మైసూరు(కర్ణాటక): యువకులకు, పురుషులతో పరిచయం పెంచుకోవడం, వారి వాట్సప్‌కి తన నగ్నచిత్రాలను పంపి డబ్బులు వసూలు చేస్తున్న మహిళను నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు సవిత అలియాస్ మంజులా యాదవ్. ఇది మంచిది కాదని ఆమె భర్త అనేకసార్లు మందలించి గొడవపడినా ఆమె మాత్రం పంథా మార్చుకోకుండా కటకటాలను లెక్కిస్తోంది.
పరిచయం పెంచుకుని..
వివరాలు... మైసూరు జిల్లాలోని పిరియా పట్టణ తాలూకాకు సవిత మైసూరు నగరంలోని విజయనగరలో నివాసం ఉంటోంది. అక్కడక్కడ దంపతుల వద్దకు వెళ్ళి తాను పేదరాలిని, సాయం చేయాలని వారి నుంచి డబ్బు తీసుకుంటుంది. తరువాత వారితో వరసలు మార్చి మాట్లాడి సంసారంలో గొడవలు పెట్టేది. యువతను, పురుషులను పరిచయం చేసుకుని తరచూ ఫోన్లలో చిట్‌చాట్ చేసేది. తన నగ్నచిత్రాలను పంపి బెదిరింపులకు దిగి అందినకాడికి వసూళ్లకు పాల్పడేది.
ఈ వ్యవహారం తెలిసి సవిత భర్త ఆమెతో గొడవ పడ్డాడు. ఒకసారి చాకుతో పొడిచి దాడి కూడా చేశాడు. కానీ సవిత బుద్ధి మాత్రం మార్చుకోలేదు. ఇలా అనేకమంది వద్ద లక్షల రూపాయలను గుంజినట్లు సమాచారం. విజయనగరలోని రెండవ స్టేజ్‌లో అభిషేక్ రోడ్డులో స్పా పేరుతో వేశ్యావాటికను కూడా నడుపుతోందని పోలీసులు తెలిపారు. పలు ఫిర్యాదులు రావడంతో విజయనగర పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
రెండు దోపిడీ కేసుల్లో ఏడుగురు అరెస్టు
మైసూరులో రెండు వేర్వేరు చోట్ల జనాన్ని కొట్టి సొమ్ము దోచుకెళ్లిన ఏడుమందిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నవంబర్ నెల 30వ తేదీ తెల్లవారుజామున 5 గంటల సమయంలో మైసూరులో బీఎన్ రోడ్డులో నడిచి వెళ్తున్న వ్యక్తిని ఆటోలో వచ్చిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కొట్టి అతని వద్దనున్న సుమారు రూ. 25 వేల నగదును దోచుకెళ్లారు.
లష్కర్ పోలీసులు విచారించి నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 22 వేల నగదును, ఒక ఆటో, మొబైల్ ఫోన్లను స్వా«దీనం చేసుకొన్నారు. మరో కేసులో డిసెంబర్ 14వ తేదీన రాత్రి 7.30 సమయంలో బీఎన్ సెంట్రల్ మాల్ దగ్గర నడిచి వెళ్తున్న వ్యక్తిని ఆటోలో వచ్చిన నలుగురు అడ్డుకుని కొట్టి రూ. 6700 నగదు, మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. లష్కర్ పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.
చదవండి: వివాహిత ఆత్మహత్య.. కారణం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment