cab
-
గూగుల్‌ను గుడ్డిగా నమ్మితే.. మీకూ ఇలాంటి మోసమే జరగొచ్చు!
ప్రస్తుతం ఏది కావాలన్నా గూగుల్లోనే వెతికేస్తున్నాం. అయితే అందులో వచ్చిన ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్తే మోసపోయే అవకాశం ఉంది. ఇలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలోని ఉడిపిలో క్యాబ్ బుక్ చేసుకునే ప్రయత్నంలో ఆన్లైన్ మోసానికి గురై రూ.4.1 లక్షలు పోగొట్టుకున్నాడు.మోసం జరిగిందిలా..గూగుల్ సెర్చ్‌లో కనిపించిన మోసపూరిత కార్ రెంటల్ వెబ్‌సైట్‌తో లింక్ అయిన నకిలీ చెల్లింపు పేజీలో తన కార్డ్ వివరాలను నమోదు చేసి బాధితుడు మోసపోయినట్లు తెలుస్తోంది. ఓ వార్తా నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తి కార్ రెంటల్ సర్వీస్‌ల కోసం గూగుల్‌లో శోధించాడు. “శక్తి కార్ రెంటల్స్” అని కనిపించిన లింక్‌పై క్లిక్ చేశాడు. కొద్దిసేపటికే కంపెనీ ప్రతినిధినంటూ ఒక వ్యక్తి అతన్ని సంప్రదించాడు. అతను వెబ్సైట్ ద్వారా టోకెన్‌గా రూ. 150 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించమని సూచించాడు.దీంతో బాధితుడు తన డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో ఫీజు చెల్లించడానికి ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా లావాదేవీ పూర్తి చేయడానికి అవసరమైన ఓటీపీ రాలేదు. కానీ, కొద్దిసేపటికే అతని ఖాతాల నుండి డబ్బులు కట్ అయినట్లు బ్యాంక్ నుంచి నోటిఫికేషన్లు వచ్చాయి. తన ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి రూ.3.3 లక్షలు, కెనరా బ్యాంక్ డెబిట్ కార్డు నుంచి రూ.80,056 మొత్తం రూ.4.1 లక్షలు కట్ అయ్యాయి.దేనికోసమైనా గూగుల్‌లో వెతికేటప్పుడు అందులో వచ్చే లింక్‌లను ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకుని ముందుకెళ్లాలి. ఆర్థిక విషయాలకు సంబంధించినవైతే మరింత జాగ్రత్త అవసరం. మరోవైపు గూగుల్ కూడా ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఒక కొత్త అల్గారిథమ్‌ను అభివృద్ధి చేసినట్లు కొన్ని నెలల క్రితం తెలిపింది. -
టెస్లా .. రోబోట్యాక్సీ..
లాస్ ఏంజెలిస్: వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోబోట్యాక్సీ ’సైబర్‌క్యాబ్’ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ఆవిష్కరించారు. అటానామస్ వాహనంగా ఉండే రోబోట్యాక్సీలో స్టీరింగ్ వీల్, పెడల్స్ ఉండవు. ఇద్దరు ప్రయాణికులు మాత్రమే పట్టేంత క్యాబిన్ ఉంటుంది. స్వయంచాలిత వాహనాలు మనుషులు నడిపే వాహనాల కన్నా 10–20 రెట్లు సురక్షితంగా ఉంటాయని, సిటీ బస్సులతో పోలిస్తే వీటిలో ప్రయాణ వ్యయాలు కూడా చాలా తక్కువేనని మస్క్ చెప్పారు. సైబర్‌క్యాబ్ ఉత్పత్తి 2026లో ప్రారంభమవుతుందని, ధర 30,000 డాలర్ల లోపే ఉంటుందని మస్క్ తెలిపారు. అలాగే 20 మంది పట్టే రోబోవ్యాన్ను కూడా మస్క్ ప్రవేశపెట్టారు. అటు వివిధ పనులు చేసి పెట్టే ఆప్టిమస్ రోబోను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు మస్క్ చెప్పారు. దీని ధర 20,000–30,000 డాలర్ల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. అటానామస్ వాహనాలు ప్రమాదాలకు దారి తీస్తున్న ఉదంతాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో టెస్లా స్వయంచాలిత వాహనాలకు అనుమతులపై సందేహాలు నెలకొన్నాయి. -
చౌకలో ఫుడ్, క్యాబ్.. ఇలా బుక్ చేసుకోండి
అందరిలోనూ రోజువారీ ఖర్చులపై ఆందోళన పెరిగిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో ఆహారం, ప్రయాణాల కోసం అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ప్లేస్టోర్‌లో లభ్యమయ్యే కొన్ని యాప్‌లను వినియోగించడం ద్వారా చౌకగా ఆహార, ప్రయాణ సేవలను అందుకోవచ్చు. తద్వారా ప్రతి నెలా కొంతవరకూ సొమ్ము ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఈ యాప్‌లు ఎలా పని చేస్తాయి? అవి మీకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఇటీవల యష్ తివారీ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో చౌకగా ప్రయాణాన్ని అందించే క్యాబ్‌ను ఎలా బుక్ చేసుకోవచ్చో వివరించారు. విశేషమేమిటంటే ఈ యాప్ పూర్తిగా ఉచితం. దీనిని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు క్యాబ్ కంపేర్(Cab Compare). ఈ ఒక్క యాప్‌లో ఓలా, ఉబెర్, ర్యాపిడోలలో మన ప్రయాణ ఛార్జీలను పరిశీలించి, మనకు చౌకగా అనిపించిన దానిని ఎన్నుకోవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే ఐదు లక్షలకుపైగా యూజర్లు వినియోగిస్తున్నారు. పైగా దీనికి మంచి ఫీడ్ బ్యాక్ కూడా ఉంది. అదే సమయంలో ఈ యాప్.. యూజర్ల గోప్యతకు సంబంధించి అనేక భద్రతా ఫీచర్లను కూడా జోడించింది.ఇక చౌకగా ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే క్రేవియో(Craveo) అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ కూడా ‘క్యాబ్ కంపేర్’ మాదిరిగానే పనిచేస్తుంది. ఇందులో మీ జొమాటో లేదా స్విగ్గీ ఖాతాను జోడించడం ద్వారా చౌకైన ఆహారం ఎక్కడ లభిస్తుందో వెంటనే తెలుసుకోవచ్చు. ఈ యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ఉపయోగించడం చాలా సులభం. ముందుగా క్రేవియో యాప్‌ని తెరిచాక ఖాతాను జోడించే ఎంపికను పొందుతారు. దీని సాయంతో జొమాటో, స్విగ్గీలలో ఎక్కడ చౌకగా ఆహారం దొరుకుతోందో తెలుసుకోవచ్చు. మరెందుకాలస్యం? ఈ యాప్‌లను ఒకసారి వినియోగించి చూడండి. -
హాయ్, నేను సీజేఐని... క్యాబ్‌కు రూ.500 పంపండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా వదలడం లేదు. సీజేఐ పేరిట ఒక వ్యక్తిని రూ.500 అడిగారు! సదరు స్కామర్ తనను తాను సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌గా చెప్పుకున్నాడు. ‘‘హలో! నేను సీజేఐని. కొలీజియం అత్యవసర భేటీకి వెళ్లాల్సి ఉంది. కన్నాట్ ప్లేస్‌లో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం రూ.500 పంపగలరా! కోర్టుకు చేరగానే తిరిగి పంపిస్తా’’ అంటూ మెసేజ్ చేశాడు. అది నిజమైందేనని నమ్మించడానికి ఐ పాడ్ నుంచి పంపుతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అయితే దాన్నిండా స్పెల్లింగ్, వ్యాకరణ దోషాలే ఉండటం విశేషం! ఈ నకిలీ మెసేజ్ వైరల్‌గా మారింది. దాన్ని కైలాశ్ మేఘ్వాల్ అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఫ్రెండ్స్, ఏం చేద్దాం మరి!’ అంటూ కామెంట్ చేశారు. ఈ వైరల్ పోస్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీజేఐ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్‌కు ఫిర్యాదు చేసింది. -
ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,470 కోట్లు చెల్లించనున్న ప్రముఖ కంపెనీ.. ఎందుకంటే..
ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ తన ట్యాక్సీ డ్రైవర్లకు ఏకంగా రూ.1,470 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఆస్ట్రేలియాలో చాలాకాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి పరిష్కారం లభించింది. ఉబర్ తమ దేశంలోకి ప్రవేశించడంతో ఉపాధి కోల్పోయామంటూ దాదాపు 8,000 మంది ట్యాక్సీ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. పరిహారం చెల్లించడానికి కంపెనీ నిరాకరిస్తూ వచ్చింది. తాజాగా ఈ కేసు విక్టోరియా సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. కానీ, అప్పటికే ఉబర్ డ్రైవర్లతో పరిహార ఒప్పందం కుదుర్చుకుంది. ఉబర్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవలందిస్తోంది. 2012లో ఆస్ట్రేలియాలోకి ప్రవేశించిన ఉబర్ వేగంగా సేవలను విస్తరించినట్లు న్యాయవాది మైఖేల్ తెలిపారు. దీనివల్ల అప్పటికే స్థానికంగా అద్దె ట్యాక్సీలను నడిపే చాలా మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వారికి పరిహారం చెల్లించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఉబర్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. డ్రైవర్ల డిమాండ్‌కు సామాన్య పౌరులు సైతం మద్దతు తెలిపినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ఉబర్ స్పందిస్తూ ప్రపంచంలో కంపెనీ ఉబర్ సేవలు ప్రారంభించినపుడు ఆయా దేశాల్లో నియంత్రణ నిబంధనలులేవు. ఆస్ట్రేలియాలో ఉబర్ కార్యకలాపాల వల్ల అక్కడి రవాణా వ్యవస్థలు మెరుగైన మార్పులు వచ్చాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దాంతో స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరికాయని చెప్పారు. ఆదేశ నిబంధనల ప్రకారం..2018 నుంచి వివిధ ప్రాంతాల్లోని వారితో పరిహార ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. ఇదీ చదవండి: మరో ‘కేజీఎఫ్’ ఆనవాలు.. ఎక్కడో తెలుసా..? -
నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో..
ట్యాక్సీ సర్వీసులను అందించే ఉబర్ సంస్థ 2023లో చేసిన పర్యటనలకు సంబంధించి ఆసక్తికర విషయాలను విడుదల చేసింది. ఈ ఏడాది దిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, పుణెల్లో ఎక్కువ మంది రైడ్ బుక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. రాత్రి సమయంలో వచ్చిన బుకింగ్‌ల విషయానికొస్తే.. ముంబయి మొదటిస్థానంలో నిలిచింది. వీకెండ్లో మాత్రం కోల్‌కతాలోని ప్రజలు ఎక్కువగా బుక్ చేసుకున్నారు. 2023 సంవత్సరానికిగాను ఉబర్ రైడ్స్ రికార్డు స్థాయిలో 6800 కోట్ల కిలోమీటర్లలో సేవలందించిందని తెలిపింది. ఇది దేశంలోని మొత్తం రోడ్ నెట్‌వర్క్‌లో వెయ్యి రెట్లు అని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఉబెర్ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు రైడ్స్‌లో ఎక్కువ భాగం సాయంత్రం 6-7 గంటల మధ్య షెడ్యూల్ చేస్తున్నవే. శనివారం ఉబెర్ ఫేవరెట్ డే. ఆ రోజే అధికంగా బుకింగ్స్ వస్తున్నాయి. రైడ్ బుక్ చేసిన ట్రిప్‌ల సంఖ్య పరంగా దసరా, క్రిస్మస్ అత్యంత ప్రజాదరణ పొందిన రోజులు. ఒక్క డిసెంబర్లోనే అత్యధిక సంఖ్యలో రైడ్లు బుక్ అయినట్లు సంస్థ తెలిపింది. విమానాశ్రయాలకు అధిక సంఖ్యలో ఉబర్ ట్రిప్‌లు ఉదయం 4-5 గంటల మధ్య బుక్ అయ్యాయి. -
‘ఉబర్ సీఈవో తిక్క కుదిరింది’
రైడ్ హెయిలింగ్ కంపెనీ ఉబర్ కస్టమర్లపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతంలో క్యాబ్ బుక్ చేసుకున్న కస్టమర్ల ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంటే వారి నుంచి ఎక్కువ ఛార్జీ విధిస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ అదనపు ఛార్జీల బాదుడు సెగ కస్టమర్లకే కాదు ఉబర్ సీఈవో ఖోస్రోషాహికి తగలింది. ఎలా అంటారా? మ్యాగజైన్ సంస్థ వైర్డ్ ఎడిటర్ స్టీవెన్ లెవీ ఉబర్ సీఈవోని ఇంటర్వ్యూ చేసేందుకు ఉబర్ క్యాబ్‌నే బుక్ చేసుకున్నారు. ఇంటర్వ్యూ కోసం న్యూయార్క్‌లోని డౌన్‌టౌన్ సిటీ నుంచి నాలుగున్న కిలోమీటర్ల దూరంలో వెస్ట్‌సైడ్ ఉబర్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడే 2.95 మైళ్ల ఉబెర్ రైడ్ ఛార్జీ ఎంత అయ్యింటుందో చెప్పాలని స్టీవెన్ లెవీ.. ఖోస్రాషాహిని అడిగారు. అందుకు ఉబర్ సీఈవో ఇరవై డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా డ్రైవర్ టిప్‌తో కలిపి ఉబర్ రైడ్‌కి 51.69 డాలర్లు ఛార్జీ పడిందని అన్నారు. వైర్డ్ ఎడిటర్ ఊహించని దానికంటే ఎక్కువ చెల్లించడంపై ఉబర్ సీఈవో సైతం షాక్ తిన్నారు. ‘ఓ మై గాడ్’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఐదు నిమిషాల ముందు 20 డాలర్ల కంటే ఎక్కువగా ఉందని జర్నలిస్ట్ సీఈవోకి చెప్పారు. అంతేకాదు ఉబర్ రైడ్‌లో ఈ ధరల వ్యత్యాసం గురించి ప్రశ్నించారు. బదులుగా ఖోస్రోషాహి ద్రవ్యోల్బణం, రైడ్ సమయం పెరిగిపోతున్న కొద్ది ఛార్జీల విధింపు, కార్మికుల చెల్లించే వేతనాలే కారణమని తెలిపారు. ఇలా భారీగా ఉన్న ఉబర్ క్యాబ్ ధరలపై జర్నలిస్ట్ ఖోస్రోషాహిని ప్రశ్నించడం, సంభాషణల మధ్యలో ఉబర్ విధిస్తున్న ఛార్జీల్ని సీఈవో సమర్ధించడం.. అందుకు జర్నలిస్ట్ వ్యతిరేకించడం వంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చాకు దారి తీశాయి. దీంతో పలువురు నెటిజన్లు ఉబర్ క్యాబ్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఉబర్ సీఈవో సమాధానం చెప్పలేకపోయారు. తిక్క కుదిరింది అంటూ సమర్ధిస్తున్నారు. కాగా, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..అమెరికాలో ఉబర్ ధరలు 2018 నుండి 2022 వరకు ద్రవ్యోల్బణం రేటు కంటే నాలుగు రెట్లు పెరిగాయని, దాదాపు నాలుగు సంవత్సరాలలో మొత్తం 83శాతం ధరలు పెరిగాయని వెల్లడించింది. -
కష్టాలకు లొంగని మహిళా ట్యాక్సీ డ్రైవర్.. విదేశాల్లో చదువుకునే స్థాయికి..
ముంబయి: కష్టాలకు లొంగని తత్వం తనది. ఎక్కడో మారుమూల గిరిజన గూడెంలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తోంది. పరిస్థితులు పరీక్షించినా.. కుటుంబ భారం మీద పడినా.. అమ్మాయి డ్రైవారా..! అంటూ సమాజం చిన్నచూపు చూసినా బెరుకులేని జీవిత ప్రయాణం సాగించింది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహాయంతో చివరికి విదేశాల్లో చదువుకోవాలనే తన కలను సాకారం చేసుకుంది. ఆ యువతి పేరు కిరణ్ కుర్మా. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలోని రేగుంత గ్రామానికి చెందినది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఆరోగ్యం దెబ్బతినడంతో కుటుంబ పోషణకు ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేయాల్సి వచ్చింది. రేగుంత నుంచి సిరోంచ వరకు 140 కిలోమీటర్ల దూరం ట్యాక్సీ నడిపింది. ప్రస్తుతం ఆమెకు మూడు ట్యాక్సీ లు ఉన్నాయి. మావోయిస్టు ప్రాంతంలో సాహసంతో ట్యాక్సీ సేవలు అందించినందుకు వరల్డ్ క్రాస్ అనే సంస్థ ఆమెను గుర్తించింది. ఇప్పటికీ ఆమెకు 18 అవార్డులు కూడా వచ్చాయి. అయితే.. తన ఉన్నత చదువుల కోసం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను సంప్రదించింది. దీంతో ఆయన రూ.40 లక్షల స్కాలర్షిప్ను మంజూరు చేశారు. యూకేలో ఏడాది పాటు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ కోర్సును యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ లో ఆమె చదవనున్నారు. మరో రెండేళ్ల పాటు అక్కడే ఓ సంస్థలో పనిచేయనున్నారు. ఇదీ చదవండి: IIT Bombay: ఐఐటీ బాంబేలో కొత్త వివాదం.. నాన్ వెజిటేరియన్లు వేరే చోట కూర్చోవాలంటూ.. -
ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన.. యువతిని బలవంతంగా క్యాబ్లోకి లాక్కెళ్లి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతిని యువకుడు బలవంతంగా క్యాబ్‌లోని ఎక్కించాడు. ఆమెను దుర్భాషలాడుతూ చొక్కా పట్టుకుని లాక్కెళ్లి కారులో పడేశాడు. కారుకు అటువైపు మరో యువకుడు కూడా నిలబడి ఉన్నాడు. మంగోల్‌పురిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు దేశ రాజధానిలో అమ్మాయిలకు భద్రత లేదా? ఆందోళన వ్యక్తం చేశారు. #SOS | Just Now at Mangolpuri Flyover towards Peeragarhi Chowk.@DelhiPolice @LtGovDelhi @dcpouter @DCWDelhi @dtptraffic pic.twitter.com/ukmVc7Tu1v — Office of Vishnu Joshi (@thevishnujoshi) March 18, 2023 ఈ వీడియోను సుమోటోగా తీసుకుని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిని వేధించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ రికార్డులను పరిశీలించారు. ఇద్దరు యువకులు, ఓ యువతి రోహిణి నుంచి వికాస్పుర్ వరకు వెళ్లేందుకు ఈ క్యాబ్‌ను బుక్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే వీరి మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత యువతి రానని చెప్పగా.. బలవంతంగా తీసుకెళ్లారని వివరించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. చదవండి: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్.. -
Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన యువకుడు.. యువతి మెడపట్టుకొని లాక్కెళ్లి..
రద్దీగా ఉన్న నడిరోడ్డుపై ఓ యువకుడు యువతితో రెచ్చిపోయి ప్రవర్తించాడు. అందరిముందే యువతిపై చేయిచేసుకోవడమే కాకుండా ఆమెను బలవంతంగా మెడ పట్టుకొని కారులోకి ఎక్కించాడు. ఈ అమానుష ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలన్నీంటిని రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో ప్రకారం.. ఢిల్లీలోని మంగోల్‌పురి ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో వాహనం ఆగింది. ఇంతలో కారులో నుంచి దిగి యువతి బయటకు వెళ్లింది. వెంటనే కారులో నుంచి యువకుడు దిగి యువతి వెనకాలే వెళ్లాడు. రోడ్డు మీద వెళ్తున్న ఆమెపై చేయిచేసుకున్నాడు. షర్ట్ పట్టుక్కొన్ని లాక్కొచ్చాడు. బలవంతంగా కారులోకి నూకేశాడు. కారులో సైతం యువతిపై పిడిగుద్దులు గుద్దాడు. వీరిద్దరితోపాటు కారు వద్ద మరో యువకుడు కూడా ఉన్నాడు. అక్కడ జరిగే తతంగాన్నంతా చూస్తూ ఉన్నాడే తప్ప అతన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. అనంతరం ముగ్గురు క్యాబ్‌లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే క్యాబ్ డ్రైవర్‌తో సహా రోడ్డు మీద ఉన్న ఎవరూ బాధితురాలికి సహాయం చేయడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం.చివరికి ఈ విషయం పోలీసులకు చేరడంతో వీడియో ఆధారంగా విచారణ చేపట్టారు. క్యాబ్ హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. క్యాబ్‌ను చివరిసారి గురుగ్రామ్‌లోని ఐఎస్ఎఫ్సీఓ చౌక్ వద్ద గుర్తించగా.. పోలీసులు అక్కడికి వెళ్లి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు(యువతి, ఇద్దరు యువకుడు) రోహిణి నుంచి వికాస్పురి వరకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లిన్నట్లు తెలిసింది. దారిలో వీరి మధ్య గొడవ జరగ్గా.. ఆమె బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. సదరు యువకుడు ఆమెను క్యాబ్‌లోని నెట్టిన్నట్లు డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. ఆ ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Man in Delhi forces a woman into a cab, near Mangolpuri flyover. The vehicle and the driver have been traced. Two boys & a girl had booked Uber from Rohini to Vikaspuri. The girl wanted to leave following an argument, after which the boy pushes her back into the cab. #Delhi pic.twitter.com/s2rkfgnaqh — Vani Mehrotra (@vani_mehrotra) March 19, 2023 -
మా ఊరిలో సినిమా తీయడం ఆనందంగా ఉంది: అర్జున్ దేవరకొండ
అర్జున్ దేవరకొండ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'క్యాబ్'. ఈ సినిమాలో నాగ, సూర్య, వందన, దేవి, శివమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అనంతపురంలో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 25 రోజుల పాటు ఈ సినిమాను అనంతపురంలో చిత్రీకరించారు. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తవ్వగా.. మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో చిన్నారి హాస్పిటల్ డా.హరిప్రసాద్, తెలుగమ్మాయి మహిత నటిస్తున్నారు ఈ సందర్భంగా చిత్రబృందానికి సహకరించిన అధికారులకు డైరెక్టర్ అర్జున్ దేవరకొండ ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం మేయర్ వసీం , డిప్యూటీ మేయర్స్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అర్జున్ దేవరకొండ మాట్లాడుతూ..' నేను పుట్టిన ఊరిలో నా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని.' తెలిపారు -
క్యాబ్ బుకింగ్ ఫెయిలైందా? ఫార్మింగ్ ఎటాక్‌తో మనీ గోవిందా!ఈ స్టోరీ చూడండి!
సాక్షి, ముంబై: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుపోతోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎక్కడో ఒక చోట మోసానికి పాల్పడి దోచుకున్నారు. తాజాగా ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేటుగాళ్లకు వలలో చిక్కారు. టట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయి రూ2లక్షలు పోగొట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళితే మహారాష్ట్రకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నాసిక్‌కు వెళ్లేందుకు ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లో క్యాబ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ టెక్నికల్ లోపం కారణంగా బుకింగ్ ఫెయిల్ అయింది.అయితే అతను ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లో ఉన్న ఈ-మెయిల్‌ను సంప్రదించాడు. అదే అతను చేసిన పొరపాటు. కొద్దిసేపటి తర్వాత ట్రావెల్ కంపెనీ ఏజెంట్ రజత్ అని అంటూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. బుకింగ్ కోసం మరోసారి వెబ్సైట్లో రూ.100 చెల్లించాలని,ప్రయాణానికి సంబంధించి మిగతా మొత్తాన్ని తర్వాత చెల్లించ వచ్చని నమ్మబలికాడు. ఈ క్రమంలో బాధితుడు మరోసారి డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించాడు. వెబ్సైట్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు ఈ సారి ఇగ్నోర్ చేశాడు. కానీ భయపడినంతా జరిగిపోయింది. గంటల వ్యవధిలో అతని క్రెడిట్‌కార్డు నుంచి రూ.2లక్షలకు పైగా డెబిట్ అయిపోయాయి. క్రెడిట్‌కార్డు నుంచి రూ.81,400, రూ.71,085, రూ.1.42లక్షలు డెబిట్ అయినట్లుగా మొబైల్‌కు మెస్సేజ్‌లు వచ్చాయి. వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించడంతో బాధితుడు తన రూ. 71,085ని పోకుండా అడ్డుకోగలిగాడు. కానీ మిగిలిన రూ. 2.2 లక్షలను పోగొట్టుకున్నాడు. వెంటనే తేరుకొని బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి క్రెడిట్‌కార్డులను బ్లాక్ చేయించాడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులుఫార్మింగ్ సైబర్ దాడి అని పేర్కొన్నారు. వెబ్సైట్, కంప్యూటర్ డీఎన్ఎస్ సర్వర్‌ని నేరుగా వినియోగదారులను ఫేక్ వెబ్‌సైట్‌కు మళ్లించి, ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయకపోయినా, నకిలీ వైబ్సైట్ల ద్వారా పాస్వర్డ్లు, క్రెడిట్‌కార్డుల నంబర్లు తదితర రహస్య డేటాను హ్యాకర్లు సేకరిస్తారని.. ఆ తర్వాత చెల్లింపు చేసే సమయంలో సాంకేతిక సమస్య ఉన్నట్లుగా చూపించి మోసానికి తెగబడతారిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేసులోనూ ఇదే జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోందన్నారు. ఫార్మింగ్ సైబర్ ఎటాక్ అంటే? ఫార్మింగ్ సైబర్‌దాడులు ఫిషింగ్ ఎటాక్స్ కంటే ప్రమాదకరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఎవరైనా ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయకపోయినా, రియల్ వెబ్సైట్ ద్వారా సెర్చ్ చేసినా, యూజర్లకు తెలియకుండానే హ్యాక్ చేస్తారు. అంటే వెబ్సైట్ లేదా కంప్యూటర్ DNS (డొమైన్ నేమ్ సిస్టమ్) సర్వర్‌ని నేరుగా వినియోగదారులను ఫేక్ లేదా హానికరమైన వెబ్‌సైట్‌కి మళ్లిస్తారని, దీంతో గుర్తించడం కష్టమని పేర్కొన్నారు. ఫార్మింగ్ సైబర్ దాడిలో బాధితులు చేసేది ఏమీ ఉండదని తెలిపారు. సైబర్ దాడులను తప్పించుకునేందుకు అనుమానాస్పద వెబ్సైట్లలో లింక్‌లను క్లిక్ చేయడం, డౌన్లోడ్ చేయడం లాంటివి మానుకోవాలని, అలాగే ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. -
లోయలోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది దుర్మరణం
జమ్మూ: జమ్ముకశ్మీర్‌లో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టవార్ జిల్లాలో ఓ క్యాబ్ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంపై కిష్టవార్ డీసీపీ దేవాన్స్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. మృతదేహాలను వెలికి తీశామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: గోఖలే వంతెన త్వరలో కూల్చివేత -
హైదరాబాద్‌లో భారీగా తగ్గిన క్యాబ్‌లు, ఆటోలు!
నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ఏ సమయంలోనైనా బుక్ చేసిన కొన్ని నిమిషాల్లోనే క్యాబ్‌లు రయ్‌రయ్‌మంటూ దూసుకొచ్చేవి. కానీ కొంతకాలంగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాలు, కొన్ని సమయాల్లో మినహా నో క్యాబ్స్ అనో, నో ఆటోస్ అనో యాప్‌లు చేతులెత్తేస్తున్నాయి. గతేడాది భారీ వర్షాల్లో కూడా సేవలందించిన క్యాబ్స్‌కు ఇప్పుడేమైంది? కొన్నేళ్లుగా క్యాబ్‌లతో కళకళలాడిన భాగ్యనగరం ఇప్పుడు వాటి జాడ కోసం ఎందుకు వెతుక్కోవాల్సి వస్తోంది? – సాక్షి, హైదరాబాద్ వాహనాలపై కేంద్రం పిడుగు.. కరోనా లాక్‌డౌన్‌తో నగరంలో కొన్ని నెలలపాటు క్యాబ్‌లు, ఆటోలు తిరగక డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. వారిలో కొందరు వాహనాలను అమ్మేయగా, ఇల్లు గడవడం కష్టమై మరికొందరు కార్లను వేరే రకంగా అద్దెలకు ఇచ్చారు. ఇలా నగరంలో కరోనా వ్యాప్తి తర్వాత క్యాబ్‌ల సంఖ్య తగ్గి కొంత సమస్య ఏర్పడింది. దీనికితోడు డీజిల్ ధరలు అమాంతం పెరగడం.. ఆ మేరకు చార్జీలు పెరగకపోవడం ఒక కారణమైతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధనతో క్యాబ్‌లు, ఆటోలు భారీగా నిలిచిపోయాయి. ఈ కారణంగానే క్యాబ్‌లకు కొరత వచ్చి పడింది. ఇదీ సమస్య.. కేంద్ర మోటారు వాహనాల చట్టంలో జరిగిన మార్పు మూడు నెలల క్రితం అమలులోకి వచ్చింది. పర్యావరణానికి ప్రాధాన్యమిచ్చే క్రమంలో వాహనాలు కచ్చితంగా ఎప్పటికప్పుడు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా లోపాలు సరిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా ఏటా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందే నిబంధనను కఠినతరం చేసింది. గడువు తీరినా ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను రెన్యూవల్ చేయించుకోని రవాణా వాహనాలపై రోజుకు రూ. 50 చొప్పున పెనాల్టీ వసూలు చేసే నిబంధనను తెరపైకి తెచ్చింది. అది ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. దీన్ని రాష్ట్ర రవాణా శాఖ సైతం అమలు చేయడం ప్రారంభించింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన నాటి నుంచి రోజుకు రూ.50 చొప్పున లెక్కగట్టి వసూలు చేస్తోంది. గత రెండు నెలలుగా ఇది తీవ్రమైంది. నగరంలో చాలా క్యాబ్‌లు, ఆటోల ఫిట్నెస్ గడువు ఎప్పుడో ముగిసింది. చాలా వాహనాలకు ఫిట్నెస్ రెన్యూవల్ చేయించుకోవాల్సిన గడువు 3–4 ఏళ్లు దాటిపోయింది. దీంతో ఒక్కో వాహనంపై రూ.60–70 వేల పెనాల్టీ పెండింగ్‌లో ఉంది. దీంతో వాహనాలను రోడ్డుపైకి తేవడానికి యజమానులు జంకుతున్నారు. అలా ఏకంగా 35 వేలకుపైగా క్యాబ్‌లు, 25–30 వేల ఆటోలు నిలిచిపోయాయి. కరోనా దెబ్బకు ఇప్పటికే దాదాపు 15 వేల క్యాబ్‌ల డ్రైవర్లు వేరే పనులు చూసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో క్యాబ్‌లు, ఆటోలు లేకపోయేసరికి ప్రయాణికుల బుకింగ్స్‌కు స్పందన తగ్గిపోయింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు... భారీ పెనాల్టీల నుంచి విముక్తి కలిగించాలంటూ పదుల సంఖ్యలో డ్రైవర్లు హైకోర్టును ఆశ్రయించగా ఓ కేసు విషయంలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి తీర్పు వచ్చే వరకు రోజుకు రూ. 10 చొప్పున పెనాల్టీ వసూలు చేసి తాత్కాలిక ఫిట్‌నెస్‌ల సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించింది. మరోవైపు ఈ భారాన్ని తగ్గించాలంటూ క్యాబ్‌లు, ఆటోల యూనియన్లు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. కానీ దీనిపై ఇప్పటివరకు రవాణాశాఖ సానుకూల ప్రకటనేదీ విడుదల చేయలేదు. కొత్త ఆటోలకూ కష్టమే.. ధాసాధారణంగా ప్రతినెలా నగరంలో దాదాపు ప్రతి నెలా వెయ్యి వరకు పాత ఆటోలను తుక్కుగా మార్చి వాటి స్థానంలో కొత్త ఆటోలు తీసుకుంటారు. ఇప్పుడు తుక్కుగా మార్చాలంటే.. అప్పటివరకు ఉన్న ఫిట్నెస్ పెనాల్టీ చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో తుక్కుగా మార్చే ప్రక్రియ కూడా బాగా తగ్గిపోయింది. కొత్త ఆటోలకు 100 పర్మిట్లు జారీ చేసే చోట 2–3 జారీ అవుతుండటం గమనార్హం. ఈ సమస్య పరిష్కారమయ్యేవరకు నగర వాసులకు క్యాబ్ కష్టాలు తీరేలా లేవు. -
అప్రమత్తతే ఆయుధం
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కోవిడ్ కాలంలో అనుసరించాల్సిన విధానాలు(కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్– సీఏబీ) తప్పక పాటించాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు. వ్యాక్సినేషన్ తక్కువ, కేసులు ఎక్కువ, మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రాలకు సహాయక బృందాలను పంపాలని, పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్ కల్లోల నేపథ్యంలో కరోనా పరిస్థితులపై ఆయన గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అందరం అప్రమత్తంగా, జాగరుకతతో ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ, ఆరోగ్య వసతుల కల్పన, ఔషధాలు, ఆక్సిజన్ లభ్యత, వెంటిలేటర్లు, ఆస్పత్రి బెడ్స్ లభ్యత, మానవ వనరులు, టీకా కార్యక్రమ పురోగతి తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వల్ల తలెత్తుతున్న పరిస్థితులను, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, అధిక కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలు, పాజిటివిటీ అధికంగా ఉన్న జిల్లాల సమాచారాన్ని ప్రధాని ముందుంచారు. నవంబర్ 25 నుంచి తీసుకున్న చర్యలను, అంతర్జాతీయ విమానప్రయాణికుల నూతన నిబంధనలు, రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశాల సారాన్ని ప్రధానికి వివరించారు. పర్యవేక్షణ అనంతరం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ తగిన సహాయం అందించాలని కేంద్ర అధికారులను మోదీ ఆదేశించారు. పీఎం ఆదేశాలివే.. ► కరోనాపై కేంద్రీకృత, సహకారయుక్త పోరు సాగించాలి. ► జిల్లాస్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలి. ► రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్ సదుపాయాలు, సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలి. ► టెలిమెడిసిన్, టెలి కన్సల్టేషన్ వంటి ఐటీ సాంకేతికతలను ఉపయోగించుకోవాలి. ► కేసుల సత్వర గుర్తింపుతో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలి. ► కాంటాక్ట్ ట్రాకింగ్ సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా వ్యాప్తిని అరికట్టే చర్యలపై శ్రద్ధవహించాలి. ► తక్కువ టీకా రేటు, ఎక్కువ కేసులున్న ప్రాంతాలకు బృందాలను పంపాలి. కరోనాపై కేంద్రీకృత, సహకారయుక్త పోరు సాగించాలి. జిల్లాస్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలి. రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్ సరఫరా యంత్రాంగం ఉండేలా, అవన్నీ సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలి. – ప్రధాని మోదీ -
ఇకపై వాట్సాప్ నుంచి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?
వాహన ప్రయాణికులకు శుభవార్త. చేతిలో ఊబెర్ షేరింగ్ యాప్ లేకపోయినా వాట్సాప్ ఆన్‌లో ఉంటే చాలు ఇకపై ఊబెర్ క్యాబ్స్‌ను బుక్ చేసుకోవచ్చని' ఊబెర్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారి మనదేశంలో ఈ తరహా క్యాబ్ సర్వీసుల్ని ఊబెర్ అందించనుంది. ఇందుకోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రైడ్ షేరింగ్ సంస్థ ఊబెర్ సరికొత్త రైడ్ షేరింగ్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చింది. ఊబెర్ యాప్ లేకుండా ఊబెర్ లోని చాట్ బోట్‌తో కనెక్టై సులభంగా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోనే ప్రారంభించారు. త్వరలో దేశం మొత్తం విస్తరించేందుకు ఊబెర్ ప్రతినిధులు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. వాట్సాప్‌తో క్యాబ్ ఎలా బుక్ చేసుకోవాలి వాట్సాప్ యూజర్లు మొత్తం మూడు మార్గాల ద్వారా ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. లేదంటే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి ఉబెర్ వాట్సాప్ చాట్ లింక్‌పై క్లిక్ చేస్తే బుకింగ్ ఓపెన్ అవుతుంది. అక్కడే పికప్, డ్రాప్ లొకేషన్‌తో పాటు ఫేర్ ప్రైస్, క్యాబ్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే వివరాలు డిస్ప్లే అవుతాయి. ఫైనల్‌గా మీరు ‘బుక్ ఎ రైడ్’ పై క్లిక్ చేసి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. చదవండి: ‘ఆధార్ కార్డు’ మోడల్..! ప్రపంచ వ్యాప్తంగా...! -
క్యాబ్ డ్రైవర్‌పై మహిళ వీరంగం.. నడి రోడ్డుపై చొక్కా పట్టుకొని
న్యూఢిల్లీ: ఓ మహిళ నడిరోడ్డు మీద వీరంగం సృష్టించింది. రోడ్డు మధ్యలో స్కూటీ పార్క్ చేసి క్యాబ్ డ్రైవర్ చెంప చెళ్లుమనిపించింది. బూతులు తిడుతూ.. అతడి కాలర్ పట్టుకుని చెడామడా కొట్టింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసేకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వెస్ట్ పటేల్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కస్తూరి లాల్ ఆనంద్ మార్గంలో ఓ మహిళ మరో మహిళతో కలిసి స్కూటీపై ప్రయాణిస్తుంది. ఈ మార్గం అత్యంత రద్దీగా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇంతలో మహిళ హారన్ కొట్టింది. అయతే దీనిని పట్టించుకొని ముందున్న క్యాబ్ డ్రైవర్ మహిళకు దారివ్వలేదు. చదవండి: వైరల్: ఆకాశంలో క్రేజీ కపుల్స్.. అంతలో అనుకోకుండా .. దీంతో హారన్ కొట్టినా కూడా దారి ఇవ్వకపోవడంతో మహిళ రెచ్చిపోయింది. స్కూటీని రోడ్డుమీదే పార్క్ చేసి క్యాబ్ డ్రైవర్‌పై విరుచుకుపడింది. అతన్ని నోటికొచ్చినట్లు బండ బూతులు తిడుతూ కొట్టింది. కాలర్ పట్టుకొని చెంప చెళ్లుమనిపించింది. అక్కడే ఉన్న కొందరు ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా గట్టిగట్టిగా అరిచింది. ఈ ఘటనను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక ఈ వీడియో పోలీసుల వరకు చేరడంతో సదరు మహిళ కోసం వేట ప్రారంభించారు. మహిళపై క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు ఇస్తే ఆమెపై కేసు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉందని పోలీసులు తెలిపారు. మహిళ స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ఆమెను కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నించారు. చదవండి: వామ్మో! మొసలిని కౌగిలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!! -
మహిళా జర్నలిస్టుతో క్యాబ్ డ్రైవర్ పిచ్చి వేషాలు.. ఫోటో తీసి..
కోల్‌కతా: రోడ్ల పై ఒంటరి మహిళలు కనపడితే కొందరు ఆకతాయిలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వారిని వేధిస్తుంటారు. ఈ తరహాలోనే ఓ మహిళా జర్నలిస్టును క్యాబ్ డ్రైవర్ వేధించడమే గాక తన స్నేహితురాలిపై దాడి చేసి చివరికి జైలు పాలయ్యాడు. ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలోని బెహలాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ టీవీ న్యూస్ ఛానెల్లో పనిచేస్తున్న మహిళ, సాల్ట్ లేక్ సెక్టార్ 5లోని తన కార్యాలయం నుంచి స్కూటర్‌పై స్నేహితురాలితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా సత్యన్ రాయ్ రోడ్-జేమ్స్ లాంగ్ రోడ్ క్రాసింగ్ వద్ద ఈ సంఘటన జరిగిందీ. క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ గురువారం రాత్రి మహిళను రోడ్డుపైకి నెట్టడానికి తన స్కూటర్‌ను పలుమార్లు ఢీకొట్టడానికి ప్రయత్నించాడు. చివరకు అతని ఆగడాలను భరించలేక ఆమె సత్యేన్ రాయ్ రోడ్-జేమ్స్ లాంగ్ రోడ్ క్రాసింగ్ వద్ద తన స్కూటర్‌ను ఆపి అతన్ని వారించింది. ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్ మహిళపై దాడి చేసి వేధించడమే గాక ఆమె స్నేహితురాలితో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ అతని వాహనాన్ని ఫోటో తీసుకుని బెహలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. చదవండి: పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది.. కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు.. -
ఇకపై ఎంచక్కా..ఫ్లైట్ జర్నీలోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ దేశీయ విమానయాన రంగంలో తొలిసారిగా కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ఇన్‌ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ వేదిక అయిన స్పైస్‌స్క్రీన్ సహాయంతో విమానంలో ఉన్నప్పుడే ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. తక్కువ చార్జీలతోపాటు 10 శాతం వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. ప్రయాణికులు క్యాబ్ డిపార్చర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. అరైవల్ గేట్ వద్దే క్యాబ్ సిద్ధంగా ఉంటుందని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో దిగే ప్యాసింజర్లు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. హైదరాబాద్‌సహా ఇతర ప్రధాన నగరాలకు ఈ సౌకర్యాన్ని దశలవారీగా పరిచయం చేస్తారు. క్యాబ్ రద్దు చేసుకుంటే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. స్పైస్‌స్క్రీన్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకోగానే ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా ఓటీపీతోపాటు విమానం దిగిన వెంటనే కాల్ కూడా వస్తుంది. స్పైస్స్క్రీన్ను గతేడాది ఆగస్టులో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణంలో ఆన్‌బోర్డ్ వైర్లెస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీ లేదా ల్యాప్‌టాప్ ద్వారా వినోదాన్ని ఆస్వాదించవచ్చు. చదవండి : వారెవ్వా..!సరికొత్త రికార్డ్లను బద్దలు కొట్టిన అగ్రికల్చర్ బిజినెస్ రిజిస్ట్రేషన్లు -
Telangana: ఆర్టీసీ, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ, ఆటో, క్యాబ్ డ్రైవర్లందరికీ టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 3వ తేదీ నుంచి రోజుకు సగటు 10 వేల మందికి టీకాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. టీకా పంపిణీపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేసిన సూచనలకు అనుగుణంగా సూపర్ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్లు ఇవ్వాలని సూచించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి వైద్య ,ఆరోగ్య శాఖ అధికారులతో హరీశ్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి మరిన్ని ఎక్కువ టీకా డోసులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో థర్డ్‌వేవ్ వచ్చే అంచనాలను సైతం పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పరిశ్రమలు,ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, రవాణా శాఖ కమిషనర్ యం.ఆర్.యం.రావు, వైద్యవిద్య సంచాలకుడు రమేశ్ రెడ్డి, ప్రజారోగ్య విభాగ సంచాలకుడు శ్రీనివాస రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, కాళోజీ హెల్త్ యూనివర్సిటి వైస్‌చాన్స్‌లర్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మీరు డాక్టరా..? అయితే రూ.2 వేలు
సాక్షి, హిమాయత్‌నగర్: క్యాబ్ డ్రైవర్ల దోపిడీ ప్రారంభమైంది. కింగ్‌కోఠి నుంచి అల్వాల్ వెళ్లేందుకు ఏకంగా రూ.2 వేలు అడిగిన ఘటన కింగ్‌కోఠి ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కింగ్‌కోఠి ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సంగీత బుధవారం డ్యూటీ ముగించుకొని 3గంటల ప్రాంతంలో కింగ్‌కోఠి ఆస్పత్రి నుంచి అల్వాల్‌లోని తన ఇంటికి క్యాబ్ బుక్ చేయగా.. రూ.391 చూపింది. డ్రైవర్‌కు కాల్ చేసి ఆస్పత్రి లోపలికి రావాలని చెప్పింది. దీంతో డ్రైవర్ స్పందిస్తూ.. మీరు పేషెంటా? స్టాఫా? అని అడిగాడు. నేను డాక్టర్ని అనగానే.. ఓహో అయితే రూ.2 వేలు ఇవ్వండి వస్తాను. లేదంటే డ్రైవ్ క్యాన్సిల్ చేయమన్నాడు. దీంతో ఖంగుతిన్న డాక్టర్ సంగీత అక్కడే ఉన్న ఏసీపీ వెంకట్‌రెడ్డికి తెలిపింది. మరొక్కసారి మీరు క్యాబ్ బుక్ చేయండి ఆ ఛార్జీకే మీరు మీ ఇంటికి వెళ్లేలా నేను చూసుకుంటా అన్నారు. దీంతో సంగీత మరో క్యాబ్ బుక్ చేయగా.. రూ.341 చూపించింది. వెంటనే ఆస్పత్రి లోపలికి వచ్చిన డ్రైవర్‌ను ఏసీపీ వెంకట్‌రెడ్డి పిలిచి, డాక్టర్ మేడంని జాగ్రత్తగా ఇంటి వద్ద దించు. యాప్‌లో చూపించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఊరుకోను. ఇది ప్యాండమిక్ టైమ్, మనకు ఈ టైంలో వైద్యులు చేస్తున్న సేవ ఎంతో భేష్. మనమే వారికి ఉచిత సేవను అందించాలని నాలుగు మంచి మాటలు చెప్పారు. దీంతో క్యాబ్ డ్రైవర్ జాగ్రత్తగా తీసికెళ్లి యాప్‌లో చూపించినంత డబ్బులే తీసుకుంటానంటూ ఏసీపీ వెంకట్‌రెడ్డికి మాట ఇచ్చారు. చదవండి: కోవిడ్ మరణాల్లో మరో రికార్డు -
నేనే పోలీస్ అన్నాడు, జైల్లో వేశారు!
ముంబై: పోలీస్ అవ్వాలన్న కోరిక ఉంటే ఆ శాఖ నిర్వహించే పరీక్షలు రాసి సెలక్ట్ అవ్వాలి. కానీ.. ఇక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ మాత్రం పెద్దగా కష్టపడకుండానే తనకు తానే పోలీస్ అని ప్రకటించుకున్నాడు, కానిస్టేబుల్ అని అందరితో చెప్పుకున్నాడు. ట్యాక్సీకి పోలీస్ స్టిక్కర్ అతికించాడు. అంతటితో ఆగకుండా ఖాకీ దుస్తులు ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకే ముంది ఫేమస్ అయిపోదామనుకున్న అతగాడు పోలీసులు అరెస్టు చేయడంతో కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. విజయ్ గుండ్రె ముంబైలోని ఘన్సోలీలో నివసించేవాడు. క్యాబ్ నడుపుతూ జీవనం సాగించేవాడు. అయితే చుట్టుపక్కల వారితో పోలీస్ అని చెప్పుకునేవాడు. ఈ క్రమంలో ఒక రోజు పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. విజయ్ గుండ్రె పట్టుబడ్డాడు. పోలీసులకు టోకరా ఇచ్చి తప్పించుకుందాం అనుకున్నాడు. తాను కూడా డిపార్ట్మెంట్ అని కవర్ చేశాడు. కానీ అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయడంతో అతడు నకిలీ పోలీసన్న విషయం బయటపడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. చదవండి: వాహన దారులకు షాక్: శాశ్వతంగా లైసెన్సు రద్దు -
HYD: రెట్టింపైన క్యాబ్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: పద్మారావునగర్‌కు చెందిన రోహిత్ నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్ నుంచి మణికొండకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. సాధారణ రోజుల్లో రూ.350 చార్జీ నమోదు కాగా ప్రస్తుతం రూ.550కి పెరిగింది. అత్యవసరమైన పని కావడంతో తప్పనిసరిగా బయలుదేరవలసి వచ్చింది. బంజారాహిల్స్ నుంచి రాంనగర్ వరకు ప్రతి రోజు క్యాబ్‌లో ప్రయాణం చేసే గోపీనాథ్‌కు భారీగా పెరిగిన చార్జీలతో బెంబేలెత్తాడు. లాక్‌డౌన్‌కు ముందు రోజుల్లో అయితే ఆ రూట్లో రూ.110 నుంచి రూ.120 వరకు చార్జీ అయ్యేది. కానీ ఇప్పుడు రూ.180 నుంచి రూ.220 వరకు నమోదవుతున్నాయి. ఒక్కోసారి అది రూ.250 వరకు పెరిగిపోతుంది. (హైదరాబాద్-తిరుపతి మధ్య తగ్గనున్న దూరం) ఇది ఏ ఒక్క రూట్‌కు పరిమితమైన చార్జీలు కాదు. నగరంలోని అన్ని రూట్లలోనూ కొద్ది రోజులుగా క్యాబ్ చార్జీలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు, తరువాత క్యాబ్ చార్జీల్లో గణనీయమైన తేడా నమోదవుతోంది. ఒకవైపు ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడం, మరోవైపు ఎంఎంటీఎస్ ఇప్పటికీ పునరుద్ధరణకు నోచకపోవడంతో మెట్రోరైళ్లు అందుబాటులో లేని మార్గాల్లో ప్రయాణికులు ఎక్కువ శాతం ఆటోలు, క్యాబ్‌లపైన ఆధారపడాల్సి వస్తుంది. ప్రయాణికుల అవసరాన్ని, డిమాండ్‌ను క్యాబ్ సంస్థలు ఇష్టారాజ్యంగా సొమ్ము చేసుకుంటున్నాయి. అరకొర సదుపాయాలే... అన్‌లాక్ 4.0 నుంచి క్రమంగా జనజీవన సాధారణ స్థాయికి చేరుకుంది. రాకపోకలు పెరిగాయి. మొదట్లో మెట్రో రైళ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అన్‌లాక్ 5.0 తరువాత పరిమితంగా సిటీ బస్సులను పునరుద్ధరించారు. సాధారణంగానే గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు సుమారు 30 లక్షల మంది సిటీ బస్సుల్లో తిరుగుతారు. మరో 10 లక్షల నుంచి 15 లక్షల మంది క్యాబ్‌లు, ఆటోల్లో ప్రయాణం చేస్తారు. కరోనా కారణంగా ప్రయాణాలు తగ్గినప్పటికీ లాక్డౌన్ సడలింపులతో ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. ఉద్యోగ, వ్యాపారాల కోసమే కాకుండా అన్ని రకాల అవసరాల కోసం వివిధ ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగింది. కానీ ఇందుకు తగినట్లుగా రవాణా సదుపాయాల పునరుద్ధరణ జరగలేదు. ఐటీ రంగం ఇంకా ప్రారంభం కాకపోవడంతో క్యాబ్‌లు తక్కువగా తిరుగుతున్నాయి. గతంలో 1.5 లక్షల క్యాబ్‌లు ఉంటే ఇప్పుడు 60 వేలకు తగ్గాయి. తిరిగి ఐటీ పుంజుకుంటే తప్ప క్యాబ్ సదుపాయం మెరుగుపడకపోవచ్చునని అంచనా. సాధారణ రోజుల్లో కనీసం 50 లక్షల మంది వివిధ రకాల ప్రజా రవాణా సదుపాయాలను వినియోగించేవారని భావించినా ఇప్పుడు అందులో సగం మందికి సరిపడా ప్రజారవాణా కూడా అందుబాటులో లేదు. 3000 బస్సులకు బదులు 1000 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. మరో 121 ఎంఎంటీఎస్ సర్వీసులు ఇంకా పునరుద్ధరణకు నోచలేదు. దీంతో అరకొర సదుపాయాలపైన ఆధారపడి ప్రయాణం చేయవలసి వస్తుంది. లేదంటే వ్యక్తిగత వాహనాలపైన ఆధారపడాల్సి వస్తుంది. డ్రైరన్ పేరిట హాఫ్ రిటర్న్... ఈ క్రమంలోనే క్యాబ్ సంస్థలు చార్జీలను అడ్డగోలుగా పెంచేస్తున్నాయి. ప్రయాణికులు కోరుకున్న చోట నుంచి క్యాబ్ అందుబాటులో లేదనే సాకుతో డ్రైరన్ పేరిట అదనపు చార్జీలు విధిస్తున్నారు. ఉప్పల్‌లో బుక్ చేసుకొనే ప్రయాణికుడికి అక్కడికి దగ్గర్లో క్యాబ్ అందుబాటులో లేదనే కారణంతో తార్నాక నుంచి రప్పిస్తారు. తార్నాక నుంచి ఉప్పల్ వరకు ఖాళీగా వచ్చినందుకు ఆ మొత్తాన్ని ప్రయాణికులపైన మోపుతున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లోనూ ఇదే తరహాలో ప్రయాణికుల డిమాండ్‌కు తగినట్లుగా క్యాబ్‌లు అందుబాటులో లేవనే కారణంతో సర్‌చార్జీలు విధిస్తున్నారు. డ్రైరన్ పేరిట భారం మోపుతున్నారు. ఆటోల్లోనూ అదే దోపిడీ కొనసాగుతోంది. ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగుతున్నారు. కమీషన్లో మార్పు లేదు ఇదంతా క్యాబ్ సంస్థల మాయాజాలమే. డ్రైరన్ వల్ల బలయ్యేది డ్రైవర్లే. ప్రయాణికుల దగ్గర అదనంగా వసూలు చేసే చార్జీలు క్యాబ్ సంస్థలకే వెళ్తున్నాయి. మా దగ్గర మాత్రం ప్రతి రైడ్‌కు యథావిధిగా 25 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 20 శాతానికి తగ్గిస్తే డ్రైవర్లకు ఎంతో మేలు జరుగుతుంది. కానీ క్యాబ్ సంస్థలు ఆ పని చేయడం లేదు. – షేక్ సలావుద్దీన్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోషియేషన్ -
వేధింపులతో క్యాబ్ నుంచి దూకేశారు..
చండీగఢ్: రెస్టారెంట్‌కు వెళ్లి సరదాగా విందు భోజనం ఆరగిద్దామనుకున్న ముగ్గురు మహిళల ఆనందాన్ని ఓ క్యాబ్ డ్రైవర్ ఆవిరి చేశాడు. క్యాబ్‌లో వారంతా వెళ్తుండగా.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ డ్రైవర్ వేధింపులకు దిగాడు. ఈ ఘటన అమృత్‌సర్‌లో శనివారం సాయంత్రం జరిగింది. ఎస్హెచ్ఓ రాబిన్ హాన్స్ వివరాల ప్రకారం.. రంజిత్ అవెన్యూ ప్రాంతంలోని రెస్టారెంట్‌కు వెళ్లేందుకు ముగ్గురు మహిళలు క్యాబ్ మాట్లాడుకుని వెళ్తున్నారు. కొంత దూరం వెళ్లాక.. వారిలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ డ్రైవర్ లైగింకంగా వేధించసాగాడు. వారంతా అతనికి ఎదురు తిరిగి గట్టిగా సమాధానం చెప్పడంతో వాహనాన్ని మరింత వేగంగా పోనిచ్చాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఆ మహిళల్లో ఇద్దరు ఒక్కసారిగా వాహనం నుంచి కిందకు దూకేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. ఆ వెంటనే రోడ్డు వెంట వెళ్తున్నవారికి విషయం చెప్పి అలర్ట్ చేయడంతో.. కొంతమంది బైకులపై కారును వెంబడించారు. అందులో చిక్కుకున్న మరో మహిళను రక్షించారు. క్యాబ్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గంట వ్యవధిలోనే అతన్ని పట్టుకుని జైల్లో వేశారు. -
పరాఠాల కోసం.. క్యాబ్ డ్రైవర్‌పై దాడి
న్యూఢిల్లీ: హరియాణాలో ప్రసిద్ధి చెందిన పరాఠాలు తినడానికి అవసరమైన డబ్బుల కోసం ఓ క్యాబ్ డ్రైవర్ని దోచుకున్న వారిలో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. ఢిల్లీకి చెందిన ఐదుగురు స్నేహితులు హరియాణా ముర్థాల్ వెళ్లి పరాఠాలు తినాలని భావించారు. కానీ డబ్బులు లేవు. దాంతో దొంగతనం చేయాలనుకుని.. క్యాబ్ బుక్ చేసుకున్నారు. కొద్ది దూరం వెళ్లాక ప్రయాణం గురించి వివాదం తలెత్తింది. దాంతో ట్రిప్ క్యాన్సలయ్యింది. ఈ క్రమంలో వారు క్యాబ్ డ్రైవర్ మీద దాడి చేసి అతడి వద్ద ఉన్న డబ్బులు, మొబైల్ లాక్కొని కారు నుంచి బయటకు తోశారు. అనంతరం వారంతా ఢిల్లీ పస్చిమ్ విహార్‌కి వెళ్లి భోజనం చేశారు. (చదవండి: ఇంట్లో చొరబడి ఎవర్నీ వదల్లేదు) కారును నిహాల్ విహార్ ప్రాంతంలోని ఏకాంత ప్రదేశంలో పార్క్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఐదుగురిలో ముగ్గురుని అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
క్యాబ్ హెడ్ క్వార్టర్స్ మూసివేత
కోల్‌కతా: నగరంలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఉన్న క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) హెడ్ క్వార్టర్ వారం రోజుల పాటు మూతబడనుంది. ఈడెన్ గార్డెన్‌లోని సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ సోకడంతో క్యాబ్ ఆఫీస్‌ను ఆదివారం మూసేశారు. సుమారు వారం రోజుల పాటు క్యాబ్ హెడ్ క్వార్టర్‌కు తాళాలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈడెన్ గార్డెన్లో కరోనా సోకిన వ్యక్తి తాత్కాలిక ఉద్యోగిగా తేలింది. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చందదాస్ అనే అతను తాత్కాలిక సర్వీస్‌పై పని చేయడానికి రాగా కరోనా బారిన పడినట్లు క్యాబ్ ప్రెసిడెంట్ అవిషేక్ దాల్మియా తెలిపారు. (‘గంగూలీ అంటే అసహ్యం పుట్టేది’) అతన్ని చార్నోక్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతనితో సాన్నిహిత్యంగా మెలిగిన వారిని సైతం కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ముందు వీరంతా హోమ్ క్వారంటైన్‌కు వెళ్లగా కరోనా టెస్టులు చేయనున్నారు. మొత్తం ఆఫీస్‌ను శానిటైజ్ చేయనున్నట్లు అవిషేక్ దాల్మియా తెలిపారు. పశ్చిమ బెంగాల్లో శనివారం రికార్డు స్థాయిలో 743 కేసులు నమోదు కాగా, కోల్‌కతాలో నగరంలో 242లో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ దాదాపు ఏడువేల కేసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నమోదయ్యాయి. (నీ బుగ్గలు ఇష్టం.. వాటిని పట్టుకోనా?) -
పరిమితికి మించితే పరేషానే!
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రాచకొండ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రయాణికులను పరిమితికి మించి తీసుకెళ్తున్న ఆటోలు, క్యాబ్‌లపై చర్యలకు ఉప్రమించారు. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు, క్యాబ్‌లో ముగ్గురికి మించి కనిపిస్తే 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నగరంలో కేవలం ఆటోలు, క్యాబ్‌లు తిరిగేందుకు వీలు కల్పించడంతో డ్రైవర్లు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నవారిపై నజర్ పెట్టారు. కొన్నిరోజులుగా రాత్రిళ్లు మాత్రమే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన రాచకొండ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఇక నుంచి పగటిపూట కూడా వాహనాల రాకపోకలపై నిఘా వేశారు. ప్రభుత్వ జీఓ 68 ప్రకారం నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్రావు తెలిపారు. ఐపీసీ 188 సెక్షన్ కింద ఆరు నెలల జైలు, లేదంటే రూ.వెయ్యి జరిమానా విధించే అవకాశముందన్నారు. ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని కరోనా వైరస్ నియంత్రణ కోసం ఆటోడ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పసరిగా పాటించాలని ఆయన సూచించారు. -
దోపిడీకి గురవుతున్నారు..
సాక్షి, హైదరాబాద్ : రాజేష్ సొంత వాహనం గల ఓ క్యాబ్ డ్రైవర్. హైటెక్ సిటీలోని ప్రముఖ ఐటీ సంస్థకు రవాణా సేవలు అందించాలని భావించాడు. సంస్థ అధికారులను నేరుగా సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ సంస్థకు సుమారు 200 వాహనాలను అందజేస్తున్న వెండర్స్ వ్యవస్థ ఉంది. ఒక బడా వెండర్ కింద మరో ఇద్దరు సబ్ వెండర్లు ఉన్నారు. చివరకు ఆ సబ్ వెండర్ సహాయంతో డ్యూటీలో చేరాడు. కానీ అతనికి ప్రతినెలా వచ్చే ఆదాయంలో ముగ్గురు వెండర్లకు కమిషన్ చెల్లించగా మిగిలింది కేవలం రూ.25 వేలు, ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోలేక, కారు లోన్ కిస్తీ చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ‘ఓలా, ఊబర్ వంటి సంస్థల్లోనే పెద్ద ఎత్తున కమిషన్ తీసుకొని మోసం చేస్తున్నారని ఐటీ సంస్థల్లో చేరితే.. వెండర్స్ వ్యవస్థ మరింత దోచుకుంటోందని రాజేష్ ఆందోళన వ్యక్తం చేశాడు. హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, వేవ్‌రాక్ వంటి ఐటీ కారిడార్లలో పెద్ద పెద్ద ఐటీ సంస్థలకు రవాణా సదుపాయాన్ని అందజేసే వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు వెండర్స్ వ్యవస్థ కారణంగా తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. క్యాబ్ డ్రైవర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీని పెంచి వారికి దక్కాల్సిన ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. ఓలా,ఉబర్ వంటి సంస్థల్లాగే ఐటీ సంస్థలకు రవాణా సదుపాయాన్ని అందజేసే నెపంతో వెండర్స్ వ్యవస్థీకృతమైన దోపిడీకి పాల్పడుతున్నారు. ‘బతుకు దెరువు కోసం రూ.లక్షల్లో అప్పు చేసి స్విఫ్ట్ డిజైర్ వంటి సెడాన్ వెహికల్స్ కొనుగోలు చేసిన డ్రైవర్లు వెండర్లకు కమిషన్ చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఏ రవాణా చట్టాల్లోనూ లేని ఈ ‘వెండర్స్’ వ్యవస్థ.. డ్రైవర్లను నిలువునా దోచుకుంటుంది’ అని ఆం దోళన వ్యక్తం చేశాడు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్. ‘ఓలా, ఉబర్‌లో అన్యాయం జరుగుతుందని ఐటీ కంపెనీలకు వస్తే ఇక్కడా అదే పరిస్థితి ఉంది’ అని విస్మయం వ్యక్తం చేశాడాయన. బడా ట్రావెల్స్‌దే గుత్తాధిపత్యం గ్రేటర్‌లోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు సుమారు 30 వేల మందికి పైగా క్యాబ్ డ్రైవర్లు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నారు. రాత్రింబవళ్లు క్యాబ్ డ్రైవర్ల సేవలు కొనసాగుతున్నాయి. కానీ ఈ డ్రైవర్లలో ఏ ఒక్కరు నేరుగా ఆయా కార్పొరేట్ సంస్థలకు అనుసంధానం కాలేదు. కార్పొరేట్ సంస్థలు తమకు చెల్లించే వేతనాలను కూడా స్వయంగా పొందేందుకు అవకాశం లేదు. వేలాది మంది క్యాబ్ డ్రైవర్లకు, వందల్లో ఉన్న కార్పొరేట్ సంస్థలకు మధ్య కొన్ని బడా ట్రావెల్స్ సంస్థలు మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తూ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ బడా ట్రావెల్స్ కింద మరో రెండు స్థాయిల్లో సబ్ వెండర్స్ పాతుకుపోయారు. మొత్తంగా ఒక కార్పొరేట్ సంస్థకు మూడు స్థాయిల్లో ‘వెండర్స్’ వ్యవస్థ వాహనాలను సమకూరుస్తుండగా, అంతిమంగా తమ సొంత వాహనాలతో రవాణా సదుపాయాన్ని అందజేసే క్యాబ్ డ్రైవర్లు మాత్రం కమిషన్ చెల్లింపులతో తీవ్రంగా నష్టపోతున్నారు. కార్పొరేట్ సంస్థల నుంచి వెండర్ కిలోమీటర్‌కు రూ.14 చొప్పున వసూలు చేస్తూ.. డ్రైవర్లకు మాత్రం రూ.9 చెల్లిస్తున్నారు. ‘కార్పొరేట్ సంస్థలు ఒక షీట్ (ట్రిప్పునకు) రూ.750 వరకు చెల్లిస్తారు. కానీ మా చేతికి అందేది రూ.450 మాత్రమే. పైగా డీజిల్‌పై 8 శాతం చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం’ అని క్యాబ్ డ్రైవర్ అశోక్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాగా పెరిగిన పోటీ ఐటీ కారిడార్లలో ఒకప్పుడు క్యాబ్‌లు మాత్రమే రవాణా సదుపాయాన్ని అందజేసేవి. ఇప్పుడు సిటీ బస్సులతో పాటు, మెట్రో అందుబాటులోకి రావడంతో పోటీ పెరిగింది. దీంతో వెండర్స్‌ను డిమాండ్ చేయలేని పరిస్థితి. ఒక్కో కార్పొరేట్ సంస్థకు ఒకప్పుడు వెయ్యికి పైగా వాహనాల అవసరం ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 60 శాతానికి తగ్గింది. దీంతో క్యాబ్ డ్రైవర్ల మధ్య కూడా పోటీ పెరిగింది. ‘మంత్లీ ప్యాకేజీపై నడిచే పెద్ద వాహనాలు ఉన్నాయి. ఇలాంటి వాహనాలకు కార్పొరేట్ సంస్థలు ప్రతినెలా రూ.45 వేల వరకు చెల్లిస్తే వెండర్లు ఇచ్చేది మాత్రం రూ.35 వేలే. ఈ వ్యవస్థలోంచి బయటకు రాలేక, తగిన ఉపాధి పొందలేక కొట్టుమిట్టాడుతున్నాం’ అని ఆవేదన చెందాడు రాజశేఖర్. వెండర్ వ్యవస్థను రద్దు చేయాలి ఏ మోటారు వాహన చట్టంలోనూ లేని ఈ వెండర్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి. అసంఘటిత రంగంలోని క్యాబ్ డ్రైవర్లకు న్యాయం చేసేందుకు రవాణాశాఖ చర్యలు తీసుకోవాలి. – షేక్ సలావుద్దీన్, తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు గతంలో ఈ దోపిడీ లేదు మొదట్లో వెండర్ వ్యవస్థ లేదు. కార్పొరేట్ సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా వాహనాలను సమకూర్చుకొనేవి. కానీ కొన్ని ట్రావెల్స్ సంస్థల గుత్తాధిపత్యంతో ఇది మొదలైంది. – అశోక్‌గౌడ్, క్యాబ్ డ్రైవర్ తీవ్రంగా నష్టపోతున్నాం అప్పు చేసి బండి కొంటే నెలనెలా ఈఎంఐ చెల్లించలేకపోతున్నాం. ఒక అప్పు తీర్చేందుకు మరోచోట అప్పు చేయాల్సి వస్తుంది. వెండర్స్ వ్యవస్థ లేకుండా చేస్తేనే డ్రైవర్లకు మేలు జరుగుతుంది. – రాజశేఖర్, క్యాబ్ డ్రైవర్ -
‘క్యాబ్‌లో కండోమ్ లేకపోతే చలానా’
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఈ చట్టం గురించి కొత్త కొత్త పుకార్లు కూడా బాగానే షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ చెత్త పుకారు బాగా వ్యాప్తి చేందుతుంది. అదేంటంటే.. బైక్ మీద వెళ్లే వారికి హెల్మెట్, కారులో వెళ్లేవారు సీటు బెల్టు ధరించడం తప్పనిసరి ఎలానో.. అలానే క్యాబ్ డ్రైవర్లు కార్లలో కండోమ్‌లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.. లేదంటే చలానా విధిస్తారంటూ ఓ తప్పుడు వార్త ప్రచారం అవుతోంది. కండోమ్ లేని కారణంగా ధర్మేంద్ర అనే క్యాబ్ డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారట. ఇందుకు సంబంధించిన రిసిప్ట్‌ను అతడు షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వార్త బాగా వ్యాప్తి చెందుతుంది. దీని గురించి ధర్మేంద్ర మాట్లాడుతూ.. ‘ట్రాఫిక్ సిబ్బంది నా క్యాబ్‌ని చెక్ చేసినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో కండోమ్ లేదు అని చెప్పి చలానా విధించారు. నాలా ఇంకొకరికి జరగకూడదనే ఉద్దేశంతో.. చలానా కట్టిన రిసిప్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాను’ అని తెలిపాడు. అంతేకాక ఢిల్లీ సర్వోదయ డ్రైవర్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఇక మీదట క్యాబ్ డ్రైవర్లందరు కార్లలో కండోమ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఆదేశించాడు. ఈ విషయం గురించి పలువురు క్యాబ్ డ్రైవర్లు మాట్లాడుతూ.. ‘ఫిటనెస్ టెస్ట్‌లో భాగంగా చాలాసార్లు ట్రాఫిక్ అధికారులు క్యాబ్‌లో కండోమ్ ఉందా అని ప్రశ్నించేవారు. దాంతో ఒకటి తీసుకుని అలా పడేశాను’ అన్నారు. మరి కొందరు ‘ఎప్పుడైనా యాక్సిడెంట్ లాంటి ప్రమాదాలు జరిగితే కట్టుకట్టడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో క్యాబ్‌లో కండోమ్ ఒకటి ఎప్పుడు ఉంచుతాను’ అన్నారు. అయితే దీని గురించి ట్రాఫిక్ అధికారులను ప్రశ్నించగా కొత్త మోటారు వాహన చట్టంలో ఇలాంటి రూల్ ఎక్కడా లేదని.. ఫిట్నెస్ టెస్ట్‌లో కూడా కండోమ్ గురించి ఎప్పుడు ప్రశ్నించలేదని తెలిపారు. క్యాబ్‌లో కండోమ్ లేదని ఎవరికైనా జరిమానా విధిస్తే.. వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
ఇక టోరా క్యాబ్స్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ రహదారులపై మరో సరికొత్త క్యాబ్ సర్వీస్ ‘టోరా’ అందుబాటులోకి వచ్చింది. సోమవారం ఈ క్యాబ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఉబర్, ఓలా తరహాలోనే టోరా మొబైల్ యాప్ ద్వారా ఈ క్యాబ్ సేవలను వినియోగించుకోవచ్చు. ప్రయాణికులపై ఎలాంటి సర్‌చార్జీల భారం ఉండబోదని, అలాగే డ్రైవర్ భాగస్వాములు కూడా కమిషన్లు చెల్లించాల్సిన అవసరం లేదని టోరా టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (టీటీఎస్‌పీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ శాంతి మండే అన్నారు. డ్రైవర్లు కేవలంయూజర్ చార్జీలు చెల్లిస్తే చాలునని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాలకు టోరా సర్వీసులు అందుబాటులో ఉండేవిధంగా 10,500 మంది డ్రైవర్ భాగస్వాములతో సేవలను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ‘ప్రయాణికులకు, డ్రైవర్లకు ప్రయోజనం కలిగించేవిధంగా టోరా సేవలు ఉంటాయి. యాప్ ఆధారిత క్యాబ్ సేవలను అందించడంలో టోరా ద్వారా విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కొరియన్ భాగస్వామ్య సంస్థతో కలిసి నగరంలో టోరా సేవలను ప్రారంభించారు. ప్రజారవాణా రంగంలో టోరా ఒక బాధ్యతాయుతమైన సంస్థగా సేవలనందజేస్తుందని ఆమె తెలిపారు. మార్కెటింగ్ డైరెక్టర్ కవితా భాస్కరన్ మాట్లాడుతూ, ప్రయాణికులకు పూర్తి భద్రత, నమ్మకమైన రవాణా సదుపాయాన్ని అందజేయడమే లక్ష్యంగా అనేక ప్రత్యేకతలతో టోరాను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇవీ ప్రత్యేకతలు.. ♦ రద్దీ వేళల్లో ప్రయాణికులపై విధించే సర్‌చార్జీలు ఉండవు. ♦ 24/7 టోరా క్యాబ్ అందుబాటులో ఉంటుంది. ♦ అతి తక్కువ వెయిటింగ్ సమయంలో టోరా సేవలు ఉంటాయి. ♦ సమగ్రమైన భద్రతా వ్యవస్థతో టోరా అనుసంధానమై ఉంటుంది. పోలీసుల హాక్ ఐ ద్వారా ప్రయాణికులకు భద్రత లభిస్తుంది. ♦ టోరాలో చేరే డ్రైవర్లు కమిషన్లు చెల్లించవలసిన అవసరం లేదు.రోజు వారి యూజర్ చార్జీ చెల్లిస్తే చాలు. ♦ రోజుకు రూ.199 చొప్పున డ్రైవర్లు యూజర్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. వారానికి 6 రోజులు, నెలకు 25 రోజులు యూజర్ చార్జీలు చెల్లించవలసిఉంటుంది. -
క్యాబ్‌లు, అద్దె కార్లకే మొగ్గు! ఎస్బీఐ చైర్మన్ విశ్లేషణ
జైపూర్: డిజిటల్ లావాదేవీలను గణనీయంగా పెంచే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా ‘యోనో’ క్యాష్ పాయింట్ల సంఖ్యను పెంచనున్నట్లు బ్యాంక్ చైర్మన్ రజనీష్ కుమార్ బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం 70,000 క్యాష్ పాయింట్లు ఉండగా.. వీటి సంఖ్యను వచ్చే 18 నెలల్లో 10 లక్షలకు చేర్చనున్నామని వెల్లడించారు. డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరిగే చర్యలు తీసుకోవడం వల్ల డెబిట్ కార్డు వాడకం తగ్గిపోతుందని, కార్డుల జారీని నిలిపివేసే యోచన తమకు లేదని స్పష్టంచేశారు. ఆటోరంగ మందగమనంపై మాట్లాడిన ఆయన.. ‘ఉద్యోగాల్లో అనిశ్చితి కారణంగా వినియోగదారులు సొంత కార్లను కొనుగోలు చేయడం కంటే.. క్యాబ్‌లు, అద్దెకార్లకే మొగ్గుచూపుతున్నారు. ఈ ప్రభావం ఎంత మేర ఉందనే విషయాన్ని పరిశీలించాలి’ అని విశ్లేషించారు. -
క్యాబ్‌పై 104 చలాన్లు
గచ్చిబౌలి: 104 చలానాలు పెండింగ్ ఉన్న ఓ క్యాబ్‌నుగచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ రఘు కుమార్ మంగళవారం ఉదయం గచ్చిబౌలి ఓఆర్ఆర్పై నో పార్కింగ్‌లో పార్క్ చేసిన క్యాబ్(టీఎస్07యుఎ0202)కు రూ. 200 చలాన్ విధించారు. ఈ సందర్భంగా ట్యాబ్‌లో పరిశీలించగా సదరు వాహనపై 104 చలానాలు ఉన్నట్లు తేలింది. రూ. 17,805 చెల్లించాల్సి ఉన్నట్లు గుర్తించిన ఎస్ఐ క్యాబ్‌ను సీజ్ చేశారు. చలానాలు చెల్లించిన తరువాత కారు విడుదల చేస్తామని డ్రైవర్ రమేష్ గౌడ్‌కు సూచించారు. -
నిండా ముంచిన ‘369 క్యాబ్స్’
తూర్పుగోదావరి, అనపర్తి: ఎక్కువ అద్దె రేటు ఆశచూపి పలువురి నించి కార్లను తీసుకున్న ‘369 క్యాబ్స్’ నిర్వాహకులు వారిని నిండా ముంచారు. అద్దె చెల్లించక, వారి కార్లను ఇతర ప్రాంతాలకు తరలించి తనఖాలు పెట్టి వారిని నానా అవస్థలు పెట్టారు. విశాఖపట్నంలో ప్రారంభమైన ఈఅద్దె కార్ల బాగోతం అనపర్తికి చేరుకుంది. విశాఖపట్నానికి చెందిన ట్రావెల్ నిర్వాహకులు ఆదివారం అనపర్తి ప్రెస్ క్లబ్లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. అడపా ప్రసాద్, అతని మిత్రులు కుమార్, కిషోర్, రాము తదితరులు 2018 జనవరిలో విశాఖ ఎంవీపీ కాలనీ సెక్టార్–2లో ‘369 క్యాబ్స్’ పేరుతో కార్యాలయం ప్రారంభించి అద్దె ప్రాతిపదికన కార్లు సరఫరా చేస్తామన్నారు. విశాఖ వ్యాప్తంగా ప్రతీ నెల అద్దె చెల్లించే విధంగా వారు కార్లను లీజుకు తీసుకున్నారని మురళీప్రియ ట్రావెల్స్ అధినేత ఎన్.వెంకటేష్ తెలిపారు. అలా తమ వద్ద అద్దెకు తీసుకున్న కార్లను రియల్ఎస్టేట్, ఎంఎన్సీ కంపెనీలు, సంస్థలకు సరఫరా చేసి నెలవారీ అద్దెలు క్రమబద్ధంగా చెల్లిస్తామని నమ్మబలికారని తెలిపారు. ఎక్కువ అద్దెలు చెల్లిస్తామని ఆశచూపారని తెలిపారు. దాంతో పలువురు బ్యాంకు రుణాలు తీసుకొని మరీ కార్లు కొనుగోలు చేసి వారికి అప్పగించారన్నారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మధ్యవర్తుల సహాయంతో సుమారు 400 కార్లకుపైగా ‘369 క్యాబ్’ ప్రతినిధులు సేకరించారన్నారు. వారు రెండు నెలల పాటు సక్రమంగానే కారు అద్దెలు చెల్లించి ఆతర్వాత చెల్లించలేదని, కార్ల కోసం సంప్రదించినా సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. దాంతో అనుమానం వచ్చి ఆరా తీయగా ‘369 క్యాబ్స్’ అద్దెకు తీసుకున్న కార్లు అనపర్తి, పరిసర గ్రామాల్లోనే తిరుగుతున్నాయని తెలియడంతో ఆయా గ్రామాలకు వచ్చి విచారించగా ట్రావెల్స్, కార్ల యజమానుల నుంచి అద్దెకు తీసుకున్న కార్లను అడపా ప్రసాద్, తదితరులు ఇతరులకు తాకట్టుపెట్టినట్టు తెలిసిందన్నారు. దీనిపై అడపా ప్రసాద్‌ను తాము ప్రశ్నించగా తప్పుడు కేసులు బనాయించి తమను జైల్లో పెట్టించారని ‘ఓపెల్ క్యాబ్స్’ నిర్వాహకుడు ఎల్.గణపతి వాపోయారు. ఇప్పటి వరకు 71 కార్లు రికవరీ చేయగా మిగిలిన కార్లను రికవరీ చేయాల్సి ఉందన్నారు. తమ ట్రావెల్స్ ద్వారా, బయట వ్యక్తుల నుంచి తాము హామీ ఉండి తీసుకున్న కార్లకు నెలవారీ అద్దెలు చెల్లించక, బ్యాంకు వాయిదాలు బకాయి పడడంతో వారి నుండి ఒత్తిళ్లు అధికమవుతున్నాయని తెలిపారు. దీంతో భార్య, బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడటం తప్ప వేరే మార్గం కనబడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు, ఫైనాన్సర్లు స్పందించి తమ కార్లను తమకు అప్పగించాలని వారు విజ్ఞప్తి చేశారు. కారు యాజమానులు, క్యాబ్స్ నిర్వాహకులు పి.సురేష్, పి.వంశీ, ప్రసాద్ పాల్గొన్నారు. -
కారు బ్యానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లాడు
-
డ్రైవర్ బీభత్సం.. ప్రాణాలతో చెలగాటం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్‌లో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కారు బ్యానెట్‌పై వ్యక్తి ఉండగా... రెండు కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేశాడు. ఘజియాబాద్‌కు చెందిన ఓ యువకుడు తన కారుతో మరో క్యాబ్‌ను ఢీకొట్టాడు. దాంతో ఆ క్యాబ్ డ్రైవర్ ఆ యువకుడిని ప్రశ్నించేందుకు కారుకు ఎదురుగా నిలబడి ఆపే ప్రయత్నం చేశాడు. కారును ఆపేందుకు నిరాకరించిన ఆ యువకుడు .. అలాగే ముందుకు డ్రైవ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్ కారు బ్యానెట్‌పైకి ఎక్కాడు. అయినప్పుటికీ ఆ యువకుడు కారును ఆపకుండా రెండు కిలోమీటర్ల మేర డ్రైవ్ చేశాడు. కానీ క్యాబ్ డ్రైవర్ మాత్రం తన కారును బ్యానెట్‌ను పట్టుకుని వదల్లేదు. ఈ ఘటనను అంతా అదే రోడ్డుపై వెళ్లున్న కొందరు వీడియో తీశారు. కారు బ్యానెట్‌పై ఉన్న యువకుడు కూడా కారు డ్రైవర్‌ను నిలదీస్తూ ఆ వీడియోలో కనిపించాడు. సమచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. -
నేడు ఆటో,క్యాబ్‌ల బంద్
-
గుడ్ బై నవీన్!
మృత్యువు ఒక అజ్ఞాత మిత్రుడు. హఠాత్తుగా వచ్చి కౌగిలించుకుంటుంది. అప్పుడు మనం విడిపించుకోలేం. ఈ భూమిని ఒక శాశ్వత విడిదిగా భావించి నిరంతరం లావాదేవీల్లో మునిగి తేలే నవీన్‌కుమార్ చనిపోయాడు. వాట్సప్‌లో మెసేజ్ చూసి ఒక్కక్షణం షాక్ తిన్నాను. వెంటనే తేరుకుని లెక్కలేసుకున్న. ఇరవై కిలోమీటర్ల దూరం క్యాబ్‌లో వెళ్లి రావాలంటే కనీసం వెయ్యి ఖర్చు. హాఫ్ డే టైం. నవీన్‌తో పనేముంది? చనిపోయిన వాడి గుడ్‌లుక్స్ అవసరమా? వెళితే ఎవరైనా పాత ఫ్రెండ్స్ తగలొచ్చు. ఈ నగరాల్లో మన మొహమే మనం సరిగా చూసుకోం. ఫ్రెండ్స్‌ని చూసుకోవాలంటే ఎవడైనా చావాలి, ‘‘ఏరావస్తున్నావా?’’ ధీరజ్ ఫోన్.‘‘అదే ఆలోచిస్తున్నా’’‘‘ఏంట్రా ఆలోచించేది. ఏం రైటర్విరా నువ్వు. ఫ్రెండ్‌షిప్‌డే గురించి వ్యాసాలు రాయమంటే రాస్తావు. ఫ్రెండ్ చచ్చిపోతే ఆలోచిస్తా అంటావ్. ఏం తీసుకుపోతార్రా మీరంతా. వీడు చూడు నవీన్. లంకంత కొంప కట్టుకున్నాడు. ఈ నైట్ ఆరడుగుల గుంతలో నిద్రపోతాడు’’‘‘కొంచెం ఆపరా బాబూ, జర్నలిస్ట్ ఉద్యోగాల్లో మనం చస్తే కూడా సెలవివ్వరు తెలుసా’’‘‘సరే, నువ్వొస్తానంటే నా కారులో పికప్ చేసుకుంటా’’అయితే, క్యాబ్ ఖర్చు మిగిలిందన్న మాట. వెళితే సరి, ఫ్రెండ్‌ని ఆఖరిసారి చూసినట్టుంటుంది. ‘గున్న గున్న మామిడి..’’ పాటకి కారు కూడా ఊగుతోంది. ‘‘మనం వెళ్లేది చావుకి, పెళ్లికి కాదు... పాట మారుస్తావా’’ చిరాగ్గా అన్నాను.ధీరజ్ నా వైపు సీరియస్‌గా చూశాడు.‘‘డ్రైవింగ్, షేవింగ్ జాగ్రత్తగా చేయాలి. లేదంటే బ్లడ్డే’’ అన్నాడు.‘‘ఇప్పుడీ కొటేషన్ అవసరమా?’’‘‘డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని అర్థం. అయినా వాడు నవీన్ చచ్చిపోతే ఈ ప్రపంచమేమన్నా ఆగిపోయిందా? ఈ నైట్ మనంభోంచేయమా, మందు కొట్టమా?’’‘‘కొంచెం డీసెన్సీ అక్కరలేదా?’’‘‘ఏంట్రా డీసెన్సీ? లైఫ్‌లో పైకెదగాలని వాడెన్నెన్ని ఘోరాలు చేశాడో తెలియదా నీకు? ఇప్పుడు కూడా వాడి డెడ్‌బాడీ దగ్గరకెళ్లి, ‘అరె, నీకు ప్రమోషన్ వచ్చింది లే’ అంటే లేచి కూచుంటాడు. కావాలంటే పందెం’’పకపక నవ్వాడు.‘‘చనిపోయిన వాళ్ల మీద సెటైర్లు అవసరమా?’’‘‘ఏం రేపు నువ్వు చచ్చిపోవా? నేను చచ్చిపోనా? అప్పుడు బతికున్నోళ్లంతా మన మీద జోకులేసుకోరా? నీలాంటి వాళ్లంతా నెగటివ్ ఎనర్జీ. రెండురోజులు మీతోవుంటే మెంటలొస్తుంది. నన్ను చూడు, బ్లడ్‌గ్రూప్‌తో సహా బీ పాజిటివ్’’‘‘నవీన్ ఇల్లొచ్చేసింది. కొంచెం సీరియస్‌గా వుండు’’‘‘ఇప్పుడు నువ్వక్కడ చేసే యాక్టింగ్‌కి నంది అవార్డ్ ఇచ్చేయొచ్చు కదా.. ఫేక్ న్యూస్‌లు రాసిరాసి మనిషే ఫేక్ అయిపోయావ్’’‘‘మూసుకుని రా, పొలిటీషియన్లు కూడా నీ అంత చెత్తగా మాట్లాడరు.’’ నవీన్‌ది ఇండిపెండెంట్ హౌస్. గేటెడ్ కమ్యూనిటీ. ఇంటి ముందు షామియానా, కుర్చీలు. భగవద్గీత వినిపిస్తోంది. వాడి కారు మిలమిల మెరుస్తోంది. దాని మీద కాసింత దుమ్ము పడనిచ్చేవాడు కాదు.డ్రైవర్ని చెడామడా తిట్టేవాడు. సాయంత్రం వాడి మీద అందరూ తలా ఇంత గుప్పెడు మట్టి చల్లుతారు. కోట్లు లెక్కపెట్టి అలసిపోయిన చేతుల మీద మట్టి రేణువులు పరుచుకుంటాయి. సూక్ష్మజీవులు శరీరాన్ని తినేస్తాయి.ఎవరో అటూ ఇటూ తిరుగుతున్నారు. చావు దగ్గర ఎలా వుండాలో నాకు తెలియదు. బర్త్‌డేలు, పెళ్లిళ్లయితే నవ్వుతూ వెళ్లి పలకరిస్తాం. ఇక్కడేమో అంతా గంభీరంగా వుంటారు.సంతోషాన్ని షేర్ చేసుకోవచ్చు. కన్నీళ్లతోనే సమస్య. ఈ మధ్య ఒకరింటికెళితే, ఆవిడ నన్ను పట్టుకుని భోరుమని ఏడ్చింది. నాకేమో ఏడుపు రాదు. కళ్లు వుత్తుత్తిగా తుడుచుకున్నా. ఆ తర్వాత నెలరోజులకి నేనో బ్యూటీషియన్ ఇంటర్వ్యూ కోసం వెళితే అక్కడ ఆమె కనిపించింది. అన్నీ మరచిపోయి ప్రశాంతంగా కనిపించింది. ఆరోజు ఆమె ఏడుపు చూసి, పోయిన మొగుడితో పాటు ఈమె కూడాపోతుందేమో అనిపించింది. ఏదీ ఆగదు. పోయేవాళ్లు పోతూనే ఉంటారు.ఇంట్లోకెళ్లాం. నవీన్ వైఫ్ ప్రశాంతి నన్ను చూసి కళ్లు తుడుచుకుంది. ఫ్రీజర్ బాక్స్‌లో నవీన్ నిద్రపోతున్నాడు. వాడికి ఐస్క్యూబ్లంటే ఇష్టం.విస్కీ తాగితే సోడా, వాటర్ ఏదీ తీసుకోడు. ఓన్లీ ఐస్‌క్యూబ్స్. ఒక పెగ్గు మందు గ్లాసులో పోసుకుని ఫుల్‌గా ఐస్‌క్యూబ్స్‌తో నింపేవాడు. ఇప్పుడు చల్లగా.. ఆ బాక్స్‌లో.‘‘ఉదయం ఆఫీస్కెళుతుండగా గుండెపోటు వచ్చింది... హాస్పిటల్‌కి తీసుకెళ్లే టైం కూడా లేదు’’ ప్రశాంతి చెబుతూ వుంది.‘‘వాడికి గుండె కూడా వుందంటావా... నిచ్చెనలెక్కడానికి ఎందర్ని ఫినిష్ చేశాడో వీడు’’ ఈధీరజ్గాడు తాగినా తాక్కపోయినా కుక్కలా ఏదో ఒకటి మొరుగుతూ వుంటాడు. వాడికి రావాల్సిన ప్రమోషన్ ఆ నవీన్ కొట్టేశాడు. అప్పట్నుంచి కడుపుమంట.వీళ్లంతా నాకు ఎంబీఏలో క్లాస్మేట్స్.జర్నలిజం మీద పిచ్చికొద్దీ నేను రిపోర్టర్నయ్యా. కంపెనీల్లో చేరి వాళ్లు ఇళ్లు కట్టుకున్నారు. నేను అద్దె ఇంట్లో వుంటున్నా. ఈ దేహమే ఒక అద్దె ఇల్లు. నవీన్ ఖాళీ చేశాడు. ఏదో ఒకరోజు మేమూ ఖాళీ చేస్తాం.ఎవరెవరో వస్తున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు.‘‘ఇప్పుడంతా ప్యాకేజీ సిస్టం. పుట్టడానికి, బతకడానికి, చావడానికి అన్నీ ప్యాకేజీలే. క్రిమేషన్ వరకు ప్యాకేజీనే. పంతులు ఖర్చులు కూడా ఇన్‌క్లూడెడ్’’ నవీన్ బంధువు ఎవరో మాట్లాడుతున్నారు.‘‘చాలా ఎక్కువ చెబుతున్నాడు. నీ ఇన్ఫ్లుయెన్స్ వుపయోగించి చూడు. తగ్గిస్తారు’’‘‘ఏం తగ్గిస్తారు? మన బాధ వాళ్లకి వ్యాపారం.’’‘ఈ ప్రపంచంలో ప్రతిదీ వ్యాపారమే. మనల్ని మనం అమ్ముకుంటాం. లేదా ఎవరో ఒకర్ని కొంటూ వుంటాం. లాభనష్టాలు అనే పదాలపై ఈ లోకం నడుస్తుంది. ఎమోషన్స్, రిలేషన్స్ అన్నీ ఇవే నడిపిస్తాయి.’’అనేవాడు.ప్పుడు వాడి చివరి ప్రయాణంతో వ్యాపారం జరుగుతోంది. మనం ఎదుటివాళ్ల వ్యాపారాన్ని గుర్తిస్తాం కానీ, మన వ్యాపారాన్ని గుర్తించం. ఇరవై ఏళ్లుగా పరిచయమున్న నవీన్ చనిపోతే నాకు దుఃఖం రాలేదు. క్యాబ్ ఖర్చుల గురించి ఆలోచించాను.ఘంటసాల గొంతు వినిపిస్తోంది.చావు ఇంట్లో ఈ భగవద్గీత వినిపించాలని మొదట ఎవడు కనిపెట్టాడో? భగవద్గీత వినపడగానే ఎవడో పోయాడని అర్థమైపోతుంది.ప్రశాంతి కళ్లు తుడుచుకుంటోంది.నిజంగా ప్రశాంతి నవీన్‌ని ప్రేమించిందా? లేదంటే ఇక్కడ దుఃఖం ఒక అనివార్యత మాత్రమేనా?‘జీవితం ఒక గేమ్. ఫౌల్ ఆడయినా సరే గెలవాలి. నాకు సెంటిమెంట్స్ లేవు. మనం గెలవాలంటే ఎవడో ఒకడు ఓడాలి’నవీన్ ఫిలాసఫీ ఇది.నవీన్ గెలిచాడా.. ఓడాడా?లేత పసుపురంగులోకి మారింది మొహం. చివరి క్షణాల్లో బాధని అనుభవించాడా? మృత్యువు ఎదురైనప్పుడు అతని ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి?కలలన్నీ సునామీలో కొట్టుకుపోతున్నప్పుడు, ఏడుస్తూ వాటి వెంట పరుగెత్తాడా? పైసా ఖర్చు లేకుండా గుండెల నిండా పీల్చుకునే గాలి, కోట్ల రూపాయలిచ్చినా హృదయాన్ని తాకకుండా వుక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడుఏ మనిషయినా ఏం చేస్తాడు?జీవితంలో ప్రతిదీ ప్లాన్ చేశాడు. కానీ చావు వాడి కోసం వేసిన ప్లాన్‌ని కనుక్కోలేకపోయాడు.‘దేవుడు మన కోసం బ్లాంక్ పేపర్ని వదిలేస్తాడు. ప్రతిదీ మనమే రాసుకోవాలి. ఒకవేళ దేవుడు తప్పుడు రాత రాసినా సరే, మనమే కరెక్ట్ చేసుకోవాలి’ మిడిల్‌క్లాస్‌లో పుట్టిన నవీన్ ఇలాగే మాట్లాడి, ఇలాగే జీవించాడు. నిజానికతను చాలా సిస్టమాటిక్.తెల్లారి నాలుగుకి లేచేవాడు. వాకింగ్, యోగా, ధ్యానం, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ ఆరుగంటల లోపే. ఏడు గంటల వరకు పేపర్ రీడింగ్, ముఖ్యంగా బిజినెస్ పేజీలు. సెవెన్ టు ఎయిట్ ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్. ఎయిట్‌కి ఆఫీస్‌కి బయలుదేరితే వన్ అవర్ జర్నీ.తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు ఆఫీస్. రోజుకి పన్నెండు గంటలు పనిచేసేవాళ్లని ప్రతి సంస్థ ఇష్టపడుతుంది. తొమ్మిదికి బయలుదేరి, మధ్యలో ఒక పెగ్గు విస్కీ. పదకొండు గంటలకి ఇల్లు, నిద్ర, వీలైతే రోమాన్స్. శని, ఆదివారాలు ఏం చేయాలో నెల ముందే ఫిక్సయిపోతాయి.ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పదకొండు వరకు డ్రైవర్ డ్యూటీలోనే వుంటాడు. అతను భోంచేశాడో లేదో ఏనాడూ అడిగేవాడు కాదు. నిజానికి ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న డ్రైవర్ పూర్తి పేరేంటో కూడా తెలియదు. కష్టాలు వినడం ప్రారంభిస్తే ప్రతివాడు టన్నుల కొద్దీ కష్టాల్ని మన మీద మోపుతాడు. ఆ బరువుకి ఇక పైకి లేవలేం. సుఖపడ్డానికే ఈ భూమ్మీదకొచ్చాం. సుఖపడాలి అంతే. ఎవరూ కష్టపడకపోతే మనమెలాసుఖపడతాం?నిచ్చెన ఎక్కుతున్నప్పుడు చూపు పై మెట్టు మీదే ఉండాలి. కాలి కింద నలుగుతున్న మెట్టు మీద కాదు.అతనికి ఫిక్షన్ చదివే అలవాటు లేదు. కెరీర్ మేనేజ్మెంట్ పుస్తకాలే చదివేవాడు. నచ్చిన వాక్యాల్ని అండర్లైన్ చేసుకునేవాడు.ఇదంతా పులి మేక ఆట. నువ్వు పులివో, మేకవో నిర్ణయించుకో. పులివైతే మేకని తిను. వేటగాడి నుంచి కాపాడుకో.ఇలాంటి వాక్యాలు బాగా ఇష్టం.నవీన్ కొలీగ్స్ చాలామంది వస్తున్నారు. గంభీరంగా కళ్లు తుడుచుకుంటున్నారు. చనిపోయింది తాము కాదనే రిలీఫ్. వాళ్లలో ఒక అందమైన అమ్మాయి వెక్కివెక్కి ఏడ్చింది.ప్రశాంతి ఒక్క క్షణం చిరాగ్గా, అనుమానంగా చూసింది.ఇక్కణ్ణుంచి వెళ్లిపోగానే అందరూ చర్చించే విషయం ఒకటే. నవీన్ ప్లేస్‌లో వచ్చే అదృష్టవంతుడెవడురా అని!ఈపాటికి పైరవీలు ప్రారంభమై వుంటాయి.నవీన్ చాలా కలలు కన్నాడు. ఇది కలలు లేని నిద్ర.ప్రతి ఆరునెలలకోసారి అన్ని టెస్ట్‌లు చేయించుకునేవాడు. డైట్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేవాడు. ఎగ్ ఎల్లో తినేవాడు కాదు. అది కొలెస్ట్రాల్. ఆయిలీ ఫుడ్స్ నిషిద్ధం. ఇష్టాలన్నీ అణచేసేవాడు.పురోహితుడొచ్చాడు. జరగాల్సిన కార్యక్రమాన్ని వివరించాడు.శవాన్ని బాక్స్‌లోంచి బయటికి తీశారు. ప్రశాంతి వెక్కివెక్కి ఏడుస్తోంది. వాళ్లకి పిల్లలు లేరు. ప్లానింగ్‌లో భాగంగా, ఇల్లు తర్వాతే పిల్లలు.ఈ భూగోళానికి మనం అతిథులు మాత్రమే.. ఈ వాక్యాన్ని నేనే రాశాను. వృత్తిలో భాగంగా రోజూ ఏదో ఒకటి రాయాలి. మనం చదివే పుస్తకాలు, వినే ప్రవచనాలు దేన్నీ జీవితానికి అన్వయించుకోం.వాస్తవంలోకి వస్తే మళ్లీ పేడపురుగులా జీవితాన్ని దొర్లిస్తూ వుంటాం. నవీనంటే నాకు అసూయ. వాడికి ఇల్లుంది. నాకు లేదు. నాకంటే జీతమెక్కువ. నా జీతం నాకు చాలదు. వాడికి లగ్జరీకారుంది.వైకుంఠరథం ఆగింది. ఏవేవో శ్లోకాలు, కొటేషన్లు దాని మీద రాశారు. డ్రైవర్ నిర్వికారంగా దిగాడు.‘‘స్నానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వన్ అవర్‌లో వెళ్లిపోదాం’’ చెప్పారెవరో.నవీన్ బాడీని నలుగురు పట్టుకున్నారు. తెల్లటి బనీను, పంచె. మెడలో గోల్డ్‌చైన్. నున్నగా షేవ్ చేసిన గడ్డం. ఎక్కడా కొవ్వు లేకుండా ఫిట్‌గా ఉన్న బాడీ. చాలాకాలం బతకాల్సినోడు.వేలికున్నఉంగరాలు,మెడలోని గొలుసు తీసేశారు. ఇంటి ముందు ఆవరణలో ఒక కుర్చీలో బాడీని వుంచి ఇరువైపులా పట్టుకున్నారు. రెండు బకెట్లతో గోరువెచ్చని నీళ్లొచ్చాయి. ఒకచెంబులోకుంకుడురసం. నవీన్ తండ్రి రెండేళ్ల క్రితం పోయాడు. హార్ట్ పేషెంట్. డబ్బులు ఖర్చవుతాయని ఆయనకి సరైన వైద్యం చేయించలేదని అంటారు. ఆ తర్వాత ఆరునెలలకి తల్లి కూడా పోయింది. వాళ్ల కోసం పెద్దగా దుఃఖించినట్టుగా కూడా లేడు. తల్లి పోయిన మరుసటి రోజే బోర్డ్ మీటింగ్‌కి అటెండయ్యాడు.‘ఎమోషన్స్ వుంటే లైఫ్‌లో ప్రమోషన్స్ రావు’– ఇది కూడా అతని కొటేషనే.నేనూ, ధీరజ్, ప్రశాంతి,నవీన్ నలుగురం ఎంబీఏలో క్లాస్మేట్స్. ధీరజ్‌తో ప్రశాంతి చాలా క్లోజ్. ఒకరకంగా లవ్. ఒకర్నొకరు దిలేవాళ్లు కాదు. చదువు తర్వాత నేను జర్నలిజం వైపు వచ్చాను. నవీన్‌కి మంచి కంపెనీలో జాబ్‌వచ్చింది. ధీరజ్ ఇంకా ట్రయల్స్‌లో వుండేవాడు.ఒకరోజు నన్ను కాఫీషాప్‌కి రమ్మంది ప్రశాంతి. కూచున్న వెంటనే ఏడవడం స్టార్ట్ చేసింది.‘ధీరజ్ చాలా పొసెసివ్‌గా మారిపోతున్నాడు. నవీన్ నాకు ఇప్పిస్తానంటే వద్దంటున్నాడు. అసలు నవీన్‌తో మాట్లాడితేనే మండిపోతున్నాడు.’’ ఇవే వాక్యాల్ని అటు ఇటు తిప్పి చాలాసేపు మాట్లాడి వెళ్లిపోయింది.తర్వాత ధీరజ్ నుంచి ఒకరోజు ఫోన్.‘‘ప్రశాంతి జాబ్‌లో చేరింది. ఆ నవీన్ ఆఫీస్‌లో’’‘‘అయితే ఏంటి?’’‘‘ఇప్పుడు దానికి నాకంటే వాడే ఎక్కువ’’‘‘అది ఇదని అమ్మాయిల్ని చీప్‌గా మాట్లాడకు. జాబ్ లేదని నీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్’’‘‘జాబ్ లేదనే నన్నొదిలేసింది. నవీన్‌కి మేనేజర్ పోస్టుంది. పైగా సేమ్ క్యాస్ట్. ఇంట్లో ప్రెషర్స్ ఉండవు. షికార్లకు నేను, పెళ్లికి వాడు...’’‘‘సైకోలాగా మాట్లాడకు’’‘ప్రేమిస్తే తెలిసేది నా పెయినేంటో’’ వెక్కిళ్లతో ఫోన్ పెట్టేశాడు.నెలరోజుల తర్వాత ప్రశాంతి,ధీరజ్ కొంచెం దూరంలో నిలబడి ప్రశాంతిని చూస్తున్నాడు. అసలు వాడు నవీన్‌ని చూడ్డానికొచ్చాడా? ప్రశాంతి కళ్లలో బాధని చూడ్డానికొచ్చాడా? లోపల వాడిలో శాడిస్టిక్ హ్యాపీనెస్ వుందా? ఏమోబయటపడ్డం లేదు. మనుషులంతా ఇంతే, లోపల ఏంఆలోచిస్తుంటారో . ఆలోచనలు మదపుటేనుగుల్లాంటివి. అవి మనల్ని తొక్కిపడేస్తాయి.వైకుంఠరథం నుంచి పాడెని దింపారు. నవీన్‌ని అందులోపడుకోబెట్టారు. మా ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీలో కూచోడానికే ఇబ్బందిపడేవాడు. కుషన్ లేకపోతే వాడి వల్ల కాదు.వెదురుబద్దలపై కాసింత గడ్డి, పాడెలోని అసౌఖ్యం తెలిసే అవకాశం లేదు.‘గోవిందా’ అని అరుస్తూ పాడెని ఎత్తారు. ప్రశాంతి కుప్పకూలిపోయింది.‘‘శ్మశానానికి వెళదామంటావా?’’ అడిగాడు ధీరజ్.‘‘నేను వైకుంఠరథంలో వస్తా’’‘‘ఎందుకు కారుందిగా’’‘నువ్వు కారులో రా, శ్మశానం నుంచి కారులో వెళ్లిపోదాం’’నేను వైకుంఠరథంలో కూచున్నాను. చుట్టూ కొంతమంది గంభీరంగా, భావరహితంగా వున్నారు. ప్రశాంతితో పాటు చాలామంది కార్లలో బయలుదేరారు. రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్.వైకుంఠరథాన్నిభయంగా చూస్తున్నారు. చనిపోయింది తాము కాదనే ఆనందంతో పాటు, ఎప్పటికైనా తాము కూడా చనిపోవాల్సిందే అనే భయం వాళ్ల కళ్లలో కనిపిస్తోంది.హరిశ్చంద్ర వాటికలో రథం ఆగింది. కారులో నుంచి ప్రశాంతి దిగింది. కలలో నడుస్తున్నట్టుగా వుంది. జరుగుతున్నదంతా నిజం కాకపోతే బాగుండు అన్నట్టు చూస్తోంది.నిన్న రాత్రి వాళ్లు చాలా కబుర్లు చెప్పుకుని వుంటారు. ఈ సమ్మర్లో వెళ్లేయూరోప్ ట్రిప్ ప్లానింగ్ గురించి మాట్లాడి వుంటారు. నిద్రలేచే సరికి జీవితం మారిపోయింది.దహనవాటికల్లో ఒకదాని మీద నవీన్‌కుమార్ పేరు రాశారు.‘‘అదేంటి మీ ఆచారం దహనం కాదు కదా?’’ ఎవర్నో అడుగుతున్నాడు ధీరజ్.‘‘సిటీల్లో అవన్నీ ఎక్కడ కుదురుతాయి సార్, ఖననమంటే ప్లేస్ లేదంటున్నారు. కాదు కూడదంటే కాస్టీ›్ల చెబుతున్నారు. అందుకే ఇలా... ఖర్చుకి వెనుకాడకుండా గంధపుచెక్కలు కూడా తెప్పించాం.’’‘‘రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అని పడి చచ్చాడు. చివరికి ఆరడుగుల నేల కూడా దక్కలేదు వీడికి. గాలిలో కలిసిపోతున్నాడు’’ అన్నాడు ధీరజ్.ఎవరికి మాత్రం ఏం దక్కుతుంది? మార్కుల కోసం ప్రొఫెసర్లని కాకా పట్టినవాడు.. ఎందర్నో ఉద్యోగాల్లోంచి తీసేసినవాడు.. సాటివాడు ఒక మనిషేనని గుర్తించలేనివాడు... అంతా శాశ్వతమని నమ్మినవాడు... కట్టెలపై నిద్రపోతున్నాడు. శవం చుట్టూ అందరూ తిరుగుతున్నారు. బంధువులెవరో నిప్పుపెట్టారు. చిన్నగా మంట... మొదట నెయ్యి, తర్వాత కిరోసిన్. మంటని ఎగదోశారు.అపురూపంగా చూసుకున్న శరీరం కాలిపోతోంది. జీవుడేమయ్యాడు? చిటపటమని చితిమంటలు. ప్రశాంతి నిర్వికారంగా చూస్తూ వుంది. రాబోయే ఇరవయ్యేళ్లకి సరిపడా ప్లాన్ చేశారు. పిల్లల్ని ఎప్పుడు కనాలి.. ఎలా పెంచాలి.. ప్లేస్కూల్ ఎక్కడ చేర్చాలి...స్కూలింగ్ తర్వాత కెరీర్ ఏంటి... ఇరవయ్యేళ్ల తర్వాత ఏ కంట్రీలో అవకాశాలు ఎక్కువుంటాయి..టప్మని శబ్దం.‘కపాలమోక్షం’ అంటున్నారెవరో..దహనవాటికకి కొంచెం దూరంలో ఎవరో ముసలమ్మ.. చేతిలో గిన్నె ఆడిస్తోంది. పురాతన బండరాళ్లలో కనిపించే ముడుతలు ఆమె మొహంలో. జీవితం కంటే మృత్యువునే ఎక్కువ చూసుంటుంది.‘‘దానం చేయకుండా వెళ్లకూడదు బాబూ..’’స్నేహితుడు చచ్చిపోతే క్యాబ్ ఖర్చుల గురించి ఆలోచించాను.. క్రూరత్వం నాలో వుందా? నగర జీవితంలో వుందా?పర్స్ తీసి రెండు ఐదువందల నోట్లు వెళ్లతో పట్టుకున్నా... ముసలమ్మ ఆశ్చర్యంగా చూసింది.గిన్నెలో వేశాను. శ్మశాన వైరాగ్యమంటే ఇదేనేమో!ధీరజ్ కారు తీశాడు.‘‘నేను రాను, నడిచి వెళతా’’ అన్నాను.‘‘నడిచా.. మీ ఇల్లెంత దూరమో తెలుసా’’‘‘నేను వెళ్లేది ఇంటికి కాదు.’’‘‘మరి’’దూరంగా మంటలు కనిపిస్తున్నాయి.గమ్యం అర్థమైంది. గమ్యం లేకుండా కాసేపు నడవాలనిపించింది. శ్మశానం కాంపౌండ్ గోడ దాటి వెనక్కి తిరిగి చూశాను.ఇల్లు ఇక్కడుంటే.. మనుషులంతా ఎక్కడెక్కడో వెతుకుతూ వుంటారు. ∙జి.ఆర్.మహర్షి -
హలో దోస్త్.. కైసే హో?
‘హాయ్ ఫ్రెండ్స్! ఏం చేస్తున్నారు? హ్యాపీనా?’తన యూట్యూబ్ ఫాలోవర్లను ఇలాగే పలకరిస్తాడు ఉబర్ డ్రైవర్ గోల్డీ సింగ్. చెరగని చిరునవ్వుతో.. రంగురంగుల తలపాగాలతో.. సరదా సంభాషణతో.. వారిని ఆకట్టుకుంటాడు. అందుకే రోజుకు వందమంది చొప్పున ఇతడి ఫాలోవర్ల జాబితాలో చేరిపోతున్నారట. ఇతడి వీడి యోలు తమను సంతోష పెడుతున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారట. 33 ఏళ్ల ఈ ఢిల్లీ డ్రైవర్‌కి క్యాబ్ ఓ ‘చక్రాల కార్యాలయం’.. ఓ స్టూడియో. అందులో అతడు సహ డ్రైవర్లతో కబుర్లాడతాడు. దేశ, విదేశీ ప్రయాణికులతో ముచ్చటిస్తాడు. వీటన్నింటినీ మొబైల్‌తో చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటాడు. జనవరిలో ఇతడు యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఫాలోవర్ల సంఖ్య 20 వేలకు పైమాటే. క్యాబ్ డ్రైవర్లకు, డ్రైవర్లు కాబోయే వారికి గోల్డీ సలహాలిస్తాడు. జాగ్రత్తలు చెబుతాడు. వృత్తి కొనసాగించేందుకు అవసరమైన ఉత్సాహమిస్తాడు. వారానికి నాలుగు వీడియాలు అప్లోడ్ చేస్తున్న ఈ డ్రైవర్ నికరాదాయం రూ.20 వేలు. ఇప్పుటికి 126 వీడియోలు పెట్టాడు. ఇతని మాటల్లో మన దేశం కనిపిస్తుంది. మన డ్రైవర్ల జీవితాలు కనిపిస్తాయి. రోజువారీ జీవితంలో ఇతడికి ఎదురయ్యే వింత వింత అనుభవాలుంటాయి. అంతా యాప్ దయ.. వృత్తి జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవాలు డ్రైవర్లను ఆత్మ న్యూనతకు లోను చేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితిని అధిగమించడమెలాగో చెబుతుంటాయి మహమ్మద్ షారుఖ్ వీడియోలు. ‘లక్నో షారుఖ్’పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతున్న ఈ పాతికేళ్ల యువకుడు.. ఒకటిన్నర సంవత్సరం కింద లక్నో నుంచి ఢిల్లీ వచ్చాడు. ఓలా షేర్ బుకింగ్‌లో చేయకూడని పొరపాట్లు, రెంటల్స్ బుకింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ ఇతడు రెండు వీడియాలు చేశాడు. ఇప్పుడు ఓలా, ఉబర్ వంటి కంపెనీల్లో పనిచేసే డ్రైవర్ల సంఖ్య పెరిగింది. అన్ని ఖర్చులు పోగా రూ. 700–800 మిగలాలంటే రోజుకు కనీసం 15 గంటలు పని చేయాల్సిందే. నాతో సహా అనేకమంది అప్పులు చేసి కార్లు కొనుక్కొని, కంపెనీలకు అటాచ్ చేశాం. అప్పులు తీర్చడం మాత్రం కష్టమైపోతోంది. ఇప్పటికి 5 నెలల బాకీ ఉంది. ఒక్క యాప్ దయ మీదే ఇప్పుడు నా జీవితం ఆధారపడిఉంది’అంటున్నాడు షారుక్. ‘డ్రైవర్ దోస్త్ ’అప్డేట్స్ గోల్డీ సింగ్ మాదిరిగా ఢిల్లీలోని పలువురు డ్రైవర్లు ఇప్పడు యూట్యూబ్ ద్వారా తమ బతుకు చిత్రాలను ప్రజల ముందుంచు తున్నారు. వీరిలో ఒకరు విజయ్ సింగ్. ఇతడు ‘డ్రైవర్ దోస్త్’పేరిట ఓ చానల్ నడుపుతున్నాడు. 15 వేల మంది ఫాలోవర్లున్నారు. 30 ఏళ్ల ఈ యువకుడు పత్రికల నుంచి ఆసక్తికర వార్తలు సేకరిస్తాడు. వీడియోల్లో వాటిని చదువుతూ, వివరిస్తూ కనిపిస్తాడు. ‘ఎక్కువ మంది డ్రైవర్లు పత్రికలు చదవలేరు కాబట్టి కొన్ని వార్తల్ని వారికి వివరిస్తాను. అవి డ్రైవర్లపై చూపగల ప్రభావం గురించి చెబుతాను’అంటున్నాడు. ఇప్పటికి 113 వీడియోలు అప్లోడ్ చేశాడు. 2017 వరకు ఇతడు ఓలా డ్రైవర్. ఇప్పుడు సొంత టాక్సీ నడుపుకుంటున్నాడు. షూటింగ్, వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాడు. ఓ మైక్, సెల్ఫీ స్టిక్ ఎప్పుడూ దగ్గర ఉంచుకుంటాడు. అనేక వీడియోల్లో టెక్ గురూ అవతారమెత్తి.. మొబైల్ హోల్డర్లు, కార్ చార్జర్లు, కారు కెమెరాల వంటి వాటి వాడకానికి సంబంధించి కొన్ని టిప్స్ చెబుతుంటాడు విజయ్. 10 వేల సమాధానాలు.. ♦ 2016 వరకూ గోల్డీ ఏసీ, రిఫ్రిజరేటర్ మెకా నిక్. సంపాదనలో 10 శాతాన్ని దాన«ధర్మా లకు వెచ్చించాలనే సిక్కు సంప్ర దాయాన్ని ఇతడు పాటిస్తాడు. ఆ సంప్రదాయం తో సంతోషపరి చేది తన ప్రయాణి కులనే! వారికి ఉచితంగా కాఫీలు, శీతల పానీయాలు, నీళ్ల బాటిళ్లు, బిస్కెట్లు అందిస్తాడు. ♦ తన చానల్‌కు రోజుకు వంద మంది తోడవుతున్నట్లు చెబు తున్నాడు గోల్డీ. వీరిలో కెనడా తదితర దేశాల ప్రజలు కూడా ఉన్నారు. తన వీడియోలపై ప్రజలు పెట్టే కామెంట్లకు గోల్డీ ప్రతిస్పందిస్తాడట. ఇప్పటికి 10 వేల సమాధానాలిచ్చాడట. ’అనేక మంది నా వీడియోలు సంతోషం పంచాయనే కామెంట్ పెడుతుంటారు. ఇది నాకు గొప్ప అభినందనగా భావిస్తాను’అంటాడు గోల్డీ. విభిన్నంగా.. ♦ యాంకరింగ్‌లో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. హిందీ, ఇంగ్లిష్; పంజాబీ భాషల్ని కలగాపులగం చేసి సరదా సంభాషణ చేస్తుంటాడు గోల్డీ. కోరమీసంతో, నల్ల కళ్లాద్దాలతో సూటిగా చెప్పాల్సిన విషయాలు చెప్పేస్తుంటాడు విజయ్. నాలుగు నెలల కింద చానల్ ప్రారంభించిన షారుఖ్.. గోల్డీ బాణిని అనుకరిస్తుంటాడు. ఇతడు గోల్డీని ఎప్పుడూ కలవలేదట. కానీ ఆయన వీడియోలు చూసి స్ఫూర్తి పొందాడట. ఓలా, ఉబర్ సర్వీసుల్లో పనిచేస్తున్న ఈ డ్రైవర్ ఇప్పటికి 50 వీడియోలు అప్లోడ్ చేశాడు. -
ప్రమాదంలో జర్నీ
సాక్షి, సిటీబ్యూరో: రాత్రి 11 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ నుంచి ఎల్బీనగర్ వెళ్లడానికి ఓ ప్రయాణికుడు క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కాడు. వీరి వాహనం నాంపల్లి దాటిన తర్వాత డ్రైవర్ నిద్రలోకి జారుతుండటం గుర్తించిన ప్రయాణికులు నిలదీశాడు. ‘ఉదయం నుంచి అన్నీ లాంగ్ బుకింగ్సే సార్.. రెస్ట్ లేదు’ అంటూ సమాధానమిచ్చాడు డ్రైవర్. జూబ్లీహిల్స్ నుంచి కొండాపూర్ వెళ్లడానికి మరో వ్యక్తి యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేశాడు. బుకింగ్ కన్ఫర్మ్ అయిన సమయంలో ఓ డ్రైవర్ పేరు, ఫొటో కనిపించాయి. తీరా క్యాబ్ వచ్చిన తర్వాత చూస్తే డ్రైవింగ్ సీట్లో వేరే వ్యక్తి ఉన్నాడు. అదేమంటూ ప్రయాణికుడు ప్రశ్నిస్తే... ‘క్యాబ్ మా సార్‌ది. నేనూ డ్రైవింగ్ చేస్తుంటా’ అని అన్నాడు. నగరంలోని అనేక మంది క్యాబ్ వినియోగదారులకు ఈ అనుభవాలు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి. వీటిని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో పాటు ఎవరికి ఫిర్యాదు చేయాలే తెలియక కొందరు, మనకెందుకులే అనే భావనతో మరికొందరు వదిలేస్తున్నారు. ఈ తరహా ఉల్లంఘనలు, నిర్లక్ష్యాలు కొన్ని సందర్భాల్లో భద్రతపై నీలినీడలు వ్యాపింపజేసే ప్రమాదం ఉందన్నది నిర్వివాదాంశం. జరగరానిది ఏదైనా జరిగితే తప్ప ఈ అంశాలపై ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు దృష్టి పెట్టే పరిస్థితులు కనిపించట్లేదు. భద్రమనే ఉద్దేశంతోనే వాటి వైపు... రాజధానిలో క్యాబ్‌ల సంఖ్య లక్ష వరకు ఉంటుంది. ఆటోలు వీటికంటే చాలా ఎక్కువగానే ఉంటాయి. క్యాబ్ ఎక్కాలంటే కచ్చితంగా యాప్ ద్వారానో, ఫోన్ వినియోగించో బుక్ చేసుకోవడంతో పాటు అది వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. అయినప్పటికీ ప్రస్తుతం నగరవాసులు పెద్ద సంఖ్యలోనే క్యాబ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉండటం, ఎక్స్ట్రా డిమాండ్స్ లేకపోవడంతో పాటు భద్రమనే ఉద్దేశమే దీనికి కారణం. అయితే అత్యంత కీలకమైన ఈ భద్రత కోణాన్నే క్యాబ్ నిర్వహణ సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పరోక్షంగా టార్గెట్లు ఇస్తూ సమయపాలన పట్టించుకోకపోవడంతో పాటు క్యాబ్‌లను ఎవరు డ్రైవ్ చేస్తున్నారనే అంశమూ నిర్వాహకులకు పట్టట్లేదు. ఇదే భవిష్యత్తులో విపరీత పరిణామాలకు కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పని వేళల అమలు ఆమడ దూరం... కిరాయికి సంచరించే క్యాబ్‌లు సైతం కమర్షియల్ వాహనాల కిందికే వస్తాయి. మోటారు వాహన చట్టం (ఎంవీ యాక్ట్) ప్రకారం ఈ వాహనాల డ్రైవర్లకు కచ్చితంగా పని గంటలు అమలు కావాల్సిందే. వీటి డ్రైవర్లు రోజుకు గరిష్టంగా పది గంటల (విశ్రాంతితో కలిపి) చొప్పున వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ విధులు నిర్వర్తించే కనీస కాలం ఎనిమిది గంటల్లో కచ్చితంగా రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలి. అయితే క్యాబ్ నిర్వాహక సంస్థలు పక్కాగా ఇన్ని ట్రిప్పులు వేయాలంటూ డ్రైవర్లకు పరోక్షంగా టార్గెట్లు విధిస్తున్నాయి. దీన్ని పూర్తి చేసిన వారికే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. దీంతో ఒక్కో క్యాబ్ డ్రైవర్ కనిష్టంగా 15 గంటల నుంచి గరిష్టంగా 18 గంటల వరకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. అలసట తీరేందుకు ఆగుదామన్నా... ఇలా నిత్యం ఉరుకులు–పరుగులు పెట్టే డ్రైవర్లు అప్పుడప్పుడు కాస్త అలసట తీర్చుకుందామని భావించినా ఇబ్బందే వస్తోంది. ఇలాంటి డ్రైవర్లు తామ వాహనాలను పార్కింగ్ చేసుకుని సేదతీరేందుకు అవసరమైన స్థలాలు అన్ని చోట్లా అందుబాటులో ఉండట్లేదు. ఫలితంగా ఎక్కువ శాతం రోడ్ల పక్కనే ఆపుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులో ఇతర వాహనచోదకులో వచ్చినప్పుడల్లా తమ వాహనాలను పక్కకు తీయాల్సి ఉండటంతో సరైన విశ్రాంతి లభించట్లేదు. ఇలా ఆపడం అనేక సందర్భాల్లో ఎదుటి వారికి, కొన్నిసార్లు వారికే ప్రమాదహేతువుగా మారుతోంది. ఈ సమస్య తీరాలంటే క్యాబ్స్ డ్రైవర్లకు కచ్చితంగా పని గంటలు అమలు చేయడంపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. పేరొకరిది... వచ్చేది ఇంకొకరు... క్యాబ్ నిర్వహణ సంస్థలు భద్రత ప్రమాణాల్లో భాగంగా తమ డ్రైవర్ల రిజిస్ట్రేషన్‌ను పక్కా చేశాయి. ఇలా చేసుకున్న వారి వివరాలన్నీ ఆ సంస్థ వద్ద ఉంటాయి. యాప్స్‌ను వినియోగించి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి తాను ఎక్కబోతున్న వాహనం డ్రైవర్ పేరు, ఫొటో, నెంబర్‌తో పాటు అతడి రేటింగ్ సైతం అందులో కనిపిస్తుంది. ఏ సమయంలో ఎక్కడకు ప్రయాణం చేసినా భద్రంగా గమ్యం చేర్చడానికి ఈ ఏర్పాటు ఉంది. అయితే ఇటీవల కాలంలో నగరంలో క్యాబ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఒకరు ఉండే... డ్రైవింగ్ చేస్తూ వస్తున్న వారు మరొకరు ఉంటున్నారు. ఇలా ‘మార్పిడి’ చేసుకుంటున్న వారిలో కుటుంబీకులే ఉంటే పర్వాలేదు కాని కొన్ని సందర్భాల్లో బయటి వారూ ఉంటున్నారు. వేరే వ్యాపకాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉన్న వారు, గతంలో అనివార్య కారణాలతో క్యాబ్ నిర్వాహకులు ‘బ్లాక్’ చేసిన డ్రైవర్లు ఈ మార్గం అనుసరిస్తున్నారు. దీన్ని కనిపెట్టడానికి అనువైన క్రాస్ చెకింగ్ మెకానిజం క్యాబ్ నిర్వాహకుల వద్ద ఉండట్లేదు. ఇటు ట్రాఫిక్ పోలీసులు, అటు ఆర్టీఏ అధికారులు... వీరిలో ఎవరికీ ఈ విషయాలు పట్టట్లేదు. -
హైదరాబాద్‌లో మరో కారు ప్రమాదం
-
కారు దిగలేదని కొట్టి చంపారు
ముంబై : రోజురోజుకు మనుషుల్లో కోపం, అసహనం ఎంతలా పెరుగుతున్నాయో ఈ సంఘటన చూస్తే అర్థం అవుతుంది. కనీసం 18 ఏళ్లు కూడా నిండని ముగ్గురు మైనర్లు కారు త్వరగా దిగలేదన్న కోపంతో కారులోని వారిపై దాడి చేయడమే కాక ఒకరి మృతికి కారకులయ్యారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్ర సింగ్(30) అనే వ్యక్తి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కాబ్లో చెంబూరు వెళ్దామని కాబ్ మాట్లాడుకుని, అందులో ఎక్కి కూర్చున్నారు. ఇంతలో మరో నలుగురు యువకులు అక్కడకు వచ్చి కారులో ఉన్న సురేంద్ర, అతడి స్నేహితులను వెంటనే కాబ్లోంచి దిగమన్నారు. అందుకు సురేంద్ర, అతని స్నేహితులు నిరాకరించడంతో ఘర్షణ ప్రారంభమయ్యింది. అది కాస్తా పెద్దదిగా మారడంతో ఆ నలుగురు యువకులు సురేంద్ర, అతని స్నేహితులను విచక్షణారహితంగా కొట్టారు. ఈ గొడవలో సురేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే సమీప రాజవాడి ఆస్పత్రికి తరలించారు. కానీ ఈలోపే సురేంద్ర మరణించాడు. విషయం తేలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని నలుగురు యువకులపై కేసు నమోదు చేశారు. ‘నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరు మాత్రమే మేజర్. వీరి నలుగురి మీద హత్యానేరం మోపబడింది. ముగ్గురు మైనర్లను డొంగ్రిలోని జూవైనల్ హోమ్‌కు తరలించాము. మరో వ్యక్తి క్రిష్ణ పొమన్న బొయన్న(18)ను చెంబూరు కాంప్ ఏరియాకు తరలించామ’ని పోలీసు డిప్యూటీ కమిషనర్(6 జోన్) షహాజీ ఉంపా తెలిపారు. -
ట్రాంపొలీన్ జంప్
‘‘ఐ యామ్ సారీ! ఈసారి కూడా నీకు యూఎస్ వీసా చేయడం కుదరకపోవచ్చు. నెక్స్›్టఇయర్ తప్పకుండా ట్రై చేద్దాం’’.మేనేజర్ చెప్పిన ఈ మాటలే గిర్రున తిరుగుతున్నాయి. అతని మీద కోపం తెచ్చుకోవాలో, ఇలాంటి చిక్కు మెలికలు కార్పొరేట్ ప్రపంచంలో ఉంటాయని తెలిసీ రాత్రింబవళ్లు కష్టపడ్డందుకు నన్ను నేను తిట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. కాన్ఫరెన్స్ రూమ్‌లో ఒక్కడినే అలా అచేతనంగా కూర్చుండిపోయా. మేనేజర్ కొద్దిసేపటి క్రితమే వెళ్లిపోయాడు. నా ప్రశ్నలకు అతని దగ్గర సమాధానం లేదు. ఉంటే అలా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయేవాడు కాదు. నిస్తేజంగా గదిలో కూర్చున్న నాకు, ముందున్న శూన్యం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. సగటు ఐటీ ఉద్యోగిలానే నాకు కూడా డాలర్ డ్రీమ్స్ ఎక్కువే! ఆ కల కోసమే కదా.. చిన్న పల్లెటూరి నుంచి ఇంత దూరమొచ్చిందని గుర్తొచ్చినప్పుడు, బాధ ఇంకా ఎక్కువైంది. యూఎస్ వెళ్లి ఎంతోకొంత సంపాదించి సొంత ఊరికి ఏదైనా చేయాలి. కలలన్నీ కల్లలవుతున్నాయి. ‘‘ఒరేయ్ అర్జున్! ఇంకా ఎంతసేపు అలా అన్నీ పోగొట్టుకున్న వాడిలా కూర్చుంటావ్! అయ్యిందేదో అయింది. నీ ఆలోచనల ఓవర్‌టైమ్ రూమ్‌లో చేద్దువుగానీ పద.. బయల్దేరు.. రేపసలే వీకెండ్..’’ కృష్ణగాడి మాటలతో ప్రస్తుతంలోకి తేరుకున్నాను. ‘‘రేయ్! నీకు అర్థం కాదులే, నన్నొదిలెయ్..’’ అన్నాను. నాకు తెలీకుండా నా మాటల్లో కోపం ధ్వనిస్తోంది. ‘‘విక్రమ్ అంతా చెప్పారు లేరా! నువ్విక్కడ ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది లేదంటే. రూమ్‌కెళ్లి మాట్లాడకుందాం పదా.. లేట్ అయితే క్యాబ్ కూడా దొరకదు..’’ చేసేదేమీ లేక సిస్టమ్ షట్‌డౌన్ చేసి ఇద్దరం పార్కింగ్ ఏరియాకు బయల్దేరాము. క్యాబ్ రెడీగా ఉంది. కృష్ణ, నేను ఒకే ప్రాజెక్ట్‌కు పనిచేస్తున్నాం. కొలీగ్స్. ఇప్పుడైతే ఫ్రెండ్, రూమ్మేట్ కూడా. ‘రేపన్నది ఒకటుండదు.. ఈరోజు.. ఈ క్షణమే శాశ్వతం’ అంటాడు కృష్ణ. ఎవ్వరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. మా లక్ష్యాలు, లక్షణాలు వేరైనప్పటికీ ఇద్దరం బాగానే అలవాటు పడిపోయాం. వీకెండ్ అనగానే అందరికీ ఒకేరకంగా అలవాటు పడిపోతుంది. మేమూ అందరిలానే. బారెడు పొద్దెక్కాక లేవడం, ఏదో ఒక ఆంధ్రా మెస్‌లో భోజనం చేయడం, ఆ వీక్ రిలీజ్ అయిన సినిమా చూడటం, మిగిలే ఆ కొద్ది సమయాన్ని మాల్స్‌లో ‘హమ్ హై హైదరాబాదీ’ అంటూ గడిపేయడం. ఇదే. ఇదే రొటీన్ అందరిదీ. ఈ వీకెండ్ కూడా అలాగే గడిచిపోతుంది. పెద్దగా మార్పేమీ ఉండదు కదా అనుకున్నా.. మధ్యాహ్నం ఒంటి గంటకు లేచి. బెడ్‌పైనుంచి లేచి ఆవలిస్తూ లివింగ్ రూమ్‌కి వచ్చి చూస్తే, కృష్ణగాడు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. వరుసగా చానల్స్ మార్చుకుంటూ పోతున్నాడు. నన్ను చూడగానే నా వైపు తిరిగాడు. ‘‘ఏరా! రాత్రంతా ఆలోచిస్తూనే కూర్చున్నావా ఏంటీ? కళ్లు అంతలా ఎర్రబడ్డాయి?’’ ఆరాతీశాడు. ‘‘ఏమోరా.. ఏమీ అర్థం కావట్లేదు. మొత్తం బ్లాంక్ అయిపోయింది.’’ సోఫాలో కూలబడ్డాను. ‘‘ఎక్కువ ఆలోచించి బుర్ర పాడుచేసుకోకురా.. నీ ఎఫర్ట్ అయితే పెట్టావ్ కదా.. హోప్ ఫర్ ది బెస్ట్. మనం ఏదైనా బలంగా కోరుకుంటే ఈ ప్రపంచమంతా ఏకమై మనకు సహకరిస్తుందట..’’ వాడు నీతిబోధనలు మొదలుపెట్టాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఆపుతావా! ఇవన్నీ చెప్పడం బానే ఉంటుంది. నా ప్లేస్‌లో ఉండి చూడు.. తెలుస్తుంది..’’ అన్నాను కోపంగా. ‘‘ఓకే ఓకే కూల్ రా! సరే మరి, ఈ రోజు ప్లాన్స్ ఏంటి?’’ నా కోపాన్ని తగ్గించడం వాడికి బాగా తెలుసు. ‘‘ఏమో! ఎక్కడికీ వెళ్లాలని లేదు. నీకేమైనా పనులుంటే వెళ్లి చూస్కొని రా.. నేను రూమ్‌లోనే ఉంటా.’’చిన్నగా నవ్వి, మళ్లీ టీవీ చూస్కుంటూ వాడి పనిలో బిజీ అయిపోయాడు కృష్ణ. సోఫాలో కూర్చొని కొద్దిసేపు న్యూస్ పేపర్ తిరగేశా. తల గిర్రున తిరుగుతోంది. నిన్నటి రోజే వెంటాడుతోంది. ఆకలి చచ్చిపోయింది. ఏమీ తినాలనిపించట్లేదు. ఏదీ పాలుపోక మళ్లీ బెడ్‌పై కూలబడ్డా. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలీదు. ‘‘ఒరేయ్ అర్జున్! లేవరా.. లే..’’ కృష్ణగాడి మాటలు తూటాల్లా తాకుతున్నాయి. లేచి వాడివైపు కోపంగానే చూశా, పడుకోనివ్వారా? అంటూ. టైమ్ నాలుగైంది అప్పుడు. ‘‘లేరా బాబూ! ఇలా వీకెండ్‌ని లేజీగా వేస్ట్ చేస్తే ఎలా? ఇవ్వాళ రొటీన్‌గా కాకుండా ఎక్కడికైనా పోదాం. పోనీ పార్క్‌కి పోదామా? ఇక్కడే దగ్గర్లో..’’ కళ్లు పెద్దవి చేసి అడిగాడు. యాక్చువల్లీ ఐడియా బాగుంది. కానీ ఎందుకో ఎక్కడికీ వెళ్లాలనిపించట్లేదు. రానని చెప్పేశా. వాడు వదలడు కదా.. బలవంతపెట్టాడు. మనకోసం ఒకరు ఇలా తపన పడుతున్నారంటే వాళ్లకు నో చెప్పడం ఎందుకో కష్టంగా ఉంటుంది. అందులోనూ కృష్ణగాడికైతే అస్సలు నో చెప్పలేం. పక్కవాడి సంతోషంలో తన సంతోషాన్ని చూసుకునే అల్పసంతోషి కృష్ణ. ఏంటో వీడు నాకు అర్థం కాడు కూడా! రెడీ అయి వచ్చేస్తా అని చెప్పేశా. ఇద్దరం పార్క్‌కు వెళ్లిపోయాం. సాయంత్రం ఐదు దాటింది. వీకెండ్ కదా.. పార్కంతా పిల్లలు, పెద్దలు.. ఓహ్, కళకళగా ఉంది. మాఘ మాసపు సంధ్యా సమయపు చిరుగాలి నలువైపులనుంచి నన్ను అలుముకునేసరికి మనసుకు హాయిగా అనిపించింది. క్షణంపాటు గుండెలోని బరువునంతా ఆ గాలి తనతో పాటు మోసుకెళ్లిపోయినట్లనిపించింది. కాస్త తేలికగా ఉందిప్పుడు.‘‘రేయ్ అర్జున్! పదరా అక్కడ కూర్చుందాం.. అక్కడ వ్యూ బాగుంటుంది..’’ నన్ను ప్రశాంతంగా కూర్చోనివ్వడు ఈ కృష్ణగాడు. ‘‘వస్తున్నా..’’ అన్నాను. దూరంగా కనిపిస్తోన్న ఓ స్టోన్ బెంచీ వైపుకు అడుగులు వేశాం.ఒక పక్క చిన్నపాటి లేక్ వ్యూ.. మరోపక్క సేదతీరడానికి పయనమవుతున్న ఎర్రటి సంధ్యా భానుడు.. మధ్యన వీకెండ్ హుషారులో సముద్రంలోని కెరటాల్లా ఆనందంతో ఎగిసిపడుతున్న పిల్లల కేరింతల పలకరింపులు, వారమంతా పరుగుల ప్రపంచంలో కొట్టుమిట్టాడి సేదతీరుతున్న పెద్దలు.. మొత్తం ఒక ల్యాండ్‌స్కేప్ వ్యూలాగా ఉంది పార్క్, ఆ బెంచీ దగ్గర్నుంచి చూస్తే. ‘‘వావ్! నైస్ వ్యూ..’’ అన్నా. ‘‘నువ్వు ఈ వ్యూఎంజాయ్ చేస్తూ ఉండు.. ఇప్పుడే వస్తాను..’’ అంటూ తినడానికి ఏదైనా తీసుకొస్తానని వెళ్లాడు కృష్ణ. ‘‘నీ తిండిగోల మాత్రం తగ్గదే..’’ అని గట్టిగా నవ్వా. వాడూ ఓ నవ్విసిరి పరుగులాంటి నడకతో ఓ షాప్ దగ్గరికెళ్లిపోయాడు. నేను నా దృష్టిని ఎదురుగా ఉన్న మినీ చిల్డ్రన్స్ పార్క్ వైపుకు మళ్లించా. అక్కడ బాగా సందడిగా ఉంది. పిల్లలంతా గుంపుగా ట్రాంపొలీన్ జంప్ దగ్గర పోగై ఉన్నారు. చప్పట్లు కొడుతూ పైకీ, కిందకీ ఉత్సాహంతో గంతులు వేస్తున్నారు. ఆకాశంలో ఎగురుతున్న రెక్కల్లేని పక్షిలాగా గాల్లో తేలుతున్నట్టుగా చాలా బావుంటుంది ఆ ఆట. ఒక్కొక్కరుగా పిల్లలు ఆ ట్రాంపొలీన్ జంప్ ఆడుతూంటే, వాళ్లతో వచ్చిన పెద్దవాళ్లు పిల్లల ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ క్లిక్‌మనిపిస్తున్నారు. వాళ్లని అలా చూస్తూంటే భలే ముచ్చటేసింది. అలానే చూస్తూ ఉండిపోయాను. ‘‘ఇదిగోరా! వేడి వేడి మిరపకాయ్ భజ్జీలు..’’ కృష్ణగాడి మాటలకు ఒక్కసారి ఉలిక్కిపడి చూశా. వాడు ఆ పిల్లల కేరింతల వైపు చూస్తూ వచ్చి పక్కన కూర్చున్నాడు. ‘‘చూశావారా అర్జున్.. ఆ పిల్లలు ట్రాంపొలీన్ జంప్ని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో! అది పైకి వెళ్లిన క్షణంలో ఎంతైతే హ్యాపీగా ఉన్నారో.. కిందపడినప్పుడూ అంతే హుషారుగా కేకలు వేస్తున్నారు. మన లైఫ్ కూడా ఇంతేనేమో! కిందపడ్డప్పుడల్లా, పైకి మళ్లీ ఎగురుతామనే నమ్మకంతో, ధైర్యంగా ముందుకు సాగడమే. లైఫ్ ఈజ్ ఎ ట్రాంపొలీన్ జంప్..’’ అన్నాడు నవ్వుతూ. వాడు నవ్వుతూ చెప్పినా ఆ మాటల్లో గొప్ప ఫిలాసఫీ ఉంది కదా అనిపించింది. నిజమేనేమో, జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడల్లా ఎంతో ఆవేదనకు గురవుతాం. చతికిలపడిపోతాం. కానీ అది దాటొస్తే ఇంకో జీవితం ఉందనిపించింది. ఓడిపోయిన ప్రతిసారీ గెలవడానికి ఇంకోఅవకాశం ఇచ్చేస్తుందేమో లైఫ్. ఇప్పుడు నేను ఆ అవకాశం కోసం వెతకాలేమో! ‘యూ ఫెయిల్ ఓన్లీ వెన్ యూ క్విట్..’ అని ఎక్కడో చదివిన మాటలు గుర్తొచ్చాయి. కృష్ణగాడి వైపు చూశా. వాడింకా ఆ పిల్లలనే చూస్తూన్నాడు. ఆ పిల్లల సందడి ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తోంది. ఈ సాయంత్రం ఇక్కడికొచ్చి కూర్చోవడం బాగుంది. ‘రేపు నిన్నటిలా కచ్చితంగా ఉండదు’ అన్న ఆలోచన ఎంత బాగుందీ! - సుచిత్ర రెడ్డి (చెన్నై) -
క్యాబ్ ప్రయాణం చవక కాదు
సాక్షి, బెంగళూరు: ఇప్పటివరకు సాధారణ క్యాబ్‌కు ఒక ప్రయాణ చార్జీ, ఏసీ క్యాబ్‌కు ఒక చార్జీ వసూలు చేసేవారు. కానీ గురువారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. క్యాబ్ వాహనం ధరను బట్టి ఇకనుంచీ క్యాబ్ చార్జీలు ఉంటాయి. రాష్ట్ర రవాణా శాఖ క్యాబ్ కొత్త ప్రయాణ చార్జీలను నిర్దేశిస్తూ, ఇంతకంటే ఎక్కువ చార్జీలను వసూలు చేయడానికి వీల్లేదని క్యాబ్ యజమానులకు స్పష్టంచేసింది. తాజా నిర్ణయంతో బెంగళూరులో క్యాబ్ ధరలు కొంతమేర పెరిగాయి. నగరంలోని అన్ని క్యాబ్స్‌ను ఏ, బీ, సీ, డీ విభాగాలుగా విభజించి వాటి కనిష్ట, గరిష్ట ప్రయాణ చార్జీలను నిర్ధారించారు. ఏ కేటగిరీ.. : ఇక రూ. 16 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న వాహనాల్లో తొలి నాలుగు కిలోమీటర్లకు మినిమమ్ చార్జీ రూ. 80, ఆ తర్వాత ఒక్కో కిలోమీటరుకు రూ. 20–45 మధ్య చార్జీ చేస్తారు. బీ కేటగిరీ..: రూ. 10 లక్షల నుంచి రూ. 16 లక్షల మధ్య ధర ఉన్న వాహనాలను డీ కేటగిరీలో ప్రభుత్వం చేర్చింది. వీటిలో తొలి నాలుగు కిలోమీటర్లకు ప్రయాణ కనీస ధర రూ. 68. ఆ తర్వాత ప్రతి ఒక్క కిలోమీటరుకు చార్జీలను కనీసంగా రూ.16, గరిష్టంగా రూ. 34 వసూలు చేస్తారు. సీ కేటగిరీ..: రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ధర ఉన్న వాహనాలను సీ కేటగిరీలోకి వస్తాయి. వీటిలో తొలి నాలుగు కిలోమీటర్లకు ప్రయాణ కనీస ధర రూ. 52. ఆ తర్వాత ప్రతి ఒక్క కిలోమీటరుకు ప్రయాణ చార్జీ రూ.12–24 మధ్య ఉంటుంది. డీ కేటగిరీ.. : రూ. 5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న క్యాబ్ వాహనాలను డీ కేటగిరీలో ప్రభుత్వం చేర్చింది. వీటిలో తొలి నాలుగు కిలోమీటర్లకు కనీస ప్రయాణ చార్జీ రూ. 44. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు కనీసం రూ. 11 నుంచి గరిష్టంగా రూ. 22 మధ్య వసూలు చేసుకోవచ్చు. వెయిటింగ్ చార్జీలు : వీటిని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి 20 నిమిషాలు ఎలాంటి వెయిటింగ్ చార్జీలు ఉండవు. ఆపైనా ప్రతి 15 నిమిషాలకు రూ. 10ను చార్జ్ చేస్తారు. గతంలో క్యాబ్ చార్జీలు.. ♦ 2013, జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం క్యాబ్ ధరలను సవరించింది. అప్పట్లో తొలి నాలుగు కిలోమీటర్లు ఏసీ క్యాబ్‌లో రూ. 80, ఆ తర్వాత కిలోమీటరుకు రూ. 19.50 చార్జి. ♦ నాన్ ఏసీ క్యాబ్‌లో తొలి నాలుగు కిలోమీటర్లకు రూ. 70, ఆ తర్వాత కిలోమీటరుకు రూ.14.50 చార్జీ ఉండేది. -
హైదరాబాద్ లో నేటి రాత్రి ఉచిత క్యాబ్ లు
హైదరాబాద్ : కొత్త సంవత్సర వేడుకల్లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్ల అసోసియేషన్ నడుంబిగించింది. కొత్త ఏడాది వేడుకలు ముగిసిన అనంతరం చోటుచేసుకునే ప్రమాదాలను నివారించేందుకు ‘హమ్ ఆప్కా సాత్ హై’ అంటూ ఓ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 2 గంటల వరకు ఉచితంగా క్యాబ్ సర్వీసులను అందించనున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సేవలను అందించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల అనంతరం మద్యం మత్తులో మునిగి తేలుతున్నవారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మొత్తం 300 క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఉచిత సేవల కోసం 91776 24678, 88970 62663 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఎవరైనా ఫోన్ చేస్తే వారి దగ్గరికే క్యాబ్‌లను పంపిస్తామన్నారు. -
క్యాబ్ షేరింగ్ మంచిదే కానీ...
సాక్షి, న్యూఢిల్లీ: క్యాబ్ షేరింగ్‌కు చెక్ పెట్టే దిశగా ఢిల్లీ సర్కార్ ప్రయత్నిస్తుంటే సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు క్యాబ్ యూజర్లకు ఊరట ఇస్తున్నాయి. క్యాబ్ షేరింగ్ మంచి ఐడియానే అని, అయితే మహిళ భద్రత గురించి ఆలోచించాల్సి ఉందన్నారు. కొత్త వారితో కలిసి క్యాబ్‌లో వెళ్లడం మహిళల భద్రతకు ఇబ్బందికరమని అన్నారు. యాప్ ఆధారిత క్యాబ్ షేరింగ్ సేవల్లో మహిళల భద్రతపైనే రవాణా అధికారులతో, సంబంధిత వర్గాలతో చర్చిస్తున్నామని చెప్పారు. రైడ్ షేరింగ్‌కు అనుమతిస్తూనే మహిళల భద్రతకు పెద్దపీట వేసేలా సూచనలు చేయాలని కేజ్రీవాల్ ఆహ్వానించారు. మొత్తం మీద క్యాబ్ షేరింగ్ నిషేధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయంతో ముందుకొస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
అద్దెకు కారు డ్రైవర్!
♦ గంటకు రూ.90 చార్జీ; రోజుకైతే రూ.1,400 ♦ నెలకు 1,200 ఆర్డర్లు; రూ.12–15 లక్షల వ్యాపారం ♦ దసరా నాటికి విజయవాడ, వైజాగ్ల్లో సేవలు షురూ ♦ నెక్ట్స్ డ్రైవ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సర్వీసెస్ సీఈఓ హితచంద్ర కనవర్తి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెట్రో నగరాల్లో కారు బయటికి తీయాలంటే ముందుగా చూసేది.. వెళ్లే రూట్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందోనని! అలా అని తీయకుండా ఉండలేం. పోనీ, క్యాబ్‌లను ఆశ్రయిద్దామంటే... చార్జీల మోత!! ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సొంతంగా కారు నడుపుతూ పడే వ్యయ ప్రయాసలు మామూలువి కావు! .. ఇలాంటి అనుభవాలన్నీ హితచంద్ర కనవర్తి కూడా పడ్డాడు! కాకపోతే అందరిలా ఉండిపోక.. పరిష్కారం కోసం నెక్ట్స్ డ్రైవ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సర్వీసెస్ సంస్థను ప్రారంభించేశాడు. ఇది గంటల చొప్పున కారు డ్రైవర్లను బుక్ చేసుకునే వేదిక. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. యూకేలో మాస్టర్స్ చదివా. ఆ తర్వాత అక్కడే స్థానికంగా ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరా. తర్వాత అమెరికా వెళ్లా. డెలాయిట్‌లో ఎనిమిదేళ్లు వివిధ హోదాల్లో పనిచేశాక.. ఇండియాకు బదిలీ అయింది. ఇక్కడికొచ్చాకే ట్రాఫిక్‌లో కారు ప్రయాణం ఎంత ఇబ్బందో తెలిసింది. డ్రైవింగ్ కాదు పార్కింగూ సమస్యే. ట్రాఫిక్‌లో కారు నడుపుతూ ఆఫీసుకు వెళ్లి రావాలంటే చిరాకొచ్చేది. పోనీ, డ్రైవర్‌ను పెట్టుకుందామంటే.. ఆఫీసుకు రాను, పోను మినహా ఇతర సమయాల్లో డ్రైవర్ అవసరం లేదు. ఆ మాత్రం దానికి నెలమొత్తం డ్రైవర్‌కు వేతనం ఇవ్వాలా అనిపించేది? దీనికి పరిష్కారం వెతికే పనిలోనే ఈ ఆలోచన వచ్చింది. ఏడాదిన్నర పాటు మార్కెట్ సర్వే చేసి.. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ కేంద్రంగా నెక్ట్స్ డ్రైవ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సర్వీసెస్‌ను ప్రారంభించా. ఈ కంపెనీ ప్రొడక్టే డ్రైవర్జ్.కామ్! యాప్, వెబ్సైట్ అభివృద్ధి, మార్కెటింగ్, డ్రైవర్ల నియామకం వాటి కోసం రూ.75 లక్షల వరకు ఖర్చుపెట్టా. దసరాకల్లా విజయవాడ, వైజాగ్‌లకు.. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే సేవలందిస్తున్నాం. దసరా నాటికి విశాఖపట్నం, విజయవాడల్లో ప్రారంభిస్తాం. 2 నెలల్లో ఆయా నగరాల్లో డ్రైవర్లను నియమించుకుంటాం. ఈ ఏడాది ముగిసే నాటికి బెంగళూరు, చెన్నైలకు.. 2021 నాటికి దేశంలోని 45 నగరాలకు విస్తరించాలనేది లక్ష్యం. డ్రైవర్లకు నియామక పరీక్షలుంటాయి. గంటపాటు డ్రైవింగ్ టెస్ట్ పూర్తయ్యాక, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాం. లీగల్, పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెక్యూర్ టాస్క్ అనే ఇన్వెస్టిగేషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. దీంతో డ్రైవర్ల మీద ఎలాంటి పోలీసు కేసులున్నా తెలిసిపోతుంది. ఆ తర్వాత కస్టమర్లతో నడవడిక, శిక్షణ కార్యక్రమాలుంటాయి. ఆ తర్వాతే నియామకం. ఎంపికైన డ్రైవర్లకు నెలకు రూ.15–25 వేల మధ్య వేతనాలుంటాయి. గంటలకు రూ.90.. ఇప్పటివరకు 6 వేల యాప్స్, 15 వేల మంది యూజర్లు నమోదయ్యారు. డ్రైవర్జ్ యాప్, వెబ్సైట్, కాల్ సెంటర్ మూడింట్లో దేని ద్వారానైనా మా సేవలను వినియోగించుకోవచ్చు. లాగిన్ కాగానే ఇన్‌స్టేషన్, ఔట్స్టేషన్, పర్మినెంట్ డ్రైవర్ అని 3 రకాల ఆప్షన్లను చూపిస్తుంది. ఏది కావాలంటే దాన్ని ఎంచుకోవచ్చు. 30 నిమిషాల్లో డ్రైవర్ ఇంటికొచ్చేస్తాడు. ఆర్డర్ బుక్ కాగానే డ్రైవర్ ఫొటో, అతని రేటింగ్, బ్యాక్‌గ్రౌడ్ వంటివన్నీ వస్తాయి. దీంతో కస్టమర్లకు నాణ్యమైన, నమ్మకమైన సేవలందుతాయి. డ్రైవర్ అద్దె గంటకు సిటీలో రూ.90, ఔట్స్టేషన్ అయితే రూ.120. రోజు మొత్తానికైతే రూ.1,400. రోజుకు 50–75 ఆర్డర్లొస్తున్నాయి. వారాంతాల్లో అయితే రెండింతల వృద్ధి నమోదు చేస్తున్నాం. ప్రతి ట్రిప్ 5 గంటలపైనే ఉంటుంది. నెలకు 1,200 ఆర్డర్లు, రూ.12–15 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. రూ.15–20 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం డ్రైవర్లు కాకుండా నిర్వహణ, టెక్నాలజీ బృందం కలిపి 10 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపులోగా మరో 10 మందిని నియమించుకుంటాం. ‘‘ఇప్పటికే కుటుంబీకులు, తెలిసిన వారి నుంచి రూ.2.5 కోట్ల వరకు నిధులను సమీకరించాం. ఏడాది తర్వాత ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి రూ.15–20 కోట్ల నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం’’ అని హితచంద్ర వివరించారు. -
క్యాబ్‌లో వెళ్లిన యువతి అదృశ్యం
బంజారాహిల్స్(హైదరాబాద్): ఇంటి నుంచి క్యాబ్‌లో వెళ్లిన ఓ యువతి కనిపించకుండాపోయింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్-4లోని స్టోన్‌వ్యాలీ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే సుశ్మితా గాయత్రి విష్ణుభట్ల(22) మంగళవారం ఉదయం క్యాబ్‌లో బయటకు వెళ్లింది. సాయంత్రం ఎంతకూ తిరిగి రాకపోయేసరికి తండ్రి చంద్రమౌళి బంధుమిత్రుల ఇళ్లలో వాకబు చేశారు. ఫోన్ చేసినా సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. అంతకుముందే బ్యాంకులో నుంచి రెండు దఫాలుగా రూ.15 వేలు డ్రా చేసినట్లు మెస్సేజ్‌లు అందాయి. ఆమె ఫోన్ నంబర్‌కు ప్రయత్నించగా లిఫ్ట్ చేయడం లేదు. క్యాబ్ డ్రైవర్ కోసం ఆరా తీయగా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని క్యాబ్ వివరాల కోసం ఆరా తీస్తున్నారు. యువతి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటుచేసి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు ముమ్మరం చేశారు. అదృశ్యమైన యువతి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె అదృశ్యం కేసును ఛేదించడానికి పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. -
మాదాపూర్‌లో క్యాబ్ బీభత్సం
-
మాదాపూర్‌లో క్యాబ్ బీభత్సం
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో ఓ క్యాబ్ బీభత్సం సష్టించింది. వేగంగా వెళ్తున్న క్యాబ్ అదుపుతప్పి రోడ్డు పక్కన పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కార్మికులు మంజుల, శాంతమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్ పోలీసు స్టేషన్ ఎదురుగా రోడ్డు ఊడుస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆ ప్రదేశంలో నలుగురు కార్మికులు పనిచేస్తుండగా మిగతా ఇద్దరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
విజయవాడలో దింపుతామని చెప్పి..
- క్యాబ్‌లో యువతిపై లైంగికదాడికి యత్నం - ఎల్బీనగర్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన - నిందితులను అరెస్టు చేసిన పోలీసులు - నిందితుల్లో ఒకరు ఇటీవల కానిస్టేబుల్‌గా ఎంపిక సాక్షి, హైదరాబాద్: క్యాబ్‌లో ప్రయాణిస్తున్న యువతిపై డ్రైవర్, మరో యువకుడు లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ కేసును ఛేదించిన రాచకొండ కమిషరేట్ పరిధిలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు నిందితు లిద్దరిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో ఏఆర్ విభాగానికి ఎంపిక య్యాడు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ ఎం.భగవత్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుంటూరు వెళ్లేందుకు బయలుదేరి... గుంటూరుకు చెందిన ఓ యువతి మాదాపూర్‌లో హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచే స్తోంది. ఆమె బుధవారం తెల్లవారు జామున మాదాపూర్ నుంచి రిజిస్టర్డ్ క్యాబ్‌లో బయలుదేరి ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకుంది. విజయవాడ వెళ్లేందుకు వాహనాల కోసం ఎదురు చూస్తుండగా ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న నాగోల్ జయపురికాల నీకి చెందిన దంతూరి వేణు (25), నేరేడ్ మెట్కు చెందిన బి.ఇమ్మానియేల్(25) ఆమెను గమనించారు. ఆమె విజయవాడ వెళ్ళే ప్రయ త్నాల్లో ఉన్నట్లు గమనించి కుట్ర పన్నారు. సమీపంలోని హోటల్లో ఉన్న తమ స్నేహి తుడు నిల్సన్, అతడి స్నేహితుడైన క్యాబ్ డ్రైవర్ రవితేజ వద్దకు వెళ్లారు. వారి వద్ద ద్విచక్ర వాహనం వదిలి బలవంతంగా క్యాబ్ తీసుకున్నారు. డ్రైవింగ్ సీటులో ఉన్న వేణు తాము విజయవాడ వెళ్తు న్నామని యువతితో చెప్పాడు. ఆ క్యాబ్‌లోనే ఉన్న ఇమ్మానియేల్‌ను మరో ప్రయాణికుడిగా భావించి ఆమె అందులోకి ఎక్కింది. కారు విజయవాడ హైవే పైకి చేరిన తర్వాత వేణు, ఇమ్మానియేల్ మాట్లాడుకోవడం ఆమె గమనించింది. దీంతో కారు ఆపాలని కోరినా వారు పట్టించు కోలేదు. హయత్‌నగర్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి య త్నించడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో ఇమ్మానియేల్ కారు దిగి పారిపోయాడు. కారు ను ముందుకు తీసుకు వెళ్ళిన వేణు నల్లగొండ జిల్లా పంతంగి టోల్గేట్ సమీపంలోకి చేరు కున్నాడు. అక్కడ టోల్‌ట్యాక్స్ చెల్లించడానికి కారు ఆపాల్సి వస్తుం దని, అప్పుడు యువతి గోల చేస్తే ఇబ్బందని భావించి టోల్‌గేట్‌కు కాస్త దూరంలో యువ తిని బలవంతంగా రోడ్డు పైకి తోసేసి వెనక్కి వచ్చేశాడు. రంగంలోకి దిగిన ఎస్వోటీ బాధితురాలు ఆ కారు నంబర్‌ను ఏపీ28టీవీ0051గా నమోదు చేసుకుని కంట్రోల్ రూమ్ ద్వారా చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎస్వోటీ ఇన్స్పెక్టర్ నర్సింగ్‌రావు కారు చిరునామాను ఛేదించి యజమానిని గుర్తించారు. కొత్తూరులో ఉండే యజమాని శివకుమార్ రెండు రోజుల క్రితమే కారును రవితేజకు లీజుకు ఇచ్చారు. శివకుమార్ ద్వారానే రవితేజకు ఫోన్ చేయించి దిల్‌సుఖ్‌నగర్‌కు పిలిపించారు. రవితేజ ఇచ్చిన సమాచారం మేరకు నిందితులు ఇమ్మానియేల్, వేణులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించారు. పోలీసులు కేసును ఎల్బీనగర్ ఠాణాకు బదిలీ చేసి నిందితుల్ని అరెస్టు చేశారు. కారుతోపాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. -
క్యాబ్ తరహాలో అద్దెకు ఆర్టీసీ బస్సులు
-
క్యాబ్ తరహాలో అద్దెకు ఆర్టీసీ బస్సులు
- 24 గంటల పరిమితి ఎత్తివేత.. ఇక 8 గంటలకూ సై! - సిటీ బస్సులకై తే 4 గంటలకు - స్పేర్ బస్సులతో ప్రత్యేక విభాగం ఏర్పాటు - ముఖ్యమంత్రి ఆదేశంతో ప్రారంభించిన ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: కార్ల తరహాలో ఇక ఆర్టీసీ బస్సులు కూడా అద్దెకు లభించబోతున్నాయి. ఆర్టీసీ బస్సులు అద్దెకివ్వటం కొత్త కానప్పటి కీ.. క్యాబ్‌ల తరహాలో ఇన్ని గంటలు, ఇన్ని కిలోమీటర్లు అంటూ కొత్త టారిఫ్‌తో అద్దెకు సిద్ధపడటమే విశేషం. పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం బస్సులు అద్దెకు దొరికేవి. అయితే కచ్చి తంగా 24 గంటలకు తగ్గకుండా తీసుకుంటేనే ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చేది. ఇప్పుడు ఆ నిబంధనను సడలించి కనీసం 8 గంటలు, సిటీ బస్ అరుుతే కనీసం 4 గంటలకు తగ్గకుండా అద్దెకిచ్చేందుకు ఆర్టీసీ సిద్ధపడింది. తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని గట్టెక్కించే క్రమంలో స్వయంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత జూన్‌లో ఉద యం నుంచి రాత్రి వరకు కేసీఆర్ నిర్వహించిన మారథాన్ సమీక్షలో ఈ సూచన చేశారు. ఆ మేరకు అధికారులు ఇప్పుడు అద్దెకు బస్సులు ఇచ్చే కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. గరుడ ప్లస్, గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, హైదరాబాద్‌లో నడుస్తున్న సిటీ బస్సులను అద్దెకు ఇవ్వనున్నారు. విహార యాత్రలు, తీర్థ యాత్రలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు.. తదితరాలకు బస్సులు అందుబాటులో ఉంటారుు. ఒకవేళ బస్సులు మరమ్మతులకు గురైతే వాటి స్థానంలో పంపేందుకు కొన్ని బస్సులను స్పేర్‌లో సిద్ధంగా ఉంచుతారు. వాటిని ఇప్పుడు అద్దెలకు తిప్పాలని నిర్ణరుుంచారు. అద్దె ధరలిలా.. జనవరి నుంచి జూన్ వరకు, అక్టోబర్ నెల.. దీన్ని పీక్ సీజన్‌గా ఆర్టీసీ భావిస్తుంది. ఆయా నెలల్లో ఓ రకమైన అద్దె.. అక్టోబర్ మినహా జూలై నుంచి నవంబర్ వరకు మరో అద్దెను నిర్ణరుుంచారు. 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 గంటలకు విడివిడిగా ధరలు ఉంటారుు. కనిష్ట సమయానికి గరిష్టంగా 200 కి.మీ. దూరాన్ని ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ప్రతి స్లాబ్‌కు కిలోమీటర్లను 250, 300, 330, 360, 390, 420, 450, 480 లుగా నిర్ధారించారు. పీక్ సీజన్లో పల్లె వెలుగుకు 8 గంటలకు రూ.6,500, 10 గంటలకు రూ.8 వేలు, 12 గంటలకు రూ.9,500 ఆ తర్వాత ప్రతి రెండు గంటలకు రూ.వెరుు్య చొప్పున అదనంగా వసూలు చేస్తారు. సాధారణ నెలల్లో ఇది రూ.500 చొప్పున ఆయా స్లాబ్‌లలో తక్కువగా ఉంటుంది. ఎక్స్‌ప్రెస్‌లో పీక్ సీజన్లో కనిష్ట స్లాబ్‌కు రూ.7,600, ఆ తర్వాత రూ.9,500, 11,400, 12,600, 13,700, 14,900, 16 వేలు, 17,100, 18,300గా.. సాధార ణ నెలల్లో రూ.400 నుంచి రూ.600 మేర తక్కువగా నిర్ధారించారు. డీలక్స్‌లో కనిష్టంగా రూ.11 వేలు, గరిష్టంగా రూ.17,800, సూపర్ లగ్జరీలో కనిష్టంగా రూ.11,400, గరిష్టంగా రూ.18,300 వసూలు చేస్తారు. రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌లకు మాత్రం కచ్చితంగా 24 గంటలు, 500 కి.మీ.ధరనే లెక్కకట్టి ఇవ్వాల్సి ఉంటుంది. రాజధానికి రూ.29,500, గరుడకు రూ.34,500, గరుడ ప్లస్‌కు రూ.40,500 ధర వసూలు చేస్తారు. పరిమితి దాటితే ప్రతి అదనపు గంటకు అదనపు మొత్తాన్ని వసూలు చేస్తారు. చార్జీలపై సర్వీసు పన్ను 6 శాతంగా నిర్ధారించారు. సిటీ బస్సులకు ఇలా.. సిటీ బస్సులు 4, 6, 8, 10, 12, 14, 16 గంటలకు, కి.మీ. పరిధి 60 నుంచి మొదలై ప్రతి స్లాబ్‌కు 30 కి.మీ. చొప్పున అదనంగా నిర్ధారించారు. ఆర్డినరీ బస్సు చార్జీ కనిష్టంగా రూ.3,500 గరిష్టంగా రూ.8,500, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో లగ్జరీ రూ.4 వేలు- రూ.9 వేలుగా నిర్ధారించారు. సిటీ శీతల్‌కు 24 గంటలు, 300 కి.మీ., మెట్రో లగ్జరీకి 24 గంటలు, 500 కి.మీ.గా, ధర రూ.18,600, రూ.27,000గా నిర్ధారించారు. బస్సు లకు కాషన్ డిపాజిట్ కూడా ఉంటుంది. ప్ర యాణం పూర్తరుున తర్వాత దాన్ని తిరిగి చెల్లిస్తారు. -
హైదరాబాద్‌లో యుటూ క్యాబ్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెన్నైకు చెందిన క్యాబ్ సేవల సంస్థ ‘యుటూ’ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇతర క్యాబ్ సంస్థల మాదిరిగా కాకుండా నో సర్జ్ రేట్స్, కస్టమర్లకు రివార్డ్ పాయింట్లు తమ ప్రత్యేకతని యుటూ సీఈఓ కేవీపీ భాస్కరన్ మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. మరో రెండు నెలల్లో బెంగళూరులోనూ సేవలను ప్రారంభిస్తామని.. ఆ తర్వాత 6 నెలల్లో పుణె, అహ్మదాబాద్, కోచిలతో పాటూ మొత్తం 6 ప్రధాన నగరాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డాట్సన్ గో ప్లస్, నిస్సాన్ సన్నీ వాహనాలతో మొత్తం 105 వాహనాల సామర్థ్యం ఉందని.. ఈ ఏడాది ముగింపు నాటికి వీటి సంఖ్యను 750కు పెంచుతామని తెలియజేశారు. ప్రస్తుతం చెన్నైలో లక్ష యుటూ యాప్స్ డౌన్లోడ్ అయ్యాయని.. రోజుకు 850 ట్రిప్పుల బుకింగ్స్ పూర్తి చేస్తున్నామని చెప్పారు. -
ఔటర్‌రింగు రోడ్డుపై ప్రమాదం.. ఒకరి మృతి
శంషాబాద్ రూరల్(రంగారెడ్డి జిల్లా): శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో ఔటర్‌రింగురోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి క్యాబ్ ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. క్యాబు లారీ కిందకు చొచ్చుకెళ్లటంతో డ్రైవర్ మృతదేహాన్ని తీయడం కష్టమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్యాబ్ వినియోగదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ల అధిక చార్జీల వసూళ్లకు ఢిల్లీ కోర్టు అడ్డుకట్ట వేసింది. ప్రభుత్వం నిర్ణంయించిన ధరలను మాత్రమే క్యాబ్ లు వసూలు చేయాలని తేల్చిచెప్పింది. యాప్ బేస్డ్ అప్లికేషన్స్ లో లోపాల కారణంగా వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేస్తుండటంపై కోర్టు విచారించింది. ప్రముఖ మొబైల్ సర్వీసులైన ఓలా, ఉబెర్ లు అధికచార్జీలు వసూలు చేసిన క్యాబ్ కంపెనీల లిస్టులో ఉన్నాయి. యాప్ లో వచ్చిన దోషాల కారణంగానే చార్జీలు అధికంగా పడుతున్నాయని ఉబెర్ కోర్టుకు నివేదించగా, యాప్ లోని తప్పులు సరిదిద్దుకున్నట్లు ఓలా పేర్కొంది. దోషాలను సరిచేయడానికి పదిరోజుల సమయం కావాలని ఉబెర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ నెల 22లోగా ఎట్టిపరిస్థితుల్లో యాప్ లలోని దోషాలను సరిదిద్దుకోవాలని కేసును విచారించిన జస్టిస్ మన్మోహన్ ఆదేశించారు. 2013లో క్యాబ్ లు వసూలు చేయాల్సిన చార్జీలను ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. క్యాబ్ చార్జీ వివరాలు (ఒక కిలోమీటరుకు): ఎకానమీ రేడియో ట్యాక్సీ: రూ.12.50/- నాన్-ఏసీ బ్లాక్ ట్యాక్సీ: రూ.14/- నాన్-ఏసీ ఎల్లో టాప్ ట్యాక్సీ: రూ.14/- ఏసీ ఎల్లో టాప్ ట్యాక్సీ: రూ.16/- ఏసీ బ్లాక్ ట్యాక్సీ: రూ.16/- ఎల్లో రేడియో ట్యాక్సీ(ఎల్ సీడీ డిస్ప్లే కలిగినవి): రూ.23/- నైట్ చార్జ్: రాత్రి 11గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య కిలోమీటరుకు అదనంగా 25 శాతం చార్జ్ చేస్తారు. -
అన్ని యాప్లెందుకు? బక్కర్ ఉంటే చాలు!
• ఆన్లైన్ సంస్థల రాయితీలు, కూపన్ల వివరాలందిస్తున్న బక్కర్ • బక్కర్తో ఈ-కామర్స్‌లకు నెలకు రూ.75 లక్షల వ్యాపారం • నెల రోజుల్లో లోకల్ షాపింగ్, రీచార్జ్ విభాగాల్లోకి విస్తరణ కూడా • 3 నెలల్లో రూ.6 కోట్ల నిధుల సమీకరణ • ‘స్టార్టప్ డైరీ’తో కో-ఫౌండర్ వెన్నెల మిర్యాల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వీకెండ్స్‌లో సినిమాకి వెళ్లాలి.. థియేటర్‌కు చేరుకోవడానికో క్యాబ్ కావాలి! రిటర్న్‌లో రెస్టారెంట్లో భోజనం చేయాలి.. ఇంటికొచ్చాక ఆన్లైన్లో షాపింగూ చేసేయాలి!! ...కానీ, ఇవన్నీ తక్కువ ధరలోనే కావాలండోయ్. ఆన్లైన్లో వెతికితే వేటికవే వేర్వేరుగా రాయితీలందించే కూపన్లు దొరుకుతాయ్. కానీ, ఒక్కో దానికోసం బోలెడంత సమయం వృథా. అసలు రాయితీలందించే యాప్‌లన్నీ ఒకే వేదికగా ఉంటే!! ఆ కిక్కే వేరు కదూ...! ఇదిగో అచ్చం ఇలాంటి యాపే ‘‘బక్కర్’’. ఈ యాప్ విశేషాలు, సేవల గురించి వెన్నెల మిర్యాల ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. నేను, రవనీత్ సింగ్, నిఖార్ అగర్వాల్ ముగ్గురం ట్రిపుల్ ఐటీ గ్రాడ్యుయేట్స్. బీటెక్ నాలుగో సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఏ అంశాన్ని ఎంచుకోవాలనే విషయంపై బాగా ఆలోచించాం. ఆ సమయంలో మాకెదురైన అనుభవాన్నే ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం. అదే బక్కర్ యాప్‌గా మారింది. అదెలాగంటే.. మీం వీకెండ్స్‌లో ఫుడ్యాప్ల ద్వారా రాయితీలపై ఆహారాన్ని తెప్పించుకొని తినేవాళ్లం. అయితే తక్కువ ధరకు, నాణ్యమైన ఫుడ్ ఏ సంస్థ ఆఫర్ చేస్తుందోనని తెలుసుకునేందుకు ఆన్లైన్లో గంటల కొద్దీ వెతికేవాళ్లం. ఆ సమయంలో మేం గ్రహించిందేంటంటే.. ఆన్లైన్లో రాయితీలను వెతికేందుకు ఎంత సమయం వృథా అవుతుందోనని! ‘‘ప్రతీ సంస్థకూ ఓ యాప్ ఉంటుంది.. రాయితీలూ ఉంటాయ్’’ కానీ, అవన్నీ ఒకే వేదికగా అందుబాటులో లేవని కూడా తెలిసింది. దీన్నే వ్యాపార సూత్రంగా మలుచుకొని రూ.2 లక్షల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా గతేడాది డిసెంబర్లో క్రూగ్జియో ల్యాబ్స్ ప్రై.లి. పేరిట సంస్థను ప్రారంభించాం. ఈ సంస్థ ఆండ్రాయిడ్ యాపే ‘బక్కర్’! వినియోగదారులకు లాభపడేలా.. కంపెనీలకు తగిన మార్కెట్ చూపించేలా వివిధ సంస్థల యాప్‌లు, వాటికి ప్రత్యామ్నాయాలు, రాయితీలు, డిస్కౌంట్లు, ఆఫర్లనూ అందించే సంస్థలు.. ఇలా అన్నింటికీ ఒకే వేదికగా పొందే వీలు కల్పించడమే బక్కర్ పని. 4 విభాగాలు.. 22 సంస్థలు.. బక్కర్ యాప్‌లో లాగినయ్యాక.. కావాల్సిన సేవలను ఎంచుకోవాలి. వెంటనే ఆయా సేవలందిస్తున్న సంస్థలు, ధరలు, రాయితీల వివరాలొస్తాయి. నేరుగా అక్కడి నుంచే వాటిని బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం క్యాబ్స్, ఈ-కామర్స్, విమానాలు, కూపన్లు... నాలుగు విభాగాల్లో సేవలందిస్తున్నాం. ఫుడ్‌పాండా, స్విగ్గీస్, సాసోస్, ఓలా, ఉబర్, పేటీఎం, మొబీక్విక్, ఫ్రీచార్జ్, గ్రాబ్ఆన్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి 22 సంస్థలు మాతో భాగస్వామ్యమయ్యాయి. నెలకు 50 వేల మంది బక్కర్ను వినియోగించుకుంటున్నారు. వచ్చే 6 నెలల్లో 5 లక్షల యూజర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా యాప్ నుంచి జరిగే ప్రతి కొనుగోలు మీద 7-10 శాతం కమీషన్ కింద ఆయా సంస్థలు చెల్లిస్తాయి. నెలకు రూ.75 లక్షల జీఎంవీ.. ప్రస్తుతం నెలకు రూ.9-10 లక్షల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. బక్కర్ ద్వారా మా భాగస్వామ్య సంస్థలకు నెలకు రూ.75-80 లక్షల వ్యాపారం (జీఎంవీ) జరుగుతుంది. ఆగస్టులో రెండింతల వృద్ధిని చేరుకోవాలనేది లక్ష్యం. ప్రస్తుతం మా సంస్థలో ఆరుగురు ఉద్యోగులున్నారు. నెల రోజుల్లో లోకల్ షాపింగ్, రీచార్జ్ విభాగాల్లోకి విస్తరించనున్నాం. 6 నెలల్లో హోటల్స్, ట్రావెల్ (బస్సు, రైళ్లు) విభాగాలకు విస్తరించాలనేది లక్ష్యం. రూ.6 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి.. ‘‘సీడ్రౌండ్లో భాగంగా గతేడాది డిసెంబర్లో కోటి రూపాయల నిధులను సమీకరించాం. 50కే వెంచర్స్, సింగపూర్, సిలికాన్‌వ్యాలీకి చెందిన ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం రూ.6 కోట్ల నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. బెంగళూరు, ముంబైకి చెందిన పలువురు వీసీ)సంస్థలతో మాట్లాడుతున్నాం. మరో 3 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తాం’’ అని వెన్నెల వివరించారు. -
ఈడెన్‌లో ‘గులాబి’ మ్యాచ్
కోల్‌కతా: గులాబి బంతితో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో దేశంలో తొలిసారి గులాబీ బంతితో ఆడే మ్యాచ్‌కు ఈడెన్ గార్డెన్ సిద్ధమవుతోంది. ఈనెల 17 నుంచి 20 వరకు క్యాబ్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరిగే సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ను ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించనున్నారు. ఈ ప్రయోగం సమీప భవిష్యత్‌లో డే అండ్ నైట్ టెస్టు నిర్వహణకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు గంగూలీ తెలిపారు. బోర్డు సాంకేతిక కమిటీ అధ్యక్షుడిగానూ దాదా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
క్యురేటర్ ప్రబీర్ ముఖర్జీ మృతి
కోల్‌కతా: సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) మాజీ చీఫ్ క్యురేటర్ ప్రబీర్ ముఖర్జీ (86) మంగళవారం రాత్రి మరణించారు. డిప్రెషన్, కాలేయ వ్యాధి కారణంగా ఏప్రిల్ 11 నుంచి ముఖర్జీ నగరంలోని బీఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన మనవడు ప్రణయ్ ముఖర్జీ తెలిపారు. 1987 ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు రెండు దశాబ్దాలు ఈడెన్‌లో పిచ్‌లను తయారు చేయడంలో ప్రబీర్ కీలక పాత్ర పోషించారు. అయితే 2015 అక్టోబరు 8న భారత్, దక్షిణాఫ్రికాల మధ్య టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఆరు గంటల పాటు సమయం దొరికినా ప్రబీర్ స్టేడియంను సిద్ధం చేయలేకపోయారని సౌరవ్ గంగూలీ విమర్శించడంతో... అప్పటినుంచి ప్రబీర్ ఈడెన్‌లో అడుగుపెట్టలేదు. -
క్యాబ్ ను లైబ్రరీగా మార్చేశాడు!
టెహ్రాన్ః మనిషి ఆలోచనల్ని క్రమబద్ధీకరించడానికి, వ్యక్తిలో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి పుస్తక పఠనం ఎంతగానో దోహద పడుతుంది. అందుకే పుస్తక ప్రేమికులను ప్రోత్సహించేందుకు ఓ ఇరానియన్ క్యాబ్ డ్రైవర్ ప్రయత్నం ప్రారంభించాడు. ప్రయాణీకులను ఆకట్టుకోవడంతోపాటు.. పుస్తక ప్రియులకు అందుబాటులో ఉండేట్టుగా తన నూతన ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. ఇరాన్ లోని రాస్ట్ సిటీ లో నడిపే తన ట్యాక్సీలో పుస్తకాలను నింపేసి ప్రయాణీకులకు ఓ మినీ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చాడు. తన షెటిల్ టాక్సీని ఓ మొబైల్ లైబ్రరీగా మార్చేశాడు ఇరాన్ కు చెందిన సాహెల్ ఫిల్ సూఫ్. పుస్తక పఠనంతో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నమ్మిన అతడు... తన ప్యాసింజర్లను పఠనానికి ప్రోత్సహించాలన్న ఉద్యేశ్యంతో తన టాక్సీలో ప్రయాణించే వారికి లైబ్రరీని అందుబాటులోకి తెచ్చాడు. కొంతకాలం క్రితమే తనకు లైబ్రరీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందని, అందుకు తన క్యాబ్ ను వినియోగించి ప్రజలకు చేరువవ్వచ్చునన్న ఆలోచనను ఆచరణలో పెట్టానని సాహెల్ చెప్తున్నాడు. ఆధునిక కాలంలో అనేక ఒత్తిళ్ళతో సతమతమౌతున్న ప్రజలకు పుస్తక పఠనం ఎంతగానో ఉపకరిస్తుందని, ఉపశమనం కలిగిస్తుందని భావించానని, అందుకే ఈ మొబైల్ లైబ్రరీ ని ఏర్పాటు చేశానని సాహెల్ చెప్తున్నాడు. తన క్యాబ్ ట్యాక్సీలో సాహెల్ వివిధ రకాల పుస్తకాలను సుమారు 50 వరకూ పాఠకులకు అందుబాటులో ఉంచాడు. మనస్తత్వ శాస్త్రం, పిల్లల పుస్తకాలు, చరిత్ర వంటి ఎన్నో గ్రంథాలతో ఇప్పుడు సాహెల్ క్యాబ్ లైబ్రరీ పుస్తాకాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పైగా తన లైబ్రరీకి ఫ్యాన్స్ గా మారిన ప్యాసింజర్లు ఎక్కువగా మహిళలు, యువకులేనని సాహెల్ చెప్తున్నాడు. గిలాన్ ఉత్తర ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల అధికారులను అనుమతి కోరానని, వారు తన మొబైల్ లైబ్రరీ నాణ్యత పెరిగే పుస్తకాలను సూచించి సహకరించారని సాహెల్ వివరించాడు. నా కారులో ప్రయాణించే వారు చదివేందుకు మంచి పుస్తకం ఇమ్మని అడిగినప్పుడు నాకెంతో ఆనందంగా ఉంటుందని, నేను మంచి పని చేశానన్న సంతోషం కలుగుతుందని సాహెల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. -
క్యాబ్‌లో వెళ్లేందుకు... అప్పుడు నా దగ్గర డబ్బేది!
పన్నెండేళ్ల ప్రాయంలోని సచిన్ మనోగతం ముంబై: సచిన్ టెండూల్కర్ ఓ దిగ్గజం. అంతేనా.... అంటే కాదు ఇంకా చాలానే ఉంది. అతను బ్యాటింగ్‌లో గ్రేటెస్ట్, పరుగుల్లో ఎవరెస్ట్, ఆర్జనలో రిచెస్ట్... అయితే ఇవన్నీ ఇప్పటి మాటలు. మరి 30 ఏళ్ల క్రితం... అందరిలాగే ఓ సాధారణ పిల్లాడు. 12 ఏళ్ల కుర్రాడు. ఇప్పుడు కోటిన్నర విలువచేసే ఫెరారీ కారులో తిరిగినా... ఐదు కోట్ల రోల్స్ రాయిస్‌లో చక్కర్లు కొట్టినా పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటే అతను భారత్‌లోనే అత్యంత ధనవంతమైన క్రీడాకారుడు. మరి ఆ రోజుల్లో... మూడు దశాబ్దాల క్రితం... ఓ అద్దె కారులో కూడా వెళ్లలేకపోయేంతటి సాధారణ జీవితం. ఇదే విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. మంగళవారం డీబీఎస్ బ్యాంక్ కొత్తగా ఆవిష్కరించిన ‘డిజిబ్యాంక్’ కార్యక్రమంలో తన బాల్యాన్ని ఇలా పంచుకున్నాడు. ‘నాకపుడు సరిగ్గా పన్నెండేళ్లు. ముంబై అండర్-15 జట్టుకు ఎంపికయ్యా. పట్టరాని సంతోషం. ఇంకేముంది... జేబులో మామూలు అవసరాలు తీరే డబ్బులతో పుణెకు వెళ్లా. అక్కడప్పుడు బాగా వర్షం కురిసింది. మొత్తానికి ఆటమొదలై నా వరకు వచ్చేసరికి క్రీజులోకెళ్లిన నేను 4 పరుగుల వద్ద రనౌటయ్యా. ఏం చేస్తాం. ఆ ప్రాయంలో అంతగా పరుగు పెట్టలేకపోయా. చాలా నిరాశతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేశా. తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. కారణం వర్షం. ఇక ఇంటిముఖం తప్ప చేయడానికేమీ లేదు. దీంతో సినిమా, చిరుతిండికే తెచ్చిన డబ్బు అయిపోయింది. దేనికెంత ఖర్చు చేయాలో అప్పుడేం తెలుసు మరి. రెలైక్కి ముంబై చేరుకున్న నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. దాదర్ స్టేషన్ నుంచి రెండు బ్యాగుల్ని భుజాన వేసుకొని శివాజీ పార్క్‌కు నడుచుకుంటూ వెళ్లాను. ఎందుకంటే క్యాబ్‌లో వెళ్లెందుకు జేబులో డబ్బులుండాలిగా’ అని ఈ బ్యాటింగ్ మేధావి సెల్ఫోన్లు లేని రోజుల్ని వివరించాడు. అప్పుడే సెల్ఫోన్లు ఉంటే తాను ఎస్సెమ్మెస్తోనూ, ఫోన్ కాల్‌తోనూ తన తల్లిదండ్రుల్ని సంప్రదించి డబ్బుల్ని అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడ్నని చెప్పుకొచ్చాడు. జీవితంలోనే కాదు... క్రికెట్లో టెక్నాలజీ ఆవిష్కరణలు పెను మార్పులు తెచ్చాయన్నాడు. 1992లో థర్డ్ అంపైర్ (టీవీ రిప్లే చూసి నిర్ణయించడం), తదనంతరం కంప్యూటర్‌తో ప్రణాళిక వ్యూహాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మార్పులే వచ్చాయని అన్నాడు. -
క్యాబ్‌లో ప్రసవం.. శిశువు పేరు ఉబెర్!
అది దక్షిణ ఢిల్లీలోని డెవ్లీ ప్రాంతం. పురుటి నొప్పులు పడుతున్న ఓ మహిళ అంబులెన్స్ కోసం ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఆమెకు సహాయం చేయడానికి ఏ ఒక్క అంబులెన్స్ అందుబాటులో లేదు అనే సమాధానం వచ్చింది. దీంతో కంగారు పడిన ఆమె అటుగా వచ్చిన క్యాబ్‌ను పిలించింది. ఆసుపత్రికి వెళ్లే లోపే.. క్యాబ్‌లోనే ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె తనకు సహాయం అందించిన ఆ క్యాబ్ కంపెనీ పేరే బిడ్డకు పెట్టబోతోంది. బాబ్లీ అనే మహిళ ప్రసవానికి సహకరించిన క్యాబ్ డ్రైవర్ షానవాజ్ మాట్లాడుతూ.. 'తాను మరో ఇద్దరు మహిళలతో ఉంది. క్యాబ్ కావాలి అని చెప్పగానే.. నేను అంబులెన్స్‌ను పిలువకపోయారా అని అడిగాను. అవి అందుబాటులో లేవని సమాధానం చెప్పారు. దీంతో క్యాబ్‌లో తీసుకెళ్తుండగానే ఆమెకు ప్రసవం అయింది. కూడా ఉన్న ఇద్దరు మహిళలు ప్రసవంలో సహకరించారు. అంతా నిమిషాల్లో జరిగిపోయింది. వెంటనే వారిని సఫ్తార్‌జంగ్ హస్పిటల్‌కు తీసుకెళ్లాను. ఎమర్జెన్సీ వార్డుకు చేర్చాను. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు.. చాలా సంతోషంగా ఉంది. ఆస్పత్రి డాక్టర్లు నువ్వు ఆమె భర్తవా అని అడిగారు' అని నవ్వుతూ తెలిపాడు. కుటుంబ సభ్యులు ఆదివారం ఆ బిడ్డకు నామకరణ మహోత్సవం జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి షానవాజ్‌ను ఆహ్వనించి అతన్నే తన బిడ్డకు పేరు పెట్టాల్సిందిగా బాబ్లీ కోరింది. షానవాజ్ తను పనిచేస్తున్న సంస్థ 'ఉబెర్' పేరునే ఆ మగబిడ్డకు పెట్టనున్నట్లు వెల్లడించాడు. -
'క్యాబ్' పగ్గాలు చేపట్టిన దాదా
టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురువారం అధికారికంగా 'క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్' (క్యాబ్) పగ్గాలు చేపట్టారు. కోల్‌కతాలో జరిగిన ప్రత్యేక జనరల్ మీటింగ్ సమావేశంలో గంగూలీ క్యాబ్ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నారు. సెప్టెంబర్ 20న జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణంతో గంగూలీ ఈ స్థానాన్ని భర్తీ చేశారు. దాల్మియా తనయుడు అవిషేక్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. కేవలం 10 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో గంగూలీ, అవిషేక్లను బెంగాల్ క్రికెట్ బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
మనోహర్‌కు గంగూలీ మద్దతు!
బోర్డు అధ్యక్ష పదవికి పేరు ప్రతిపాదించే అవకాశం కోల్‌కతా: బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పేరు దాదాపు ఖాయమైంది. ఈమేరకు ఈస్ట్‌జోన్ నుంచి తమ అభ్యర్థిగా మనోహర్ పేరును బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడి హోదాలో సౌరవ్ గంగూలీ ప్రతిపాదించనున్నారు. క్యాబ్‌తో పాటు ఎన్సీసీ, త్రిపుర, జార్ఖండ్ క్రికెట్ సంఘాలు మనోహర్‌కు పూర్తి మద్దతునిస్తున్నాయి. ముందుగా సౌరవ్ తమ క్రికెట్ సంఘం ఎస్‌జీఎంను ఏర్పాటు చేసి... ఇప్పటిదాకా ఉన్న సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేయనున్నారు. బీసీసీఐ ఏజీఎంలో పాల్గొనడానికి ముందే క్యాబ్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. క్యాబ్ ఏజీఎం ఎప్పుడనేది అక్టోబర్ 1న ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు బీసీసీఐ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం బోర్డు ఎస్జీఎం ఎప్పుడనేది రాష్ట్ర యూనిట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి ఎన్నిక కోసం 15 రోజుల్లోగా ఎస్జీఎం ఏర్పాటును వెల్లడించాలి. ఈనెల 20న దాల్మియా మరణించాడు కాబట్టి వచ్చేనెల 5 వరకు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌కు సమయం ఉంది. -
'క్యాబ్' చీఫ్ గా గంగూలీ
కోల్ కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గంగూలీ నియమకాన్నిపశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఖరారు చేశారు. అంతకుముందు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ దాల్మియా మృతితో ఆ స్థానం ఖాళీ అయ్యింది. దాల్మియా వారసుడిగా ఎవరూ ఎదగలేకపోవడంతో పరిస్థితి కొంతమేర సంక్లిష్టంగా కనిపించింది. అయితే చాలా మంది సౌరవ్ గంగూలీ పేరును సూచించారు. అంతకుముందు ‘క్యాబ్’ సంయుక్త కార్యదర్శి హోదాలో సౌరవ్ ఉన్నా.. అతనికి అనుభవం తక్కువ అనే అభిప్రాయం వినిపించింది. వీటన్నింటికీ తెరదించుతూ సీఏబీ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు మమత ప్రకటించారు. మంచి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న గంగూలీ.. అదే తరహాలో బెంగాల్ క్రికెట్ ను కూడా ముందుకు తీసుకువెళతారని మమత ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు దాల్మియా కుమారుడు అభిషేక్ కు 'క్యాబ్'లో కీలక పదవి దక్కే అవకాశం కనబడుతోంది. -
మమతతో గంగూలీ భేటీ.. దాదాకు కీలక పదవి!
కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్ష పదవికి గంగూలీ పేరు వినిపిస్తున్న తరుణంలో ఆయన మమతా బెనర్జీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. బీసీసీఐ అధ్యక్షుడు, క్యాచ్ చీఫ్ జగ్మోహన్ దాల్మియా మరణంతో ఈ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా ఉన్న గంగూలీని చీఫ్‌గా నియమిస్తే బాగుంటుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలావుండగా, బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు అరూప్ బిస్వాల్, సుబ్రతా ముఖర్జీ కూడా అధ్యక్ష పదవిపై కన్నేశారు. ఈ నేపథ్యంలో గంగూలీ మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. -
నిశ్చితార్థానికి వెళుతూ మహిళా జర్నలిస్టు దుర్మరణం
నాసిక్ : ముంబై- ఆగ్రా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా జర్నలిస్ట్ సహా ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంబాద్ పోలీసు స్టేషన్ అధికారుల సమాచారం ప్రకారం.. నాసిక్ సమీపంలో అతి వేగంగా వెళ్తున్న క్యాబ్ అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ముంబైలోని మరాఠీ దినపత్రికకు చెందిన 26 ఏళ్ల మహిళా జర్నలిస్టు ప్రియాంక దాహ్లే, క్యాబ్ డ్రైవర్ భూపీందర్ సింగ్, మరో ప్రయాణికుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. గతంలో స్థానిక పత్రికలో పనిచేసిన ప్రియాంక ఈ మధ్యనే ముంబైలోని మరో ప్రతికలో చేరినట్టు సమాచారం. ఈ మధ్య ఆమెకు ముంబైకి షిప్ట్ అయ్యారు. ముంబై నుంచి తన నిశ్చితార్థం కోసం వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిశ్చితార్థ వేడుకలో మునిగి తేలాల్సిన ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం ఉదయం ప్రియాంక మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
ఇక రైలుతోపాటే క్యాబ్
నేటి నుంచి సికింద్రాబాద్, తిరుపతి స్టేషన్లలో సర్వీసులు సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణంతో పాటే క్యాబ్, పోర్టల్ బుకింగ్ సదుపాయాలను ఐఆర్సీటీసీ( ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్) అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు రైలు దిగిన వెంటనే పోర్టర్, క్యాబ్ సర్వీసుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఐఆర్‌సీటీసీయే కొత్తగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. శనివారం నుంచి సికింద్రాబాద్, తిరుపతి రైల్వేస్టేషన్లలో ఈ సేవలు అమల్లోకి రానున్నాయి. త్వరలో విజయవాడ,గుంటూరు రైల్వేస్టేషన్లలో కూడా ఈ సేవలను ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి 36 గంటలు ముందు ఐఆర్సీటీసీ ఆన్లైన్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఆర్సీటీసీ.కో.ఇన్’ లేదా ‘డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ. ఐఆర్సిటీసీ టూరిజం.కమ్.’ సైట్లలో క్యాబ్, పోర్టర్లను బుక్ చేసుకోవచ్చు. రెండు రకాల సేవలను కలిపి లేదా విడివిడిగా బుక్ చేసుకోవచ్చు. అనంతరం ప్రయాణికులకు ట్రైన్ దిగిన వెంటనే క్యాబ్, పోర్టర్ సర్వీసుల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్, ఇతర వివరాలు రైల్వే సిబ్బంది తెలియజేస్తారు. అంతేకాకుండా స్వయంగా క్యాబ్, పోర్టర్లను ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రస్తుతం రాజధాని, శతాబ్ది, దురంతో,ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. అలాగే తిరుపతి రైల్వేస్టేషన్ వద్ద న్యూఢిల్లీ, సికింద్రాబాద్, విశాఖపట్నం,ముంబై నుంచి వచ్చే రైళ్లకూ ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. త్వరలో అన్ని రైళ్లకు క్యాబ్,పోర్టర్ సదుపాయాలను విస్తరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. -
‘గుర్తు’ పెట్టుకోండి!
* ప్రతి క్యాబ్ కూ పోలీసు ఐడీ ఉండాల్సిందే * నేర చరిత్ర ఉన్న క్యాబ్ డ్రైవర్లకు చెక్ * ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్ తప్పనిసరి * డ్రైవర్లు, ఓనర్ల వివరాలు సేకరిస్తున్న పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: క్యాబ్‌లలో ప్రయాణించే వారి భద్రతకు జంట పోలీసు కమిషనరేట్లు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యాబ్ యజమానులు, డ్రైవర్లపై పోలీసులు దృష్టి సారించారు. నేర చరిత్ర కలిగిన క్యాబ్ డ్రైవర్లకు ఉద్వాసన పలికేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతేకాదు... ప్రతి క్యాబ్కూ ఇక నుంచి పోలీసు ఐడీ నెంబర్‌ను కేటాయించే పనిలో పడ్డారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన క్యాబ్ డ్రైవర్ అకృత్యాలు నేపథ్యంలోఇక్కడి వారిపై దృష్టి సారించారు. క్యాబ్‌లకు ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ అనే పోలీసు స్టిక్కర్ లేకపోతే అలాంటి వాహనాలను జనవరి ఒకటి నుంచి తిరగనివ్వరు. క్యాబ్ డ్రైవర్లు, యజమానులకు మెటారు వాహనాల చట్టం, నగర పోలీసు చట్టంపై అవగాహన ల్పిస్తున్నారు. ఇప్పటికే జంట పోలీసు కమిషనరేట్లలో తిరుగుతున్న క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లతో పోలీసులు విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేశారు. డ్రైవర్లు, ఓనర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై కౌన్సెలింగ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 45 వేలకుపైగా వివిధ సంస్థలు, ప్రయివేటు వ్యక్తులకు చెందిన క్యాబ్‌లు ఉన్నాయి. ఇవి ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసమే నడుస్తున్నాయి. మరికొన్ని విమానాశ్రయం, మహాత్మాగాంధీ, జూబ్లీబస్ స్టేషన్లు, కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. నగరంలో విహార యాత్ర కోసం కూడా క్యాబ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇవి పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాహన యజమాని చిరునామా, సెల్‌నెంబర్‌తో పాటు డ్రైవర్ పేరు, చిరునామా, సెల్‌నెంబర్, ఫొటోలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఠాణాల వారీగా వివరాలు సేకరించిన తరువాత ఒక్కో క్యాబ్‌కు ఐడీ నెంబర్‌తో కూడిన ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’అని ముద్రించిన స్టిక్కర్‌ను ఇస్తారు. దీన్ని క్యాబ్ ముందు, వెనుక భాగాల్లో అతికించాలి. ఏదైనా క్యాబ్ డ్రైవర్ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ మార్చుకుని నేరానికి పాల్పడితే రహదారులపై ఉండే సీసీ కెమెరాల ఆధారంగా స్టిక్కర్‌పై ఉండే ఐడీని పోలీసులు గుర్తించి వాహనం, డ్రైవర్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ప్రతి ఠాణాలో దీనికి సంబంధించి ప్రత్యేక రిజిస్టర్ ఉంటుంది. ఇందులో డ్రైవర్ల ఫోటోతో పాటు అతని స్వగ్రామం, పూర్తి వివరాలు పొందుపరుస్తారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు పదివేలకుపైగా క్యాబ్‌లకు ఐడీ నెంబర్లతో కూడిన స్టిక్కర్లను అందజేశారు. ఒకవేళ డ్రైవర్ మారితే ఆ వివరాలను యజమాని పొందుపర్చాల్సి ఉంటుంది. వివరాలు అందజేయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆధికారులు హెచ్చరిస్తున్నారు. నేరచరిత్రపై ఆరా ప్రతి క్యాబ్ డ్రైవర్ ప్రవర్తనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో డ్రైవర్ ఎక్కడ నివసించాడు, ప్రస్తుతం ఉంటున్న చిరునామా, అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. కేసులు ఉంటే ఆ విషయాన్ని పోలీసులు వెంటనే క్యాబ్ యజమానికి తెలియజేస్తారు. నేర చరిత్ర ఉన్న డ్రైవర్లను ఉద్యోగంలో నియమిస్తే ఘోరాలకు ఆస్కారం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. నేరం రుజువై, జైలు శిక్ష అనుభవించిన డ్రైవర్లు పూర్తిగా మారిపోయారని యజమాని భావిస్తే ఉద్యోగంలో పెట్టుకోవచ్చంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ మహిళలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగినిల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చందానగర్, మియాపూర్ ప్రాంతాలతో క్యాబ్, ఆటో డ్రైవర్లతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించాం. ప్రయాణికులతో ఎలా మెలగాలి? యజమానులు, డ్రైవర్ల బాధ్యతపై అవగాహన కల్పించాం. నేర ప్రవృత్తి కలిగిన డ్రైవర్ల సమాచారం సేకరిస్తున్నాం. జనవరి ఒకటి నుంచి క్యాబ్‌లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఇప్పటికే అన్ని ఠాణాలకు ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలు ఉల్లంఘించిన క్యాబ్‌లను సీజ్ చేస్తాం. -సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ -
మహిళలకు దడపుట్టిస్తున్న ట్యాక్సీ
-
స్లో అండ్ స్టడీ..
ఎక్కడైనా క్యాబ్ వాళ్లు మిమ్మల్ని వేగంగా గమ్యస్థానానికి చేరుస్తాం.. కళ్లు మూసి తెరిచేలోపల మీక్కావాల్సిన చోట దింపేస్తాం అంటూ యాడ్లు ఇస్తారు. కానీ జపాన్‌లోని యోకోహామాలో టర్టిల్ ట్యాక్సీ వాళ్లు మాత్రం పేరుకు తగ్గట్లే.. మేం నత్తనడకన పోతాం.. బాగా నెమ్మదిగా ట్యాక్సీ నడుపుతాం.. అరగంటలో వెళ్లాల్సినదానికి గంట సమయం తీసుకుంటాం అని యాడ్ ఇచ్చారు. మన దగ్గరైతే.. టర్టిల్ ట్యాక్సీ అట్టర్ ఫ్లాప్ అయ్యేది. కానీ జపాన్‌లో ఇదో పెద్ద హిట్ అయి కూర్చుంది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలతో ప్రయాణించేవారు, సిటీ చూడ్డానికి వచ్చే పర్యాటకులు ఈ ట్యాక్సీకే ఓటేస్తున్నారు. టర్టిల్ ట్యాక్సీ డ్రైవర్లు అతి నెమ్మదిగా.. కుదుపులు లేకుండా కారు నడుపుతారు. దీని కోసం ముందుగా మనం ట్యాక్సీ ఎక్కగానే.. సీటువద్ద ఉండే ఓ బటన్‌ను నొక్కాల్సి ఉంటుంది. దాన్ని నొక్కితే.. నెమ్మదిగా వెళ్లమని డ్రైవర్‌కు సంకేతం పోయినట్లే.. దీనికి బాగా డిమాండ్ పెరగడంతో వచ్చే ఏడాది టోక్యోతోపాటు మరిన్ని నగరాల్లో ఈ సర్వీసును ప్రవేశపెట్టనున్నారు. -
‘నా వాహనం సురక్షితం’ క్యాబ్‌లోనే ప్రయాణించండి
మార్చి 1 నుంచి క్యాబ్‌లకు పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్లు.... లేదంటే వాహనం సీజ్ సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ సిటీలో తిరిగే ప్రతి క్యాబ్ కూడా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రత్యేక నంబర్‌ను పొందాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 1 నుంచి పోలీసు రిజిస్ట్రేషన్ మొదలవుతుందని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భం గా కమిషనర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివరాలను ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి వివరించారు. పోలీసులు జారీ చేసే నా వాహనం సురక్షితం అనే స్టిక్కర్ ఉన్న క్యాబ్‌లోనే మహిళా ఉద్యోగులు ప్రయాణించాలని ఆయన సూచించారు. పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా తిరిగే క్యాబ్‌లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ పులిందర్రెడ్డి, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కా ర్యదర్శి శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ఇలా... ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులను తరలించే ప్రతి క్యాబ్ పోలీసు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం వాహనం, డ్రైవర్, యజమాని వివరాలు నింపేందుకు ప్రత్యేక ఫారాలను తయారు చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ కాగితాలు, ఫిట్నెస్, పొల్యుషన్, ఇన్సూరెన్స్ కాగితాలు సమర్పించాలి. అలాగే డ్రైవర్ వివరాల కోసం అతని ఫోటో, చిరునామా తెలిపే రేషన్, ఓటర్, ఆధార్‌లో ఏదైనా ఒక కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాలి. ఇక వాహన యజమాని వివరాలకై చిరునామా తెలిపే ఏదేని ప్రభుత్వ కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాల్సి ఉంది. ఫారాలు కూకట్పల్లి ట్రాఫిక్ ఠాణాలో లభిస్తాయి. మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. ప్రతి ఏటా క్యాబ్‌లు పోలీసుల వద్ద రెన్యూవల్ చేయించుకోవాలి.రిజిస్ట్రేషన్ కోసం రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. క్యాబ్ వివరాలు క్షణాల్లో... క్యాబ్‌లకు పోలీసులు ప్రత్యేకంగా క్యూర్ నంబర్‌ను కేటాయిస్తారు. డ్రైవర్ ఫోటో, వివరాలతో కూడిన స్టిక్కర్‌ను వాహనం లోపల, బయటి వ్యక్తులకు కనిపించేలా అతికించాలి. స్టిక్కర్లో ఉన్న కోడ్ నంబర్‌ను మొబైల్ యాప్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ సెల్‌నంబర్ 8500411111కు ఎస్ఎంఎస్ చేస్తే క్షణాల్లో వాహనం, డ్రైవర్ పూర్తి వివరాలు అందుతాయి. ఇలా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ అయిన క్యాబ్‌ల వివరాలన్నీ త్వరలో ట్రాఫిక్ పోలీసు వెబ్సెట్లో పొందుపరుస్తారు. దాంతో క్యాబ్ డ్రైవర్లు నేరాలకు పాల్పడరని అధికారులు ఆశిస్తున్నారు. -
‘నా వాహనం సురక్షితం’ క్యాబ్‌లోనే ప్రయాణించండి
సాక్షి, హైదరాబాద్: హైటెక్ సిటీలో తిరిగే ప్రతి క్యాబ్ కూడా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రత్యేక నంబర్‌ను పొందాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 1 నుంచి పోలీసు రిజిస్ట్రేషన్ మొదలవుతుందని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివరాలను ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి వివరించారు. పోలీసులు జారీ చేసే నా వాహనం సురక్షితం అనే స్టిక్కర్ ఉన్న క్యాబ్‌లోనే మహిళా ఉద్యోగులు ప్రయాణించాలని ఆయన సూచించారు. పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా తిరిగే క్యాబ్‌లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ పులిందర్రెడ్డి, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ఇలా... ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులను తరలించే ప్రతి క్యాబ్ పోలీసు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం వాహనం, డ్రైవర్, యజమాని వివరాలు నింపేందుకు ప్రత్యేక ఫారాలను తయారు చేశారు. వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కాగితాలు, ఫిట్నెస్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ కాగితాలు సమర్పించాలి. అలాగే డ్రైవర్ వివరాల కోసం అతని ఫోటో, చిరునామా తెలిపే రేషన్, ఓటర్, ఆధార్‌లో ఏదైనా ఒక కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాలి. ఇక వాహన యజమాని వివరాలకై చిరునామా తెలిపే ఏదేని ప్రభుత్వ కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫారాలు కూకట్పల్లి ట్రాఫిక్ ఠాణాలో లభిస్తాయి. మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. ప్రతి ఏటా క్యాబ్‌లు పోలీసుల వద్ద రెన్యూవల్ చేయించుకోవాలి.రిజిస్ట్రేషన్ కోసం రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. క్యాబ్ వివరాలు క్షణాల్లో... క్యాబ్‌లకు పోలీసులు ప్రత్యేకంగా క్యూర్ నంబర్‌ను కేటాయిస్తారు. డ్రైవర్ ఫోటో, వివరాలతో కూడిన స్టిక్కర్‌ను వాహనం లోపల, బయటి వ్యక్తులకు కనిపించేలా అతికించాలి. స్టిక్కర్లో ఉన్న కోడ్ నంబర్‌ను మొబైల్ యాప్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ సెల్‌నంబర్ 8500411111కు ఎస్ఎంఎస్ చేస్తే క్షణాల్లో వాహనం, డ్రైవర్ పూర్తి వివరాలు అందుతాయి. ఇలా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ అయిన క్యాబ్‌ల వివరాలన్నీ త్వరలో ట్రాఫిక్ పోలీసు వెబ్సెట్లో పొందుపరుస్తారు. ఇలా చేయడంతో క్యాబ్ డ్రైవర్లు నేరాలకు దూరంగా ఉంటారని అధికారులు ఆశిస్తున్నారు. -
'సచిన్' పేరును తప్పుగా రాసినందుకు ధోని ఆగ్రహం!
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధికారులపై భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ కూల్ గా ఉండే ధోని ఆగ్రహించడానికి సచిన్ టెండూల్కర్ పేరు కారణమైంది. సచిన్ ఆడనున్న 199వ టెస్ట్ ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో బెంగాల్ క్రికెట్ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఈడెన్ గార్డెన్ లోని హైకోర్టు ఎండ్ లో ఉన్న ఎలక్ట్రానికి స్కోర్ బోర్డుపై సచిన్ పేరును తప్పుగా పెట్టిందెవరూ అని ధోని నిలదీశారు. వెస్టిండీస్ తో జరుగనున్న టెస్ట్ మ్యాచ్ కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముందు సచిన్ పేరును తప్పుగా రాసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోపల Sachin కు బదులు Sachine అని పేరును సరిగా రాయనిదెవరో ముందు చెప్పాలని స్కోర్ బోర్డును చూపిస్తూ సమావేశంలో మండిపడ్డారు. స్టేడియంలో చేసిన ఏర్పాట్లను చూసి సచిన్ అసంతృప్తికి గురయ్యారనే వార్తల నేపథ్యంలో బెంగాల్ అధికారుల తీరును ధోని తప్పుపట్టారు. -
క్యాబ్.. లబోదిబో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో క్యాబ్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ప్రయాణికులతో నిండుగా కనిపించే క్యాబ్‌లు ఇప్పుడు బోసిపోతున్నాయి. రాష్ట్రంలో గత కొన్ని ఏళ్లుగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులే ఇందుకు కారణమని తెలుస్తోంది. 2007లో వచ్చిన మాంద్యం నుంచి గట్టెక్కుతున్న తరుణంలో.. విభజన, సమైక్య ఉద్యమ ఫలితంగా క్యాబ్ పరిశ్రమ వ్యాపారం సగానికి పడిపోయింది. రాష్ట్రంలో క్యాబ్, బస్ సర్వీసులకు హైదరాబాద్ అతి పెద్ద మార్కెట్. ఐటీ, ఔషధ, రసాయన కంపెనీలు వీటికి అతిపెద్ద ఆదాయ వనరు కావడమే ఇందుకు కారణం. అయితే కార్పొరేట్ సంస్థలు ఖర్చులను తగ్గించుకునేం దుకు పిక్ అప్‌లను తగ్గించివేశాయి. ఉద్యోగులను వారి ఇంటి వద్ద నుంచి తీసుకు వచ్చేబదులు పాయింట్ పిక్ అప్‌లను ఎంచుకుంటున్నాయి. అంటే వివిధ రూట్లలో బస్‌లను నడిపి, ఆ రూట్లో ఉన్న ఉద్యోగులను నిర్దిష్ట ప్రాంతం నుంచి ఎక్కించుకుంటున్నాయి. గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను ఎంఎంటీఎస్‌లో రమ్మంటున్నాయని గ్రేటర్ హైదరాబాద్ క్యాబ్స్, బస్ ఆపరేటర్ల సంఘం వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి సయ్యద్ నిజాముద్దీన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పన్ను కట్టాల్సిందే..: కార్పొరేట్ కంపెనీలు ఎక్కువ సీట్లున్న వాహనాలను డిమాండ్ చేస్తున్నాయి. 2006-07లో హైదరాబాద్‌లో 25 వేల ఇండికా కార్లు ఉంటే, ఇప్పుడు వీటి సంఖ్య 6 వేలకు తగ్గడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం 22-36 సీట్ల బస్‌లు 1,000కి పైమాటే. ఇన్నోవాలు 10 వేల దాకా ఉంటాయి. క్యాబ్ ఏజెన్సీల వద్ద 5 వేల లోగాన్ కార్లున్నాయి. వ్యాపారం బాగా జరిగిన సమయంలో ఇక్కడి ఆపరేటర్లు ఆడి, బీఎండబ్ల్యు, జాగ్వార్ వంటి ఖరీదైన కార్లను కూడా కొనుగోలు చేశారు. ఇటువంటివి నగరంలో 100 దాకా ఉంటాయి. క్యాబ్ ఏజెన్సీలు, పెద్ద బస్‌లను నిర్వహిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు రాష్ట్రంలో మూడు నెలలకోసారి సుమారు రూ.1,000 కోట్ల పన్ను కడుతున్నాయని సమాచారం. వాహనం తిరిగినా తిరగకపోయినా ట్యాక్స్ కట్టాల్సిందేనని మోతినగర్‌లోని రమ్య ట్రావెల్స్ యజమాని ఎన్.శ్రీనివాస్ చెప్పారు. 30% వ్యాపారులే... ఒకట్రెండు వాహనాలను కొని కార్పొరేట్ కంపెనీలకు అద్దెకు ఇచ్చేవారి పరిస్థితి మరీ దారుణం. కంపెనీల వ్యయ నియంత్రణతో వాహన యజమానులకు ఆదాయం తగ్గిపోయింది. ‘మూడేళ్ల క్రితం డీజిల్ ధర లీటరుకు రూ.33.50. ఇప్పుడది రూ.56.65. డ్రైవర్ వేతనం రూ.5,500 నుంచి రూ.10 వేలకు ఎగబాకింది. అయినా కార్పొరేట్ కంపెనీలు వాహనాకు చెల్లించే నెలవారీ అద్దె పెంచకపోగా తగ్గించాయి’ అని సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. ఈ పరిశ్రమలో చిన్న వాహన యజమానుల్లో విజయవంతమైనవారు 30% మందే ఉంటారన్నారు. వందలాది మంది వాహనాలను అమ్ముకుని ఇతర వ్యాపకాలను చేసుకుంటున్నారని చెప్పారు. ఇక హైదరాబాద్‌లో రేడియో క్యాబ్ ఏజెన్సీల వద్ద 1,300 వాహనాలు ఉన్నాయి. వీటి వ్యాపారం రోజుకు రూ.30 లక్షలు. గడిచిన రెండు నెలల్లోనే వ్యాపారం 35% తగ్గిందని ఒక రేడియో క్యాబ్ ఏజెన్సీ ప్రతినిధి చెప్పారు. మిగిలేది పెద్ద ఆపరేటర్లేనా... క్యాబ్, బస్ ఆపరేటర్లలో పెద్ద సంస్థలే ప్రస్తుత పరిస్థితుల్లో నిలదొక్కుకుంటున్నాయి. క్లయింట్ల సంఖ్య ఎక్కువగా ఉండి, వాహనాలు నిరంతరం బిజీగా ఉంటేనే మంచి లాభాలు వస్తున్నాయి. లేదంటే రాబడికి బదులు ఖర్చే ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు 22 సీటర్ల బస్‌కు కార్పొరేట్ కంపెనీలు నెలవారీ అద్దె రూ.55 వేలు చెల్లిస్తున్నాయి. ఇక బస్ యజమానికి అవుతున్న ఖర్చు చూస్తే.. నెలకు పన్నుల రూపంలో రూ.3 వేలు, డీజిల్ రూ.20 వేలు, డ్రైవర్‌కు రూ.10 వేలు, బీమా రూ.3 వేలు, నిర్వహణ వ్యయం రూ.4 వేలు, ఫైనాన్స్ సంస్థకు నెల వాయిదా రూ.32 వేలు అవుతోంది. దీంతో వ్యయం రూ.72 వేలకు చేరింది. వాహనాన్ని ఇతర కంపెనీలకు కూడా తిప్పగలిగితేనే అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి.