HYD: కేబుల్‌ బ్రిడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా | Road Accident At Cable Bridge In Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: కేబుల్‌ బ్రిడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా

Published Wed, Aug 9 2023 6:44 PM | Last Updated on Wed, Aug 9 2023 6:46 PM

Road Accident At Cable Bridge In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌లోని కేబుల్‌ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంలో ఉన్న కారు కేబుల్‌ బ్రిడ్జి వద్ద పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయాపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. 

వివరాల ప్రకారం.. కేబుల్‌ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ నుంచి ఐటీసీ కోహినూర్‌ వైపు వెళ్తున్న బ్రీజా కారు(B.No: TS09FB4896) పల్టీ కొట్టింది. ​కాగా, కారు డ్రైవర్‌ హైస్పీడ్‌లో ఉండటం, నిర్లక్ష్యంతో డ్రైవింగ్‌ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం, కారును ఘటనా స్థలం నుంచి తొలగించారు. 

ఇది కూడా చదవండి: సంధ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌.. ఆటోడ్రైవర్‌కు అర్ధరాత్రి ఫోన్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement