సాక్షి, హైదరాబాద్: నగ్న చిత్రాలు తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న ఓ యువకుడ్ని షీటీమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. గురువారం ఇన్‌స్పెక్టర్ కసపరాజు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శివరామ్‌పల్లికి చెందిన మహమ్మద్ మోసిన్(22) పెయింటర్. దిల్‌సుఖ్‌నగర్ హాస్టల్లో ఉంటూ ఎమ్మెస్సీ చదువుతున్న ఓ యువతికి తన సెల్‌ఫోన్ నుంచి కాల్ చేసి తన పేరు రాజు అని పరిచయం చేసుకున్నాడు.
అయితే కొంత కాలం క్రితం తనతో విడిపోయిన తన బాయ్‌ఫ్రెండ్ రాజు అని నమ్మిన ఆమె అతనితో సంభాషించడం మొదలు పెట్టింది. అతని అభ్యర్థన మేరకు తన నగ్న చిత్రాలను పంచుకుంది. అయితే ఇద్దరు వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు అతడు బాయ్ ఫ్రెండ్ రాజు కాదని తెలిసి షాక్‌కు గురైంది. తన చిత్రాలు తొలగించాలని అతడిని కోరింది. ఫొటోలు తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని, లేకపోతే వాటిని వైరల్ చేస్తానని బెరింపులకు దిగాడు. దీంతో యువతి షీటీమ్‌ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన షీటీమ్ పోలీసులు అతడిని పట్టుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు.
చదవండి: సింగర్ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు
Comments
Please login to add a commentAdd a comment