![Telugu Student Shot Deat In Ohio United States - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/21/telugu.jpg.webp?itok=IxZmgnZu)
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ ఉన్నత చదువుల నిమ్మితం అమెరికా వెళ్లాడు. ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. కొలంబస్ ఫ్రాంక్లింటన్‌లోని ఓ షెల్ గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌టైం ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
బుధవారం అర్థరాత్రి 12.50 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) గ్యాస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తుండగా ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి నగదు తీసుకుపోయారు. ఈ కాల్పుల్లో సాయిష్‌కు తీవ్ర గాయాలవ్వగా ఓహియోహెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యరణించాడు. సాయిష్ తల్లి ప్రస్తుతం ఏలూరులో నివాసం ఉంటోంది. ఈ ఘటనపై గురువారం రాత్రి 8 గంటలకు తమకు సమాచారం అందిందని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా పాలకొల్లు పట్టణానికి చెందిన వీరా రమణ నాలుగేళ్ల క్రితం మృతిచెందారు. ఆయన చిన్న కుమారుడైన సాయేష్ అమెరికాలోని ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం యూఎస్ వచ్చిన సాయిష్.. ఇప్పడిప్పుడే కుటుంబ ఆర్థిక సమస్యలను చక్కబెడుతున్నాడు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ చదువుతుండగా.. మరో 10 రోజుల్లో ఎంఎస్ పూర్తికానుంది. ఈ సమయంలో కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆయన తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చదవండి: రంజాన్ 2023: యెమెన్‌లో వితరణ వేళ విషాదం.. 78 మంది దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment