మా ఊరిలో సినిమా తీయడం ఆనందంగా ఉంది: అర్జున్ దేవరకొండ | Tollywood Movie Cab Shooting Completed In Anantapur | Sakshi
Sakshi News home page

Cab Movie: అనంతపురంలో షూటింగ్ పూర్తి చేసుకున్న 'క్యాబ్'

Published Tue, Feb 14 2023 2:34 PM | Last Updated on Tue, Feb 14 2023 2:36 PM

Tollywood Movie Cab Shooting Completed In Anantapur - Sakshi

అర్జున్ దేవరకొండ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'క్యాబ్'. ఈ సినిమాలో నాగ, సూర్య, వందన, దేవి, శివమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అనంతపురంలో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 25 రోజుల పాటు ఈ సినిమాను అనంతపురంలో చిత్రీకరించారు. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తవ్వగా.. మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో చిన్నారి హాస్పిటల్ డా.హరిప్రసాద్, తెలుగమ్మాయి మహిత నటిస్తున్నారు

ఈ సందర్భంగా చిత్రబృందానికి సహకరించిన అధికారులకు డైరెక్టర్ అర్జున్ దేవరకొండ ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం మేయర్ వసీం , డిప్యూటీ మేయర్స్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అర్జున్ దేవరకొండ మాట్లాడుతూ..' నేను పుట్టిన ఊరిలో నా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని.' తెలిపారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement