హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనపై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. బుధవారం రాత్రి ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం పట్ల దురదృష్టకరమని తెలిపింది. ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఆమె కుమారుడు శ్రీతేజ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
అసలేం జరిగిందంటే..
పుష్ప-2 ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రదర్శించారు. అయితే ఆ థియేటర్‌కు అల్లు అర్జున్ వస్తున్నారని పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. దీంతో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment