుతున్నాయి. ఇలాంటి ‘పొరపాట్ల’లో రాంగ్ రూట్, నో ఎంట్రీ మార్గాల్లోకి వాహనాలతో రావడం ప్రధానమైంది. వీటిని నిరోధించేందుకు ఆటోమేటిక్ రాంగ్ డైరెక్షన్ వైలేషన్ క్యాప్చర్ సిస్టం (ఏఆర్‌డీవీసీఎస్)ను అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. నిర్లక్ష్యంతో కూలిపోతున్న కుటుంబాలు... నగరంలో ఇలా రాంగ్ రూట్/నో ఎంట్రీ మార్గాల్లో దూసుకుపోతూ ప్రమాదాలకు లోను కావడంతో పాటు వాటికి కారకులుగా మారుతున్న ఉదంతాలు ఎన్నో ఉంటున్నాయి. కాస్తదూరం ముందుకు వెళ్లి ‘యూ టర్న్’ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్న వాహనచోదకులు...అది వన్ వేగా కనిపిస్తున్నా...రాంగ్ రూట్ అని తెలిసినా దూసుకుపోతున్నారు. నో ఎంట్రీ మార్గాలనూ వీరు వదలట్లేదు. ఇలాంటి వాహనచోదకులు నిత్యం చిన్న చిన్న ప్రమాదాలకు లోనవడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఎదుటి వారి ఉసురు తీయడం చేస్తున్నారు. ఇప్పటి వరకు బారికేడ్లు, కెమెరాలతో... సిటీలోని అనేక జంక్షన్లతో పాటు కొన్ని కీలక ప్రాంతాల్లో ఈ రాంగ్ రూట్, నో ఎంట్రీ ఉల్లంఘనలు ఉంటున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆయా చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసినా ఉల్లంఘనుల్ని అడ్డుకోలేకపోతున్నారు. దీంతో కెమెరాలతో కానిస్టేబుళ్లు, హోంగార్డుల్ని మోహరిస్తున్నారు. వీరు ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడే వారి వాహనాల ఫొటోలు తీసి, ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ–చలాన్ పంపుతున్నారు. అయితే అన్ని వేళల్లో, ప్రధానంగా రాత్రిపూట ఈ పాయింట్లలో సిబ్బంది లేకపోవడంతో ఉల్లంఘనులు రెచ్చిపోయి ప్రాణాలు తీసుకోవడం/తీయడం చేస్తున్నారు. దీనికి పరిష్కారంగానే ట్రాఫిక్ పోలీసు విభాగం ఏఆర్‌డీవీసీఎస్ పరిజ్ఞానాన్ని అమలులోకి తెస్తోంది. నగర వ్యాప్తంగా 100 చోట్ల... ఆటోమేటిక్ రాంగ్ డైరెక్షన్ వైలేషన్ క్యాప్చర్ సిస్టం (ఏఆర్‌డీవీసీఎస్)గా పిలిచే ఈ సాఫ్ట్‌వేర్‌ను బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. దీన్ని నగరంలో ఈ తరహా ఉల్లంఘనలకు అవకాశం ఉన్న జంక్షన్లలో ఇప్పటికే ఉన్న సర్వైలెన్స్ కెమెరాలను అనుసంధానిస్తారు. జంక్షన్లు కాకుండా ఇతర చోట్ల ఈ ఉల్లంఘనలు జరుగుతున్న ప్రాంతాల్లో కొత్తగా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇలా నగర వ్యాప్తంగా 100 చోట్ల ఉండే కెమెరాలన్నీ కంట్రోల్ రూమ్‌లోని సర్వర్‌కు అనుసంధానించి ఉంటాయి. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ప్రత్యేక ప్రోగ్రామింగ్ ఆయా మార్గాల్లో నిర్దేశించిన రూట్లలో కాకుండా వాటికి వ్యతిరేకంగా వచ్చే వాహనాలను గుర్తించి, ఫొటో తీసి, కంట్రోల్‌రూమ్ సర్వర్‌కు పంపుతుంది. అక్కడ ఈ–చలాన్‌ను జనరేట్ చేసి వాహనచోదకుల చిరునామాకు పంపేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. వచ్చే నెల నుంచి అందుబాటులోకి... ఈ తరహా ఈ–చలాన్లు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచేసే వాహనచోదకులపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మూడు కమిషనరేట్లకు చెందిన పెండింగ్ డేటాను ఇంటిగ్రేడ్ చేయడం, బకాయిదారులకు సంక్షిప్త సందేశాలు పంపడం, రహదారులపై పీడీఏ మిషన్ల ద్వారా తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడం, ఎక్కువ సంఖ్యలో పెండింగ్ చలాన్లు ఉన్న వారిపై న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేయడం తదితర చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఓపక్క ఉల్లంఘనల్ని నిరోధించడంతో... మరోపక్క ఈ–చలాన్ బకాయిలు వసూలు చేయడం సాధ్యమవుతుందని అధికారులు చెప్తున్నారు. టెండర్ల దశను పూర్తి చేసుకున్న ఏఆర్‌డీవీసీఎస్ విధానం వచ్చే నెల నుంచి పని చేయడం ప్రారంభించనుంది. ఇలాంటి టెక్నాలజీ అనుసంధానిత విధానాల వల్ల వాహనచోదకులతో ట్రాఫిక్ సిబ్బందికి ఘర్షణలు, వాగ్వాదాలకూ అస్కారం ఉండదని అధికారులు చెప్తున్నారు. -
దివాకర్ బస్సుది ‘రాంగ్‌రూటే’
అనంతపురం సెంట్రల్: వరుస ప్రమాదాలకు కారణమవుతున్న ఏపీ05 డబ్ల్యూ 8556 నంబరుగల దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తున్నది రాంగ్ రూటేనని రోడ్డు రవాణా శాఖ అధికారులు నిర్దారించారు. రెండురోజుల క్రితం ఈ బస్సు బెళుగుప్ప మండల పరిధిలో అతివేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదానికి గురై 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గతంలో వ్యవసాయ అనుబంధ ‘ఆత్మ’ డీడీ రమణ ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టి.. ఆయన మృతికి కారణమైంది. ఇలా వరుస ప్రమాదాలకు కారణమవుతున్న ఈ బస్సు కర్ణాటక ప్రభుత్వం నుంచి పర్మిట్ పొందింది ఒక రూటైతే.. ప్రయాణికులను ఎక్కించుకుంటున్నది మరో రూట్ కావడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన అనంతపురం ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) సుందర్‌వద్దీ సదరు ట్రావెల్స్ యజమాన్యానికి బుధవారం నోటీసులు పంపారు. -
రాంగ్‌రూట్ లో డ్రైవింగ్: 31 వేల జరిమానా
పటాన్చెరు: ముత్తంగి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) జంక్షన్ వద్ద రాంగ్రూట్లో వాహనాలు నడుపుతున్న వారికి పోలీసులు బుధవారం రూ.31,500 జరిమానా విధించారు. జాతీయ రహదారిపై పూర్తిగా తప్పుడు రూట్లో వచ్చే వారిని మాత్రమే గుర్తించి, 31 మందికి జరిమానా విధించినట్లు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య తెలిపారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్ మంచిది కాదని, అది కూడా జాతీయ రహదారిపై రాంగ్‌సైడ్‌లో నడపడం ప్రమాదకరమని ఆయన వాహనదారులను హెచ్చరించారు.