బంగారం కోసం దారుణ హత్య
బాసర: బంగారు నగల కోసం గుర్తుతెలియని దుండగులు ఓ వృద్ధురాలిని దారుణంగా హాతమార్చారు. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్(బి) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లింగమ్మ(73)ను గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు గొంతునులిమి హత్యచేసి ఆమె వంటిపై ఉన్న బంగారు నగలతో ఉడాయించారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.