woman arrested
-
లోన్ ప్రాసెస్.. డబ్బులు ఉఫ్
కృష్ణరాజపురం: నేటి రోజుల్లో అందరికీ డబ్బులు అవసరమే. దానినే మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. బ్యాంకులో లోన్లు ఇప్పిస్తామని వేలాదిమంది వద్ద ప్రాసెసింగ్ ఫీజులని లక్షల రూపాయలు వసూలు చేసి పత్తా లేకుండా పోయిన కిలాడి గ్యాంగ్ ఉదంతం బయటపడింది. బాధితులు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, రేష్మా అనే మహిళను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆనంద్, రేష్మా, అంజుం, అనియా అనే నలుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఏం చేసేవారంటే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీకార కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో రూ. 1 లక్ష నుంచి 25 లక్షల వరకు సులభంగా లోన్లు ఇప్పిస్తామని ఈ ముఠా ప్రచారం చేసుకుంది, దీంతో అనేకమంది వీరి బుట్టలో పడిపోయారు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులని చెప్పి బాధితుల నుంచి లక్షల రూపాయలను వసూలు చేశారు. కానీ అప్పు మాత్రం ఇప్పించలేదు. ఫీజు డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగితే అడ్రస్ లేకుండా పోయేవారు. మోసపోయామని గుర్తించిన వందలాది మంది బాధితులు హైగ్రౌండ్స్ ఠాణాలో ఫిర్యాదులు చేశారు. కిలాడీ రేష్మా తనకు రాజకీయ నాయకులు తెలుసని ఈ దందాలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ ముఠా సుమారు 2 వేల మంది నుంచి డబ్బులు కైంకర్య చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ డబ్బు కోట్ల రూపాయల్లోనే ఉండవచ్చని తెలుస్తోంది. పరారీలో ఉన్న ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
మహిళ గలీజ్ పని.. యువకులతో పరిచయం పెంచుకుని.. నగ్న చిత్రాలు పంపి..
మైసూరు(కర్ణాటక): యువకులకు, పురుషులతో పరిచయం పెంచుకోవడం, వారి వాట్సప్‌కి తన నగ్నచిత్రాలను పంపి డబ్బులు వసూలు చేస్తున్న మహిళను నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు సవిత అలియాస్ మంజులా యాదవ్. ఇది మంచిది కాదని ఆమె భర్త అనేకసార్లు మందలించి గొడవపడినా ఆమె మాత్రం పంథా మార్చుకోకుండా కటకటాలను లెక్కిస్తోంది. పరిచయం పెంచుకుని.. వివరాలు... మైసూరు జిల్లాలోని పిరియా పట్టణ తాలూకాకు సవిత మైసూరు నగరంలోని విజయనగరలో నివాసం ఉంటోంది. అక్కడక్కడ దంపతుల వద్దకు వెళ్ళి తాను పేదరాలిని, సాయం చేయాలని వారి నుంచి డబ్బు తీసుకుంటుంది. తరువాత వారితో వరసలు మార్చి మాట్లాడి సంసారంలో గొడవలు పెట్టేది. యువతను, పురుషులను పరిచయం చేసుకుని తరచూ ఫోన్లలో చిట్‌చాట్ చేసేది. తన నగ్నచిత్రాలను పంపి బెదిరింపులకు దిగి అందినకాడికి వసూళ్లకు పాల్పడేది. ఈ వ్యవహారం తెలిసి సవిత భర్త ఆమెతో గొడవ పడ్డాడు. ఒకసారి చాకుతో పొడిచి దాడి కూడా చేశాడు. కానీ సవిత బుద్ధి మాత్రం మార్చుకోలేదు. ఇలా అనేకమంది వద్ద లక్షల రూపాయలను గుంజినట్లు సమాచారం. విజయనగరలోని రెండవ స్టేజ్‌లో అభిషేక్ రోడ్డులో స్పా పేరుతో వేశ్యావాటికను కూడా నడుపుతోందని పోలీసులు తెలిపారు. పలు ఫిర్యాదులు రావడంతో విజయనగర పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రెండు దోపిడీ కేసుల్లో ఏడుగురు అరెస్టు మైసూరులో రెండు వేర్వేరు చోట్ల జనాన్ని కొట్టి సొమ్ము దోచుకెళ్లిన ఏడుమందిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నవంబర్ నెల 30వ తేదీ తెల్లవారుజామున 5 గంటల సమయంలో మైసూరులో బీఎన్ రోడ్డులో నడిచి వెళ్తున్న వ్యక్తిని ఆటోలో వచ్చిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కొట్టి అతని వద్దనున్న సుమారు రూ. 25 వేల నగదును దోచుకెళ్లారు. లష్కర్ పోలీసులు విచారించి నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 22 వేల నగదును, ఒక ఆటో, మొబైల్ ఫోన్లను స్వా«దీనం చేసుకొన్నారు. మరో కేసులో డిసెంబర్ 14వ తేదీన రాత్రి 7.30 సమయంలో బీఎన్ సెంట్రల్ మాల్ దగ్గర నడిచి వెళ్తున్న వ్యక్తిని ఆటోలో వచ్చిన నలుగురు అడ్డుకుని కొట్టి రూ. 6700 నగదు, మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. లష్కర్ పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. చదవండి: వివాహిత ఆత్మహత్య.. కారణం అదేనా? -
హైదరాబాద్ లో వెలుగులోకి మరో వలపు వల
-
పెళ్లి పేరుతో యువకుడికి ‘మాయలేడి’ వల.. రూ.31లక్షలకు టోకరా
సాక్షి, హైదరాబాద్: మత్తెక్కించే మాటలతో ఆకట్టుకుంటుంది. చూపు తిప్పుకోలేని అందమైన ఫొటోలు, వీడియోలతో ఆకర్షిస్తుంది. పెళ్లి చేసుకుందామని నమ్మించి జేబు ఖాళీ చేసేస్తుంది ఈ మాయలేడి! సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచి యువకులకు గాలం వేస్తున్న యువతితో పాటు ఆమెతో సహజీవనం చేస్తున్న మరొకరిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బీ రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన పరాస తనుశ్రీ, పరాస రవితేజ ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని భావించిన ఇరువురూ పథకం వేశారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతా తెరిచి యువకులను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. తనుశ్రీ పేరుతో ఇన్‌స్ట్రాగామ్‌లో నాలుగు అకౌంట్లు తెరిచి అందమైన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసేది. దీంతో తక్కువ సమయంలోనే ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. కామెంట్లు పెట్టేవారిలో బ్యాచిలర్స్, అమాయకులను ఎంపిక చేసుకుని వారికి రిప్లై ఇచ్చేది. ఫోన్ నంబర్లు తీసుకుని తియ్యని మాటలతో ప్రేమగా మాట్లాడుతూ నమ్మించేది. ఈ క్రమంలో ఓ రోజు ఫిర్యాదుదారుడికి తనుశ్రీ ఇన్‌స్ట్రాగామ్ నుంచి మెసేజ్ వచ్చింది. తక్కువ సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఒకరికొకరు ఫోన్ నంబర్లు మార్చుకొని గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. తల్లికి ఆరోగ్యం బాలేదని, గృహ రుణం వాయిదా చెల్లించాలని, కరోనా వచ్చిందని ఇలా రకరకాల సాకులతో ఖర్చులకు డబ్బులు కావాలని అడగడంతో 8 నెలల కాలంలో రూ.31.66 లక్షలు బదిలీ చేశాడు. ఒక రోజు యువతి బాధితుడితో పెళ్లి చేసుకుందామని చెప్పింది. నిజమేనని నమ్మిన బాధితుడు ఎదురుచూశాడు. ఆపై ఆమె నుంచి రిప్లై రాకపోవటంతో మోసపోయానని గుర్తించి రాచకొండ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాంకేతికత ఆధారాల ఆధారంగా తనుశ్రీ, రవితేజలను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరు ఇద్దరూ పలువురు యువకులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే వీరిపై మేడిపల్లి ఠాణాలోనూ కేసు నమోదయింది. ఇదీ చదవండి: Anti Hijab Protests: ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అరెస్ట్ -
ఐసిస్‌తో సంబంధమున్న మహిళ అరెస్ట్
యశవంతపుర: కర్ణాటకలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కన్నడ రచయిత దివంగత బీఎం ఇదినబ్బ మనవడి భార్య దీప్తి మార్లా అలియాస్ మరియం.. యువకులను ఐసిస్ వైపు ఆకర్షితులను చేస్తున్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) ఆమెను సోమవారం అరెస్ట్ చేసింది. ఉళ్లాలలో ఇదినబ్బ కొడుకు బీఎం బాషా నివాసంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బాషా చిన్నకొడుకు రహమాన్‌ను అరెస్ట్ చేశారు. -
అత్యాచారం కేసు పెట్టిన యువతి అరెస్ట్.. విచారణలో అసలు విషయం!
గురుగ్రామ్: తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసిన 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురుగ్రామ్(హర్యానా)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనపై 8మంది అత్యాచారం చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సదరు యువతి తన తల్లితో గురుగ్రామ్‌లో నివాసం ఉంటోంది. ఆమెకు హనీ ట్రాప్ పేరుతో మగవారిని వలలో వేసి డబ్బులు గుంజటం అలవాటుగా మారింది. ఆమె వలలో చిక్కనివారిపై నకిలీ అత్యాచారం కేసులు పెట్టి వేధించడం ప్రారంభించింది. తాజాగా ఆమె 8 మందిపై అత్యాచారం కేసు పెట్టగా విచారణ జరిపిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆమె ఫేక్ అత్యాచారం కేసు పెట్టి.. పలువురు పురుషుల వద్ద హనీ ట్రాప్ ముగుసులో డబ్బు లాగుతోందని పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో ఆ యువతి తల్లితో పాటు నరేందర్ యాదవ్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నారని ఏసీపీ(క్రైమ్) ప్రీత్ పాల్ సింగ్ సాంగ్వాన్ తెలిపారు. పోలీసులు ఆమెను బుధవారం కోర్టుకు హాజరపరిచి, అనంతరం జ్యుడీషియల్ కస్టడికి తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మాటలు కలిపి.. మత్తులో దించి
మొయినాబాద్(చేవేళ్ల): అమ్మలా ఉన్నావంటూ మాయమాటలతో వృద్ధురాలిని బుట్టలో వేసుకున్న ఓ కి‘లేడీ’ మద్యం తాగించి బంగారు, వెండి నగలు కాజే సింది. ఒక్క రోజులోనే నిఘానేత్రానికి చి క్కిన ఈ పాత నేరస్తురాలిని పోలీసులు శ నివారం రిమాండ్‌కు తరలించారు. మొ యినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్, మొయినాబాద్ సీఐ సు నీత వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన చాంద్‌బీ(45) గత కొంతకాలంగా నగ రంలోని బార్కాస్ బండ్లగూడ గౌస్‌నగర్ లో నివాసముంటుంది. పరిసర ప్రాంతా ల్లో బిక్షాటన చేస్తూ అమాయక మహిళలను మాయమాటలతో బుట్టలో వేసుకు ని దొంగతనాలకు పాల్పడుతుంది. కాగా ఈ నెల 18న మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వృ ద్ధురాలు బుచ్చమ్మ(65) మొయినాబాద్ లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చింది. కూరగాయలు కొనుక్కుని తిరిగి వెళ్తుండగా ఒంటిపై నగలతో చాంద్‌బీ కంట పడింది. చాంద్‌బీ ఆమె వద్దకెళ్లి నీవు మా అమ్మలా ఉన్నావంటూ మాటలు కలిపింది. మాయ మాటలతో బుట్టలో పడిసేంది. చనువుగా వ్యవహరింస్తూ మద్యం సేవించేందుకు తీసుకెళ్లింది. సురంగల్ రోడ్డులో ఉన్న మద్యం షాపు వద్దకు తీసుకెళ్లి విస్కీ క్వార్టర్, ఒక బీరు బాటిల్ తీసుకుంది. రెండూ కలిపి వృద్ధురాలికి తాగించింది. మద్యం మత్తులో ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి తులంన్నర బంగారు గుండ్లు, అర తులం బంగారు కమ్మలు, 30 తులాల వెండి నడుము వడ్డానం తీసుకుని పారిపోయింది. తేరుకున్న తరువాత బుచ్చమ్మ మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పట్టించిన నిఘానేత్రం... కేసు విచారణలో భాగంగా పోలీసులు వృద్ధురాలు ఎక్కడెక్కడ తిరిగిందో ఆ పరిసరాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. మద్యం షాపు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఓ మహిళ మద్యం సీసాలు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వృద్ధురాలు నగలు దోచుకుంది ఆ మహిళే అని గుర్తించిన పోలీసులు ఆమె కోసం వెతుకుతుండగా ఈ నెల 19న శుక్రవారం మొయినాబాద్‌లో కనిపించింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకుని చాంద్‌బీని శనివారం రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి వచ్చిన 45 రోజులకే తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న చాంద్‌బీ జైలు నుంచి వచ్చిన 45 రోజులకే మళ్లీ దొంగతనానికి పాల్పడింది. గతంలో చాంద్‌బీ రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లుగా పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ సలాంను ఏసీపీ అశోక్ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు. నేరస్తులను పట్టించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని.. ప్రతి గ్రామంలో సీసీ కెమరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని ఏసీపీ కోరారు. సమావేశంలో సీఐ సునీత, ఎస్సై రాందాస్‌నాయక్, కానిస్టేబుల్ కవిత ఉన్నారు. -
పెట్టుబడి పేరుతో వంచన.. యువతి అరెస్ట్
బనశంకరి: ఫ్యషన్, బ్రాండింగ్ తదితర ప్రకటన రంగాల్లో పెట్టుబడులు పెట్టాల ని ప్రజలను ఆహ్వానించి వంచనకు పాల్పడిన యువతిని శుక్రవారం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జార్ఘండ్ రాష్ట్రంలోని జెమ్షెడ్పూర్కు చెందిన ఒండ్రిల్లాదాస్గుప్తా అనే యువతి జర్నలిజం కోర్సు పూర్తిచేసి ఓ ఇంగ్లిష్ పత్రికలో పనిచేసింది. అనంతరం ప్రసిద్ధ ఫ్యషన్ మ్యాగజైన్లో చేరడంతో ఫ్యాషన్ రంగానికి పరిచయమైంది. అనంతరం eatshoplove.in కంపెనీని స్థాపించింది. ఫ్యాషన్, బ్రాండింగ్ ప్రకటనల రంగంలో తాను స్థాపించిన కంపెనీకి పెట్టుబడులు కావాలని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేసింది. దీన్ని చూసిన కొందరు ఆమె బ్యాంక్ అకౌంట్‌కు డబ్బు జమచేసేవారు. తన వాక్చాతుర్యంతో ప్రజలనుంచి లక్షలాదిరూపాయలు తన అకౌంట్లో వేయించుకుని వారిని వంచించింది. బాధితులు కొంతమంది బెంగళూరు నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించడంతో వీరు తీవ్రంగా గాలించి శుక్రవారం ఉదయం డిల్లీలో ఒండ్రిల్లాదాస్గుప్తాను అరెస్ట్‌చేసి నగరానికి తీసుకువచ్చి విచారణ చేపడుతున్నారు. -
ఎంపీలకు వల.. కిలేడీ అరెస్ట్!
