recruiter
-
ఇంటర్వ్యూలో అన్నీ కరెక్ట్‌గా చెప్పినా.. ఆ సిల్లి కారణంతో రిజెక్ట్ చేశారు
సాధారణంగా ఉద్యోగులను ఎంపిక చేసుకునేటప్పుడు హెచ్ఆర్లు తాము ఎంపిక చేయబోయే అభ్యర్థులకు కొన్ని అర్హతలు నిర్ణయించుకుంటారు. వాటిని అనుసరించే ఆ ప్రశ్నలు ఉంటాయి. ఈ క్రమంలో అభ్యర్థులు ఇంటర్యూ సమయంలో చెప్పిన సమాధానాలను మరికొన్ని వాటిని పోల్చి చూసుకుని వారిని ఎంపిక చేయాలా, వద్దా అనేది తేలస్తారు రిక్రూటర్లు. కానీ ఓ యువతి ఒక వింత కారణం చెప్పి రిజెక్ట్ చేశారు. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ఈ సిల్లీ రీజన్ చెప్పి ఉద్యోగానికి రిజెక్ట్ చేసిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాపర్టీ రిక్రూట్మెంట్ సంస్థ డైరెక్టర్ ఫాయె ఏంజెలెట్టా తన క్లయింట్ కంపెనీలో ఓ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు తీసుకుంది. అందులో ఒక యువతిని ఎంపిక చేసింది. ఎంపిక చేసిన ఆ యువతి బయోడేటాను సదరు క్లయింట్‌కు పంపించింది. అయితే.. వాళ్లు మాత్రం ఆ యువతి లావుగా ఉందనే కారణంతో రిజెక్ట్ చేశారు. ఆ యువతిని ఎందుకు రిజెక్ట్ చేశారో కారణం చూసి ఏంజెలెట్టా షాక్ అవుతూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో.. తను లావుగా ఉందని.. ఉద్యోగంలోకి తీసుకోకపోవడం అసలు కారణమే కాదు. ఇంతవరకు నేను ఇలాంటి కారణాలతో ఉద్యోగులను రిజెక్ట్ చేయడం చూడలేదు. ఇప్పుడు నేను ఆ యువతికి ఎలా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అంటూ రాసుంది. నిజానికి ఆ యువతి అంత లావుగా కూడా లేదు, కానీ వాళ్లు ఎందుకు రిజక్ట్ చేశారో తెలియదు కానీ కారణం మాత్రం ఇదే చెప్పారని ఏంజెలెట్టా తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు యువతిని రిజక్ట్ చేయడం పై మండిపడుతున్నారు. చదవండి: Interesting Facts About Toothbrush: మొట్టమొదటి టూత్ బ్రష్ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్!! పంది శరీరంపై...! -
జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...
మనం చాలా రకాల ఇంటర్వ్యూలు చూసి ఉంటాం. అంతేందుకు ఒక్కొసారి మనల్ని ఇబ్బందికి గురి చేసేలా ఇంటర్వ్యూయర్ వేసే ప్రశ్నలకు కూడా మనం ఓపికగా సమాధానం ఇస్తాం. అయితే ఒక్కొసారి మనం ఏమైన సందేహాల్ని వెలిబుచ్చితే మాత్రం ఇంటర్వ్యూయర్లు చాలా మటుకు సరిగా సమాధానమైతే మనకు ఇవ్వరు. పైగా చాలా గర్వంగా సమాధానాలిస్తారు. మరికొంత మంది అయితే చాలా తెలివిగా సమాధానాలు చెబుతూ మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. అచ్చం అలానే ఇక్కొడ ఇంటర్వ్యూయర్ ఒక ఆమెను ఇబ్బంది పెట్టడమే కాక సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటాడు. (చదవండి: భారత్, పాకిస్తాన్ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు) అసలు విషయంలోకెళ్లితే...ఒక వ్యక్తి స్కైప్‌లో ఒక మహిళను ఆన్లైన్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఇంటర్వ్యూ చాలా మంచిగా ఆసక్తికరంగా సాగి పోతుంటుంది. చివరిగా జీతం గురించి ప్రస్తావన కొచ్చినప్పుడు సదరు మహిళ సాధారణంగా మీరు ఒక గంట పనికి ఎంత జీతం చెల్లిస్తారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. అలా అడగటమే కాక అమెకరికన్ ఎటర్ప్రెన్యూర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ జిమ్ రోన్ కొటేషన్.." నేను ఎంత పొందుతున్నాను అనే బదులు ఈ పని చేయడం వల్ల నేనేం పొందగలుగుతున్నాను" అనే సందేశాన్ని కూడా జోడించి అడుగుతుంది. దీంతో సదరు ఇంటర్వ్యూయర్ స్వారీ అంటూ ఒక ఎరుపు రంగు జెండాను చూపిస్తాడు. దీంతో సదరు మహిళ క్షమించండి నేను చెల్లించాల్సిన బిల్లులు, ఇతర ఇంటర్వ్యూల గురించి కూడా ఆలోచించాల్సి ఉంది కాబట్టి నాకు ఎంత జీతం చెల్లిస్తారో చెప్పాల్సిందే అంటూ పట్టుబడుతుంది. అయితే ఇంటర్వ్యూయర్ నుంచి ఎటువంటి సమాధానం రాదు. ఆ తర్వాత ఆమె ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన సందేశాలను మొత్తం స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీంతో నెటిజన్లు సదరు ఇంటర్వ్యూ తీరుని చూసి షాక్ అవ్వుతూ ..మేము ఉద్యోగులకు తక్కువ జీతం ఇస్తాం అని పరోక్షంగా చెబుతున్నట్లే అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!) -
ఐఐఎం-ఎలో టాప్ రిక్రూటర్‌గా అమెజాన్
న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఐఎం అహమ్మదాబాద్‌లో టాప్ రిక్రూటర్‌గా నిలిచింది. ఫైనల్ ఇయర్ పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 18 ఉద్యోగాలు ఆఫర్ చేసిన అమెజాన్ ఈ ఏడాది టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థలో పీజీ ప్రోగ్రాం 2017 విద్యార్థులు 18మందిని టాప్ ఉద్యోగాలకు ఎంపిక చేసింది. మరోవైపు మెకిన్సే & కో 15 ఆఫర్లతో రెండవ స్థానంలో నిలిచింది. 100కు పైగా సంస్థలు ఐఐఎం-ఏ వద్ద ఆఖరి రౌండ్ నియామకాల్లో పాల్గొన్నాయి. యాక్సెంచర్ స్ట్రాటజీ, , బైన్ & కంపెనీ, మెకిన్సే & కంపెనీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లాంటి కన్సల్టింగ్ సంస్థలు ఇక్కడి విద్యార్థులను ఎంపిక చేశాయి. గోల్డ్‌మన్ సాచ్స్, 9, హెచ్‌యూఎల్ 7 ఆఫర్లు అందించగా, ప్రోక్టర్ & గాంబుల్, ఎస్సీ జాన్సన్ , శామ్సంగ్ 6 గురు ఐఐఎంలకు అవకాశాలను ఆఫర్ చేశాయి. -
భారత సంతతి ఐసిస్ రిక్రూటర్ హతం
మెల్బోర్న్: అమెరికా సైనిక దళం ఏప్రిల్ 29న ఇరాక్‌లో జరిపిన వైమానిక దాడుల్లో ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న భారత సంతతికి చెందిన ఐసిస్(ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద సంస్థ రిక్రూటర్ నీల్ ప్రకాశ్ అలియాస్ అబు ఖలీద్ అల్-కాంబోడి హతమయ్యాడని అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. భారత సంతతికి చెందిన ప్రకాశ్ మెల్బోర్న్లో జన్మించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన పలు దాడులతో ఇతనికి సంబంధాలున్నాయి. ఇరాక్‌లోని మోసుల్‌లో ఉన్నట్టు ఆస్త్రేలియా అధికారులు ఇచ్చిన ఇన్పుట్ల ఆధారంగా ఆమెరికా సైనిక దళం వైమానిక దాడులు జరిపి అతడిని మట్టుబెట్టినట్టు ఆటార్నీ జనరల్ జార్జ్ బ్రాండీస్ వెల్లడించారు. ఉగ్రవాద చర్యల్లో పాలుపంచుకుంటూ ఆస్ట్రేలియా తరఫున మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న మొదటి వ్యక్తి ప్రకాశ్ అని చెప్పారు. ప్రకాశ్‌ను హతమార్చడం వల్ల ఐఎస్‌లో చేరికలకు అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నట్టు చెప్పారు. -
కొలువు సాధనకు.. మూడు లక్షణాలు
జాబ్ స్కిల్స్ ఆధునిక ప్రపంచంలో పోటీ నానాటికీ పెరిగిపోతోంది. అభ్యర్థులు తమకు ఇష్టమైన కోర్సులో ప్రవేశించాలన్నా, నచ్చిన కొలువులో చేరాలన్నా ఇతరుల నుంచి పోటీని ఎదుర్కోవాల్సిందే. చదువు పూర్తయిన తర్వాత సంతృప్తికరమైన వేతనం లభించే ఉద్యోగంలో చేరాలనేది అందరి కల. అయితే, ఇంటర్వ్యూలో ఇతర అభ్యర్థుల కంటే మిన్నగా రిక్రూటర్‌ను మెప్పిస్తేనే ఉద్యోగం సొంతమవు తుంది. కాబట్టి ఇంటర్వ్యూలో విజయానికి కావాల్సిన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. రిక్రూటర్ ఆశించేదేమిటి? సంస్థ యాజమాన్యం ఎదుట అభ్యర్థి తన సామర్థ్యాలను, ప్రతిభను ప్రదర్శించేందుకు వీలుకల్పించే వేదిక.. ఇంటర్వ్యూ. మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థి నుంచి రిక్రూటర్ ఏం కోరుకుంటు న్నారో తెలుసుకోవాలి. ఏ ప్రాతిపదికన అభ్యర్థిని అంచనా వేస్తున్నారో గుర్తించాలి. ఎలాంటి లక్షణాలు అభ్యర్థుల్లో ఉండాలని ఆశిస్తున్నారో.. వాటిని పెంపొందించుకుంటే గెలుపు ఖాయం. సాధారణంగా మూడు లక్షణాలను రిక్రూటర్ కోరుకుంటారు. అవి ఇంటెలిజెన్స్, లీడర్షిప్, ఇంటిగ్రిటీ. తెలివితేటలు: అభ్యర్థిలో రిక్రూటర్ ప్రధానంగా ఆశించే లక్షణం.. మంచి తెలివితేటలు. దీంతోపాటు ఉద్యోగానికి అవసరమైన సమయస్ఫూర్తి, సమస్యలను పరిష్కరించే ప్రాక్టికల్ సామర్థ్యం ఉండాలని కోరుకుంటారు. ఈ లక్షణాలు మీలో ఉన్నట్లు ఇంటర్వ్యూలో రిక్రూటర్‌కు తెలియాలంటే.. కొలువుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించాలి. రిక్రూటర్ చెప్పే సమాధానాలను కుతూహలంతో వినాలి. వారు ఏవైనా సమస్యలను ప్రస్తావిస్తే మీరు వాటికి పరిష్కార మార్గాలను సూచించాలి. సదరు ఉద్యోగంపై మీలో ఆసక్తి ఉన్నట్లు రిక్రూటర్ గుర్తిస్తారు. నాయకత్వం లీడర్షిప్ అంటే కొత్త బాధ్యతలను స్వీకరిం చేందుకు సర్వసన్నద్ధంగా ఉండడం. ఉద్యోగం లో జవాబుదారీతనంతో వ్యవహరించడం. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడాన్ని, ఊహించని సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడాన్ని, సాకులు చూపకపోవడాన్ని కూడా నాయకత్వ లక్షణంగా భావిస్తారు. నిజాయతీ అభ్యర్థులు సంస్థకు విధేయులుగా ఉండడాన్ని, తమ బలాలతోపాటు బలహీనతలనూ ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించడాన్ని నిజాయతీగా చెప్పుకోవచ్చు. కార్యాలయంలో సహచరులను, బృంద సభ్యులను విమర్శించకపోవడం, పాత యాజమాన్యాన్ని తప్పుపట్టకపోవడం వంటి లక్షణాలు అభ్యర్థుల్లో ఉండాలి. అందుకే ఇంటర్వ్యూలో అభ్యర్థి మనస్తత్వాన్ని తెలుసుకునేందుకు ప్రశ్నలు వేస్తుంటారు. పాత యాజమాన్యం గురించి ప్రస్తావిస్తుంటారు. అభ్యర్థులు తగిన సమాధానం ఇవ్వాలి.