Srikakulam Crime News: Villagers Attack On Teacher Showing Abused Pictures To Girls In Srikakulam - Sakshi
Sakshi News home page

టీచర్‌ కాదు కామాంధుడు.. విద్యార్థులకు అశ్లీల చిత్రాలు చూపించి...

Feb 24 2022 9:36 AM | Updated on Feb 24 2022 1:47 PM

Villagers Attack On Teacher Showing Abused Pictures To Girls In Srikakulam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అమ్మఒడి లాంటి బడిలో మరో అకృత్యం వెలుగుచూసింది. తండ్రి స్థానంలో ఉండి పిల్లలను చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు గురు స్థానానికి మచ్చ తీసుకువచ్చాడు.

పాలకొండ/పాలకొండ రూరల్‌(శ్రీకాకుళం జిల్లా): అమ్మఒడి లాంటి బడిలో మరో అకృత్యం వెలుగుచూసింది. తండ్రి స్థానంలో ఉండి పిల్లలను చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు గురు స్థానానికి మచ్చ తీసుకువచ్చాడు. చిన్నారులకు అశ్లీల వీడియోలు చూపించి తన వికృత కోణాన్ని పిల్లలకు పరిచయం చేశాడు. మృగాడి విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియడంతో గురువుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పాలకొండ ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. పాలకొండ మండలంలోని నవగాం గ్రామంలోని మండల పరిషత్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గొర్ల భానూజీరావు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.

చదవండి: ప్రేమ వివాహం:  ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..

ఈయన కొంతకాలంగా తన సెల్‌ఫోన్‌లో నీలి చిత్రాలను చిన్నారులకు చూపిస్తున్నారు. అశ్లీల చిత్రాల్లో ఉన్న మహిళలను చూపించి వారికి విద్యార్థినుల పేర్లు పెట్టడం చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా విద్యార్థినుల ఇంటిలో ఉన్న మహిళలను కూడా వారితో పోల్చి చెబుతున్నారు. దీంతో పిల్లలు వారి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీనిపై ఆగ్రహించిన తల్లితండ్రులు బుధవారం సాయంత్రం ఆ ఉపాధాయుడిని నిలదీసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ నీరజ ఉపాధ్యాయుడిని మందలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామంలోకి వెళ్లి టీచర్‌ను స్టేషన్‌కు తరలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement