ఉద్యోగం కోసం వెళితే.. నగ్న వీడియో తీశాడు | Woman arrested for Mayur Vihar senior citizen's murder | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కోసం వెళితే.. నగ్న వీడియో తీశాడు

Published Sat, Jul 23 2016 3:30 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

ఉద్యోగం కోసం వెళితే.. నగ్న వీడియో తీశాడు - Sakshi

ఉద్యోగం కోసం వెళితే.. నగ్న వీడియో తీశాడు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ తూర్పు ప్రాంతంలోని మయూర్ విహార్లో 65 ఏళ్ల వృద్ధుడు విజయ్కుమార్ను హత్య చేసిన కేసులో నిందితురాలి (25)ని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ ఆధారం, సీసీటీవీ ఫుటేజి సాయంతో నిందితురాలిని గుర్తించినట్టు పోలీసులు చెప్పారు.  

విజయ్కుమార్ తనపై లైంగికదాడి చేశాడని, తనను నగ్నంగా వీడియో తీశాడని, ఆయనపై ప్రతీకారం తీర్చుకునేందుకు కత్తితో పొడిచి చంపినట్టు నిందితురాలు అంగీకరించింది. రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం ఆయనను కలిస్తే తనను శారీరకంగా వేధించాడని పోలీసులకు చెప్పింది.

విజయ్ కుమార్ భార్య వసుంధర ఐటీ అధికారిణిగా పనిచేస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఆయన ఒక్కడే ఉన్నాడు. కుమార్తె ఫోన్ చేస్తే విజయ్ కుమార్ స్పందించలేదు. ఆమె విజయ్ కుమార్ ఫ్లాట్లోకి వచ్చి చూడగా, ఆయన రక్తపుమడుగులో పడిఉన్నాడు. ఆమె వెంటనే అలారమ్ మోగించి పోలీసులకు సమాచారం అందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement