కార్ల తరహాలో ఇక ఆర్టీసీ బస్సులు కూడా అద్దెకు లభించబోతున్నాయి. ఆర్టీసీ బస్సులు అద్దెకివ్వటం కొత్త కానప్పటి కీ.. క్యాబ్‌ల తరహాలో ఇన్ని గంటలు, ఇన్ని కిలోమీటర్లు అంటూ కొత్త టారిఫ్‌తో అద్దెకు సిద్ధపడటమే విశేషం. పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం బస్సులు అద్దెకు దొరికేవి. అయితే కచ్చి తంగా 24 గంటలకు తగ్గకుండా తీసుకుంటేనే ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చేది. ఇప్పుడు ఆ నిబంధనను సడలించి కనీసం 8 గంటలు, సిటీ బస్ అరుుతే కనీసం 4 గంటలకు తగ్గకుండా అద్దెకిచ్చేందుకు ఆర్టీసీ సిద్ధపడింది. తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని గట్టెక్కించే క్రమంలో స్వయంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత జూన్‌లో ఉద యం నుంచి రాత్రి వరకు కేసీఆర్ నిర్వహించిన మారథాన్ సమీక్షలో ఈ సూచన చేశారు.