రెస్టారెంట్‌కి వెళ్తే బిల్ కచ్చితంగా వేలల్లోనే ఉంటుంది. ఎంతకాదనుకున్న ఒక మనిషికే ఏదో ఒక్క వైరైటీ లాగించిన.... సాధారణంగా తక్కువలో తక్కువ కనీసం రూ. 1000 నుంచి రూ. 1200ల వరకు అవుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే చాలా ఏళ్ల కిందట అంటే 1985ల్లోని రెస్టారెంట్ బిల్ ఒకటి నెట్టింట వైరల్ తెగ అవుతోంది. అందులో రెసిపీల ఖరీదు వింటే ఆ! అని నోరెళ్ల బెట్టకుండా ఉండరు.
వివరాల్లోకెళ్తే....ఢిల్లీలో లజపతి నగర్ ప్రాంతంలో ఉన్న లాజీజ్ రెస్టారెంట్ అండ్ హోటల్ డిసెంబర్ 20, 1985 నాటి రెస్టారెంట్ బిల్‌ని ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. అందులో కస్టమర్ షాహీ పన్నీర్ , దాల్ మఖ్నీ, రైతా, కొన్ని చపాతీలు ఆర్డర్ చేశాడు. అతను ఆర్డర్‌చేసిన వాటిల్లో మొదటి రెండు రెసీపీలు రూ. 8, మిగతా రెండు రెసీపీలు ఒక్కొక్కటి రూ. 5, నుంచి రూ. 6 రూపాయాలు మాత్రమే.
మొత్తం బిల్ కేవలం అక్షరాల రూ. 26\-రూపాయలే. ప్రస్తుతం ఈ ఖరీదుకి ఒక చిప్స్ పాకెట్ మాత్రమే కొనుక్కోగలం. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా అందరూ వాట్ ఇది నిజమేనా! అని షాక్ అయ్యారు. నెటజన్లంతా ఔను నాటి కాలంలో పెట్రోల్ ధర, జీతం కూడా తక్కువగానే ఉన్నా అందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు అంటూ నాటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు.
(చదవండి: ఘోస్ట్ పేషెంట్‌తో మాట్లాడుతున్న సెక్యూరిటీ గార్డు)
Comments
Please login to add a commentAdd a comment