
ప్రతీకాత్మకచిత్రం
న్యూఢిల్లీ : తాగిన సిగరెట్లకు డబ్బు ఇవ్వాలని కోరినందుకు పాన్‌షాప్ యజమానిని కస్టమర్ దారుణంగా హత్య చేసిన ఘటన గురుగ్రామ్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈనెల 3న కన్హయ్య సిగరెట్లు కొనుగోలు చేసేందుకు అబ్ధుల్ షకూర్ (55)కు చెందిన పాన్‌షాప్‌కు వెళ్లాడు.
కన్హయ్య మూడు సిగరెట్లు తాగిన తర్వాత అతడిని డబ్బులు ఇవ్వాలని పాన్‌షాప్ యజమాని షకూర్ కోరగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, మరుసటి రోజు మళ్లీ పాన్‌షాప్‌కు వెళ్లిన కన్హయ్య కొనుగోలు చేసిన సిగరెట్‌ను వెలిగించి షకూర్‌పై పెట్రోల్ చల్లి కాలుతున్న సిగరెట్‌ను అతడి చేయికి అంటించడంతో బాధితుడు మంటల్లో చిక్కుకున్నాడు. తీవ్రంగా గాయపడిన షకూర్‌ను సప్ధర్‌జంగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఈనెల 13న మరణించాడు. కాగా ఘటన జరిగిన ప్రాంతంలోనే కన్హయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment