తాళం వేసిన ఇంట్లో చోరీ
-
- 29 సవర్ల బంగారం, రూ.20 వేల నగదు అపహరణ
నెల్లూరు (అర్బన్) : స్థానిక కొండాయపాళెం గేటు సమీపంలోని స్నేహనగర్‌లో పట్టపగలే దొంగలు బుధవారం ఓ ఇంటి తాళాలు పగల గొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసుల సమాచారం మేరకు.. రత్నం కళాశాలలో మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీహరి ఉదయం తన వి«ధులకు వెళ్లిపోయాడు. భార్య ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. దుండగులు ఆ ఇంటి తాళాలను పగల గొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాను పగల గొట్టి అందులోని 29 సవర్ల బంగారు నగలతో పాటు 20 వేల నగదును అపహరించుకుని వెళ్లారు. మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి వచ్చిన యజమాని శ్రీహరి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు అనుమానించాడు. లోపలికి వెళ్లి బీరువా బీరువాలో చూడగా నగలు, నగదు కనిపించలేదు. దీంతో ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర డీఎస్పీ వెంకటరాముడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు పక్కింటి వారిని విచారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.