అతుల్ సుభాష్ అనే టెక్కీ బలవన్మరణం దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించింది. చట్టాలన్ని ఆడవాళ్లకేనా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. భార్య కుటుంబం పెడుతున్న తప్పుడు కేసులతో ఎంతోమంది అతుల్ సుభాష్ లాంటి భర్తలు వేధింపులకు గురవ్వుతున్నారనే వాదన వినిపిస్తోంది.
మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వైవాహిక చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని బాధిత భర్తలు ఆరోపిస్తున్నారు. చెప్పాలంటే ఆ టెక్కీ మరణం చర్చనీయాంసంగా మారడమే గాక బీటలు వారిపోతున్న వైవాహిక వ్యవస్థ, చట్టంలోని లోసుగులను లేవనెత్తింది. ప్రస్తుతంఈ విషయమే హాట్‌టాపిక్ మారింది. ఈ తరుణంలో ఢిల్లీ రెస్టారెంట్ చెందిన జంబోకింగ్ ఫ్రాంచైజీ ఆ టెక్కీ అతుల్‌కి వినూత్నంగా నివాళి ఆర్పించడం నెట్టింట వైరల్‌గా మారింది.
హౌజ్ ఖాస్ అనే గ్రామంలోని జంబోకింగ్ ఫ్రాంచైజీ అవుట్‌లెట్‌కి ఓ వ్యక్తి వెళ్లాడు. అతను అక్కడ తినేసి తిరిగి వెళ్లేటప్పడూ అందుకున్న రసీదు అతడిని ఆకర్షించింది. అందులో "జస్టీస్ ఫర్ అతుల్ సుభాష్ అనే హ్యాష్ ట్యాగ్‌తో అతడి ఆత్మహత్యకు తాము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అతని జీవితం అందిరిలానే అత్యంత ముఖ్యమైనది. మీకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం." అని రాసి ఉంది. అతడు వెంటనే ఆ రసీదుని ఫోటో తీసి తన స్నేహితుడికి పంపండంతో రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది.
ఆ జంబోకింగ్ ఫ్రాంచైజీని స్వామి సమర్థ్ ఫుడ్స్ నడుపుతోంది. అందర్ని కదలించిన ఆ టెక్కీ ఆవేదనను సహృద్భావంతో అర్థం చేసుకుని ఇలా వినూత్నంగా నివాళులర్నించడమే గాక అతడికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ.. అందరికీ అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది. పైగా అందుకోసం ఇలా రసీదుని ఉపయోగించుకోవడమనేది ప్రశంసనీయం.
అంతేగాదు సదరు వ్యక్తి ఈ విషయమై జంబోకింగ్ ఫ్రాంచైజీ యజమానిని ప్రశ్నించగా.. దానికి ఆ వ్యాపారి ప్రతీది వ్యాపారం కాదని తన దైన శైలి బదులిచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు. నెటిజన్లు కూడా.. ఆ వ్యాపారి విశాల హృదయాన్ని ప్రశంసించగా, ఇలా జొమాటా, స్విగ్గీలు కూడా చెయ్యొచు గదా అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment