Gurugram Police
-
యాక్సిడెంట్ నిందితునికి అరగంటలోనే బెయిల్..!
ఢిల్లీ: దేశ రాజధాని రీజియన్‌లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు ఓ నిండు ప్రాణం బలైంది. అతివేగంగా రాంగ్రూట్లో వచ్చి ఓ యువ బైకర్‌ను ఢీ కొట్టడంతో స్పాట్లోనే అతను చనిపోయాడు. అయితే ఈ కేసులో గురుగావ్ పోలీసులు వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్వారకాకు చెందిన 23 ఏళ్ల అక్షత్ గార్గ్.. తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం డీఎల్ఎఫ్ ఫేజ్ 2 గోల్ఫ్ కోర్స్ రోడ్లో వెళ్తున్నాడు. ఆ టైంలో హఠాత్తుగా రాంగ్రూట్లో వచ్చిన ఓ మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనం అతని బైక్‌ను ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ ఎగిరి కాస్త దూరంలో పడింది. ఆ ప్రమాదం తర్వాత అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 24 గంటలు గడవక ముందే బెయిల్ మీద రిలీజ్ చేశారు.అక్షత్ స్నేహితుడి బైక్‌కు ఉన్న గోప్రో యాక్షన్ కెమెరా ద్వారా యాక్సిడెంట్ రికార్డయ్యింది. అయితే పోలీసులు ఆ వీడియోను సాక్ష్యంగా పరిగణించబోమని చెప్పారని, నిందితుడిని అరగంటలోనే బయటకు పంపించేశారని అక్షత్ స్నేహితుడు వాపోయాడు. విషయం బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తగా.. బెయిల్ రద్దు చేసి కేసు విచారణ చేపడతామని గురుగావ్ పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో #JusticeforAkshat ట్రెండ్ నడుస్తోందిShocking Car-Bike Collision in Gurgaon, accused released on bail same day! Car driving on wrong side of Gurgaon Golf Course road DLF Phase-II rammed into a bike killing the rider Akshat Garg on the spot. Accused driver Kuldeep Thakur who was in the SUV with a BJP sticker on it… pic.twitter.com/qUETDrAZ1C— Nabila Jamal (@nabilajamal_) September 19, 2024 -
మేడం మీరు మోడ్రన్ డ్రెస్‌లో బాగుంటారు.. వర్సిటీ డీన్ వేధింపులు..
దేశంలో మహిళలు, యువతులపై ఏదో ఒక చోట.. వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. పనిచేసేచోట, ప్రయాణ సమయాల్లో మహిళలు వేధింపులకు గురువుతూనే ఉన్నారు. తాజాగా ఓ డిపార్ట్మెంట్ డీన్.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు వేధింపులకు గురిచేశాడు. విదేశీ దుస్తుల్లో నువ్వు అందంగా ఉంటావ్ అంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గురుగ్రామ్ యూనివర్సిటీలో ఫార్మాస్యూటికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్ ధీరేంద్ర కౌశిక్ పనిచేస్తున్నారు. అదే వర్సిటీలో ఓ మహిళ.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తన్నారు. ఈ క్రమంలో డీన్ ధీరేంద్ర.. ఆమెపై కన్నేసి అనుచితంగా ప్రవర్తించాడు. శారీరకంగా వేధింపులకు గురిచేశాడు. ఇటీవల ధీరేంద్ర.. ఆమెతో మాట్లాడుతూ.. మీరు మోడ్రన్ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తారు. మీ భర్త లేనప్పుడు నన్ను హోట్ల్లో కలవండి అంటూ కామెంట్స్ చేశాడు. అలాగే, పలు సందర్భాల్లో ఆమె ప్రైవేటు భాగాలను తాకే ప్రయత్నం చేశాడు. దీంతో, ఆమె.. తనతో ఇలా ప్రవర్తించవద్దని ధీరేంద్రను కోరింది. అనంతరం.. ఈ విషయాలపై వీసీకి ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆయన నిరాకరించడం గమనార్హం. ఇలా, ధీరేంద్ర.. ఆమెను వేధింపులకు గురిచేయడం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఏప్రిల్ 28వ తేదీన యూనివర్సిటీ ఆవరణలోని ఒక గదిలో తనను వేధించడంతో ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. ఆమె.. గురుగ్రామ్‌లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా, ఫిర్యాదు సమయంలో తనపై జరిగిన వేధింపులను వీసీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య ఉన్న కొన్ని సంబంధాల కారణంగా వీసీ పట్టించుకోలేదని తెలిపారు. ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. -
హాలీవుడ్ మూవీ రేంజ్.. స్మగ్లర్లను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: అక్రమంగా గోవులను తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను గురుగ్రామ్ పోలీసులు అర్ధరాత్రి ఛేజ్ చేసి పట్టుకున్నారు. దొంగలను పట్టుకునేందు పోలీసులు.. హాలీవుడ్ మూవీ రేంజ్లో రోడ్డుపై లారీని ఛేజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. ఐదుగురు పశువుల స్మగ్లర్లు గోవులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు వారి వాహనాన్ని వెంబడించారు. అయితే, స్మగ్లర్లు ఢిల్లీ బోర్డర్ నుండి గురుగ్రామ్‌లోకి ప్రవేశిస్తుండగా పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్మగ్లర్లు లారీని ఆపకుండా స్పీడ్‌గా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి దాదాపు 22 కిలోమీటర్ల దూరం ఛేజింగ్ చేసిన తర్వాత వారిని పట్టుకున్నారు. Cow Smugglers for Illegal Slaughter Perpetrators: TASLIM, SHAHID, KHALID, BALLU Thanks to Gurugram Police for catching these thieves. https://t.co/JnlW8cfOV9 — शुद्ध | Shuddha (@ShuddhaWorld) April 10, 2022 ఛేజ్ చేసే క్రమంలో పోలీసులు.. స్మగ్లర్ల లారీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్ల్లో లారీ టైర్ పేలిపోయినప్పటికీ వారు వాహనాన్ని మాత్రం ఆపలేదు. కాగా, లారీ పట్టుకున్న తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత లారీలో తనిఖీలు చేపట్టగా అందులో తుపాకులు, బుల్లెట్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆవుల స్మగ్లర్లు గురుగ్రామ్‌లో భీభత్సం సృష్టించడం ఇదేమీ మొదటిసారి కాదు. హర్యానా ప్రభుత్వం ఆవుల స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను రూపొందించినప్పటికీ స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పశువుల అక్రమ రవాణా పెరుగుతూనే ఉంది. -
అత్యాచారం కేసు పెట్టిన యువతి అరెస్ట్.. విచారణలో అసలు విషయం!
గురుగ్రామ్: తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసిన 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురుగ్రామ్(హర్యానా)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనపై 8మంది అత్యాచారం చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సదరు యువతి తన తల్లితో గురుగ్రామ్‌లో నివాసం ఉంటోంది. ఆమెకు హనీ ట్రాప్ పేరుతో మగవారిని వలలో వేసి డబ్బులు గుంజటం అలవాటుగా మారింది. ఆమె వలలో చిక్కనివారిపై నకిలీ అత్యాచారం కేసులు పెట్టి వేధించడం ప్రారంభించింది. తాజాగా ఆమె 8 మందిపై అత్యాచారం కేసు పెట్టగా విచారణ జరిపిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆమె ఫేక్ అత్యాచారం కేసు పెట్టి.. పలువురు పురుషుల వద్ద హనీ ట్రాప్ ముగుసులో డబ్బు లాగుతోందని పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో ఆ యువతి తల్లితో పాటు నరేందర్ యాదవ్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నారని ఏసీపీ(క్రైమ్) ప్రీత్ పాల్ సింగ్ సాంగ్వాన్ తెలిపారు. పోలీసులు ఆమెను బుధవారం కోర్టుకు హాజరపరిచి, అనంతరం జ్యుడీషియల్ కస్టడికి తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు.. కేసు నమోదు