న్యూఢిల్లీ: ఎంపీలను బురిడీ కొట్టించిన కిలేడీని ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరాపురంలోని ఆమె ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేతలను కలిసి వారికి మాయమాటలు చెప్పి ఏదో రకంగా వారితో అసభ్యంగా ఫొటోలు దిగి బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళను ఢిల్లీ పోలీసులు నేడు ప్రశ్నించనున్నారు. ఇటీవల గుజరాత్‌లోని వల్సాద్కు చెందిన బీజేపీ ఎంపీ కేసీ పటేల్‌కు మత్తుమందు ఇచ్చి ఆపై ఆయనతో అసభ్యంగా ఫొటోలు దిగిన ఆ మహిళ రూ.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. అంతా మోసమని గ్రహించిన ఎంపీ పటేల్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో.. మార్చి నెలలో డిన్నర్‌కు పిలిచి అత్యాచారం చేశారని, ఆసమయంలో తాను ఎలాగోలా వీడియో తీశానని మహిళ ఆరోపించడం అప్పట్లో కలకలం రేపింది. ఘజియాబాద్ పోలీసుల వద్దకు వెళ్లి తనకు న్యాయం చేయాలని ఆ మహిళ కోరింది, ఢిల్లీ పరిధిలో అన్యాయం జరిగింది కనుక అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఢిల్లీ పోలీసుల వద్దకు వెళ్లి ఎంపీ కేసీ పటేల్ పలుమార్లు తనపై అత్యాచారం చేశానని కథలు చెప్పింది. అయితే ఆమె చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. గతేడాది హర్యానాకు చెందిన ఎంపీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిన ఆ మహిళ.. కేసు విచారణ ప్రారంభించగానే కేసు వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆమె వెనుక పెద్ద ముఠా ఉందని భావించిన ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ముకేష్ మీనా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఎంపీ కేసీ పటేల్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఓ మహిళ డబ్బు కోసం తనపై లేనిపోని ఆరోపణలు చేసిందన్నారు. సాయం కోసం వచ్చిన మహిళ కూల్ డ్రింకులో మత్తుమందు కలిపిందని, ఆపై తన గ్యాంగుతో కలిసి కొన్ని వీడియోలు తీసిందని ఆరోపించారు. ఘజియాబాద్‌లో ఇల్లు రాసివ్వాలని లేనిపక్షంలో వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని తెలిపారు. బ్లాక్ మెయిల్, దోపీడీకి సంబంధించిన విషయాలపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, తాను నిర్దోషినని తేలుతుందని ధీమా వ్యక్తంచేశారు. -
బురఖా లేని ఫొటో పోస్ట్ చేసిందని...
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఆమె నేరం ఏమిటంటే, బహిరంగ ప్రదేశంలో బురఖా లేకుండా తిరగడంతో పాటు.. ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేయడం. పోలీసు ప్రతినిధి ఫవాజ్ అల్ మైమన్ ఆమె పేరు చెప్పలేదు గానీ, పలు వెబ్సైట్లు మాత్రం ఆమె పేరు మలక్ అల్ హెహరీ అని చెప్పాయి. గత నెలలో రియాద్‌లోని ఓ మెయిన్‌రోడ్డులో బురఖా లేకుండా ఫొటో తీయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆమెపై కామెంట్లతో పలువురు విరుచుకుపడ్డారు. ఆమె సాధారణ నైతిక నియమాలను ఉల్లంఘించినందుకు తమ విధులు నిర్వర్తించినట్లు పోలీసు ప్రతినిధి మైమన్ తెలిపారు. సౌదీ సమాజంలో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడం తప్పనిసరని, కానీ ఆమె మాత్రం రియాద్‌లోని ఓ ప్రముఖ కేఫ్ పక్కన ముసుగు లేకుండా నిలబడి ఫొటో తీయించుకుని దాన్ని ట్వీట్ చేసిందని చెప్పారు. ఆమెను అరెస్టుచేసి జైల్లో పెట్టామన్నారు. ''నిషేధించిన సంబంధాల'' గురించి తనకు సంబంధం లేని పురుషులతో మాట్లాడినట్లు కూడా ఆమెపై ఆరోపణలొచ్చాయి. దేశంలో అమలవుతున్న చట్టాలను ఆమె స్పష్టంగా ఉల్లంఘించినట్లు రియాద్ పోలీసులు చెప్పారు. ఇస్లాం బోధనలకు ప్రజలు కట్టుబడి ఉండాలని కోరారు. -
ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్టు
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శనివారం ఉదయం ఓ మహిళను భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ రోజు ఉదయం ఆమె జాంబియా నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అంతలో ఆమెను భద్రత సిబ్బంది చుట్టుముట్టి.. అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న మహిళ గుజరాత్ రాష్ట్రానికి చెందినదని సమాచారం. ఆమెపై లుక్ - అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు భద్రత సిబ్బంది చెప్పారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. -
ఎమ్మెల్యే కళ్లలో కారం: మహిళ అరెస్ట్
ముజఫర్ నగర్: ఎమ్మెల్యే కళ్లలో కారంతో దాడి చేసిన కేసులో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో బీజేపీ ఎమ్మెల్యే కపిల్ దేవ్ అగర్వాల్, తన ఆఫీసులో స్థానికులతో సమావేశంలో ఉండగా విక్రాంత్, కపిల్, ప్రదీప్ అనే యువకులు కారంతో దాడి చేశారు. ఈ దాడిలో కపిల్ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే ఈ కేసులో ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్రాంత్ తల్లి గీతను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు యువకులు ఇంకా పరారీలోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే పై దాడి జరిగిన సమయంలో అంగరక్షకులు కాల్పులు జరిపినా కూడా, ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి తప్పించుకొనిపోయారు. -
జవాన్లనుంచీ లంచం డిమాండ్.. రేప్ బాధిత అరెస్ట్...
థానెః ఆర్పీఎఫ్ జవాన్లు తనపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. డబ్బుకోసం కక్కుర్దిపడి అడ్డంగా బుక్కైంది. నిందితులైన జవాన్లనుంచి లంచం డిమాండ్ చేస్తూ పోలీసులకు చిక్కింది. నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ దివాకు చెందిన మహిళ గతవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణలో ఉండగానే సదరు బాధితురాలు.. కేసును వెనక్కు తీసుకునేందుకు నిందితులతో బేరసారాలకు దిగింది. అందులో భాగంగా నిందితుల్లోని ఓ జవాన్ ను.. మధ్యవర్తితోపాటు చాటుగా ఓ హోటల్ లో కలసి లంచం డిమాండ్ చేస్తూ పోలీసులకు చిక్కడంతో కథ అడ్డం తిరిగింది. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రదీప్ సింగ్ (57) వద్ద 90,000 లంచం తీసుకునేందుకు సిద్ధపడిన బాధిత మహిళ పోలీసుల కంటపడింది. స్థానిక దొంబివిలి లోని ద్వారకా హోటల్లో నిందితురాలు జవాన్లతో జరిపిన సంభాషణ రికార్డు చేసినట్లు పోలీస్ పీఆర్వో సుఖద నర్కర్ తెలిపారు. అనంతరం మహిళను అరెస్టు చేశామని, ఆమె జవాన్ల నుంచీ 1,11,000 రూపాయలు డిమాండ్ చేసిందని, ఈ వ్యవహారంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తో బేరం కుదిర్చేందుకు మధ్యవర్తులుగా మోహన్ బిట్లా అనే వ్యక్తితోపాటు, స్థానికంగా పేరొందిన ఓ పత్రికలో పనిచేసే విలేకరి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళతో సహా బిట్లాను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు. దివాకు చెందిన నిందితురాలు దొంబివిలిలోని ఓ బొటిక్ లో పనిచేస్తోంది. సెంట్రల్ రైల్వేకు చెందిన నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లు తనపై ఆత్యాచారానికి పాల్పడినట్లు ఆమె గతవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. జవాన్లపై ఐపీసీ 376-డి, 326 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
బంగారం.. అక్కడ దాచినా పట్టేశారు..
న్యూఢిల్లీః హైదరాబాద్ కు చెందిన ఓ కిలాడీ లేడీని ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి విమానంలో ఢిల్లీ వచ్చిన ఆమె.. బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానం రావడంతో తనిఖీలు చేపట్టారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆమె... ఇన్నర్ గార్మెట్స్ లో దాచిన.. సుమారు 64,38,960 రూపాయలు ఖరీదు చేసే 2 కేజీల గోల్డ్ బార్లను 160 గ్రాముల బంగారాన్ని ఆమెవద్దనుంచీ స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానంలో ఢిల్లీకి వచ్చిన హైదరాబాద్ కు చెందిన మాయ లేడీని ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ (ఎఐయు) అధికారులు.. ఢిల్లీలో అరెస్టు చేశారు. అనంతరం ఆమెను ఫర్హాత్ ఉన్నీసాగా గుర్తించారు. దుబాయ్ నుంచి సుమారు 2 కేజీల గోల్డ్ బార్స్ తో పాటు, 160 గ్రాముల బంగారాన్ని అండర్ గార్మెట్స్ లో దాచి, అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఉన్నీసాను.. ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహిస్తుండగా గుర్తించినట్లు ఎఐయు తెలిపింది. అనంతరం ఆ ప్రయాణీకురాలిని అరెస్టు చేసి, ఆమెవద్దనుంచీ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎఐయు తెలిపింది. విదేశాలనుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉద్యోగం కోసం వెళితే.. నగ్న వీడియో తీశాడు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ తూర్పు ప్రాంతంలోని మయూర్ విహార్‌లో 65 ఏళ్ల వృద్ధుడు విజయ్‌కుమార్‌ను హత్య చేసిన కేసులో నిందితురాలి (25)ని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ ఆధారం, సీసీటీవీ ఫుటేజి సాయంతో నిందితురాలిని గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. విజయ్‌కుమార్ తనపై లైంగికదాడి చేశాడని, తనను నగ్నంగా వీడియో తీశాడని, ఆయనపై ప్రతీకారం తీర్చుకునేందుకు కత్తితో పొడిచి చంపినట్టు నిందితురాలు అంగీకరించింది. రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం ఆయనను కలిస్తే తనను శారీరకంగా వేధించాడని పోలీసులకు చెప్పింది. విజయ్ కుమార్ భార్య వసుంధర ఐటీ అధికారిణిగా పనిచేస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఆయన ఒక్కడే ఉన్నాడు. కుమార్తె ఫోన్ చేస్తే విజయ్ కుమార్ స్పందించలేదు. ఆమె విజయ్ కుమార్ ఫ్లాట్‌లోకి వచ్చి చూడగా, ఆయన రక్తపుమడుగులో పడిఉన్నాడు. ఆమె వెంటనే అలారమ్ మోగించి పోలీసులకు సమాచారం అందించింది. -
బ్లూ ఫిల్మ్స్ సీడీలు అమ్ముతున్న మహిళ అరెస్ట్
జీడిమెట్ల: జీడిమెట్ల పోలీసులు బుధవారం ఓ దుకాణంపై దాడి చేసి పైరేటెడ్ సీడీలను స్వాధీనం చేసుకుని ఒకరిని రిమాండ్ తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సంజయ్‌గాంధీ నగర్‌కు చెందిన మహేశ్వరి (30) స్థానికంగా ఎస్ఎస్ మ్యూజికల్స్ దుకాణం నిర్వహిస్తోంది. పైరసీ సీడీలతో పాటు బ్లూ ఫిల్మ్ సీడీలు కూడా విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తమ వద్ద ఉన్న సమాచారం మేరకు బుధవారం జీడిమెట్ల పోలీసులు దుకాణంపై దాడులు నిర్వహించారు. దాడుల్లో 117 పైరసీ సీడీలు దొరకగా వాటిలో 5 కొత్త సినిమాలు, మిగిలినవి అశ్లీల చిత్రాలుగా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకురాలు మహేశ్వరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. -
పుట్టింటికే కన్నం..
- కన్నవారింట బంగారం కొట్టేసిన వివాహిత - నగలు అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకుని సుదూరాలకు వెళ్లిపోయింది. భర్తతో గొడవపడ్డానంటూ పుట్టింటికి చేరింది. అదను చూసి ఇంట్లో నగానట్రా కాజేసీ అమ్ముకునే ప్రయత్నం చేసింది. పోలీసుల రంగప్రవేశంతో కటకటాలపాలైంది. హైదరాబాద్‌లో పుట్టింటికే కన్నం వేసిన సంఘటనలో 28 ఏళ్ల వివాహితను నారాయణగూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. హిమాయత్ నగర్, 13వ నంబంర్ వీధిలో షేక్ అఫ్జల్, మహబూబీ(55) దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమార్తె షౌఖతున్నీసా ఆలియాస్ మునావర్.. కొద్దికాలం సత్యనారాయణ అనే వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. రేవతిగా పేరు మార్చుకుని చెన్నైలో నివసిస్తోంది. ఇటీవలే హిమాయత్ నగర్ లోని పుట్టింటికి చేరుకున్న ఆమె.. భర్తతో గొడవపడి వచ్చానని తల్లిదండ్రులకు చెప్పింది. ఇలా ఉండగా రెండు రోజుల కిందట ఆ ఇంట్లో బంగారం, వెండి నగలు మాయమయ్యాయి. సొమ్ములు పోయిన విషయాన్ని గుర్తించిన అప్జల్, మహబూబీ దంపతులు నారాయణగూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు షౌఖతున్నీసా ఆలియాస్ రేవతి తీరుపై అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టారు. దొంగిలించిన ఆభరణాలను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ దుకానంలో అమ్ముతుండగా రేవతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఆమె నుంచి 67 తులాల బంగారు నగలు, 40 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కూతురి చర్యతో తల్లిదండ్రులు కుమిలిపోయారు. -
పోలీసులపై దౌర్జన్యం.. మహిళ అరెస్టు
ఓ పోలీసుతో పాటు మహిళా కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసిన కేసులో గోవా పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. ఫరీదా బీ (35) అనే మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లి అక్కడ గందరగళం సృష్టించిందని ఇన్స్పెక్టర్ సిద్ధాంత్ శిరోద్కర్ తెలిపారు. సరిగా ప్రవర్తించాలని చెప్పినందుకు తనతో పాటు మరో మహిళా కానిస్టేబుల్‌ను కూడా ఆమె తోసిపారేసిందని ఆయన చెప్పారు. పోలీసుస్టేషన్లో ఆమె చేసిన హడావుడి మొత్తం లోపలున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యిందన్నారు. స్థానిక యువకుడిపై ఫిర్యాదు చేయడానికి ఆమె స్టేషన్‌కు వెళ్లింది. తర్వాత ఓ ఎస్ఐని విచారణకు పంపినా ఆమె సంతృప్తి చెందలేదు. మళ్లీ పోలీసు స్టేషన్‌కు వచ్చి.. దర్యాప్తు సక్రమంగా లేదని చెబుతూ పోలీసులపై ఆరోపణలు చేసింది. తర్వాత వాగ్వాదం చోటుచేసుకుని ఇన్స్పెక్టర్, మహిళా కానిస్టేబుళ్లను తోసేసింది. ఆమెపై ఐపీసీ సెక్షన్లు 353, 427, 504 కింద కేసు పెట్టారు. -
నకిలీ గర్భంతో నటిస్తున్న మహిళ అరెస్టు
తనకు గర్భం ఉన్నట్లు నటించి.. బాంబు దాడులు చేయడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానంతో ఓ మహిళను ఫ్రెంచి పోలీసులు అరెస్టు చేశారు. ఇస్లాం మతంలోకి మారిన ఆ మహిళ (23)తో పాటు ఆమె భర్త (35)ను కూడా అరెస్టు చేశారు. వాళ్ల ఇంటిని సోదా చేసిన పోలీసులకు.. కడుపు ఎత్తుగా కనపడేందుకు ఉపయోగించే దిండు ఒకటి దొరికింది. దాన్ని వాళ్లు ఇంటర్నెట్లో కొనుగోలు చేసినట్లు తేలింది. అయితే విమానాల్లో ప్రయాణించేటప్పుడు తనకు మంచి సౌకర్యాలు వస్తాయనే ఈ నకిలీ గర్భాన్ని కొన్నట్లు వాళ్లు వాదిస్తున్నారు. కానీ, దానిమీద అల్యూమినియం ఫాయిల్ కోటింగ్ ఉందని, మెటల్ డిటెక్టర్ల నుంచి కూడా లోపల ఉన్న పదార్థాలు స్కాన్ కాకుండా అది అడ్డుపడుతుందని పోలీసులు అంటున్నారు. అలాంటివి కేవలం బాంబులు దాచడానికే ఉపయోగిస్తారని తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సాగించిన అరాచకాలకు సంబంధించిన వీడియోలను ఆ జంట చూసిందనేందుకు తగిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని పోలీసులు చెప్పారు. ప్రస్తుతానికి వాళ్లను గృహనిర్బంధంలో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. నవంబర్ 13న జరిగిన ప్యారిస్ ఉగ్రదాడుల్లో 130 మంది మరణించడంతో అప్పటినుంచి ఫ్రాన్స్‌లో హై ఎలర్ట్ ప్రకటించారు. -
మద్యం అమ్ముతున్న మహిళ అరెస్ట్
కీసర(రంగారెడ్డి): అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆమె వద్ద నుంచి 40 మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం కరీంగూడలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ అక్రమంగా మద్యం విక్రయిస్తోందన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తనఖీలు చేశారు. మహిళను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి 40 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకెవరైనా ఇందులో భాగస్వామ్యం పంచుకున్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. -
విదేశాలకు పంపిస్తానని మోసం చేసింది
హైదరాబాద : విదేశాలకు పంపిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మహిళను సంతోష్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం....సంతోష్‌నగర్‌కు చెందిన చక్రవర్తుల కల్పవల్లి (40) విశాఖపట్నం గాజువాకకు చెందిన లావణ్యను విదేశాలకు పంపిస్తానని నమ్మించింది. ఇందు కోసం లావణ్య నుంచి రూ. 1.60 లక్షలు వసూలు చేసింది. విదేశాలకు పంపిస్తానంటూ ఢిల్లీ, కాన్పూర్‌ల వరకూ తీసుకెళ్లి వెనక్కి తీసుకొచ్చి చేతులు దులుపుకుంది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మోసానికి పాల్పడిన కల్పవల్లిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
డ్రగ్స్ ఇచ్చి.. అశ్లీల సీడీలతో బెదిరింపు!!
