gold stolen
-
19 కిలోల బంగారం చోరీ
సాక్షి, వరంగల్/ రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐలో మంగళవారం తెల్లవారుజా మున భారీ దోపిడీ జరిగింది. భవనం కిటికీని తొలగించి లోపలికి వెళ్లిన దుండగులు బ్యాంకులోని మూడు లాకర్లలో ఒకదానిని గ్యాస్‌కట్టర్‌తో పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. బ్యాంకులోని అలారం సిస్టంను ధ్వంసం చేశారు. లాకర్లోని 19 కిలోలకుపైగా బంగారం చోరీచేసినట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.14.82 కోట్లు ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. సీసీ కెమెరా పుటేజీకి సంబంధించిన డీవీఆర్‌ను కూడా అపహరించారు.దోపిడీకి గురైన బ్యాంకు రాయపర్తి పోలీసు స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలోనే ఉన్నా నిందితులు పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం విధులకు హాజరైన మేనేజర్ సత్యనారాయణ బ్యాంకులో చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాయపర్తి, వర్ధన్నపేట ఎస్సైలు శ్రవణ్‌కుమార్, రాజు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ మంగళవారం రాత్రి సందర్శించారు. దోపిడీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు దొంగల పనే? ఈ దోపిడీకి పాల్పడింది తమిళనాడుకు చెందిన దొంగల ముఠా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో తమిళ భాషలో ఉన్న ‘జోకర్’ అగ్గిపెట్టె లభించడంతో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్యాంకు లాకర్‌ను కట్ చేసిన గ్యాస్ కట్టర్‌ను కూడా దొంగలు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కేసు దర్యాప్తులో అది కీలకం కానుందని పోలీసులు తెలిపారు. ఈ గ్యాస్‌కట్టర్‌ను అమెజాన్ వెబ్సైట్లో కొనుగోలు చేసినట్టు గుర్తించిన పోలీసులు.. అది డెలివరీ అయిన చిరునామా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.25 రోజల క్రితం కర్ణాటకలోని దావణగెరె జిల్లా న్యామతి పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచిలో దొంగలు రూ.12.95 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. అచ్చం అదే తరహాలో ఇక్కడ కూడా దోపిడీ జరగటంతో రెండు దోపిడీలు చేసింది ఒకటే ముఠా అని అనుమానిస్తున్నారు. బ్యాంకు అధికారుల అలసత్వంవల్లే: ఖాతాదారులు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పనిచేయటంలేదు. దీంతో దొంగలకు చోరీలు చేసి తప్పించుకోవటం తేలికైందని ఖాతాదారులు మండిపడుతున్నారు. మండల కేంద్రానికి బ్యాంకు దూరంగా ఉండటం.. గతంలో సెక్యూరిటీగార్డును నియమించినా ప్రస్తుతం తొలగించటం వల్లే దోపిడీ జరిగిందని చెప్తున్నారు. బ్యాంకులో బంగారం చోరీ అయినట్లు తెలుసుకున్న ఖాతాదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు.ఎంతో నమ్మకంతో బ్యాంకులో సొమ్ము దాచుకుంటే ఇలా నిర్లక్ష్యం చేయడం ఏమిటని అధికారులను నిలదీశారు. మూడేళ్ల క్రితం ఇప్పుడు పగులకొట్టిన కిటికీ నుంచి కాకుండా మరో కిటికీని పగులగొట్టి దొంగలు బ్యాంకులోకి చొరబడ్డారు. కానీ, లాకర్‌ను ఓపెన్ చేయలేక తిరిగి వెళ్లిపోయారు. పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించకపోవటం కూడా దోపిడీలకు కారణమవుతోందని స్థానికులు అంటున్నారు. -
Hyderabad: వజ్రాలు కొట్టేసి..గోవా చెక్కేసి.. డైమండ్స్ విలువ తెలియక..
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్లో ఈ నెల 20న రాత్రి జరిగిన భారీ దొంగతనం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని బంజారాహిల్స్ డివిజన్ క్రైం పోలీసులు సోమవారం గోవాలో అదుపులోకి తీసుకున్నారు. చింతలబస్తీకి చెందిన చాపల అంజలప్ప అలియాస్ మచ్చ అలియాస్ అంజి స్థానిక చేపల మార్కెట్లో పని చేసేవాడు. బంజారాహిల్స్‌లోని సింగాడికుంటకు చెందిన మైలారం పవన్‌కుమార్‌తో స్నేహం, జల్సాలకు దారి తీసింది. గంజాయితోపాటు మద్యం సేవించడం అలవాటుగా చేసుకున్నారు. ఇందులో భాగంగా దొంగతనానికి స్కెచ్ వేసిన వీరు.. ఈ నెల 20న రాత్రి నంబర్ ప్లేటు లేని స్కూటీపై వీధుల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని తిరుగుతుండగా ఓ ఇంటి తాళాలు వేసి ఉండటం కనిపించింది. ఇద్దరు ఆ ఇంటి వెనుక కిటికీలో నుంచి లోపలికి దూరి నగదు, నగల కోసం యత్నిస్తుండగా ఓ లాకర్ కనిపించింది. లాకర్ తీసుకుని బంజారాహిల్స్ రోడ్‌నంబరు 13లోని ఓ స్మశాన వాటికలో పగులగొట్టి అందులో ఉన్న ఆభరణాలు, వజ్రాలను పంచుకున్నారు. దొంగతనం జరిగిన రెండు రోజుల తర్వాత పవన్‌కుమార్ పోలీసులకు చిక్కాడు. అదే రోజు అంజిని పట్టుకోవడానికి యత్నించగా పోలీసుల కదలికలను గుర్తించిన అతను తన వద్ద ఉన్న ఆభరణాలు మణప్పురంలో తాకట్టు పెట్టి రూ. 1.50 లక్షలు తీసుకున్నాడు. లక్డీకాపూల్‌లో బస్సు ఎక్కి బెంగుళూరులో దిగి అక్కడి నుంచి గోవాకు చెక్కేశాడు. పవన్‌కుమార్‌ను విచారించగా పోలీసులకు ఎంతకూ సహరించలేదు. అయితే పవన్ చేతి మీద ఓ ఫోన్ నంబరు రాసి ఉండటాన్ని గుర్తించిన క్రైం పోలీసులు ఆ నంబరు ఎవరిదని ఆరా తీశారు. స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ నంబరుపై నిఘా పెట్టగా అది అంజలప్ప అనే పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఆ నంబరును ఆధారంగా చేసుకొని చోరీ జరిగిన రాత్రి టవర్ డంప్ పరిశీలించగా అక్కడే రెండు గంటల పాటు తిరిగినట్లు గుర్తించారు. చదవండి: హడలెత్తించిన చిరుత.. 24 గంటల్లో 15 మందిపై దాడి.. వీడియో వైరల్ దీంతో ప్రధాన నిందితుడు అంజికి సంబంధించిన నంబరును గుర్తించి లోకేషన్ పెట్టగా గోవాలో ఉన్నట్లు తేలింది. వెంటనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు గోవాకు వెళ్లి ఓ లాడ్జిలో తలదాచుకున్న అంజిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తుండగానే గోవాలో చిక్కాడు. పోలీసులను తక్కువ అంచనా వేసి ఇక తాను దొరకనని గోవాలో మకాం వేసిన అంజిని సాంకేతికతతో పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి దొంగతనం చేసిన సొత్తును రికవరీ చేశారు. నల్లమోతు పవన్ అనే ఆభరణాల వ్యాపారి ఫిలింనగర్లో శమంతక డైమండ్ షోరూంను నిర్వహిస్తుండగా అందులోనే ఈ దొంగతనం జరిగింది. ఈ షోరూంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ రోడ్లపైన సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుల జాడ చిక్కలేదు. అయితే సింగాడికుంటలో ఓ వ్యక్తి తన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ద్వారా నిందితుల్లో ఒకరైన మైలారం పవన్ దొరకడం, అతన్ని విచారిస్తే ప్రధాన నిందితుడు పట్టుబడటం జరిగిపోయాయి. డైమండ్స్ విలువ తెలియక.. తాము దొంగతనం చేసిన డైమండ్స్ రూ.లక్షలు విలువ చేస్తాయనే విషయం తెలియక నిందితులు పవన్‌కుమార్, అంజి వాటిని తమ గదుల్లో డబ్బాలో వేసి ఓ మూలన పెట్టారు. వాటిని అమ్మితే రూ.లక్షలు వస్తాయనే విషయం తెలియకనే కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే తాకట్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. -
