భారత సంతతి ఐసిస్ రిక్రూటర్ హతం
మెల్‌బోర్న్: అమెరికా సైనిక దళం ఏప్రిల్ 29న ఇరాక్‌లో జరిపిన వైమానిక దాడుల్లో ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న భారత సంతతికి చెందిన ఐసిస్(ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద సంస్థ రిక్రూటర్ నీల్ ప్రకాశ్ అలియాస్ అబు ఖలీద్ అల్-కాంబోడి హతమయ్యాడని అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. భారత సంతతికి చెందిన ప్రకాశ్ మెల్‌బోర్న్‌లో జన్మించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన పలు దాడులతో ఇతనికి సంబంధాలున్నాయి. ఇరాక్‌లోని మోసుల్‌లో ఉన్నట్టు ఆస్త్రేలియా అధికారులు ఇచ్చిన ఇన్‌పుట్ల ఆధారంగా ఆమెరికా సైనిక దళం వైమానిక దాడులు జరిపి అతడిని మట్టుబెట్టినట్టు ఆటార్నీ జనరల్ జార్జ్ బ్రాండీస్ వెల్లడించారు.
ఉగ్రవాద చర్యల్లో పాలుపంచుకుంటూ ఆస్ట్రేలియా తరఫున మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న మొదటి వ్యక్తి ప్రకాశ్ అని చెప్పారు. ప్రకాశ్‌ను హతమార్చడం వల్ల ఐఎస్‌లో చేరికలకు అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నట్టు చెప్పారు.