ప్రియురాలు నగ్న చిత్రాలు ఫేస్ బుక్లో పెట్టిన ప్రేమికుడు | Youth rapes girl, uploads nude pictures in social media | Sakshi
Sakshi News home page

ప్రియురాలు నగ్న చిత్రాలు ఫేస్ బుక్లో పెట్టిన ప్రేమికుడు

Published Fri, Jan 3 2014 2:17 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

ప్రియురాలు నగ్న చిత్రాలు ఫేస్ బుక్లో పెట్టిన ప్రేమికుడు - Sakshi

ప్రియురాలు నగ్న చిత్రాలు ఫేస్ బుక్లో పెట్టిన ప్రేమికుడు

యువతిని మత్తులో ఉంచి అత్యాచారం చేసి ఆపై ఆమె నగ్నంగా ఉన్న పోటోలను ఫేస్ బుక్లో పెట్టిన ప్రబుద్ధుడి కోసం మణిపూర్ పోలీసులు వేట సాగిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కథనం ప్రకారం.... మణిపూర్కు చెందిన అలాం రజాక్ మకాక్మయిమ్ అనే యువకుడు తురాలో విద్యాభ్యాసం చేస్తున్న స్థానిక యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలో 2012 సెప్టెంబర్లో యువతిని మేఘాలయాలోని తురాలోని లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ యువతికి మత్తు పానీయం ఇచ్చి ఆపై అత్యాచారం చేశారు.

 

అనంతరం విషయం తెలుసుకున్న యువతి నిలదియడంతో చేసిన తప్పును అలాం రజాక్ ఒప్పుకున్నాడు. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని  ఆ యువతికి మాటా కూడా ఇచ్చాడు. దాంతో అతడి మాటలను యువతి నమ్మింది. అనంతరం అలాం రజాక్ ఉన్నత విద్య కోసం పునే పయనమైయ్యాడు. సెలవుల నిమిత్తం తురా నుంచి ఇటీవలే మణిపూర్లోని తన ఇంటికి వచ్చిన ఆ యువతికి ఫేస్ బుక్లోని తన నగ్న చిత్రాలను చూసి నిర్ఘాంతపోయింది.

 

దాంతో జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అలాం రజాక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు తీవ్ర తరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement