
చెన్నై,తిరువొత్తియూరు: బజ్జీ గొంతులో చిక్కుకుని మహిళ మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చెన్నైలో చోటుచేసుకుంది. చూలైమేడు కామరాజర్ నగర్‌కు చెందిన పద్మావతి (45) గురువారం రాత్రి బజ్జీలు చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి తింటుండగా గొంతులో ఇరుక్కుపోయి విలవిలలాడింది. కుటుంబ సభ్యులు ఆమెను కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చూలైమేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment