ఇద్దరి ప్రాణం తీసిన అతివేగం
మాదాపూర్‌లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న బైకు
తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందిన ఐటీ ఉద్యోగులు
మాదాపూర్: సరదాగా రాత్రి వేళ నగరాన్ని చూసొద్దామని బయలుదేరిన ఇద్దరు ఐటీ ఉద్యోగులు ‘అతివేగం’ కారణంగా మృత్యు ఒడికి చేరారు. అదుపు తప్పిన వేగంతో బైకు నడిపి అనంతలోకాలకు చేరారు. ఈ సంఘటన మాదాపూర్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మాదాపూర్ ఇన్స్‌పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన ఆకాం„Š (24), నెల్లూరుకు చెందిన రఘుబాబు స్నేహితులు. వీరిద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
గురువారం అర్థరాత్రి దాటాక దాదాపు 12.30 గంటల సమయంలో ఇద్దరు మోటార్ సైకిల్ (టీఎస్ 02 ఎఫ్‌ఈ 8983)పై బోరబండ నుంచి మాదాపూర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో పర్వత్‌నగర్ సిగ్నల్ దాటిన తరువాత ఆకాంక్షా నడుపుతున్న బైక్ అదుపుతప్పి రోడ్ డివైడర్‌ను వేగంగా ఢీకొని.. ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. బైకు కొద్దిదూరం రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం మెడికవర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ నడుపుతున్న వ్యక్తి… pic.twitter.com/ebLjSuNVrM— Telugu Scribe (@TeluguScribe) December 27, 2024
Comments
Please login to add a commentAdd a comment