
నేను పిలిచి జాబిస్తానంటే ఇలా చేస్తారా? అంటూ ఓ ఉద్యోగిపై అప్పుడే ఇంటర్వ్యూ చేసిన రిక్రూటర్ (recruiter) అసహనానికి గురయ్యాడు.ఆ తర్వాత ఏం చేశాడంటే?
లండన్‌కు చెందిన ఓ రిక్రూటర్ లింక్డిన్ (LinkedIn)లో ఓ పోస్ట్ పెట్టారు. ఆపోస్ట్‌లో తన పగిలిపోయిన కీబోర్డును షేర్ చేస్తూ..చివరి క్షణంలో అభ్యర్థి జాబ్ ఆఫర్‌ను తిరస్కరించాడు. దీంతో కోపం కట్టలు తెచ్చుకుంది. వెంటనే ఈ కీబోర్డును పగులగొట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ సోషల్ మీడియా పోస్టు నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
లింక్డిన్ పోస్ట్ ప్రకారం..రిక్రూట్‌మెంట్ కన్సల్టెంట్ ఏతాన్ మూనీ (Ethan Mooney) ఇటీవల ఓ అభ్యర్థికి రెండో రౌండ్ ఇంటర్వ్యూ చేసేందుకు సిద్ధమైంది. కన్ఫామ్ అయితే జాబ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రిక్రూటర్.. అభ్యర్థికి రెండో రౌండ్ ఇంటర్వ్యూ చేసేందుకు ఉదయం 9:30 గంటలకు షెడ్యూల్ సిద్ధం చేశారు.
సమయం 9:30 దాటింది. కానీ అభ్యర్థి ఇంకా ఇంటర్వ్యూకి అటెండ్ కాలేదు. అరంగంటైంది. రిక్రూటర్‌లో అసహనం ఎక్కువైంది. సరిగ్గా ఆ సమయంలో సదరు రిక్రూటర్‌కు ఓ మెసేజ్ వచ్చింది. సారీ సార్.. ‘నేను మీకు కంపెనీ ఇంటర్వ్యూకి రావడం లేదు. నాకు వేరే సంస్థలో ఉద్యోగం వచ్చింది. మీ జాబ్ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నాను థ్యాంక్యూ’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దీంతో రిక్రూటర్‌కు చిర్రెత్తి పక్కనే ఉన్న కంప్యూటర్ కీబోర్డును పగుల గొట్టాడు.
నిజం చెప్పాలంటే, ఆ సమయంలో నాకు ఈ కీబోర్డు కనిపించలేదు. రిక్రూటర్లు.. ఉద్యోగార్థుల గురించి పట్టించుకోరు అని ఎవరైనా అంటారు? అని కామెంట్ చేస్తూ పగిలిన కీబోర్డు ఫొటోల్ని షేర్ చేశారు. ఈ ఘటన నెట్టింట్లో చర్చకు దారి తీసింది. కొందరు ఇంటర్వ్యూ జరిగే సమయంలో అభ్యర్థి రాకపోతే హైరింగ్ ప్రాసెస్‌లో తలెత్తే ఇబ్బందుల్ని ప్రశ్నిస్తుంటే మరికొందరు..రిక్రూట్‌మెంట్ కన్సల్టెంట్ ఏతాన్ మూనీకి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment