nude pictures
-
పుట్టు మచ్చలతో జాతకాలు మారుస్తామంటూ.. నగ్న చిత్రాలు సేకరించిన ముఠా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘హస్తరేఖలు, పుట్టు మచ్చల ఆధారంగా ఉన్నది ఉన్న ట్లు చెబుతాం.. మీరు కోరినట్లుగా జాతకం మారుస్తాం.. ఆ తర్వాత మీరు అనుకున్నది జరుగుద్ది.. కనకవర్షం కురిపిస్తాం’ అంటూ మహిళలకు పలువురు జ్యోతిష్కులు మాయ మాటలు చెప్పి నగ్న చిత్రాలు సేకరించారు. ఈ ఉదంతం మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూడగా.. తవ్విన కొద్దీ వారి లీలలు బయటకు వస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని కోడుపర్తి, వికారాబాద్ జిల్లా ఆమన్‌గల్, రంగారెడ్డి జిల్లాలో కొందరు జ్యోతిష్కులు జ్యోతిష్యకేంద్రాలు తెరిచారు. తమ దగ్గరికి వస్తే మంచి జరుగుతుందంటూ తెలిసిన వారి నుంచి విస్తృత ప్రచారం చేపట్టారు. పూలు, పండ్లు, కూరగాయలు విక్రయించే మహిళలకు వల వేశారు. శరీరంపై పుట్టుమచ్చలను తాము స్వయంగా చూసి గుర్తిస్తే జాతకం పక్కాగా ఉంటుందని చెప్పారు. ఫొటోలను పైకి పంపిస్తామని.. అక్కడ అమ్మ వారికి పూజలు చేస్తారని.. మీకు అమ్మవారి పూనకం వస్తుందని.. ఆతర్వాత కనక వర్షం కురుస్తుందనీ.. అప్పుడే మాకు కొంత ముట్టజెప్పాలని మాయమాటలు చెప్పి నమ్మబలికారు. అలా కొంతమంది మహిళల వద్ద న్యూడ్ ఫొటోలను సేకరించినట్లు సమాచారం. బాధితుల్లో కొందరు మగవారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. బ్లాక్ మెయిల్‌తో బయటికొచ్చిన బాగోతం జాతకం పేరిట న్యూడ్‌ఫొటోలు సేకరించిన అక్రమార్కులు చివరికి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన క్రమంలో వారి బాగోతం బట్టబయలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన ఖాకీలు జైనుద్దీన్, రాములు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని విచారించిన క్రమంలో తిరుపతి, శంకర్ పేర్లు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వీరిని పట్టుకునేందుకు ఓ పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. పూర్తి విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. -
మహిళ గలీజ్ పని.. యువకులతో పరిచయం పెంచుకుని.. నగ్న చిత్రాలు పంపి..
మైసూరు(కర్ణాటక): యువకులకు, పురుషులతో పరిచయం పెంచుకోవడం, వారి వాట్సప్‌కి తన నగ్నచిత్రాలను పంపి డబ్బులు వసూలు చేస్తున్న మహిళను నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు సవిత అలియాస్ మంజులా యాదవ్. ఇది మంచిది కాదని ఆమె భర్త అనేకసార్లు మందలించి గొడవపడినా ఆమె మాత్రం పంథా మార్చుకోకుండా కటకటాలను లెక్కిస్తోంది. పరిచయం పెంచుకుని.. వివరాలు... మైసూరు జిల్లాలోని పిరియా పట్టణ తాలూకాకు సవిత మైసూరు నగరంలోని విజయనగరలో నివాసం ఉంటోంది. అక్కడక్కడ దంపతుల వద్దకు వెళ్ళి తాను పేదరాలిని, సాయం చేయాలని వారి నుంచి డబ్బు తీసుకుంటుంది. తరువాత వారితో వరసలు మార్చి మాట్లాడి సంసారంలో గొడవలు పెట్టేది. యువతను, పురుషులను పరిచయం చేసుకుని తరచూ ఫోన్లలో చిట్‌చాట్ చేసేది. తన నగ్నచిత్రాలను పంపి బెదిరింపులకు దిగి అందినకాడికి వసూళ్లకు పాల్పడేది. ఈ వ్యవహారం తెలిసి సవిత భర్త ఆమెతో గొడవ పడ్డాడు. ఒకసారి చాకుతో పొడిచి దాడి కూడా చేశాడు. కానీ సవిత బుద్ధి మాత్రం మార్చుకోలేదు. ఇలా అనేకమంది వద్ద లక్షల రూపాయలను గుంజినట్లు సమాచారం. విజయనగరలోని రెండవ స్టేజ్‌లో అభిషేక్ రోడ్డులో స్పా పేరుతో వేశ్యావాటికను కూడా నడుపుతోందని పోలీసులు తెలిపారు. పలు ఫిర్యాదులు రావడంతో విజయనగర పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రెండు దోపిడీ కేసుల్లో ఏడుగురు అరెస్టు మైసూరులో రెండు వేర్వేరు చోట్ల జనాన్ని కొట్టి సొమ్ము దోచుకెళ్లిన ఏడుమందిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నవంబర్ నెల 30వ తేదీ తెల్లవారుజామున 5 గంటల సమయంలో మైసూరులో బీఎన్ రోడ్డులో నడిచి వెళ్తున్న వ్యక్తిని ఆటోలో వచ్చిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కొట్టి అతని వద్దనున్న సుమారు రూ. 25 వేల నగదును దోచుకెళ్లారు. లష్కర్ పోలీసులు విచారించి నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 22 వేల నగదును, ఒక ఆటో, మొబైల్ ఫోన్లను స్వా«దీనం చేసుకొన్నారు. మరో కేసులో డిసెంబర్ 14వ తేదీన రాత్రి 7.30 సమయంలో బీఎన్ సెంట్రల్ మాల్ దగ్గర నడిచి వెళ్తున్న వ్యక్తిని ఆటోలో వచ్చిన నలుగురు అడ్డుకుని కొట్టి రూ. 6700 నగదు, మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. లష్కర్ పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. చదవండి: వివాహిత ఆత్మహత్య.. కారణం అదేనా? -
బాయ్‌ఫ్రెండ్ అని పొరపాటు.. నగ్న చిత్రాలు తొలగించాలంటే డబ్బులివ్వాలని..
సాక్షి, హైదరాబాద్: నగ్న చిత్రాలు తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న ఓ యువకుడ్ని షీటీమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. గురువారం ఇన్స్పెక్టర్ కసపరాజు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శివరామ్పల్లికి చెందిన మహమ్మద్ మోసిన్(22) పెయింటర్. దిల్సుఖ్నగర్ హాస్టల్లో ఉంటూ ఎమ్మెస్సీ చదువుతున్న ఓ యువతికి తన సెల్‌ఫోన్ నుంచి కాల్ చేసి తన పేరు రాజు అని పరిచయం చేసుకున్నాడు. అయితే కొంత కాలం క్రితం తనతో విడిపోయిన తన బాయ్‌ఫ్రెండ్ రాజు అని నమ్మిన ఆమె అతనితో సంభాషించడం మొదలు పెట్టింది. అతని అభ్యర్థన మేరకు తన నగ్న చిత్రాలను పంచుకుంది. అయితే ఇద్దరు వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు అతడు బాయ్ ఫ్రెండ్ రాజు కాదని తెలిసి షాక్‌కు గురైంది. తన చిత్రాలు తొలగించాలని అతడిని కోరింది. ఫొటోలు తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని, లేకపోతే వాటిని వైరల్ చేస్తానని బెరింపులకు దిగాడు. దీంతో యువతి షీటీమ్‌ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన షీటీమ్ పోలీసులు అతడిని పట్టుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. చదవండి: సింగర్ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు -
టీచర్ కాదు కామాంధుడు.. విద్యార్థులకు అశ్లీల చిత్రాలు చూపించి...
పాలకొండ/పాలకొండ రూరల్(శ్రీకాకుళం జిల్లా): అమ్మఒడి లాంటి బడిలో మరో అకృత్యం వెలుగుచూసింది. తండ్రి స్థానంలో ఉండి పిల్లలను చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు గురు స్థానానికి మచ్చ తీసుకువచ్చాడు. చిన్నారులకు అశ్లీల వీడియోలు చూపించి తన వికృత కోణాన్ని పిల్లలకు పరిచయం చేశాడు. మృగాడి విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియడంతో గురువుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పాలకొండ ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. పాలకొండ మండలంలోని నవగాం గ్రామంలోని మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గొర్ల భానూజీరావు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. చదవండి: ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో.. ఈయన కొంతకాలంగా తన సెల్ఫోన్లో నీలి చిత్రాలను చిన్నారులకు చూపిస్తున్నారు. అశ్లీల చిత్రాల్లో ఉన్న మహిళలను చూపించి వారికి విద్యార్థినుల పేర్లు పెట్టడం చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా విద్యార్థినుల ఇంటిలో ఉన్న మహిళలను కూడా వారితో పోల్చి చెబుతున్నారు. దీంతో పిల్లలు వారి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీనిపై ఆగ్రహించిన తల్లితండ్రులు బుధవారం సాయంత్రం ఆ ఉపాధాయుడిని నిలదీసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ నీరజ ఉపాధ్యాయుడిని మందలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామంలోకి వెళ్లి టీచర్‌ను స్టేషన్‌కు తరలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. -
సాఫ్ట్వేర్ మొగుడు కాదు.. శాడిస్ట్ మొగుడు..
-
సాఫ్ట్వేర్ భర్త శాడిజం
సాక్షి, కర్నూలు : తన లోపాన్ని ఎవరికైనా చెబితే నగ్న చిత్రాలు బయటపెడతానని కట్టుకున్న భార్యను బెదిరించాడు ఓ సాఫ్ట్వేర్ భర్త. తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి భార్యకు టీబీ రోగం ఉందని ప్రచారం చేశాడు. భర్త వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన యువతికి, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మాచాని రాజేంద్రప్రసాద్‌తో గత ఏడాది ఆగస్టు 2న వివాహం అయింది. కట్నంగా 45లక్షల రూపాయలు, వివాహనంతరం మరో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. కాగా పెళ్లైన మొదటిరోజే రాజేంద్రప్రసాద్ తేడాగా వ్యవహరించాడు. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. తాను నపుంసకుడినని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని అతడి అమ్మమ్మకు తెలుపగా ఆమె కూడా తన మనవడు నపుంసకుడేనని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించింది. దీంతో ఆ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక కుంగిపోయానంటూ బాధితురాలు మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. టీబీ రోగం ఉందని ప్రచారం అత్తింటి వారి ఆగడాలు భరించలేక బయటకు వచ్చినట్లు బాధితురాలు పేర్కొన్నారు. దీంతో తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాధితురాలికి టీబీ రోగం ఉందని రాజేంద్రప్రసాద్ ప్రచారం చేశాడు. ‘ఆసుపత్రికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నాను. నాకు ఏ రోగం లేదని డాక్టర్లే నిర్ధారించారు. నా భర్తకు పరీక్షలు చేయించమని అత్తింటివారిని అడగ్గా.. అతడు ఎక్కడికి రాడు. ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరించారు. అమ్మనాన్నలకు చెప్పి పెద్దల సమక్షంలో నిలదీస్తే ఏమి స్పందించకుండా వెళ్లిపోయారు’అని ఆమె అవేదన వ్యక్తం చేశారు. మరో పెళ్లికి రెడీ ఇదిలా ఉండగా మాచాని రాజేంద్రప్రసాద్ మరో పెళ్లికి రెడీ అయ్యారు. సమాచారం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయం మరో అమ్మాయికి జరగకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లను వద్దలొద్దు అంటూ మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. అతడికి శిక్ష పడిన తర్వాతే తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తానని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అని పెళ్లి చేశాం : బాధితురాలి తండ్రి మంచి సంబంధం, సాఫ్ట్వేర్ ఉద్యోగమని తమ కూతురుకి డిగ్రీ సెకండియర్లోనే వివాహం చేశామని బాధితురాలి తండ్రి తెలిపారు. 45 లక్షలు కట్నంగా, మరో 10లక్షలు అదనంగా ఇచ్చామన్నారు. కానీ అబ్బాయి ఇలాంటివాడు అనుకోలేదని మీడియా ముందు వాపోయారు. ఈ విషయంపై మాట్లాడేందుకు వారి ఇంటికెళ్లిన తన తమ్ముడిని తీవ్రంగా కొట్టారని పేర్కొన్నారు. దీంతో విధిలేక పోలీసులను ఆశ్రయించామన్నారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన రాజేంద్రప్రసాద్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్ : దొంగతనంగా ఓ యువతి నగ్న చిత్రాలను సేకరించిన డబ్బులివ్వాలని బ్లాక్మెయిల్ చేస్తూ ఓ యువకుడు ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. వివరాలివీ.. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ప్రైవేట్ ఫొటోలు ఆమె స్నేహితురాలి ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. వాటిని గుంటూరుకు చెందిన షేక్ ఆజాద్ దొంగచాటుగా తన సెల్‌లోకి పంపుకున్నాడు. అనంతరం ఆ ఫొటోలను నెట్లో అప్లోడ్ చేస్తానంటూ వాట్సాప్‌లో బెదిరింపులు ప్రారంభించాడు. ముందుగా కొన్ని ఫొటోలను కూడా ఆమెకు పంపాడు. ఈ నెల 6వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి రూ.4లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే అన్నంత పనీ చేస్తానని హెచ్చరికలు చేశాడు. దీంతో బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. అప్రమత్తమైన పోలీసులు సోమవారం సికింద్రాబాద్ వచ్చిన ఆజాద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, అతని వద్ద ఉన్న నగ్నచిత్రాల సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. మంగళవారం నిందితుడిని రిమాండ్‌కు పంపారు. వివాహితకు వేధింపులు, వ్యక్తికి 4 రోజుల జైలు శిక్ష వివాహిత వెంట పడి వేధిస్తున్న వ్యక్తికి న్యాయస్థానం నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జూబ్లీహిల్స్ ఎస్ఐ జగదీష్ సమాచారం మేరకు.. జూబ్లీహిల్స్ రోడ్ నం-5లోని దుర్గాభవానీ నగర్లో నివసించే ఇ.కృష్ణ(36) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇదే బస్తీలో నివసిస్తున్న వివాహితతో కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక సారి ఆమెను తీసుకొని వెళ్లిపోగా బస్తీవాసులు తమదైన రీతిలో గుణపాటం చెప్పారు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా మూడు రోజుల క్రితం ఆమె వెళ్లే సమయంలో వెంబడిస్తూ వేధింపులకు గురి చేయడంతో బాధితురాలి భర్త రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 70(సి) కింద పోలీసులు కేసు నమోదు చేసి పదవ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం నిందితుడికి నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 50 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అశ్లీల వెబ్సైట్ల కేసులో మరో ఇద్దరు అరెస్ట్ టాలీవుడ్ హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ రేటింగ్‌తో సొమ్ము చేసుకుంటున్న పలు అశ్లీల వెబ్సైట్ల నిర్వాహకులిద్దరిని సీఐడీ సైబర్‌క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్టు అదనపు డీజీపీ గోవింద్ ఒక ప్రకటనలో తెలిపారు. అహ్మదాబాద్ మహాసేన జిల్లాకు చెందిన తాకూర్ మహేష్‌కుమార్ జయంతి, తాకూర్ బాల్సిన్హ్ను అరెస్ట్ చేసి అక్కడి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. ట్రాన్సిస్ట్ వారెంట్‌పై ఇద్దరిని హైదరాబాద్ తీసుకువచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు, ఆర్టిస్టుల ఫోటోలతో మార్ఫింగ్ చేసి ఐదు అశ్లీల సైట్లలో అప్లోడ్ చేశారని, ఈ సైట్ల హిట్స్‌తో నెలకు రూ.35వేలు సంపాదిస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. వీరి నుంచి నాలుగు ల్యాప్‌ట్యాపులు, రెండు సెల్ఫోన్లు, మూడు సిమ్‌కార్డులు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు గోవింద్ వెల్లడించారు. -
ప్రేమించలేదని నగ్న చిత్రాలు పంపాడు
హైదరాబాద్ (సాక్షి, సిటీబ్యూరో): ప్రేమను తిరస్కరించింద న్న అక్కసుతో యువతి సెల్‌ఫోన్‌కు పదే పదే కాల్స్ చేయడంతో పాటు మెయిల్‌కు అసభ్యకర పదజాలంతో పాటు నగ్నచిత్రాలు పంపి వేధించిన కీచకుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ జయరాం కథనం ప్రకారం...వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన రాజ్‌కుమార్ బీటెక్ చదువు కోసం హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో చేరాడు. ఇదే కళాశాలలో బీటెక్ చదువుతున్న యువతితో స్నేహంగా మెదిలాడు. బీటెక్ ఫైనల్ ఈయర్‌కు రాగానే రాజ్‌కుమార్ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పడంతో సున్నితంగా తిరస్కరించింది. అయితే కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన నిందితుడు హైదరాబాద్‌లోనే ఉండి ప్రిపేర్ అవుతున్నాడు. ఇదే సమయంలో తమ క్లాస్మేట్ల సహకారంతో బాధితురాలి సెల్‌ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ తెలుసుకున్న రాజ్‌కుమార్ ఆమెను వేధించాలని నిర్ణయించుకున్నాడు. తన నంబర్ల నుంచి చాలాసార్లు కాల్స్ చేయడంతో పాటు ప్రేమిస్తున్నాన ని ఎస్ఎంఎస్లు కూడా పంపాడు. అయితే బాధితురాలు తిరస్కరిం చింది. ఆ తర్వాత నకిలీ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి అసభ్యకర పదజాలంతో పాటు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన నగ్నచిత్రాలు పంపించి వేధించాడు. దీంతో బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదిహేనురోజుల పాటు మళ్లీ ఎటువంటి మెయిల్స్ పంపని రాజ్‌కుమార్... ఆ తర్వాత మళ్లీ వేధించడం షురూ చేశాడు. దీంతో ఆమె మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించగా రాజ్‌కుమార్ ను గచ్చిబౌలిలోని టెలికాంనగర్‌లో పట్టుకున్నారు. నిందితుడి నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
వీడు కొంచెం తేడా!
ఆ మధ్య హాలీవుడ్లో పెద్ద దుమారం... స్కాం... బ్లాక్‌మెయిలింగ్ ఎపిసోడ్ నడిచింది. అదే... స్టార్ హీరోయిన్ల ప్రైవేటు నగ్న చిత్రాలు పోస్ట్ చేయడం. ఆ తుంటరెవరో వెబ్సైట్ ఒకటి పెట్టి... చూస్కోండంటూ అందులో కౌంట్‌డౌన్ ఇచ్చి మరీ సదరు పిక్చర్స్ రిలీజ్ చేసి సంచలనం రేపాడు. అప్పుడు బాధిత గుమ్మలంతా కారకులపై తెగ ఫైరయ్యారు. ఇదంతా ఆకతాయిలు నడిపిన ఓ ‘డార్క్’ స్టోరీ! మళ్లీ అలాంటి పిక్చర్సే బయటకు వచ్చాయి. రియాల్టీ షోస్‌తో స్టార్డమ్ తెచ్చేసుకున్న కిమ్ కర్దాషియన్ నగ్న చిత్రాలు ఇప్పుడు సామాజిక సైట్లలో వైరస్‌లా పాకేస్తున్నాయి. ఒకటీ అరా కాదు... నాలుగైదు ఫొటోలు రకరకాల పోజుల్లో అప్లోడ్ అయిపోయాయి. విశేషమేమంటే... ఇవి చూసిన కిమ్ కూడా తెగ మురిసిపోతోంది. పోస్ట్ చేసినందుకు ప్రేమగా థ్యాంక్యూ చెప్పింది. ఇంతకీ ఆ అప్లోడ్ హీరో ఎవరనేగా..! ఇంకెవరు... స్వయానా కిమ్ హజ్బెండ్ కానె వెస్ట్!!! -
నగ్నంగా ఫోటోలు తీశారని ...
బరంపురం: ప్రభుత్వ హాస్టల్లో రక్షణ ఉంటుంది... బుద్దిగా చదువుకోవచ్చని భావించిన ఆ బాలికల ఆశలు పేక మేడల్లా కుప్పకూలాయి. తమను నగ్నంగా ఫోటోలు తీశారని వార్త తెలుసుకున్న వారు సిగ్గుతో బిక్కచచ్చిపోయారు. తీవ్ర కలత చెందారు. ఇక్కడ రక్షణ లేదని భావించిన దాదాపు 60 మంది విద్యార్థినులు హాస్టల్ వదిలి గురువారం ఇంటిముఖం పట్టారు. ఈ ఘటన ఒడిశా గంజాం జిల్లా గుడియాలి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక కస్తూరి బా బాలిక విద్యాలయం హాస్టల్లోని ఆరు, ఏడు తరగతి విద్యార్థినులను గతేడాది విహారయాత్రకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో స్కూల్ గుమాస్తా సదరు విద్యార్థినులు స్నానం చేస్తున్న సమయంలో ... వారి ఫోటోలను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ విషయం స్కూల్ ప్రధాన ప్రిన్సిపల్‌కు తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్ నివేదించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. స్కూల్ గుమాస్తాకు హాస్టల్ వంటమనిషి సహకరించినట్లు విచారణలో తెలింది. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గుమస్తా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్లో మొత్తం 87 మంది విద్యార్థినుల్లో 60 మంది ఇంటికి పయనం కావడంతో ప్రస్తుతం 27 మంది విద్యార్థులు హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ లో బాలికల రక్షణ కోసం మహిళా కానిస్టేబుల్ ను ప్రభుత్వ ఉన్నతాధికారులు నియమించారు. -
ప్రియురాలు నగ్న చిత్రాలు ఫేస్ బుక్‌లో పెట్టిన ప్రేమికుడు
యువతిని మత్తులో ఉంచి అత్యాచారం చేసి ఆపై ఆమె నగ్నంగా ఉన్న పోటోలను ఫేస్ బుక్‌లో పెట్టిన ప్రబుద్ధుడి కోసం మణిపూర్ పోలీసులు వేట సాగిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కథనం ప్రకారం.... మణిపూర్‌కు చెందిన అలాం రజాక్ మకాక్మయిమ్ అనే యువకుడు తురాలో విద్యాభ్యాసం చేస్తున్న స్థానిక యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలో 2012 సెప్టెంబర్‌లో యువతిని మేఘాలయాలోని తురాలోని లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ యువతికి మత్తు పానీయం ఇచ్చి ఆపై అత్యాచారం చేశారు. అనంతరం విషయం తెలుసుకున్న యువతి నిలదియడంతో చేసిన తప్పును అలాం రజాక్ ఒప్పుకున్నాడు. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఆ యువతికి మాటా కూడా ఇచ్చాడు. దాంతో అతడి మాటలను యువతి నమ్మింది. అనంతరం అలాం రజాక్ ఉన్నత విద్య కోసం పునే పయనమైయ్యాడు. సెలవుల నిమిత్తం తురా నుంచి ఇటీవలే మణిపూర్‌లోని తన ఇంటికి వచ్చిన ఆ యువతికి ఫేస్ బుక్‌లోని తన నగ్న చిత్రాలను చూసి నిర్ఘాంతపోయింది. దాంతో జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అలాం రజాక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు తీవ్ర తరం చేశారు.