women death
-
సంధ్య థియేటర్ వద్ద ఘటన.. స్పందించిన అల్లు అర్జున్ టీమ్!
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనపై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. బుధవారం రాత్రి ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం పట్ల దురదృష్టకరమని తెలిపింది. ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఆమె కుమారుడు శ్రీతేజ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.అసలేం జరిగిందంటే..పుష్ప-2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో ప్రదర్శించారు. అయితే ఆ థియేటర్‌కు అల్లు అర్జున్ వస్తున్నారని పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. దీంతో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. -
హైటెక్ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అతి వేగం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. నిండు ప్రాణం గాలిలో కలిసింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై హైస్పీడ్‌లో వెళ్తున్న స్కూటీ సైడ్వాల్ను ఢీకొనడంతో వాహనం వెనుక కూర్చున్న యువతి ఫ్లైఓవర్‌పై నుంచి పడిపోయి మృతిచెందింది. వివరాల ప్రకారం.. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో నివాసం ఉంటున్న స్వీటీ పాండే(22) ఓ ప్రైవేట్ ఉద్యోగి. గురువారం సాయంత్రం వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన స్నేహితుడు రాయన్ ల్యూకెతో కలిసి స్కూటీపై జేఎన్టీటీయూ కూకట్పల్లి నుంచి బయలుదేరింది. యువకుడు ఐకియా వైపు వెళ్తూ వాహనాన్ని వేగంగా నడిపాడు. హైటెక్ సిటీ చౌరస్తా వద్ద ఉన్న ఫ్లైఓవర్ వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి ప్రొటెక్షన్ వాల్‌ను ఢీకొన్నది. ఈ క్రమంలో బైక్‌పై వెనుక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పైనుంచి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న రాయన్ ల్యూకే కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, వారిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో స్వీటీ పాండే తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా తరలించినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి -
నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం..
నక్కపల్లి: మండలంలో నీలకుండీల నర్సాపురంలో ఈ నెల 1వ తేదీన అనుమానాస్పదంగా మరణించిన గుబ్బల నాగమణిది హత్యేనని సీఐ నారాయణరావు, ఎస్ఐ డి.వెంకన్నలు తెలిపారు. బుధవారం వారు నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించాడు. కోటవురట్ల మండలం రామచంద్రపాలెంకు చెందిన గుబ్బల నాగమణి, తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన లక్ష్మణరావులు నర్సాపురంలో సహజీవనం చేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. వీరు గ్రామంలో ఒక భూస్వామికి చెందిన తోటలో కాపలాదారులుగా ఉంటూ జీవిస్తున్నారు. అంతేకాకుండా వ్యసనాలకు బానిసయ్యాడు. తరచూ మద్యం సేవించి వచ్చి, నాగమణిని వేధిస్తుండేవాడు. గత నెల31న కూలిపనికి వెళ్లి వెయ్యి రూపాయలు సంపాదించాడు. ఒకటో తేదీన నాగమణి కూలి డబ్బుల విషయమై ఆరా తీసింది. అతను సరైన సమాధానం చెప్పక పోగా మద్యం సేవించి వచ్చి ఆమెను హింసించాడు. తన వ్యసనాలకు అడ్డంకిగా మారిందని ఎలాగైనా ఆమె అడ్డుతొలగించుకోవాలని భావించాడు. పీక నులిమి, నోటిలో గుడ్డలు కుక్కి నాగమణిని హత్యచేశాడు. నాగమణి చనిపోయినట్టు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ విచారణలో నాగమణిని హత్య చేసింది లక్ష్మణరావేనని తేలిందని, అతను నేరాన్ని అంగీకరించాడని సీఐ, ఎస్ఐలు తెలిపారు. లక్ష్మణరావును అరెస్టుచేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు చెప్పారు. చదవండి: కన్న తండ్రి పైశాచికత్వం! కూతురిపై లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని సైతం -
మానవత్వం మరిచారు..!
సాక్షి, భూపాలపల్లి : ఆపదలో ఉన్న ఓ మహిళను ఆస్పత్రికి చేర్చాల్సిన 108 సిబ్బంది ఆమె గుండె కొట్టుకోవడం లేదని చెప్పడం, అప్పటిదాకా ఆమెను తరలించిన ఆటో డ్రైవర్ నిజంగానే చనిపోయిందేమోనని మార్గ మధ్యంలోనే వదిలేసి వెళ్లడం, కరోనా భయంతో సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సమయానికి వైద్యం అందక ఓ మహిళ మృతి చెందింది. ఈ అమానవీయ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన శంకరమ్మ (45) మొక్కు తీర్చుకోవడానికి మంచిర్యాల జిల్లా భీమారం మండలం తాళ్లగూడెంలో ఉండే తన చెల్లి ఇంటికి మంగళవారం వచ్చింది. అక్కడ ఆమె శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతూ పడిపోయింది. నోటి నుంచి నురుగులు, ముక్కు నుంచి రక్తం రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. అది రావడం ఆలస్యమవడంతో ఆమెను ఆటోలో తీసుకుని బయల్దేరారు. జైపూర్ మండలం వెలిశాల సమీపంలోకి రాగానే 108 వాహనం వారికి ఎదురైంది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శంకరమ్మను ఆటోలోనే పరీక్షించిన 108 సిబ్బంది ఆమె గుండె కొట్టుకోవడం లేదని, పల్స్ పడిపోయిందని చెప్పి ఆస్పత్రికి తరలించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆటోడ్రైవర్ సైతం మహిళను రోడ్డుపైనే దింపి వెళ్లిపోగా, ఆ కుటుంబం సహాయం కోసం ఎంతమందిని వేడుకున్నా ఎవరూ ముందుకు రాలేదు. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రైవేటు అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. దానిలో మంచిర్యాలకు తరలిస్తుండగానే శంకరమ్మ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా వైద్యసాయం అందాల్సినవారిని తక్షణమే ఆస్పత్రికి తరలించాల్సిన 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కరోనా భయంతో ఎవరూ దగ్గరకు రాకపోవడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
ఆ పిల్లలకు దిక్కెవరు!
పెదపూడి(అమృతలూరు): ప్రమాదవశాత్తూ మొక్కజొన్న యంత్రంలో పడి మహిళా కూలీ మృతి చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం మండలంలోని పెదపూడి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పెదపూడి మరియమ్మ(35) ఉదయం రోజూలానే తెల్లజొన్న నూర్పిడి పనులకు తోటి కూలీలతో కలిసి వెళ్లింది. యంత్రం వద్ద పనిచేస్తున్న సమయంలో చీరకొంగు యంత్రానికి చుట్టుకుపోయి లోనికి లాగేసింది. ఈ క్రమంలో తల మెండెం నుంచి వేరుపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో తోటి కూలీలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. మరియమ్మ భర్త జయపాల్ ఏడాది కిందట ఇంటి వద్ద ప్రమాదవశాత్తూ్త విద్యుత్ వైరు తగిలి మృతి చెందాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చుండూరు సీఐ రమేష్‌బాబు, ఎస్ఐలు పాపారావు, కె.రాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పిల్లలకు దిక్కెవరు! పెదపూడికి చెందిన జయపాల్‌తో చుండూరు మండలం దుండిపాలెం గ్రామానికి చెందిన మరియమ్మకు 18 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. దంపతులిద్దరూ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించేవారు. ఉన్నంతలో తమ పిల్లలను చదివించుకునేవారు. గత ఏడాది తన పూరింట్లో కరెంట్ వైరు ఊడిపోవడంతో దానిని కలిపే ప్రయత్నం చేస్తుండగా జయపాల్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. దీంతో కుటుంబ భారం మరియమ్మపై పడింది. పిల్లల చదువుకు, కుటుంబ అవసరాల కోసం పనికి వెళ్లకతప్పని పరిస్థితి. ప్రస్తుతం కుమారుడు రవికుమార్ తెనాలిలో ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతుండగా, శ్రావణి పెదపూడి జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఏడాది కాలంలో తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు. -
గొంతులో బజ్జీ ఇరుక్కుని మహిళ మృతి
చెన్నై,తిరువొత్తియూరు: బజ్జీ గొంతులో చిక్కుకుని మహిళ మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చెన్నైలో చోటుచేసుకుంది. చూలైమేడు కామరాజర్ నగర్‌కు చెందిన పద్మావతి (45) గురువారం రాత్రి బజ్జీలు చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి తింటుండగా గొంతులో ఇరుక్కుపోయి విలవిలలాడింది. కుటుంబ సభ్యులు ఆమెను కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చూలైమేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
అమ్మను కాపాడుకోలేమా?
మాతృత్వం ఓ కమ్మని కల. తొమ్మిది నెలలు మోసి.. ప్రసవించాక.. అందివచ్చే ఆ తీయని అనుభూతే వేరు. కానీ చాలామంది గిరిజన ప్రాంత గర్భిణులకు మాత్రం అది దైవాధీనమే. 280 రోజులపాటు కడుపులో ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న బిడ్డ దక్కకపోతే ఆ తల్లి బాధ వర్ణనాతీతం. బిడ్డతోపాటు తల్లి సైతం కన్నుమూస్తే ఆ ఇంట నిండేది గాఢాంధకారం. అలాంటి విషాద సంఘటన ఈ వారంలో రెండోసారి జరిగింది. మూడు ఆస్పత్రులకు తిప్పినా ఘోరం ఆగలేదు. ఆమె ప్రాణం నిలబడలేదు. అమ్మను కాపాడుకోలేమా? ఈ ప్రశ్నకు బదులేది? సాక్షి, భామిని(శ్రీకాకుళం) : మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కోసింగిగూడ కాలనీకి చెందిన గిరిజన మహిళ బిడ్డిక జ్యోతి (22) పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ప్రసవానంతరం సోమవారం అర్ధరాత్రి ప్రాణాలు విడిచింది. మూడు ఆస్పత్రులకు తిప్పినా ప్రయోజనం లేకపోయింది. మాతాశిశు మరణాలను అరికట్టడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరణాలు ఆగడం లేదు. ఈ మధ్యకాలంలో సీతంపేట ఏజెన్సీలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, తాజాగా భామిని మండలంలో ఇలాంటి ఘటనే జరగడం ఆందోళనకు గురి చేస్తోంది. బిడ్డిక జ్యోతికి ఉదయం పురిటి నొప్పులు రావడంతో కోసింగూడ కాలనీ నుంచి భామిని పీహెచ్‌సీకి ఆశ వర్కర్ ప్రశాంతి సాయంతో తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు కొత్తూరు కమ్యూనిటీ ఆస్పత్రికి రిఫర్ చేసి 108 అంబులెన్స్‌లో జ్యోతిని పంపించారు. అనంతరం కొత్తూరు నుంచి పాలకొండ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ ప్రసవం జరిగిన తరువాత జ్యోతి మృత్యు ఒడిలోకి చేరిందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మృత శిశువు పుట్టింది.. అంతలోనే తల్లి ప్రాణాలు విడవడంతో కుటుంబ సభ్యుల కన్నీటికి అంతం లేదు. వైద్యం కోసం మూడు ఆస్పత్రులు తిరిగినా ప్రాణాలు దక్కలేదని వాపోతున్నారు. విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం వనబారింగికి చెందిన జ్యోతి, కోసంగూడ కాలనీకి చెం దిన దేవరాజు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నా రు. వీరు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగించేవారని చుట్టుపక్కల వారు అంటున్నారు. జ్యోతి మరణంతో కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు. -
జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం
తాడేపల్లి రూరల్/మంగళగిరి: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలో హత్యకు గురైన యువతి జ్యోతి మృతిదేహానికి వైద్యులు మళ్లీ పోస్టుమార్టం నిర్వహించారు. మహానాడు కృష్ణాతీరంలో ఉన్న శ్మశాన వాటికలో గురువారం మధ్యాహ్నం 12.25కు ప్రారంభమైన పోస్టుమార్టం 3.30 గంటల వరకు కొనసాగింది. వివరాలు వెంటనే వెల్లడించాలని జ్యోతి బంధువులు, మీడియా ప్రతినిధులు కోరగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.టి.కె.రెడ్డి నిరాకరించారు. 72 గంటల తర్వాత చెబుతామని అనడంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వెంటనే పోస్టుమార్టం వివరాలు చెప్పాలని, గతంలో పోస్టుమార్టం జరిగిందా లేదా నిర్ధారించాలని పట్టుబట్టారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. డాక్టర్ టి.టి.కె.రెడ్డిని కారు ఎక్కించారు. ఆందోళనకారులు టి.టి.కె.రెడ్డి కారును అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో కొందరు యువకులు డీజిల్ బాటిళ్లు తీసుకొచ్చి, వంటిమీద పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించారు. ఇరువర్గాల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. డాక్టర్ టి.టి.కె.రెడ్డి మాట్లాడుతూ.. పోస్టుమార్టం సంపూర్ణంగా నిర్వహించామని, జ్యోతి ఎలా చనిపోయిందో నిర్ధారించేందుకు మరో 72 గంటల సమయం పడుతుందని అన్నారు. పోలీసులు, మండల మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రెండోసారి పోస్టుమార్టం నిర్వహించామని, మొదటిసారి పోస్టుమార్టం ఏ మేరకు చేసారనే విషయం చెప్పడం సాధ్యం కాదని పేర్కొన్నారు. మృతురాలి అన్న అంగడి ప్రభాకర్, తండ్రి చిన్నగోవిందు మాట్లాడుతూ.. మొదటి పోస్టుమార్టం విషయంలో డాక్టర్లు, పోలీసులు అలసత్వం వహించారని అన్నారు. ఒక ఎస్టీ యువతి చనిపోతే డీఎస్పీ దర్యాప్తు చేయాల్సి ఉండగా, సీఐతో దర్యాప్తు చేయించి కేసును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కోలుకుంటున్న శ్రీనివాసరావు నవులూరులో అమరావతి టౌన్షిప్లో ఈనెల 11వ తేదీ రాత్రి ప్రేమికులపై దుండగులు జరిపిన దాడిలో గాయపడిన చుంచు శ్రీనివాసరావు క్రమంగా కోలుకుంటున్నాడు. తలకు గాయం కావడంతో శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు ఆరోగ్యం మెరుగుపడడంతో గురవారం ఐసీయూ నుంచి సర్జరీ వార్డుకు తరలించారు. శ్రీనివాసరావును ఎవరూ కలవకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్బీ సీఐ ఆధ్వర్యంలోని బృందం అతడిని విచారించి వివరాలు సేకరించినట్లు సమాచారం. శ్రీనివాసరావు కాల్‌డేటా ఆధారంగా విజయవాడకు చెందిన అతడి బంధువును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. విచారణ నుంచి డీఎస్పీని తప్పించిన ఉన్నతాధికారులు జ్యోతి హత్య కేసు విచారణ నుంచి నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణను పోలీసు ఉన్నతాధికారులు తప్పించారు. డీఎస్పీ హరి రాజేంద్రనాథ్బాబుకు ఈ కేసు విచారణ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ కేసులో ఇప్పటికే రూరల్ సీఐ బాలాజీని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఎస్ఐ బాబూరావును వీఆర్‌కు పంపడంతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. జ్యోతి కుటుంబానికి న్యాయం చేయాలి హత్యకు గురైన జ్యోతి కుటుంబానికి న్యాయం చేయాలని, గాయపడిన చుంచు శ్రీనివాసరావు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని, జ్యోతి కేసును నిర్లక్ష్యం చేసిన డీఎస్పీతోపాటు మిగతా అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని వివిధ గిరిజన సంఘాలు, ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని నడిబొడ్డున ఓ గిరిజన యువతి దారుణంగా హత్యకు గురైతే పోలీసులు ఇప్పటికీ సరైన ఆధారాలు సేకరించలేదని మండిపడ్డారు. కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతి పరిధిలో ఎలాంటి అనుచిత సంఘటన జరిగినా ప్రభుత్వం అప్రతిష్టపాలు కాకుండా చూసేందుకు అన్ని శాఖల అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు జ్యోతి హత్యోదంతం మరోసారి నిరూపించింది. రాజధానిలో ఓ గిరిజన యువతి హత్యకు గురైతే పోలీసు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా సామాజిక మాధ్యమాలు, పత్రికల ద్వారా జ్యోతి హత్య కేసుపై కథనాలు వస్తున్నా, సంఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ఉన్న సీఎం చంద్రబాబుకు గానీ, ఉన్నతస్థాయి అధికారులు గానీ దీనిపై కనీసం స్పందించిన పాపాన పోలేదు. -
కరీంనగర్ జిల్లాలో గుర్తు తెలియని మహిళ హత్య
-
పెద్దరావిగూడెంలో కిడ్నీ బాధితులు
పశ్చిమగోదావరి, కుక్కునూరు: కుక్కునూరు మండలం పెద్దరావిగూడెం గ్రామంలో కిడ్నీ వ్యాధితో పల్లాల లక్ష్మి (41) సోమవారం మృతి చెందింది. ప్రస్తుతం మరికొంతమంది గ్రామస్తులు కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులున్న విషయం వైద్యాధికారులు గత నెలలోనే గుర్తించారు. కొందరు బాధితులను ఇటీవల గుంటూరు ప్రభుత్వాసుపత్రికి పరీక్షల నిమిత్తం తరలించారు. అక్కడ టెస్ట్‌లు నిర్వహించిన వైద్యులు లక్ష్మికి రెండు కిడ్నీలు పాడయ్యాయని, వారానికి నాలుగుసార్లు డయాలసిస్ చెయ్యాలని తేల్చారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారని లక్ష్మి కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా ఇక్కడి వైద్యులు ట్యూబ్ వేయించుకుంటే తప్ప డయాలసిస్ చెయ్యలేమన్నారని, దీంతో బయట ట్యూబ్ వేయించాలంటే రూ.15 వేలు ఖర్చవుతుందనడంతో డబ్బులు లేక ఇంటికి తీసుకొచ్చామని చెప్పారు. దీంతో వ్యాధి ముదిరి లక్ష్మి సోమవారం మరణించిందని తెలిపారు. గుంటూరు వెళ్లిన మిగిలిన వారు కూడా స్వగ్రామానికి తిరిగి వచ్చేసినట్టు స్థానికులు తెలిపారు. కిడ్నీ సమస్యలకు కారణాలను తేల్చాలి : పెద్దరావిగూడెం గ్రామంలో రెండేళ్ల క్రితం కిడ్నీ వ్యాధితో నలుగురు మృతిచెందడం సంచలనమైంది. ఈ విషయమైపత్రికలలో కథనాలు కూడా వచ్చాయి. అప్పుడు పెద్దరావిగూడెం గ్రామంలో నీటి శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటి వల్ల ఆ వ్యాధి రాలేదని తేల్చారు. మరి కిడ్నీ సమస్య రావడానికి కారణాలు ఏమిటన్నది గ్రామస్థులకు అర్థం కావడంలేదు. అది తేల్చాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కిడ్నీ వ్యాధులకు గల కారణాలు ఏంటో తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. వైద్య సిబ్బందిని పంపిస్తాం పెద్దరావిగూడెం గ్రామంలో కిడ్నీ పాడై మహిళ మృతిచెందిన విషయం నా దృష్టికి కూడా వచ్చింది. వైద్య సిబ్బందిని మంగళవారం ఆ గ్రామానికి పంపిస్తాం. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి వారితో మాట్లాడతాం. ఆ సమస్య ఎందుకు వస్తున్నదో తెలుసుకుని నివారణ చర్యలు చేపడతాం.– వంశీలాల్ రాథోడ్,డివిజినల్ ప్రత్యేక వైద్యాధికారి -
పలకల క్వారీలో ఘోర ప్రమాదం
మార్కాపురం రూరల్: పలకల క్వారీలోని చెరియలు విరిగి పడి ఇద్దరు మహిళలు అక్కడికక్కడికే మృతి చెందిన సంఘన మండలంలోని రాయవరం గ్రామ సమీపంలో అడ్డ కొండ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన చిన్ని మంగమ్మ (35), బీమనబోయిన సీతమ్మ (30) మృతి చెందారు. సీతమ్మ భర్త కాశయ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులు కథనం ప్రకారం.. రాయవరం సమీపంలోలి ప్రముఖ పారిశ్రామిక వేత్త పలకల క్వారీలో మంగమ్మ, సీతమ్మ పని నిమిత్తం క్వారీలోకి వెళ్లారు. అయితే క్వారీ కింది భాగంలో పని చేస్తుండగా తీస్తుండంగా ఒక్క సారిగా దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి పెద్ద పలకల రాయి వారిపై పడింది. దీంతో మంగమ్మ, సీతమ్మలు అక్కడికక్కడే మృతి చెందారు. సీతమ్మ భర్త బీమనబోయిన కాశయ్య మాత్రం ముందుగానే క్వారీ నుంచి బయటకి వస్తుండగా రాళ్లు పైన పడి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే గంట ముందు మృతురాలు మంగమ్మ భర్త గురునాథం పొలం కొలతలు కోసం సర్వేరర్ ఫోన్ చేయటంతో క్వారీ నుంచి వెళ్లి పోయాడు. దీంతో అతనికి ప్రమాదం తప్పింది. మృత దేహాలు వెలికి తీయటానికి పొక్లెయిన్‌తో దాదాపు 5 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. మృత దేశాహాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రం అయ్యాయి. మృతురాలు మంగమ్మకు ముగ్గురు పిల్లలు, సీతమ్మకు ఇద్దరు పిల్లలున్నారు. ఒక్కసారి రెండు కుటుంబాల చిన్నారులు అనాథలుగా మారడంతోటి గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. సీఐ భీమానాయక్, ఎస్ఐ మల్లికార్జునరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
భర్త వేధింపులు తాళలేక
ఆస్పరి : మండల కేంద్రంలో భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరేసుకుని బలవన్మరణం పొందింది. ఎస్ఐ విజయ్‌కుమార్ వివరాల మేరకు..మండల కేంద్రానికి చెందిన మహానందికి ఆదోని మండలం బసరకోడుకు చెందిన నాగలక్ష్మి(25)తో ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన ఆరు నెలల పాటు వీరి సంసారం సాఫీ జరిగింది. ఆతర్వాత అతడు భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం వేధించేవాడు. దీంతో ఆమె పలుమార్లు పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో పెద్ద మనుషులు సర్దిచెప్పి పంపారు. అయినా భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో తీవ్రమనస్తాపానికి గురైంది. ఈక్రమంలో గుడిసె పైకప్పునకు ఉన్న ఇనుప దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి హనుమంతు ఫిర్యాదు మేరకు భర్త, అత్త చిట్టెమ్మ, మరిది రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
మహిళ అనుమానాస్పద మృతి
-
మాయమైపోయాడమ్మా... మనిషన్నవాడు
రోడ్డు ప్రమాదంలో మహిళ కాలు తెగిపడింది.. రక్తం ధారగా కారుతోంది. కళ్లు మూసుకుపోతున్నాయి. గొంతులో ఏదో మూల సన్నగా కాపాడండయ్యా అంటూ ఆర్తనాదం.. రయ్యమంటూ దూసుకెళుతున్న వాహనాలు ఒక్కటీ ఆగలేదు.. అందులో ఉన్న మనుషులూ మనసుల్లేని యంత్రాల్లాగే వెళ్లిపోయారు.. భరించలేని బాధతో నడిరోడ్డుపై గిలగిలాకొట్టుకుంటున్నా ఏ ఒక్కరూ కనికరించలేదు. పాషాణ హృదయాల్లా కదిలిపోయారు.అంతులేని వేదనతో, మాటలురాని రోదనతో విలవిలలాడిన ఆ మహిళ అరగంటపాటు మృత్యువుతో పోరాడి చివరకు రోడ్డుపైనే తుదిశ్వాస విడిచింది. ఈ రాతి గుండెల సమాజంలో ఇక నేనుండలేనంటూ వెళ్లిపోయింది. ఆదివారం జి.కొండూరులో జరిగిన ఘటన మానవత్వానికి తీరని మచ్చ తెచ్చింది. జి.కొండూరు(మైలవరం): విజయవాడ వాంబేకాలనీకి చెందిన నందేటి పద్మాబాయి (50) నడుంనొప్పికి వైద్యం చేయించుకునేందుకు ఆదివారం ఉదయం జి.కొండూరు మండలంలోని చెవుటూరు గ్రామానికి వచ్చింది. తన ఎదురింట్లో ఉంటున్న ఖమ్మంపాటి సీతారామయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వచ్చింది. నాటు వైద్యం చేయించుకుని తిరిగి వెళ్తుండగా ముత్యాలంపాడు, కందులపాడు గ్రామాల మధ్య ఉన్న బుడమేరు వంతెన దాటే క్రమంలో ఎదురుగా బూడిద లోడుతో వెళ్తున్న టిప్పర్‌ను సైడ్ ఇవ్వమని సీతారామయ్య హారన్ కొట్టాడు. టిప్పర్ సైడ్ ఇచ్చినట్లు ఇచ్చి ఎదురుగా ఉన్న గొయ్యిని తప్పించేందుకు క్రాస్ తిప్పి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. వాహనంపై ఉన్న పద్మాభాయి కింద పడిపోవడంతో టిప్పర్ వెనుక టైర్లు ఆమెపైకి ఎక్కడంతో కాలు తెగిపడింది. తీవ్ర రక్తస్రావంతో సాయంకోసం అరుస్తున్నా స్థానికులెవరు ఆమె దగ్గరకు వెళ్లలేదు. అటుగా వెళ్తున్న ఆటోవాలాలు కూడా పట్టించుకోలేదు. అరగంట తరువాత 108 అంబులెన్స్ వచ్చే వరకూ ఎవరూ పట్టించుకోలేదు. సమాచారం అందుకున్న జి.కొండూరు ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు వాహనంలో ఆమెను విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పద్మాభాయి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. స్పందించని 108 కందులపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగి మహిళ చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతుంటే, 108కు ఫోన్ చేసినా అరగంట వరకు రాలేదు. ఆటోవాలాలను ఎవరిని అడిగినా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ముందుకురాలేదు. అంబులెన్స్ అయినా త్వరగా వచ్చి ఉంటే ఆమె ప్రాణం కోల్పోకుండా ఉండేదని తెలిసింది. -
ఘోరం.. కారు మంటల్లో కాలిపోయింది
న్యూయార్క్ : అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారతీయ సంతతికి చెందిన యువతి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా తగలబడిపోయింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో చెలరేగిన మంటల్లో ఆమె దుర్మరణం పాలైంది. ఆ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు స్పష్టమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సయీద్ అహ్మద్ (23) అనే వ్యక్తి హర్లీన్ గ్రెవాల్ అనే భారతీయ సంతతికి చెందిన 25 ఏళ్ల మహిళను ఎక్కించుకున్నాడు. ఆమె ప్యాసింజర్ సీట్లో కూర్చొని ఉంది. అప్పటికే కొంచెం మద్యం సేవించిన అతడు బ్రూక్లిన్-క్వీన్ ఎక్స్‌ప్రెస్ వేలో ఓ కాంక్రీట్ పిల్లర్‌కు ఢీకొట్టాడు. దీంతో వెంటనే మంటలు చుట్టుముట్టాయి. అయితే, కారు దిగిన సయీద్ వెనుకాలే ఉన్న ప్యాసింజర్ అయిన హర్లీన్‌ను పట్టించుకోకుండానే మరో కారులో ఆస్పత్రి వెళ్లిపోయాడు. దీంతో ఆర్తనాదాలు చేస్తూ నడిరోడ్డులో నిస్సహాయ స్థితిలో ఆమె కాలిపోయి చనిపోయింది. కాగా, కారును డ్రైవర్ సయీద్ సోదరుడు మాట్లాడుతూ తన సోదరుడు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించాడని, అయితే కారు డోర్ ఇరుక్కుపోయి ఆమె బయటకు రాలేకపోయిందని అన్నారు. అందుకే సయీద్ చేతులు కూడా కాలిపోయాయని తెలిపాడు. కాగా, పోలీసులు మాత్రం సయీద్‌పై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
పెన్‌పహాడ్(సూర్యాపేట): బావిలో పడి వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అన్నారం గ్రామానికి చెందిన కోటయ్య భార్య కవిత(22) గ్రామ శివారులోని బావిలో పడి మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఏడాది వయసున్న ఓ పాప ఉంది. -
తణుకు ఆస్పత్రిలో బాలింత మృతి