మొయినాబాద్(చేవేళ్ల): అమ్మలా ఉన్నావంటూ మాయమాటలతో వృద్ధురాలిని బుట్టలో వేసుకున్న ఓ కి‘లేడీ’ మద్యం తాగించి బంగారు, వెండి నగలు కాజే సింది. ఒక్క రోజులోనే నిఘానేత్రానికి చి క్కిన ఈ పాత నేరస్తురాలిని పోలీసులు శ నివారం రిమాండ్‌కు తరలించారు. మొ యినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్, మొయినాబాద్ సీఐ సు నీత వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన చాంద్‌బీ(45) గత కొంతకాలంగా నగ రంలోని బార్కాస్ బండ్లగూడ గౌస్‌నగర్ లో నివాసముంటుంది.
పరిసర ప్రాంతా ల్లో బిక్షాటన చేస్తూ అమాయక మహిళలను మాయమాటలతో బుట్టలో వేసుకు ని దొంగతనాలకు పాల్పడుతుంది. కాగా ఈ నెల 18న మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వృ ద్ధురాలు బుచ్చమ్మ(65) మొయినాబాద్ లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చింది. కూరగాయలు కొనుక్కుని తిరిగి వెళ్తుండగా ఒంటిపై నగలతో చాంద్‌బీ కంట పడింది. చాంద్‌బీ ఆమె వద్దకెళ్లి నీవు మా అమ్మలా ఉన్నావంటూ మాటలు కలిపింది. మాయ మాటలతో బుట్టలో పడిసేంది.
చనువుగా వ్యవహరింస్తూ మద్యం సేవించేందుకు తీసుకెళ్లింది. సురంగల్ రోడ్డులో ఉన్న మద్యం షాపు వద్దకు తీసుకెళ్లి విస్కీ క్వార్టర్, ఒక బీరు బాటిల్ తీసుకుంది. రెండూ కలిపి వృద్ధురాలికి తాగించింది. మద్యం మత్తులో ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి తులంన్నర బంగారు గుండ్లు, అర తులం బంగారు కమ్మలు, 30 తులాల వెండి నడుము వడ్డానం తీసుకుని పారిపోయింది. తేరుకున్న తరువాత బుచ్చమ్మ మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పట్టించిన నిఘానేత్రం...
కేసు విచారణలో భాగంగా పోలీసులు వృద్ధురాలు ఎక్కడెక్కడ తిరిగిందో ఆ పరిసరాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. మద్యం షాపు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఓ మహిళ మద్యం సీసాలు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వృద్ధురాలు నగలు దోచుకుంది ఆ మహిళే అని గుర్తించిన పోలీసులు ఆమె కోసం వెతుకుతుండగా ఈ నెల 19న శుక్రవారం మొయినాబాద్‌లో కనిపించింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకుని చాంద్‌బీని శనివారం రిమాండ్‌కు తరలించారు.
జైలు నుంచి వచ్చిన 45 రోజులకే
తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న చాంద్‌బీ జైలు నుంచి వచ్చిన 45 రోజులకే మళ్లీ దొంగతనానికి పాల్పడింది. గతంలో చాంద్‌బీ రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లుగా పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ సలాంను ఏసీపీ అశోక్ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు. నేరస్తులను పట్టించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని.. ప్రతి గ్రామంలో సీసీ కెమరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని ఏసీపీ కోరారు. సమావేశంలో సీఐ సునీత, ఎస్సై రాందాస్‌నాయక్, కానిస్టేబుల్ కవిత ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment