ఓసారి మా ఇంటికొచ్చి.. టీ తాగి వెళ్లండి! | Civil Contractor Honey Traped in Bengaluru | Sakshi
Sakshi News home page

ఓసారి మా ఇంటికొచ్చి.. టీ తాగి వెళ్లండి!

Published Sun, Jan 19 2025 12:36 PM | Last Updated on Sun, Jan 19 2025 1:09 PM

Civil Contractor Honey Traped in Bengaluru

కృష్ణరాజపురం: అల్లరి నరేష్‌ బ్లేడ్‌బాబ్జీ సినిమాలోని సీన్‌ను తలపించే ఘటన ఒకటి బ్యాడరహళ్లి పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వేషంలో హనీట్రాప్‌కు పాల్పడి..బ్బు గుంజే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ప్రధాన నిందితురాలు నయన (20) అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. 

గతంలో ఈ గ్యాంగ్‌లోని సంతోష్‌, అజయ్, జయరాజ్‌లను అరెస్టు చేసిన బ్యాడరహళ్లి పోలీసులు తాజాగా నయనను అరెస్టు చేశారు. నిర్మాణ కాంట్రాక్టర్‌ (57)ని పరిచయం చేసుకున్న నయన మాయమాటలతో అతని నుంచి తరచుగా రూ.5 వేలు, రూ.10 వేలను ఇప్పించుకొనేది. ఓసారి టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది.  వలలో పడిన బాధితుడు ఆమె స్కూటీని ఫాలో చేసుకుని ఇంటికి వెళ్లాడు. 

ఆమె ఇంటిలో ఉండగా పోలీసులమని చెప్పి వచ్చిన దుండగులు వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ బ్లాక్‌మెయిల్‌ చేశారు.  కాంట్రాక్టర్‌ను కొట్టి దుస్తులు విప్పించి ఫొటోలు తీసుకున్నారు. కింద మేడం ఉన్నారు, ఇక్కడే సెటిల్‌ చేసుకోమని బెదిరించి రూ.29 వేల నగదు, ఫోన్‌పేలో రూ.26 వేల నగదు, వంటిపై ఉన్న రూ.5 లక్షల విలువ చేసే బంగారు గొలుసు, ఉంగరం, బ్రాస్‌లెట్‌ను లాక్కొని పరారయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.  

విషాద మలుపుల ప్రేమ


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement