Gurugram Woman Arrested Over Fake Molestation Case Against 8 People - Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసు పెట్టిన యువతి అరెస్ట్‌.. విచారణలో అసలు విషయం!

Published Thu, Dec 30 2021 7:38 PM | Last Updated on Thu, Dec 30 2021 8:38 PM

Gurugram Woman Arrested Over Fake Molastaion Case Against 8 People - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గురుగ్రామ్‌: తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసిన 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌(హర్యానా)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనపై 8మంది అత్యాచారం చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. సదరు యువతి తన తల్లితో గురుగ్రామ్‌లో నివాసం ఉంటోంది. ఆమెకు హనీ ట్రాప్‌ పేరుతో మగవారిని వలలో వేసి డబ్బులు గుంజటం అలవాటుగా మారింది. ఆమె వలలో చిక్కనివారిపై నకిలీ అత్యాచారం కేసులు పెట్టి వేధించడం ప్రారంభించింది.

తాజాగా ఆమె 8 మం​దిపై అత్యాచారం కేసు పెట్టగా విచారణ జరిపిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆమె ఫేక్‌ అత్యాచారం కేసు పెట్టి.. పలువురు పురుషుల వద్ద హనీ ట్రాప్‌ ముగుసులో  డబ్బు లాగుతోందని పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో ఆ యువతి తల్లితో పాటు నరేందర్ యాదవ్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నారని ఏసీపీ(క్రైమ్) ప్రీత్ పాల్ సింగ్ సాంగ్వాన్ తెలిపారు. పోలీసులు ఆమెను బుధవారం కోర్టుకు హాజరపరిచి, అనంతరం జ్యుడీషియల్‌ కస్టడికి తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement