
పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయగా, యువకుడు మృతిచెందాడు.
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయగా, యువకుడు మృతిచెందాడు. రైలు వచ్చే సమయానికి యువతిని పక్కకు నెట్టి యువకుడు సూసైడ్‌కు పాల్పడ్డాడు. పెద్దలు వీరి వివాహానికి అంగీకరించకపోవడమే కారణమని సమాచారం.
ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
మృతుడుది గణపవరం కాగా, ప్రియురాలు ఎస్ కొండేపాడు గ్రామానికి చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.