బావిలో పడి వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది.
పెన్‌పహాడ్(సూర్యాపేట): బావిలో పడి వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అన్నారం గ్రామానికి చెందిన కోటయ్య భార్య కవిత(22) గ్రామ శివారులోని బావిలో పడి మృతిచెందింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఏడాది వయసున్న ఓ పాప ఉంది.