గురుగ్రామ్: పాకిస్తాన్‌కు అనుకూలంగా ఓ వ్యక్తి నినాదాలు చేస్తూ.. అపార్టుమెంట్ వాసులకు ఇబ్బంది కలిగించాడు. దీంతో వారు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్ సొసైటీ అపార్టుమెంట్లో నివాసం ఉండే ఓ వ్యక్తి తన ఫ్లాట్ బాల్కానీలో నిలబడి పాకిస్తాన్‌కు అనుకూలంగా.. ‘పాకిస్తాన్ జిందాబాద్.. పాకిస్తాన్ జిందాబాద్..’ నినాదాలు చేశాడు. దీంతో అతని నినాదాలకు ఇబ్బందిగా భావించిన అపార్టుమెంట్ వాసులు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. చదవండి: ‘తాలిబన్ ఉగ్రవాద సంస్థా? కాదా? సమాధానం చెప్పాలి’ కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు. అయితే నిందితుని భార్య కూడా అపార్టుమెంట్ వాసులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని, అందుకోసం చికిత్స తీసుకుంటున్నాడని తెలిపింది. అందువల్లనే నినాదాలు చేశాడని తెలిపింది. కొంతమంది అపార్టుమెంట్ వాసులు తమ ఫ్లాట్ వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. అయితే నిందితుడు ఒత్తిడి ఉండి నినాదాలు చేశాడా? లేదా? ఉద్దేశపూర్వంగా చేశాడా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: షాకింగ్.. రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపిన స్విగ్గీ ఏజెంట్ -
హర్యానాలో ఖా‘కీచకం’
చండీగఢ్ : మానవత్వం మంటగలిసేలా పోలీస్ స్టేషన్ లాకప్‌లోనే అసోం మహిళను వివస్త్రను చేసి బెల్టులు, లాఠీలతో చితకబాదిన ఉదంతం హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగుచూసింది. డీఎల్ఎఫ్ ఫేజ్ వన్ ప్రాంతంలో ఓ ఇంటిలో పనిచేస్తున్న అసోంకు చెందిన మహిళ (30)ను చోరీకి పాల్పడిందనే ఆరోపణలపై పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. దర్యాప్తు అధికారి మధుబాల ఆమెను స్టేషన్‌కు పిలిపించి, లాకప్‌లో నిర్బంధించారు. దర్యాప్తు పేరుతో బాధితురాలిని వివస్త్రను చేసి బెల్టులు, లాఠీలతో చితకబాదారు. తాను చేయని తప్పును అంగీకరించేలా ఆమెను తీవ్రంగా వేధించారని బాధితురాలి భర్త పేర్కొన్నారు. పోలీసులు తన జననాంగాలనూ గాయపరిచారని ఆమె వాపోయారు. పోలీసుల తీరును తప్పుపడుతూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజా సంఘాల కార్యకర్తలు గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ మహ్మద్ అకిల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు పోలీసులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. -
సిగరెట్ డబ్బులు ఇవ్వమన్నందుకు పాన్‌షాప్ ఓనర్‌పై..
న్యూఢిల్లీ : తాగిన సిగరెట్లకు డబ్బు ఇవ్వాలని కోరినందుకు పాన్‌షాప్ యజమానిని కస్టమర్ దారుణంగా హత్య చేసిన ఘటన గురుగ్రామ్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈనెల 3న కన్హయ్య సిగరెట్లు కొనుగోలు చేసేందుకు అబ్ధుల్ షకూర్ (55)కు చెందిన పాన్‌షాప్‌కు వెళ్లాడు. కన్హయ్య మూడు సిగరెట్లు తాగిన తర్వాత అతడిని డబ్బులు ఇవ్వాలని పాన్‌షాప్ యజమాని షకూర్ కోరగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, మరుసటి రోజు మళ్లీ పాన్‌షాప్‌కు వెళ్లిన కన్హయ్య కొనుగోలు చేసిన సిగరెట్‌ను వెలిగించి షకూర్పై పెట్రోల్ చల్లి కాలుతున్న సిగరెట్‌ను అతడి చేయికి అంటించడంతో బాధితుడు మంటల్లో చిక్కుకున్నాడు. తీవ్రంగా గాయపడిన షకూర్‌ను సప్ధర్‌జంగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఈనెల 13న మరణించాడు. కాగా ఘటన జరిగిన ప్రాంతంలోనే కన్హయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. -
లగ్జరీ కారు కోసం కిడ్నాప్ డ్రామా..
సాక్షి, న్యూఢిల్లీ : లగ్జరీ కారు కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యుల నుంచి రూ మూడు కోట్లు పొందడం కోసం కిడ్నాప్ డ్రామాకు పూనుకున్న 19 ఏళ్ల యువకుడిని గుర్గావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 29న క్రికెట్ అకాడమీకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి వెళ్లిన సందీప్ కుమార్ అనే ఇంటర్ విద్యార్ధి అప్పటి నుంచి అదృశ్యమయ్యాడు. అయితే తాను కిడ్నాప్ అయ్యానని తన సోదరుడు నవీన్ కుమార్‌కు కాల్ చేయాల్సిందిగా ఓ వ్యక్తికి సందీప్ రూ 500 ఇచ్చాడని, రెండు రోజుల పాటు భివాడిలో ఉండి తన బైక్‌ను ఓ ఆలయం వద్ద విడిచిపెట్టి వెళ్లాడని ప్రాధమిక విచారణలో వెల్లడైందని గుర్గావ్ పోలీస్ ప్రతినిధి సుభాష్ తెలిపారు. యువకుడు గుర్గావ్ చేరుకున్న అనంతరం అప్పటికే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అతడిని గుర్తించి ట్రాఫిక్ కానిస్టేబుల్ స్ధానిక పోలీసులకు అప్పగించాడు. పోలీసులు విచారించగా హైఎండ్ కార్ కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యుల నుంచి రూ 3 కోట్లు పొందేందుకు తానే కిడ్నాప్ డ్రామాకు పాల్పడ్డానని అంగీకరించాడు. -
ఇండిగో ఉద్యోగి అనుమానాస్పద మృతి
గురుగ్రామ్ : ఇండిగో విమానయాన సంస్థలో అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ట్రెయినింగ్ నిమిత్తం గురుగ్రామ్ వచ్చిన మహిళ (35) శుక్రవారం తన సొంతూరు గువహటి(అస్సాం)కి వెళ్లాల్సి ఉంది. ఈ ఘటన సుషాంత్ లోక్-1 గెస్ట్ హౌజ్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. ట్రెయినింగ్ కోసం ఢిల్లీ వచ్చిన ఇండిగో ఉద్యోగి పనిముగించుకొని గురువారం సాయంత్రం ఓ గెస్ట్ హౌజ్‌లో దిగింది. సదరు మహిళ హోటల్ నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో ఆమె కొలీగ్ అనుమానం వచ్చి ఫోన్ చేశారు. రిప్లై లేకపోవడంతో హోటల్ సిబ్బందికి సమాచామిచ్చారు. హోటల్ సిబ్బంది ఎన్నిసార్లు డోర్ కొట్టినా ఎటువంటి స్పందన లేదు. దీంతో గది తలుపులు బద్దలు కొట్టిన హోటల్ సిబ్బందికి ఇండిగో ఉద్యోగి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అయితే, ఈ ఘటన విషయం పోలీసులకు చేరవేయడంలో హోటల్ యాజమాన్యం ఆలస్యం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు. మృతురాలి కుటుంబానికి సమాచారమిచ్చామని తెలిపారు. మహిళకు వివాహమైందనీ, పోస్టుమార్టం పరీక్ష అనంతరం మిగతా వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ కరణ్ గోయల్ చెప్పారు. ఘటనా హత్యా, ఆత్మహత్యా అనేది తేలాల్సి ఉందన్నారు. అయితే, ఘటనా స్థలంలో ఎలాంటి అనుమానిత ఆధారాలు దొరకలేదన్నారు. ‘గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇండిగో ఉద్యోగి ఫుడ్ ఆర్డర్ చేశారు. రూమ్‌లో ఆమెతో పాటు ఎవరూ లేరు. ఎప్పటిలాగానే మా హోటల్లో ఆ రోజు రాత్రి వివిధ కంపెనీల్లో పనిచేసేవారు కూడా బస చేశారు. మహిళ మృతి గురించి తెలియగానే పోలీసులకు సమాచారమిచ్చాం’ అని గెస్ట్ హౌజ్ యజమాని తెలిపారు. -
దారుణం: కెన్యా దేశస్థురాలిపై గ్యాంగ్‌రేప్
గుర్గావ్ : మహిళలపై దారుణాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. తాజాగా గుర్గావ్లో చోటు చేసుకున్న ఘటన మరో నిర్భయను గుర్తుకు తెస్తుంది. ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న కెన్యా దేశస్థురాలైన మహిళలను ఇంటి వద్ద దింపుతామని నమ్మబలికి కారు ఎక్కించుకుని ఆమెపై అత్యాచారం జరిపారు. ఈ దారణమైన ఘటన బుధవారం గుర్గావ్లో చోటుచేసుకుంది. పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్గావ్లోని బ్రిస్తోల్ చౌక్‌లో తాను నివాసం ఉండే దక్షిణ ఢిల్లీ చత్తపూర్‌కు వెళ్లేందుకు క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న మహిళను ముగ్గురు యువకులు స్కార్పియోలో వచ్చి చత్తపూర్‌లో దింపుతామని చెప్పి కారులో ఎక్కించుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు వారి స్నేహితులను మరో ఇద్దరి ఫోన్ చేసి అక్కడికి పిలిపించారు. మొత్తం ఐదుగురు అతి దారుణంగా ఆమెపై అత్యాచారం జరిపారు. అనంతరం ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డా దుండగులు ఆమెను అపస్మారకస్థితిలోకి వెళ్లేలా త్రీవంగా కొట్టి గుర్గావ్లోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పడేసి వెళ్లారు. కొంత సేపటికి తెరుకున్న బాధితురాలు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కారు నెంబర్ ఆధారంగా ఐదుగురు నిందితుల్లో ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందతులు సుధీర్, మోహిత్, ప్రవీణ్‌లుగా పోలీసు గుర్తించి వారి అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళను గుర్గావ్లోని ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దాంతో పోలీసు నిందితులపై ఐపీసీ సెక్షన్ 376-డీ కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులో కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసు తెలిపారు. -
యూవీపై కేసు.. చీప్ పబ్లిసిటీ
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహ హింస కేసు నమోదు అయినట్లు రెండురోజులుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే వెంటనే రంగంలోకి దిగిన యూవీ ఫ్యామిలీ న్యాయవాది ఆ ఆరోపణలు ఖండించాడు. కానీ, యూవీ కుటుంబానికి నోటీసులు పంపించిన మాట వాస్తవమేనని గుర్‌గ్రామ్ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యువరాజ్ తల్లి షబ్నమ్ సింగ్ స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... తమ కుటుంబం పరువు బజారుకీడుస్తున్న కోడలు ఆకాంక్షపై మండిపడ్డారు. భర్తతో దూరంగా ఉంటున్న రెండేళ్ల తర్వాత ఆమె పోరాటం దేనికోసమంటూ ఆకాంక్షను ఆమె నిలదీశారు. అసలు యువరాజ్ తో ఈ కేసుకు సంబంధం ఏంటి? ఆకాంక్ష యువరాజ్ సోదరుడు జొరావర్ సింగ్ భార్య మాత్రమే. బిగ్ బాస్‌తోసహా పలు ఇంటర్వ్యూల్లో ఆమె(ఆకాంక్ష) యువీ తనకు సోదరుడులాంటివాడని చెప్పింది. అలాంటి వ్యక్తిపై కేసు పెట్టే ప్రయత్నం ఇప్పుడేందుకు చేస్తున్నట్లు అని ఆకాంక్షపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చీప్ పబ్లిసిటీకి పాల్పడుతోంది. యువరాజ్ ఓ సెలబ్రిటీ కాబట్టి.. అతని హోదాను అడ్డుపెట్టుకుని డబ్బు గుంజాలని యత్నిస్తోంది అని షబ్నమ్ ఆరోపించారు. తమ కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని.. తనంతట తానే ఇంట్లోంచి వెళ్లిపోయిందన్నారు. జోరవర్-ఆకాంక్షలు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ గతంలోనే కోర్టును ఆశ్రయించారని, మరి అటువంటప్పుడు మళ్లీ గృహహింస కేసు వార్తలు రావడం అర్థరహితమన్నారు. యువీ అరెస్టయ్యాడా? అంటూ అంతా అడుగుతుంటే తమ కుటుంబం చిత్రవధ అనుభవిస్తోందని షబ్నమ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆకాంక్ష ఫిర్యాదు మేరకు గురుగ్రామ్ పోలీసులు యువీ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. ఆకాంక్ష ఆరోపణలు ఏంటంటే... ఆకాంక్ష తన భర్త జోర్వర్, అతని సోదరుడు యువరాజ్ సింగ్, అత్త షబ్నమ్‌లపై గృహ హింస కేసు నమోదు చేసింది. భర్త, అత్తలు హింసిస్తుంటే... యువీ అడ్డుకోకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయాడంట. ఆ లెక్కన్న అతన్ని కూడా నిందితుడిగా భావించాల్సి ఉంటుందని ఆకాంక్ష తరపు న్యాయవాది చెబుతున్నారు. ఇదిలా ఉంటే నేడు ఈ కేసు విచారణకు రాగా, వచ్చే నెల 21కి వాయిదా వేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. -
రూ.5 కోట్ల రద్దయిన కరెన్సీ స్వాధీనం
గురుగ్రామ్: టెక్నాలజీ హబ్‌గా పేరు గాంచిన గురుగ్రామ్‌లో భారీ కరెన్సీ మార్పిడి ముఠా ఆట్ట కట్టించారు పోలీసులు. ముఠా వద్ద నుంచి రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల కరెన్సీ దాదాపు రూ.5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. న్యూఢిల్లీకి సౌత్-ఈస్ట్‌లో ఉన్న గురుగ్రామ్‌లో పాత నోట్ల మార్పిడి జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. ఇక్కడి సెక్షన్ 15లోని ఓ ఇంట్లో ఓ ముఠా పాత నోట్లు మార్పిడి చేయడానికి భారీగా కమిషన్లు తీసుకుంటుందని పోలీసులు గుర్తించారు. గురువారం ఓ పోలీసు బృందం అకస్మాత్తుగా ఆ ఇంటిపై దాడులు నిర్వహించి రద్దయిన కరెన్సీ రూ.5 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. ఏడుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు గురుగ్రామ్ పోలీసులు వివరించారు. -
యువనటి మృతి కేసులో భర్త అరెస్ట్
గువాహటి: బాలీవుడ్ నటి, సింగర్ బిదిశా బెజ్బరువా అనుమానాస్పదమృతి కేసులో ఆమె భర్త నిశీత్ ఝాను గురుగ్రామ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిశీత్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అసోంకు చెందిన నటి బిదిశా బెజ్బరువా సోమవారం ఢిల్లీ శివారు ప్రాంతం గురుగ్రామ్‌లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెది ఆత్మహత్యా, లేక హత్యా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఆమెది ఆత్మహత్య కాదని, బిదిశా కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తంచేశారు. బిదిశా స్వస్థలం గువాహటి కాగా టీనేజీ నుంచే అసోం నాటకాలు, సంగీత కార్యక్రమాలు చేయడం ద్వారా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల విడుదలైన ‘జగ్గా జాసూస్’ ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గుజరాత్‌కు చెందిన నిశీత్ ఝాతో గతేడాది బిదిశా వివాహం జరిగింది. కానీ భర్త నిశీత్ ఫ్యామిలీ వేధింపులకు గురిచేయడంతో ఆ కుటుంబానికి నటి దూరంగా ఉంటున్నారు. భర్త నిశీత్ తో కలిసి జీవించాలని ఆమె భావించేవారు. ఇటీవల తన భర్త నిశీత్ తో కలిసి ఆమె టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. అంతలోనే గొడవ ఏదైనా జరిగి ఆమె సూసైడ్ చేసుకున్నారా.. ప్లాన్ ప్రకారం హత్య చేశారా అనే విషయం విచారణలో తేలుతుందన్నారు.