బాగా డబ్బున్న ఆసాములను చూసుకోవడం, వాళ్లను డ్రగ్స్‌తో మత్తులో ముంచి అశ్లీల సీడీలు రూపొందించి వాటితో బెదిరించడం.. ఇదే పనిగా పెట్టుకున్న ఓ మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉదయ్‌పూర్‌లోని వర్మ కాలనీ ప్రాంతానికి చెందిన రుబినా హరూన్ ఖాన్ (28) అనే మహిళ ఆటోమొబైల్ ఏజెన్సీలో పనిచేసేది. అక్కడకు వచ్చే కస్టమర్లలో బాగా డబ్బున్నవాళ్లను గుర్తించి, వాళ్లను తన అందంతో ఆకర్షించేదని, గోవర్ధన్ విలాస్ ప్రాంతంలోని తన అపార్టుమెంటుకు రప్పించేదని పోలీసులు తెలిపారు. అక్కడకు వెళ్లిన తర్వాత వాళ్లకు బీరులో డ్రగ్స్ కలిపి ఇచ్చేదని, తర్వాత వాళ్లతో అశ్లీల వీడియోలు రూపొందించి, వాటిని సీడీలుగా మార్చి వాటితో బెదిరించేదని చెప్పారు. ఎట్టకేలకు రఫీక్ మహ్మద్ అనే వ్యక్తి ఆమె ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు. -
ఐదో పెళ్లికి సిద్ధమైన మహిళ
సాక్షి, చెన్నై : మాటల మత్తులో పడేసి, పెళ్లి చేసుకోవడంతో పాటుగా కొన్నాళ్లకు అందిన కాడికి దోచేసి బురిడీ కొట్టించే మాయ లేడీ ఉదంతం ఇది. నలుగురిని పెళ్లి చేసుకుని మోసగించడంతో పాటుగా ఐదో పెళ్లికి సిద్ధ పడ్డ ఈ పెళ్లిళ్ల రాణి కటకటాల పాలైంది. సభానా, లక్ష్మి తదితర పేర్లతో నాలుగు కాసులున్న యువతకు వల వేసి పెళ్లి గాలంతో చేతికి అందింది దోచుకున్న యువతి బండారం గతంలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో మాయ లేడీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మొగపేర్ ఈస్ట్ టీవీఎస్ అవెన్యూకు చెందిన శ్రీనివాసన్(38) శుభకార్యాలకు, అలంకరణలు చేయించే కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. పెళ్లి కాని శ్రీనివాసన్ వధువు కోసం అన్వేషణలో పడ్డాడు. గత ఏడాది చివర్లో ఓ వెబ్ సైట్లో పెళ్లి ప్రకటనలో ఉన్న వివరాల మేరకు కోయంబత్తూరుకు చెందిన గాయత్రికి ఫోన్ కొట్టాడు. తాను బీఎస్సీ చదువుకున్నట్టు, తన ఇష్టాయిష్టాలను గాయత్రి చెప్పడం శ్రీనివాసన్‌కు నచ్చింది. ఇంకే ముంది, ఇటీవలే ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న నెలన్నరకు గాయత్రిలో మార్పులు వస్తుండడంతో రహస్యంగా ఆమె ఫోన్లోని నెంబర్లను సేకరించాడు. కొన్ని నెంబర్ల ద్వారా లభించిన సమాచారంతో షాక్‌కు గురి అయ్యాడు. తన వద్ద ఉన్న వివరాలు, సమాచారాల మేరకు తిరుమంగళం మహిళా పోలీసులను శ్రీనివాసన్ ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన మిహ ళా పోలీసులు బుధవారం రాత్రి గాయత్రిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఈ మాయ లేడి బండారం అంతా వెలుగులోకి వచ్చింది. కేవలం డబ్బు, ఆభరణాల మీదున్న మోజుతో భర్తల్ని మార్చేసినట్లు తేలింది. 2010లో టి నగర్‌కు చెందిన నరసింహారావును పెళ్లి చేసుకుని, అక్కడి నుంచి ఉడాయించినట్టు తేలింది. 2012లో తిరుచ్చిలో రవికుమార్‌ను వివాహం చేసుకుని అతడికి విడాకులు ఇవ్వడంతో పాటుగా 2013లో చెన్నై మాంబళంకు చెందిన రాజగోపాల్‌ను మనువాడి, అతడి వద్ద అందింది దోచుకుంది. తన వలలో శ్రీనివాసన్ పడటం, అతడిని బెదిరించడం మొదలెట్టడంతో పాటుగా అంబత్తూరుకు చెందిన బాలాజీతో వివాహానికి రెడీ అయింది. ముందుగానే మేల్కొన్న శ్రీనివాసన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెళ్లిళ్ల రాణి కటకటాలపాలైంది. అంబత్తూరు బాలాజీ ఈ మాయ లేడీ మాయ నుంచి తప్పించుకున్నట్టు అయింది. వాక్ చాతుర్యం, ఫోన్లలోనే గమ్మత్తయిన మాటలు చెప్పి తన వలలో పడేలా గాయత్రి చేసుకున్నట్టు శ్రీనివాసన్ పేర్కొన్నారు. తరచూ తన పేర్లను మార్చుకుని మరీ వివాహాలకు ఈ మాయ లేడీ సిద్ధ పడుతున్నట్టుగా విచారణలో తేలింది. -
పోలీసుల అదుపులో కి'లేడీ' శైలు
అమీర్‌పేట: కూలిపని చేసుకొనే ఓ మహిళ ఏకంగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌నని అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతోంది. అంతేకాకుండా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఈ కి ‘లేడీ’ తనను వేధిస్తున్నారని కేసులు పెట్టి భర్తలను కోర్టుల చుట్టూ తిప్పుతోంది. ఆస్తి కోసం బంధువులు తనను చంపేందుకు యత్నిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నిత్య ఆమెను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ జి.వి.రమణగౌడ్ కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాండ్ర హేమ అలియాస్ శైలు,అలియాస్ రాణి,బుజ్జి అలియాస్ అలేఖ్యారెడ్డి, అలియాస్ హేమలత బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి సరూర్‌నగర్‌లో ఉంటూ కూలిపని చేస్తోంది. ఎల్బీనగర్కు చెందిన రవీంద్రను వివాహం చేసుకుంది.కొద్ది కాలంపాటు అతడితో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన హేమలత భర్త వేధిసున్నాడంటూ కేసు పెట్టింది. అనంతరం మోతీనగర్, బోరబండ ప్రాంతానికి వచ్చి జగదీష్‌ను రెండో పెళ్లి చేసుకుని అతడిపై కూడా కేసుపెట్టింది. పూర్ణచందర్‌ను మూడోపెళ్లి, చివరగా కరీంనగర్‌కు చెందిన కిషోర్‌ను నాలుగో పెళ్లి చేసుకుంది. ఇటీవల అతనిపై వేధింపుల కేసుపెట్టి దూరంగా ఉంటుంది. తరుచూ వివాహాలు చేసుకుంటూ తనను వేధిస్తున్నారంటూ భర్తలపై కేసులు పెడుతూ వస్తున్న హేమ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, ఆర్ఐగా పరిచయం చేసుకుని పలువురిని మోసం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజీవ్ గృహకల్ప పథకం కింద ఇప్పిస్తానని చాలామంది వద్ద నుంచి భారీమొత్తంలో డబ్బులు వసూళు చేసింది. చివరకు మోసపోయామని భావించిన బాధితులు హేమలతపై పోలీసు కేసులుపెట్టారు. నగరంలోని ఆరు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఓ కేసులో ఎల్బీనగర్ పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చి పోలీసులకు చిక్కిన కిలేడీ హేమలత ఆస్థికోసం బంధువులు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎస్ఆర్నగర్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చి పోలీసులకు చిక్కింది. పశ్చిమ మండలం డీసీపీ వద్దకు వెళ్లి తనకు కోట్ల రూపాయల ఆస్థి ఉందని మామయ్య, బాబాయ్‌లు తనను చంపేందుకు పథకం వేశారని చెప్పింది. డీసీపీ దీనిపై విచారణ చేయాలని పోలీసులను ఆదేశించి ఎస్‌ఆర్‌నగర్‌కు వెళ్లాలని ఆమెకు సూచించారు. ఉదయం స్టేషన్ వచ్చిన హేమలత జాయింట్ కలెక్టర్‌గా పరిచయం చేసుకోవడంతో ఆమెకు సెల్యూట్ కొట్టి రాచమర్యాదలు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న సైదులు గతంలో కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన సమయంలో ఉద్యోగాల పేరుతో హేమలత మోసం చేసిందంటూ కొందరు కేసుపెట్టేందుకు వచ్చినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆమెపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తర లించారు. హేమను అరెస్టు విషయాన్ని తెలుసుకున్న బాధితులు సనత్‌నగర్, ఎస్‌నగర్ స్టేషన్లలో కేసులు పెట్టేందుకు వచ్చారు. -
పోలీసుల అదుపులో కిలాడి లేడీ శైలు
-
బంగారం చోరీ..మహిళ అరెస్ట్
అల్వాల్: ఇళ్లల్లో పనిచేస్తూ దొంగతనాలకు పాల్పడిన మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ హరిక్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కానాజిగూడ ఇందిరానగర్‌లో నివసించే జయలక్ష్మి(22) స్థానికంగా ఇళ్లలో పనిచేస్తోంది. కొంతకాలంగా నమ్మకంగా పనిచేస్తూ మూడు ఇళ్లలో దొంగతనానికి పాల్పడింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని జయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి పదమూడు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మహిళనుంచి నాలుగున్నర కేజీల బంగారం స్వాధీనం
చెన్నై: సింగపూర్ నుంచి విమానంలో చెన్నై వచ్చిన ఓ మహిళను ఎయిర్‌పోర్టు అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్టులో దిగిన ఆమె వద్ద వస్తువులను తనిఖీ చేశారు. ఆమె వద్ద నుంచి నాలుగున్నర కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
కలకలం రేపిన ‘ముజ్రా’
చిలుకూరు సమీపంలోని ఓ ఇంటిపై పోలీసుల దాడి 22 మంది యువకులు, 8 మంది యువతులు అరెస్టు మొయినాబాద్: అటవీ ప్రాంతం, జన సంచారం తక్కువగా ఉండటం, అనేక ఫాంహౌస్‌లు అందుబాటులో ఉండటం నగర శివారులో ముజ్రా, రేవ్ పార్టీల ఏర్పాటుకు అనుకూలంగా మారాయి. హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం చిలుకూరులో ఉన్న ఓ వెంచర్లో సోమవారం రాత్రి జరిగిన ముజ్రా పార్టీ స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన వస్త్ర వ్యాపారి ఆకాష్ వివాహం నగరంలోని ఎల్బీ నగర్లో జరిగింది. ఆ వివాహ వేడుకకు హైదరాబాద్, ముంబై, కలకత్త ప్రాంతాలకు చెందిన కొందరు స్నేహితులు హాజరయ్యారు. వివాహానికి విచ్చేసిన స్నేహితులకు ఆకాష్ పార్టీ ఇవ్వాలనుకున్నాడు. ఈ విషయాన్ని అతను జతిన్‌కు చెప్పాడు. అయితే జతిన్ పార్టీ విషయాన్ని అతని స్నేహితుడైన గౌరవ్‌కు తెలిపాడు. గౌరవ్‌కు పార్టీలు ఏర్పాటు చేసే దిలీప్ జైన్ అనే వ్యక్తి పరిచయమున్నాడు. రాజస్థాన్‌కు చెందిన దిలీప్‌జైన్ హైదరాబాద్‌లోనే ఉంటూ ఇలాంటి పార్టీలను ఏర్పాటు చేస్తుంటాడు. వివాహానికి వచ్చిన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేయాలని దిలీప్జైన్కు గౌరవ్ చెప్పడంతో ముజ్రా పార్టీ ఏర్పాటు చేస్తానన్నాడు. మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న గ్రీన్ హోమ్ వెంచర్లో ఆశీష్ జైన్ అనే వ్యక్తికి ఓ ఇళ్లు ఉంది. ఆశీష్ జైన్‌కు పార్టీలు ఏర్పాటు చేసే దిలీప్ జైన్‌కు పాత పరిచయం ఉండటంతో వెంచర్‌లోని ఇల్లును దిలీప్‌జైన్ అద్దెకు తీసుకున్నాడు. సోమవారం రాత్రి వెంచర్‌లోని ఇంట్లో ముజ్రా పార్టీని ఏర్పాటు చేశారు. ముంబై, అహ్మదాబాద్, కలకత్త, హైదరాబాద్‌కు చెందిన దిలీప్జైన్తోపాటు జినేష్ రాంనిక్, అంకిత్, జిగ్నేష్, భావేష్ పటేల్, రాసిక్ ప్రజాపతి, దీపేష్, గనత్రా జతిన్, గౌరవ్, శాంతిలాల్, జయేష్, దివ్యేష్, దివాంగ, శైలేష్, హర్షత్, ఆకాష్, అసత్, నగరానికి చెందిన డ్రైవర్లు షేక్ జిలాని, షేక్ ఆసిఫ్, ఎండీ షకిల్ హైమద్, నగరంలోని అల్వాల్‌కు చెందిన వర్కర్లు ఉమర్ రాజిరెడి,్డ మురళీ కృష్ణ, 8 మంది యువతులు పార్టీలో పాల్గొన్నారు. అర్ధరాత్రి సమయంలో డీజే పాటల హోరులో యువతులు నృత్యాలు చేస్తుంటే యువకులు వారిపై డబ్బులు వెదలజ్లుతూ ఎంజాయ్ చేస్తున్నారు. (ముజ్రా పార్టీలో యువతులు నృత్యాలు చేస్తూ తమ ఒంటిపై ఉన్న ఒక్కొక్క వస్త్రాన్ని విప్పేస్తూ నృత్యం చేస్తుంటారు. చివరకు నగ్నంగా తయారై నృత్యం చేస్తారు) వెంచర్‌లోని ఓ ఇంట్లో పార్టీ నడుస్తున్నట్లు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో సోమవారం అర్ధరాత్రి 12 సమయంలో ఆ ఇంటిపై దాడి చేశారు. మొత్తం 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విషయం తెలుసుకున్న మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువతీ యువకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు, కండోమ్స్ పాకెట్లు... ముజ్రా పార్టీ నిర్వహించిన ఇంట్లో మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు లభించాయి. ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన సమయంలో యువతీ యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఎస్ఓటీ పోలీసులు పకడ్బందీగా దాడి చేయడంతో వారంతా ఆ ఇల్లు దాటి బయటకు పోలేకపోయారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న అనంతరం వారందర్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద ఉన్న రూ.1.21 లక్షల నగదు, 25 సెల్ఫోన్లు, 5 కార్లను సీజ్ చేశారు. మంగళవారం యువతీ యువకులను రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, మొయినాబాద్ సీఐ రవిచంద్ర ఉన్నారు. పార్టీల ఏర్పాటులో దిలీప్‌జైన్ పాత్ర కీలకం... నగర శివారులో రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు ఏర్పాటు చేయడంలో దిలీప్‌జైన్ సూత్రధారిగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన దిలీప్‌జైన్ కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటూ నగర శివారుల్లోని రిసార్ట్స్, ఫాంహౌస్‌లలో పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడు. గతంలోనూ అతను జవహర్‌నగర్, శామీర్‌పేట్, చేవెళ్ల ప్రాంతాల్లో ఇలాంటి పార్టీలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. -
చిన్నారి హత్య: మహిళ అరెస్ట్
వేలూరు: వివాహేతర సంబంధం ప్రియుడి భార్యకు తెలిసిపోవడంతో కక్ష తీర్చుకునేందుకు ఆమె కొడుకుని ఓ మహిళ హత్య చేసింది. ఈ సంఘటన వేలూరులో చోటుచేసుకుంది. వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ముత్తు మండపం ప్రాంతానికి చెందిన మురళి. ఇతనికి ముగ్గురు పిల్లలున్నారు. రెండవ కుమారుడు దినేష్(3) శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఆటలాడుతూ కనిపించకపోవడంతో వేలూరు నార్త్ పోలీసులకు మురళి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముత్తుమండపం వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. పోలీసులను చూసిన వెంటనే మురళి ఇంటి ముందు నివశిస్తున్న పెయింటర్ ప్రభు భార్య సుమతి ఇంటికి తాళం వేసి బయట వచ్చి కూర్చుంది. అనుమానించిన పోలీసులు సుమతి వద్ద విచారణ జరపగా పొంతన లేకుండా సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమె ఇంటి తాళాలు పగులగొట్టి ఇంటిలో గాలించారు. బీరువాను పగలగొట్టి చూడగా అందులో చిన్నారి నోటిలో గుడ్డలు పెట్టి కాళ్లు,చేతులు కట్టి ఉండడాన్ని గుర్తించారు. పోలీసులు సుమతిని అరెస్ట్ చేసి బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. పోలీసుల విచారణలో చిన్నారి తండ్రి మురళీకి, తనకు వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. ఈ విషయం మురళి భార్యకు తెలిసి పోవడంతో ఆమె తనతో ఇటీవల ఘర్షణ పడిందని పోలీసులకు చెప్పింది. ఆమె మీద కక్ష తీర్చుకోవడం కోసం వీధిలో ఆటలాడుకుంటున్న దినేష్‌ను ఇంటిలోకి తీసుకెళ్లి నోటిలో గుడ్డ పెట్టి కాళ్లు, చేతులు కట్టి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశానని, ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని బీరువాలో పెట్టినట్లు నేరాన్ని అంగీకరించింది. కేసు దర్యాప్తులో ఉంది. -
ఐపీఎల్లో ఆడిస్తానని మోసం.. మహిళ అరెస్టు
ఐపీఎల్లో ఆడిస్తానంటూ మోసం చేసిన 43 ఏళ్ల మహిళను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. తిరువనంతపురానికి చెందిన నజారత్ షహాబుద్దీన్ అనే ఈమెపై కొందరు అబ్బాయిల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అలువా పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. తిరువనంతపురంలోని ఎస్హెచ్ఏ క్లబ్బుకు నజారత్, ఆమె సోదరుడు అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల మొదట్లో ఐపీఎల్ సెలక్షన్ ట్రయల్స్ కూడా నిర్వహించి, ఏకంగా 13 మంది అబ్బాయిలను ఎంపిక కూడా చేసేశారు. తర్వాత ఈ నెలాఖరులో జైపూర్ తీసుకెళ్లి మ్యాచ్‌లు ఆడిస్తామని, అందులో వారి ఆటతీరును బట్టి వాళ్లు భారత టి20 జట్టుకు ఎంపికవుతారని ఆమె చెప్పినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వాళ్ల ఆహారం, ప్రయాణాలు, జెర్సీ, బ్యాట్ల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 25 వేల వంతున ఆమె వసూలు చేసింది. దీంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి వారు పోలీసుకేసులు పెట్టారు. జైపూర్‌లోని జాతీయ టి20 క్రికెట్ ఫెడరేషన్‌కు తాను రాష్ట్ర సమన్వయకర్తనంటూ ఆమె పేపర్లలో ప్రకటనలు కూడా ఇచ్చింది. -
జడ్జిపై సెల్‌ఫోన్ విసిరిన మహిళ
తన బంధువులకు విధించిన బెయిల్ రద్దు చేయాలని ఓ మహిళ పాట్నా సివిల్ కోర్టును ఆశ్రయించింది. అందులోభాగంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందుకు గత వారం రోజులుగా కోర్టు చుట్టు చెప్పులు అరిగేలా తిరిగింది. చివరకు శుక్రవారం ఆ కేసు విచారణకు వచ్చింది. అయితే ఆ కేసును పాట్నా జిల్లా జడ్జి బీరేంద్ర కుమార్ కొట్టివేశారు. అంతే ఆ మహిళ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ జడ్జిపైకి విసిరింది. ఆ సెల్‌ఫోన్ కాస్తా ఆయన ముందు పడింది. దాంతో కోర్టు హాల్లో ఉన్నవారంతా ఏం జరుగుతుందో అర్థం కాక నిలుచుండిపోయారు. అంతలో అక్కడే ఉన్న పోలీసులు తేరుకుని ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ పేరు రీటా సింగ్ అని, శరణ్ జిల్లా సోనిపూర్ ఆమె స్వస్థలమని పోలీసులు వెల్లడించారు. కోర్టులో అమర్యాదగా ప్రవర్తించిన రీటా సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమెను జైలుకు తరలించారు. -
కుక్కను ఆకలితో మాడ్చినందుకు మహిళ అరెస్టు
మనుషులకే అన్నం లేక మలమల మాడిపోతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ అమెరికాలో మాత్రం ఓ కుక్కకు అన్నం పెట్టనందుకు గాను జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించారంటూ ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కార్లా బష్నెల్ అనే మహిళను ఎన్ఫీల్డ్ ప్రాంత పోలీసులు అరెస్టు చేశారు. మరణించిన స్నేహితురాలి కుటుంబ సభ్యులు ఈ ఫిర్యాదు చేశారు. స్నేహితురాలు మరణించినప్పుడు.. కార్లాయే ఆమె పెంపుడు కుక్క ఆలనాపాలనా చూస్తానని చెప్పిందని, కానీ ఇప్పుడు మాత్రం దానికి తిండికూడా పెట్టకుండా మాడ్చిందని వారు ఆరోపించారు. దాంతో ఆ కుక్క మరణించగా, ఆ విషయాన్ని పోస్టుమ్యాన్ చూసి చెప్పాడట. అది కేవలం కుక్క కాదని, తమ సొంత బిడ్డలాంటిదని వాళ్లు వాపోయారు. అయితే ఈ విషయమై వ్యాఖ్యానించేందుకు కార్లా నిరాకరించారు. బెయిల్ కోసం మాత్రం ఆమె దరఖాస్తు చేసినట్లు న్యూయార్క్ డైలీ తన కథనంలో తెలిపింది.