క్యాబ్‌ డ్రైవర్‌పై మహిళ వీరంగం.. నడి రోడ్డుపై చొక్కా పట్టుకొని | Delhi Woman Slaps Cab Driver Hurls Abuses In Middle Of The Road | Sakshi
Sakshi News home page

Delhi: క్యాబ్‌ డ్రైవర్‌పై మహిళ వీరంగం.. నడి రోడ్డుపై చొక్కా పట్టుకొని

Published Wed, Nov 17 2021 9:01 PM | Last Updated on Wed, Nov 17 2021 9:28 PM

Delhi Woman Slaps Cab Driver Hurls Abuses In Middle Of The Road - Sakshi

న్యూఢిల్లీ: ఓ మహిళ నడిరోడ్డు మీద వీరంగం సృష్టించింది. రోడ్డు మధ్యలో స్కూటీ పార్క్‌ చేసి క్యాబ్‌ డ్రైవర్‌ చెంప చెళ్లుమనిపించింది. బూతులు తిడుతూ.. అతడి కాలర్ పట్టుకుని చెడామడా కొట్టింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసేకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వెస్ట్ పటేల్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కస్తూరి లాల్‌ ఆనంద్‌ మార్గంలో ఓ మహిళ మరో మహిళతో కలిసి స్కూటీపై ప్రయాణిస్తుంది. ఈ మార్గం అత్యంత రద్దీగా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇంతలో మహిళ హారన్‌ కొట్టింది. అయతే దీనిని పట్టించుకొని ముందున్న క్యాబ్‌ డ్రైవర్‌ మహిళకు దారివ్వలేదు.
చదవండి: వైరల్‌: ఆకాశంలో క్రేజీ కపుల్స్‌.. అంతలో అనుకోకుండా ..

దీంతో హారన్‌ కొట్టినా కూడా దారి ఇవ్వకపోవడంతో మహిళ రెచ్చిపోయింది. స్కూటీని రోడ్డుమీదే పార్క్‌ చేసి క్యాబ్‌ డ్రైవర్‌పై విరుచుకుపడింది. అతన్ని నోటికొచ్చినట్లు బండ బూతులు తిడుతూ కొట్టింది. కాలర్‌ పట్టుకొని చెంప చెళ్లుమనిపించింది. అక్కడే ఉన్న కొందరు ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా గట్టిగట్టిగా అరిచింది. ఈ ఘటనను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇక ఈ వీడియో పోలీసుల వరకు చేరడంతో సదరు మహిళ కోసం వేట ప్రారంభించారు. మహిళపై క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు ఇస్తే ఆమెపై కేసు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉందని పోలీసులు తెలిపారు. మహిళ స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ఆమెను కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
చదవండి: వామ్మో! మొసలిని కౌగిలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement