న్యూయార్క్ : అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారతీయ సంతతికి చెందిన యువతి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా తగలబడిపోయింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో చెలరేగిన మంటల్లో ఆమె దుర్మరణం పాలైంది. ఆ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు స్పష్టమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సయీద్ అహ్మద్ (23) అనే వ్యక్తి హర్లీన్ గ్రెవాల్ అనే భారతీయ సంతతికి చెందిన 25 ఏళ్ల మహిళను ఎక్కించుకున్నాడు. ఆమె ప్యాసింజర్ సీట్లో కూర్చొని ఉంది.
అప్పటికే కొంచెం మద్యం సేవించిన అతడు బ్రూక్లిన్-క్వీన్ ఎక్స్‌ప్రెస్ వేలో ఓ కాంక్రీట్ పిల్లర్‌కు ఢీకొట్టాడు. దీంతో వెంటనే మంటలు చుట్టుముట్టాయి. అయితే, కారు దిగిన సయీద్ వెనుకాలే ఉన్న ప్యాసింజర్ అయిన హర్లీన్‌ను పట్టించుకోకుండానే మరో కారులో ఆస్పత్రి వెళ్లిపోయాడు. దీంతో ఆర్తనాదాలు చేస్తూ నడిరోడ్డులో నిస్సహాయ స్థితిలో ఆమె కాలిపోయి చనిపోయింది. కాగా, కారును డ్రైవర్ సయీద్ సోదరుడు మాట్లాడుతూ తన సోదరుడు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించాడని, అయితే కారు డోర్ ఇరుక్కుపోయి ఆమె బయటకు రాలేకపోయిందని అన్నారు. అందుకే సయీద్ చేతులు కూడా కాలిపోయాయని తెలిపాడు. కాగా, పోలీసులు మాత్రం సయీద్‌పై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు.
ఘోరం.. కారు మంటల్లో కాలిపోయింది
Published Sun, Oct 15 2017 4:29 PM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment