హలో దోస్త్‌.. కైసే హో? | Drivers' life stories on YouTube | Sakshi
Sakshi News home page

హలో దోస్త్‌.. కైసే హో?

Published Mon, Oct 8 2018 12:42 AM | Last Updated on Mon, Oct 8 2018 12:42 AM

Drivers' life stories on YouTube - Sakshi

‘హాయ్‌ ఫ్రెండ్స్‌! ఏం చేస్తున్నారు? హ్యాపీనా?’తన యూట్యూబ్‌ ఫాలోవర్లను ఇలాగే పలకరిస్తాడు ఉబర్‌ డ్రైవర్‌ గోల్డీ సింగ్‌. చెరగని చిరునవ్వుతో.. రంగురంగుల తలపాగాలతో.. సరదా సంభాషణతో.. వారిని ఆకట్టుకుంటాడు. అందుకే రోజుకు వందమంది చొప్పున ఇతడి ఫాలోవర్ల జాబితాలో చేరిపోతున్నారట. ఇతడి వీడి యోలు తమను సంతోష పెడుతున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారట.

33 ఏళ్ల ఈ ఢిల్లీ డ్రైవర్‌కి క్యాబ్‌ ఓ ‘చక్రాల కార్యాలయం’.. ఓ స్టూడియో. అందులో అతడు సహ డ్రైవర్లతో కబుర్లాడతాడు. దేశ, విదేశీ ప్రయాణికులతో ముచ్చటిస్తాడు. వీటన్నింటినీ మొబైల్‌తో చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటాడు. జనవరిలో ఇతడు యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించాడు. ఫాలోవర్ల సంఖ్య 20 వేలకు పైమాటే. క్యాబ్‌ డ్రైవర్లకు, డ్రైవర్లు కాబోయే వారికి గోల్డీ సలహాలిస్తాడు. జాగ్రత్తలు చెబుతాడు. వృత్తి కొనసాగించేందుకు అవసరమైన ఉత్సాహమిస్తాడు. వారానికి నాలుగు వీడియాలు అప్‌లోడ్‌ చేస్తున్న ఈ డ్రైవర్‌ నికరాదాయం రూ.20 వేలు. ఇప్పుటికి 126 వీడియోలు పెట్టాడు. ఇతని మాటల్లో మన దేశం కనిపిస్తుంది. మన డ్రైవర్ల జీవితాలు కనిపిస్తాయి. రోజువారీ జీవితంలో ఇతడికి ఎదురయ్యే వింత వింత అనుభవాలుంటాయి.

అంతా యాప్‌ దయ..
వృత్తి జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవాలు డ్రైవర్లను ఆత్మ న్యూనతకు లోను చేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితిని అధిగమించడమెలాగో చెబుతుంటాయి మహమ్మద్‌ షారుఖ్‌ వీడియోలు. ‘లక్నో షారుఖ్‌’పేరుతో యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్న ఈ పాతికేళ్ల యువకుడు.. ఒకటిన్నర సంవత్సరం కింద లక్నో నుంచి ఢిల్లీ వచ్చాడు. ఓలా షేర్‌ బుకింగ్‌లో చేయకూడని పొరపాట్లు, రెంటల్స్‌ బుకింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ ఇతడు రెండు వీడియాలు చేశాడు.

ఇప్పుడు ఓలా, ఉబర్‌ వంటి కంపెనీల్లో పనిచేసే డ్రైవర్ల సంఖ్య పెరిగింది. అన్ని ఖర్చులు పోగా రూ. 700–800 మిగలాలంటే రోజుకు కనీసం 15 గంటలు పని చేయాల్సిందే. నాతో సహా అనేకమంది అప్పులు చేసి కార్లు కొనుక్కొని, కంపెనీలకు అటాచ్‌ చేశాం. అప్పులు తీర్చడం మాత్రం కష్టమైపోతోంది. ఇప్పటికి 5 నెలల బాకీ ఉంది. ఒక్క యాప్‌ దయ మీదే ఇప్పుడు నా జీవితం ఆధారపడిఉంది’అంటున్నాడు షారుక్‌.

‘డ్రైవర్‌ దోస్త్‌ ’అప్‌డేట్స్‌
గోల్డీ సింగ్‌ మాదిరిగా ఢిల్లీలోని పలువురు డ్రైవర్లు ఇప్పడు యూట్యూబ్‌ ద్వారా తమ బతుకు చిత్రాలను ప్రజల ముందుంచు తున్నారు. వీరిలో ఒకరు విజయ్‌ సింగ్‌. ఇతడు ‘డ్రైవర్‌ దోస్త్‌’పేరిట ఓ చానల్‌ నడుపుతున్నాడు. 15 వేల మంది ఫాలోవర్లున్నారు. 30 ఏళ్ల ఈ యువకుడు పత్రికల నుంచి ఆసక్తికర వార్తలు సేకరిస్తాడు. వీడియోల్లో వాటిని చదువుతూ, వివరిస్తూ కనిపిస్తాడు.

‘ఎక్కువ మంది డ్రైవర్లు పత్రికలు చదవలేరు కాబట్టి కొన్ని వార్తల్ని వారికి వివరిస్తాను. అవి డ్రైవర్లపై చూపగల ప్రభావం గురించి చెబుతాను’అంటున్నాడు. ఇప్పటికి 113 వీడియోలు అప్‌లోడ్‌ చేశాడు. 2017 వరకు ఇతడు ఓలా డ్రైవర్‌. ఇప్పుడు సొంత టాక్సీ నడుపుకుంటున్నాడు. షూటింగ్, వీడియో ఎడిటింగ్‌ నేర్చుకున్నాడు. ఓ మైక్, సెల్ఫీ స్టిక్‌ ఎప్పుడూ దగ్గర ఉంచుకుంటాడు. అనేక వీడియోల్లో టెక్‌ గురూ అవతారమెత్తి.. మొబైల్‌ హోల్డర్లు, కార్‌ చార్జర్లు, కారు కెమెరాల వంటి వాటి వాడకానికి సంబంధించి కొన్ని టిప్స్‌ చెబుతుంటాడు విజయ్‌.


10 వేల సమాధానాలు..
2016 వరకూ గోల్డీ ఏసీ, రిఫ్రిజరేటర్‌ మెకా నిక్‌. సంపాదనలో 10 శాతాన్ని దాన«ధర్మా లకు వెచ్చించాలనే సిక్కు సంప్ర దాయాన్ని ఇతడు పాటిస్తాడు. ఆ సంప్రదాయం తో సంతోషపరి చేది తన ప్రయాణి కులనే! వారికి ఉచితంగా కాఫీలు, శీతల పానీయాలు, నీళ్ల బాటిళ్లు, బిస్కెట్లు అందిస్తాడు.
తన చానల్‌కు రోజుకు వంద మంది తోడవుతున్నట్లు చెబు తున్నాడు గోల్డీ. వీరిలో కెనడా తదితర దేశాల ప్రజలు కూడా ఉన్నారు. తన వీడియోలపై ప్రజలు పెట్టే కామెంట్లకు గోల్డీ ప్రతిస్పందిస్తాడట. ఇప్పటికి 10 వేల సమాధానాలిచ్చాడట. ’అనేక మంది నా వీడియోలు సంతోషం పంచాయనే కామెంట్‌ పెడుతుంటారు. ఇది నాకు గొప్ప అభినందనగా భావిస్తాను’అంటాడు గోల్డీ.
విభిన్నంగా..
యాంకరింగ్‌లో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. హిందీ, ఇంగ్లిష్‌; పంజాబీ భాషల్ని కలగాపులగం చేసి సరదా సంభాషణ చేస్తుంటాడు గోల్డీ. కోరమీసంతో, నల్ల కళ్లాద్దాలతో సూటిగా చెప్పాల్సిన విషయాలు చెప్పేస్తుంటాడు విజయ్‌. నాలుగు నెలల కింద చానల్‌ ప్రారంభించిన షారుఖ్‌.. గోల్డీ బాణిని అనుకరిస్తుంటాడు. ఇతడు గోల్డీని ఎప్పుడూ కలవలేదట. కానీ ఆయన వీడియోలు చూసి స్ఫూర్తి పొందాడట. ఓలా, ఉబర్‌ సర్వీసుల్లో పనిచేస్తున్న ఈ డ్రైవర్‌ ఇప్పటికి 50 వీడియోలు అప్‌లోడ్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement