మంగమ్మ మృతదేహాన్ని తీసుకొస్తున్న దృశ్యం
మార్కాపురం రూరల్: పలకల క్వారీలోని చెరియలు విరిగి పడి ఇద్దరు మహిళలు అక్కడికక్కడికే మృతి చెందిన సంఘన మండలంలోని రాయవరం గ్రామ సమీపంలో అడ్డ కొండ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన చిన్ని మంగమ్మ (35), బీమనబోయిన సీతమ్మ (30) మృతి చెందారు. సీతమ్మ భర్త కాశయ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులు కథనం ప్రకారం.. రాయవరం సమీపంలోలి ప్రముఖ పారిశ్రామిక వేత్త పలకల క్వారీలో మంగమ్మ, సీతమ్మ పని నిమిత్తం క్వారీలోకి వెళ్లారు. అయితే క్వారీ కింది భాగంలో పని చేస్తుండగా తీస్తుండంగా ఒక్క సారిగా దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి పెద్ద పలకల రాయి వారిపై పడింది. దీంతో మంగమ్మ, సీతమ్మలు అక్కడికక్కడే మృతి చెందారు.
సీతమ్మ భర్త బీమనబోయిన కాశయ్య మాత్రం ముందుగానే క్వారీ నుంచి బయటకి వస్తుండగా రాళ్లు పైన పడి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే గంట ముందు మృతురాలు మంగమ్మ భర్త గురునాథం పొలం కొలతలు కోసం సర్వేరర్ ఫోన్ చేయటంతో క్వారీ నుంచి వెళ్లి పోయాడు. దీంతో అతనికి ప్రమాదం తప్పింది. మృత దేహాలు వెలికి తీయటానికి పొక్లెయిన్‌తో దాదాపు 5 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. మృత దేశాహాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రం అయ్యాయి. మృతురాలు మంగమ్మకు ముగ్గురు పిల్లలు, సీతమ్మకు ఇద్దరు పిల్లలున్నారు. ఒక్కసారి రెండు కుటుంబాల చిన్నారులు అనాథలుగా మారడంతోటి గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. సీఐ భీమానాయక్, ఎస్‌ఐ మల్లికార్జునరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment