రెస్టారెంట్‌కు స్నేహితులతో కలిసి వెళ్లి.. టేస్టీ పుడ్‌ని లాగించేసి కాసేపు సరదాగా గడిపేసి రావడం అంటే అందరికీ ఇష్టమే. అయితే సాధారణంగా రెస్టారెంట్ అంటే బిల్ కాస్త ఖరీదుగానే ఉంటుంది కాబట్టి మనం దానికి కూడా సన్నద్ధంగానే ఉంటాం. మహా అయితే భోజనం ధరలు కాస్త ఎక్కువగా ఉండడం, సర్వీస్ ఛార్జీ వంటివి ఊహిస్తాం. అయితే బ్రిటన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు వెయిటర్ ఇచ్చిన బిల్ చూడగానే ఊహించని షాక్ తగిలింది. బిల్‌లో ఇలాంటివి కూడా వేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఆ ఫోటోని నెట్టింట షేర్ చేసింది.
వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని ఓ మహిళ తన స్నేహితులంతా కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లింది. ఇంకేముందు చిట్ చాట్ మొదలుపెట్టిన కాసేపటి ఆర్డర్ పెట్టిన పుడ్ వచ్చేసింది. కబుర్లు చెప్పుకొంటూ వాటిని ఆరగించారు. చివర్లో వెయిటర్ తీసుకువచ్చిన బిల్ చూసి షాక్ అవ్వడం వారి వంతైంది. ఎందుకంటే ఆ రెస్టారెంట్‌లో లైవ్ మ్యూజిక్ కార్యక్రమం నడుస్తోంది. యాజమాన్యం ఆ పాటలు విన్నందుకు 8 పౌండ్లు బిల్‌లో చేర్చింది. ఏం చేయాలో తోచక వారు బిల్లు చెల్లించి బయటకు వచ్చేశారు.
తరువాత తమకు ఇలాంటి అనుభవం ఎదురైందంటూ రెస్టారెంట్ నిర్వాహకులు ఇచ్చిన రసీదును సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇలాంటివి యూకేలో మునుపెన్నడూ లేవంటూ ఈ ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ బిల్లులో మరికొన్ని ఫీజులు ఉండటంతో రెస్టారెంట్ యాజమాన్యం పుడ్ లవర్స్ ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: 2,600లకు పైగా విమానాలు రద్దు.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ విజ్ఞప్తులు
Comments
Please login to add a commentAdd a comment