మెదక్(కౌడిపల్లి): ఏకాంతంగా ఉన్నప్రేమికులను బెదిరించి బంగారం కమ్మెలు, సెల్‌ఫోన్‌ను అపహరించిన ముగ్గురు వ్యక్తులపై కేసునమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ సైదేశ్వర్ శుక్రవారం తెలిపారు. వివరాలు... గురువారం సాయంత్రం మంజీరనది బ్రిడ్జ్ సమీపంలో హత్నూర మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌తోపాటు మరోమహిళ ఏకాంతంగా ఉన్నారు. కాగా జోగిపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు నరెందర్‌రెడ్డి, వినయ్, శేఖర్‌లు బైక్‌పై వెలుతూ వీరిని గమనించారు.
ఒంటరిగా ఉన్న ప్రేమికులవద్దకు వెల్లి వారిని బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరివద్ద డబ్బులు లేకుపోవడంతో మహిళ వద్దనుండి అరతులం బంగారు చెవికమ్మలతోపాటు, ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకున్నారు. దీంతోపాటు రూ 10వేలు ఇచ్చి సెల్‌ఫోన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే విషయం అందరికి చెబుతామని బెదిరించారు.