
మాదాపూర్‌లో క్యాబ్ బీభత్సం
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో ఓ క్యాబ్ బీభత్సం సష్టించింది. వేగంగా వెళ్తున్న క్యాబ్ అదుపుతప్పి రోడ్డు పక్కన పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కార్మికులు మంజుల, శాంతమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి.
మాదాపూర్ పోలీసు స్టేషన్ ఎదురుగా రోడ్డు ఊడుస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆ ప్రదేశంలో నలుగురు కార్మికులు పనిచేస్తుండగా మిగతా ఇద్దరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.