హైదరాబాద్ నల్లకుంట శకరమటంలో చోరి
-
పెళ్లింట్లో భారీ చోరీ
పెళ్లి జరిగిన ఇల్లు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, బంధువులతో సహా అంతా అర్ధరాత్రి వరకూ కబుర్లతో కాలక్షేపం చేసి అప్పుడే నిద్రించారు. వేసవి రాత్రులు కావడంతో ఉక్కపోత వల్ల తలుపులు బార్ల తెరిచారు. ఇదే అదను కోసం ఎదురుచూస్తున్న దొంగలు నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించారు. మహిళల మెడల్లో బంగారు చై న్లతో సహా మొత్తం క్షణాల్లో ఊడ్చేశారు. ఏం జరిగిందో తెలుసుకుని బాధితులు కేకలు వేసే లోగానే చీకట్లో మాయమైపోయారు. వివరాల్లోకి వెళ్తే.. –కొవ్వూరు రూరల్ కొవ్వూరు మండలం ధర్మవరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంటన్నర సమయంలో పెళ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం గ్రామానికి చెందిన బొప్పన శ్రీనివాస్ తన మొదటి కుమార్తె వివాహం ఈ నెల 21వ తేదీన జరిపారు. ఈ క్రమంలో పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు అల్లుడు సురేష్, కుమార్తె అలేఖ్య ఇంట్లో నిద్రిస్తున్నారు. వేసవి కావడంతో ఇంటి తలుపులు తెరుచుకుని నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. డ్రెస్సింగ్ టేబుల్‌పై ఉంచిన పెళ్లి కుమారుడి ఆరు కాసుల బంగారపు చైను, ఆరు కాసుల మూడు ఉంగరాలు, అక్కడే నిద్రిస్తున్న పెళ్లి కుమార్తె మెడలో ఉన్న నాను తాడును లాగేయడంతో మూడువంతుల తాడు దొంగ చేతికి వెళ్లింది. అంతేకాకుండా గుంటూరు నుంచి వివాహానికి వచ్చిన వృద్ధురాలు నల్లమోతు హనుమాయమ్మ తను నిద్రిస్తున్న మంచం తలగడ కింద ఉంచిన సుమారు 8 కాసుల రెండు గొలుసులను దోచుకుపోయారు. వెళుతూవెళుతూ పక్కగదిలో ఉన్న శ్రీనివాస్ చిన్న కుమార్తె సౌజన్య మెడలో సుమారు 4 కాసుల గొలుసును తెంపే ప్రయత్నం చేశారు. అయితే సౌజన్య మేల్కొని కేకలు వేస్తూ వెంబడించడంతో వారు పారిపోయారు. మొత్తం చోరీకి గురైన బంగారం 27 కాసుల వరకూ ఉండవచ్చని పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. అంతకు ముందు రాత్రి 12 గంటల ప్రాంతంలో ధర్మవరం కొత్తకాలనీలో దోపిడీకి ప్రయత్నించగా అక్కడి వారు గుర్తించి కేకలు వేయడంతో నలుగురు వ్యక్తులు పారిపోయారని చెబుతున్నారు. డాగ్‌స్కా్వడ్, క్లూస్ టీం పరిశీలన చోరీ జరిగిన ఇంటిని కొవ్వూరు రూరల్ సీఐ సి.శరత్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో ప్రతి అంగుళాన్ని పోలీసులు ఆధారాల కోసం వెతికారు. రాజమండ్రి నుంచి షాడో అనే జాగిలాన్ని తెప్పించి ఆ ప్రాంతమంతా పరిరక్షించారు. దొంగలు పారిపోతుండగా కంగారులో చేతి నుంచి జారిన పెండ్లి కుమారుడి మనీ çపర్స్‌ను జాగిలానికి వాసన చూపి వదిలారు. అయితే అది ఇంటి వద్ద నుంచి బయలు దేరి ధర్మవరం–కాపవరం ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువ వరకూ వెళ్లి వెనుదిరిగింది. క్లూస్ టీం బృందం నిందితుల వేలి ముద్రలను సేకరించింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు సేకరించామని, త్వరలో వారిని పట్టుకుంటామని తెలిపారు. రూరల్ ఎస్సై ఎం.శ్యాం సుందరరావు, సీసీఎస్ ఎస్సై పి. శ్రీనివాస సింగ్, సిబ్బంది పాల్గొన్నారు. దొంగ వెంట పరిగెట్టాను ఎవరో మెడలో చై న్లాగడంతో వెంటనే మెలకువ వచ్చింది. భయంతో కళ్లు తెరిచేసరికి మెడలో చై న్ లాక్కుని వెళుతున్న దొంగ కనిపించాడు. పెద్దగా కేకలు వేస్తూ దొంగ వెంట పరిగెట్టాను.. అయినా తప్పించుకుని పారిపోయాడు. బంధువులంతా ఇంట్లో ఉండగానే దొంగలు చొరబడి చోరీ చేయడంతో అంతా ఆందోళనగా ఉన్నాం. –బొప్పన సౌజన్య, ధర్మవరం -
బంగారం కోసం దారుణ హత్య
బాసర: బంగారు నగల కోసం గుర్తుతెలియని దుండగులు ఓ వృద్ధురాలిని దారుణంగా హాతమార్చారు. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్(బి) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లింగమ్మ(73)ను గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు గొంతునులిమి హత్యచేసి ఆమె వంటిపై ఉన్న బంగారు నగలతో ఉడాయించారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
- 29 సవర్ల బంగారం, రూ.20 వేల నగదు అపహరణ నెల్లూరు (అర్బన్) : స్థానిక కొండాయపాళెం గేటు సమీపంలోని స్నేహనగర్‌లో పట్టపగలే దొంగలు బుధవారం ఓ ఇంటి తాళాలు పగల గొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసుల సమాచారం మేరకు.. రత్నం కళాశాలలో మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీహరి ఉదయం తన వి«ధులకు వెళ్లిపోయాడు. భార్య ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. దుండగులు ఆ ఇంటి తాళాలను పగల గొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాను పగల గొట్టి అందులోని 29 సవర్ల బంగారు నగలతో పాటు 20 వేల నగదును అపహరించుకుని వెళ్లారు. మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి వచ్చిన యజమాని శ్రీహరి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు అనుమానించాడు. లోపలికి వెళ్లి బీరువా బీరువాలో చూడగా నగలు, నగదు కనిపించలేదు. దీంతో ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర డీఎస్పీ వెంకటరాముడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు పక్కింటి వారిని విచారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పట్ట పగలే ఇంట్లో చోరీ
38 గ్రాముల బంగారు నగల అపహరణ మనుబోలు : పట్టపగలు..కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మనుబోలు గమళ్లపాళెంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గమళ్లపాళెంకు చెందిన షేక్ బషీర్ లారీడ్రైవర్‌గా పనిచేస్తాడు. ఆయన భార్య జమీలా గూడూరు సమీపంలోని ఆదిశంకరా ఇంజనీరింగ్ కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పని చేస్తుంది. కుమార్తె ఫైరజ్ క్యూబా కళాశాలలో బీటెక్ చదువుతుంది. కుమారుడు సమీర్ బుజబుజ నెల్లూరులోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తాడు. మంగళవారం ఉదయమే ఎవరి పనులకు వారు వెళ్లి పోయారు. సాయంత్రం ఫైరజ్ కళాశాల నుంచి ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు పగలగొట్టి తెరిచి ఉన్నాయి. అందులోని దుస్తులు, వస్తువులు చిందవందరగా పడేసి ఉండటంతో అనుమానంతో బీరువా లోపలి అరల్లో పరిశీలించగా అందులో ఉండాల్సి రెండున్నర సవర్ల లాకెట్, ఒక సవర దండ, 6 గ్రాముల కమ్మలు, 4 గ్రాముల 2 ఉంగరాలు కనబడ లేదు. దొంగలు బీరువాలో ఉన్న ఏటీఎం కార్డును కూడా తీసుకెళ్లారు. వెంటనే ఆమె స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ గంగాధర్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అపహరించిన ఏటీఎం కార్డు ద్వారా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తన సెల్‌కు రూ.100 డ్రా చేసినట్లుగా మెసేజ్ వచ్చిందని బషీర్ కుమారుడు సమీర్ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొణితివాడ అమ్మవారి ఆలయంలో చోరీ
వీరవాసరం : కొణితివాడ గ్రామంలోని కనకదుర్గమ్మ, మారెమ్మ అమ్మవార్ల ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ చోరి జరిగింది. నాలుగు కాసుల బంగారం, నాలుగు కేజిల వెండి అపహరణకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. వీరవాసరం మండలం కొణితివాడలోని శ్రీకనకదుర్గమ్మ, మారెమ్మ అమ్మవార్ల ఆలయంలో గుర్తుతెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. తలుపులకు వేసిన తాళాలను పగలకొట్టి ఆలయంలోకి చొరబడి అమ్మవార్లకు అలంకరించిన రెండేసి జతల బంగారు మంగళసూత్రాలు, కేజీ వెండి కిరీటం, మరో మూడు కేజీల ఆభరణాలు దొంగిలించుకుపోయారు. తెల్లవారుజామునే వచ్చిన ఆలయ అర్చకుడు సుబ్రహ్మణ్యశాస్త్రి గుడి తలుపులు పగలకొట్టి ఉండడంతో పరిసర ప్రాంతాల వారిని పిలిచి వీరవాసరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతాన్ని వీరవాసరం ఎసై ్స ఎన్.శ్రీనివాసరావు, క్లూస్ టీం సీఐ నర్సింహమూర్తి పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులు నాగరాజు సత్యనారాయణరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వీరవాసర ఎసై ్స ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. -
మలేషియా భక్తుడి బంగారం చోరీ
శ్రీకాళహస్తిః శ్రీకాళహస్తి ఆలయంలో మలేషియాకు చెందిన భక్తుడి బంగారు ఆభరణం చోరీకి గురైంది. శ్రీకాళహస్తి దేవస్థానంలో మలేషియాకు చెందిన కలెసైల్వన్ తన భార్యతో కలసి మంగళవారం రాత్రి దర్శనానికి విచ్చేశారు. స్వామి దర్శనాంతరం అమ్మవారి దర్శనం చేసుకునే క్యూలో కలెసైల్వన్కు చెందిన 48 గ్రాముల బ్రాస్లైట్ చోరీకి గురైంది. దీంతో ఆయన ఆలయ చైర్మన్ గురవయ్యనాయుడుకు, వన్‌టౌన్ సీఐ చిన్నగోవింద్కు ఫిర్యాదు చేశారు. ‘సార్ దిస్ ఈస్ టూ బ్యాడ్’ అంటూ మలేషియా భక్తుడు ఆలయ చైర్మన్ గురవయ్యనాయుడు, వన్‌టౌన్ సీఐ చిన్నగోవింద్ వద్ద ఆవేదన చెందారు. విచారణ చేసి న్యాయుం చేస్తామని సీఐ వారి వివరాలు తీసుకుని పంపించారు. తర్వాత సీఐ మీడియాతో మాట్లాడుతూ ఆలయంలోని సీసీ కెమెరాలు పరిశీలించావుని.. క్యూలో కిందిపడిన బ్రాస్లైట్ను ఓ వ్యక్తి తీసుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది స్పష్టంగా తెలియడం లేదన్నారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. -
ప్రేమికుల్ని బెదిరించి.... బంగారం దోచుకెళ్లారు
మెదక్(కౌడిపల్లి): ఏకాంతంగా ఉన్నప్రేమికులను బెదిరించి బంగారం కమ్మెలు, సెల్‌ఫోన్‌ను అపహరించిన ముగ్గురు వ్యక్తులపై కేసునమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ సైదేశ్వర్ శుక్రవారం తెలిపారు. వివరాలు... గురువారం సాయంత్రం మంజీరనది బ్రిడ్జ్ సమీపంలో హత్నూర మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌తోపాటు మరోమహిళ ఏకాంతంగా ఉన్నారు. కాగా జోగిపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు నరెందర్‌రెడ్డి, వినయ్, శేఖర్లు బైక్‌పై వెలుతూ వీరిని గమనించారు. ఒంటరిగా ఉన్న ప్రేమికులవద్దకు వెల్లి వారిని బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరివద్ద డబ్బులు లేకుపోవడంతో మహిళ వద్దనుండి అరతులం బంగారు చెవికమ్మలతోపాటు, ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకున్నారు. దీంతోపాటు రూ 10వేలు ఇచ్చి సెల్‌ఫోన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే విషయం అందరికి చెబుతామని బెదిరించారు. -
కళ్లెదుటే కనికట్టు...పది తులాల బంగారం మాయం
హైదరాబాద్: ఓ వృద్ధురాలిని నమ్మించి... బంగారు నగలు మాయం చేసిన ఉదంతమిది. రామంతపూర్‌లో నివాసం ఉండే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి విజయలక్ష్మి(60) మూసారంబాగ్ డివిజన్ శాలివాహన నగర్లో ఉంటున్న తన కూతురు చంద్రకళ ఇంటికి వచ్చారు. చంద్రకళ స్థానికంగా పతంజలి మెడికల్ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నారు. ఆదివారం విజయలక్ష్మి మెడికల్ షాపులో కూర్చుని ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి, మాటల్లో పెట్టారు. త్వరలో బంగారు నగల దుకాణం పెడుతున్నామని, పక్కనే ఉన్న దేవాలయంలో మొక్కు తీర్చుకోవడానికి వచ్చామని చెప్పారు. బంగారాన్ని తాకి, డబ్బులు హుండీలో వేస్తే మంచి జరుగుతుందని ఆమెకు నమ్మబలికారు. విజయలక్ష్మి వద్ద ఉన్న బంగారు గొలుసు, చేతులకు ఉన్న బంగారు గాజులను తీయించి రూ.200, నగలు పేపర్లో చుట్టి నగదు గల్లాపెట్టెలో పెట్టారు. అనంతరం దీవించమని ఆమె కాళ్లపై పడ్డారు. డబ్బులు కూడా మీరే ఆలయ హుండీలో వేయమని చెప్పి..అక్కడ నుంచి ఉడాయించారు. తరువాత గల్లా పెట్టెను చూడగా అందులో 10 తులాల బంగారు నగలు కన్పించలేదు. దీంతో ఆందోళనకు గురైన విజయలక్ష్మి మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బంగారం చోరీ..మహిళ అరెస్ట్
అల్వాల్: ఇళ్లల్లో పనిచేస్తూ దొంగతనాలకు పాల్పడిన మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ హరిక్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కానాజిగూడ ఇందిరానగర్‌లో నివసించే జయలక్ష్మి(22) స్థానికంగా ఇళ్లలో పనిచేస్తోంది. కొంతకాలంగా నమ్మకంగా పనిచేస్తూ మూడు ఇళ్లలో దొంగతనానికి పాల్పడింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని జయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి పదమూడు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మోస్ట్‌వాంటెడ్ నిందితుడు బాబు భాగ్యరాజ్ అరెస్ట్
నెల్లూరు: చిక్కడు, దొరకడు అన్న తరహాలో రెండు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిస్తున్న మోస్ట్‌వాంటెడ్ నిందితుడు బాబు భాగ్యరాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి భారీ మొత్తంలో బంగారం, నగదును నాయుడపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు భాగ్యరాజ్‌పై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పలు కేసులు నమోదైయ్యాయి. చోరీలకు పాల్పడతూ రెండు రాష్ట్రాల పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న భాగ్యరాజ్ కోసం చెన్నై సమీపంలోని మాదవరంలో చెన్నై, ఏపీ పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. -
20 తులాల బంగారం, నగదు అపహరణ
వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో దుండగుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. విచక్షణ లేకుండా దాడులకు పాల్పడుతున్నారు. అడ్డంవచ్చినవారిపై హతమారుస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైఎస్సార్ జిల్లాలోని పులివెందల బస్టాండులో ఓ వ్యక్తి నుంచి విలువైన నగదు, బంగారాన్ని దుండగుడు అపహరించాడు. ఆ వ్యక్తి వద్ద దాదాపు ఒక లక్ష రూపాయల నగదుతో పాటు 20 తులాల బంగారం ఉన్నట్టు తెలిసింది. ఆ విలువైన బంగారం, నగదును ఆ దుండగుడు అపహరించినట్టు తెలుస్తోంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బస్సులో పది కిలోల బంగారం చోరీ?
విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న హైటెక్ బస్సులో పది కిలోల బంగారం చోరీకి గురైంది. విజయవాడలో బంగారం వ్యాపారం చేస్తున్న వ్యాపారులు కొంతమంది మిగిలిన బంగారాన్ని విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకొస్తుండగా సూర్యాపేట బస్టాండులో ఈ బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. తొలుత పది కిలోల బంగారం పోయిందని ఫిర్యాదు చేసినా, తర్వాత విచారణలో మాత్రం అది మూడు కిలోలేనని చెప్పడంతో దీనిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. విజయవాడలో అమ్మకాలు చేయగా మిగిలిన బంగారాన్ని కొంతమంది గుమాస్తాలు తీసుకొస్తున్నారు. వీరు తొలుత ఒకసారి కోదాడలో బస్సు దిగారు. తర్వాత సూర్యాపేటలో గుమాస్తాలు కిందకు దిగగా, బస్సు కండక్టర్ టీ తాగేందుకు వెళ్లారు. కానీ తిరిగి వచ్చేసరికి బస్సులో ఉండాల్సిన బంగారం లేదని వాళ్లు గగ్గోలు పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పది కిలోల బంగారం అయ్యేసరికి ఈ విషయం కాస్తా దావానలంలా వ్యాపించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై విచారణ జరిపారు. అయితే విచారణలో మాత్రం గుమాస్తాలు తమ వద్ద ఉండాల్సినది మూడు కిలోల బంగారమేనని చెప్పారు. దీంతో పాటు, బస్సులోంచి వేరే ప్రయాణికులు ఎవ్వరూ కిందకి దిగకపోవడంతో పోలీసులకు అనుమానాలు తలెత్తాయి. బస్టాండులో, అదీ పాయింటులో పెట్టిన హైటెక్ బస్సులోంచి అంత బంగారాన్ని చోరీ చేయడం సాధ్యం కాదని, అందువల్ల గుమాస్తాలే ఏమైనా మోసానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులను కూడా పోలీసులు విచారించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
బస్సులో పది కిలోల బంగారం చోరీ?