
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభ్యంతర కర తరహాలో బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కింది. దీంతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లలో విభిన్న స్పందనలు కనిపించాయి.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో బుధవారం ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ మహిళ టూపీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోవడం గమనార్హం. దీపికా నారాయణ భరద్వాజ్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకి దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. (ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?)
బికినీలో ఆమెను చూసి షాక్ అయ్యామని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె తీరును అభ్యతరకరంగా ఉందననారు. మరికొందరు మాత్రం ఆమె బట్టలు ఆమె ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛను గట్టిగా సమర్థించారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్లోనూ ఓ మహిళ బ్రా, మినీ స్కర్ట్ తో ప్రయాణించి కలకలం రేపింది.అలాగే హోలీ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు చేసిన రీల్స్ కూడా వివాదాన్నా రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. తాజా ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. (కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు)
What's really happening 😵💫😵💫pic.twitter.com/rfjavOsWMp
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 17, 2024
Comments
Please login to add a commentAdd a comment