వయనాడ్‌ విలయం : ఆమె సీత కాదు.. సివంగి | Kerala's Wayanad: Meet Major Seeta Shelke, Who Lead Constructing Critical Bridge In Record Time | Sakshi
Sakshi News home page

వయనాడ్‌ విలయం : ఆమె సీత కాదు.. సివంగి

Published Fri, Aug 2 2024 12:32 PM | Last Updated on Fri, Aug 2 2024 1:23 PM

Kerala's Wayanad: Meet Major Seeta Shelke, Who Lead Constructing Critical Bridge In Record Time

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఎవ్వరూ బతికి ఉంటే అవకాశం లేదంటూ స్వయంగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అంతటి విపత్తు సృష్టించిన ఈ విలయం నుంచి బాధితులను రక్షించే సహాయక చర్యల్లో,  రికార్డు సమయంలో 190 అడుగుల పొడవైన  బ్రిడ్జ్ నిర్మించిన మేజర్ సీతా షెల్కే వార్తల్లో నిలిచారు.

ఇండియన్ ఆర్మీకి చెందినమద్రాస్ ఇంజనీర్స్ గ్రూప్‌కు చెందిన మేజర్ సీతా షెల్కే  సహాయక చర్యలలో చురుకుగ్గా పాల్గొన్నారు. మేజర్ సీతా షెల్కే, మేజర్ అనీశ్‌ నేతృత్వంలోని బృందం చేసిన కృషి విశేషంగా నిల్సుస్తోంది. కేరళలోని వాయనాడ్‌లో కేవలం16 గంటల్లో 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను నిర్మించి పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో వినియోగించిన సాంకేతిక నైపుణ్యం, షెల్కే చూపించిన అంకితభావం, ధైర్యసాహసాలు భారత సైన్యంలోని మహిళా అధికారుల పాత్రను గుర్తు చేసింది. ఇది మహిళా సాధికారతకు, కష్టకాలంలో సమైక్యతకు నిదర్శనమని రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ ప్రశంసించారు.  ఇంకా పలువురు సైనికాధికారులు, నెటిజన్లుఆమెకు హ్యాట్సాఫ్ అంటున్నారు. 

వంతెన నిర్మాణం జూలై 31న రాత్రి 9 గంటలకు ప్రారంభమై  ఆగస్టు 1సాయంత్రం 5:30 గంటలకు పూర్తయింది. మేజర్ షెల్కే నాయకత్వంలో ఇంజనీర్ల బృందం అనేక సవాళ్ల మధ్య వంతెనను సకాలంలో పూర్తి చేయడానికి అవిశ్రాంతంగా పనిచేసింది. తద్వారా ప్రభావిత ప్రాంతాలకు రవాణాను సులభతరం, వేగవంతం చేసింది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement