గుంటూరు: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య | Love Couple Commits Suicide After Falling Under A Train At Pedakakani | Sakshi
Sakshi News home page

గుంటూరు: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య

Published Fri, Oct 18 2024 10:59 AM | Last Updated on Fri, Oct 18 2024 11:19 AM

Love Couple Commits Suicide After Falling Under A Train At Pedakakani

సాక్షి, గుంటూరు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని సమీపంలో రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను దానబోయిన మహేశ్‌, నండ్రు శైలజగా గుర్తించారు. పెదకాకానికి చెందిన మహేశ్‌, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు గత కొంత కాలంగా లవ్‌లో ఉన్నారు.

రెండేళ్ల క్రితం మహేశ్‌.. హైదరాబాద్‌లోని ఓ స్టోర్‌లో పని చేస్తుండగా.. శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది.

అయితే, పెళ్లికి యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో కొన్ని రోజుల క్రితం శైలు, మహేశ్‌ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడి ఉన్నారు.

ఇదీ చదవండి: టీడీపీ నేత రాసలీలలు.. వీడియో లీక్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement