యశవంతపుర: కర్ణాటకలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కన్నడ రచయిత దివంగత బీఎం ఇదినబ్బ మనవడి భార్య దీప్తి మార్లా అలియాస్ మరియం.. యువకులను ఐసిస్ వైపు ఆకర్షితులను చేస్తున్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) ఆమెను సోమవారం అరెస్ట్ చేసింది. ఉళ్లాలలో ఇదినబ్బ కొడుకు బీఎం బాషా నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బాషా చిన్నకొడుకు రహమాన్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment