
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న పల్లె వెలుగు బస్సుకు కు బుధవారం తెల్లవారు జామున పెను ప్రమాదం తప్పింది . పాల్వంచ వాగు వద్ద దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో బస్సు రాంగ్ రూట్లో వెళ్ళి మరో బస్సును ఢీ కొట్టబోయింది.
డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 35 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు కామారెడ్డి డిపోకు చెందిందని బస్సు డ్రైవర్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment