
ఆత్మహత్య చేసుకున్న నాగలక్ష్మి
ఆస్పరి : మండల కేంద్రంలో భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరేసుకుని బలవన్మరణం పొందింది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ వివరాల మేరకు..మండల కేంద్రానికి చెందిన మహానందికి ఆదోని మండలం బసరకోడుకు చెందిన నాగలక్ష్మి(25)తో ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన ఆరు నెలల పాటు వీరి సంసారం సాఫీ జరిగింది. ఆతర్వాత అతడు భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం వేధించేవాడు. దీంతో ఆమె పలుమార్లు పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో పెద్ద మనుషులు సర్దిచెప్పి పంపారు. అయినా భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో తీవ్రమనస్తాపానికి గురైంది. ఈక్రమంలో గుడిసె పైకప్పునకు ఉన్న ఇనుప దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి హనుమంతు ఫిర్యాదు మేరకు భర్త, అత్త చిట్టెమ్మ, మరిది రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment