
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అతి వేగం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. నిండు ప్రాణం గాలిలో కలిసింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై హైస్పీడ్‌లో వెళ్తున్న స్కూటీ సైడ్‌వాల్‌ను ఢీకొనడంతో వాహనం వెనుక కూర్చున్న యువతి ఫ్లైఓవర్‌పై నుంచి పడిపోయి మృతిచెందింది.
వివరాల ప్రకారం.. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో నివాసం ఉంటున్న స్వీటీ పాండే(22) ఓ ప్రైవేట్ ఉద్యోగి. గురువారం సాయంత్రం వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన స్నేహితుడు రాయన్ ల్యూకెతో కలిసి స్కూటీపై జేఎన్టీటీయూ కూకట్‌పల్లి నుంచి బయలుదేరింది. యువకుడు ఐకియా వైపు వెళ్తూ వాహనాన్ని వేగంగా నడిపాడు. హైటెక్ సిటీ చౌరస్తా వద్ద ఉన్న ఫ్లైఓవర్ వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి ప్రొటెక్షన్ వాల్‌ను ఢీకొన్నది. ఈ క్రమంలో బైక్‌పై వెనుక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది.
ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న రాయన్ ల్యూకే కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, వారిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో స్వీటీ పాండే తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా తరలించినట్టు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి
Comments
Please login to add a commentAdd a comment