అల్వాల్: ఇళ్లల్లో పనిచేస్తూ దొంగతనాలకు పాల్పడిన మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ హరిక్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కానాజిగూడ ఇందిరానగర్‌లో నివసించే జయలక్ష్మి(22) స్థానికంగా ఇళ్లలో పనిచేస్తోంది. కొంతకాలంగా నమ్మకంగా పనిచేస్తూ మూడు ఇళ్లలో దొంగతనానికి పాల్పడింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని జయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి పదమూడు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.