నగరంలో విషాదం
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలో దారితప్పిన ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. జాన్సన్ అలియాస్ నాగరాజ్ (23), దిల్దాద్ (25) అనే యువతి ప్రేమించుకుంటున్నారు. దిల్దాద్‌కు ఇప్పటికే పెళ్లి కాగా నాగరాజ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. సోషల్ మీడియా ద్వారా ఇద్దరికీ పరిచయమై ప్రేమగా మారింది.
తరచూ షికార్లకు వెళ్తూ ఉండేవారు. తమ ఇద్దరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించబోరని విరక్తి చెందిన నాగరాజ్ శుక్రవారం రాచేనహళ్లి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన దిల్దాద్ మనసులోనే కుమిలిపోయింది. ప్రియుడు లేని లోకం వద్దంటూ శనివారం అమృతహళ్లిలోని తమ ఇంటిలో దిల్దాద్ కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై అమృతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment