యాక్సిడెంట్‌ నిందితునికి అరగంటలోనే బెయిల్‌..! | Car Driving On Wrong Side Hits Biker In Gurugram, Video Viral | Sakshi
Sakshi News home page

యాక్సిడెంట్‌ నిందితునికి అరగంటలోనే బెయిల్‌..!

Published Fri, Sep 20 2024 11:03 AM | Last Updated on Fri, Sep 20 2024 4:48 PM

Car Driving On Wrong Side Hits Biker In Gurugram, Video Viral

ఢిల్లీ: దేశ రాజధాని రీజియన్‌లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు ఓ నిండు ప్రాణం బలైంది. అతివేగంగా రాంగ్‌రూట్‌లో వచ్చి ఓ యువ బైకర్‌ను ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే అతను చనిపోయాడు. అయితే ఈ కేసులో గురుగావ్‌ పోలీసులు వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ద్వారకాకు చెందిన 23 ఏళ్ల అక్షత్‌ గార్గ్‌.. తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం డీఎల్‌ఎఫ్‌ ఫేజ్‌ 2 గోల్ఫ్‌ కోర్స్‌ రోడ్‌లో వెళ్తున్నాడు. ఆ టైంలో హఠాత్తుగా రాంగ్‌రూట్‌లో వచ్చిన ఓ మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనం అతని బైక్‌ను ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్‌ ఎగిరి కాస్త దూరంలో పడింది. ఆ ప్రమాదం తర్వాత అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే..

నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. 24 గంటలు గడవక ముందే బెయిల్‌ మీద రిలీజ్‌ చేశారు.అక్షత్‌ స్నేహితుడి బైక్‌కు ఉన్న గోప్రో యాక్షన్‌ కెమెరా ద్వారా యాక్సిడెంట్‌ రికార్డయ్యింది. అయితే పోలీసులు ఆ వీడియోను సాక్ష్యంగా పరిగణించబోమని చెప్పారని, నిందితుడిని అరగంటలోనే బయటకు పంపించేశారని అక్షత్‌ స్నేహితుడు వాపోయాడు. విషయం బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తగా.. బెయిల్‌ రద్దు చేసి కేసు విచారణ చేపడతామని గురుగావ్‌ పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలో #JusticeforAkshat ట్రెండ్‌ నడుస్తోంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement